Ind vs Ban: హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌ టికెట్ల అమ్మకం షురూ | Sale Of Tickets For India Vs Bangladesh T20 Match In Hyderabad Uppal Stadium From Today, See Details Inside | Sakshi
Sakshi News home page

IND Vs BAN T20I Tickets: హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌ టికెట్ల అమ్మకం షురూ

Published Sat, Oct 5 2024 4:03 AM | Last Updated on Sat, Oct 5 2024 11:04 AM

Sale of Hyderabad T20 match tickets from today

సాక్షి, హైదరాబాద్‌: భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య హైదరాబాద్‌లో ఈ నెల 12న  మూడో టి20 మ్యాచ్‌ జరగనుంది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం గం. 2:30 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అభిమానులు paytm insider    వెబ్‌సైట్‌/యాప్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ట ధర రూ. 15 వేలు. 

ఆన్‌లైన్‌లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో మార్పిడి చేసుకొని మ్యాచ్‌ టికెట్లను పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏదైనా ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అన్ని టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అమ్ముతున్నామని...ఆఫ్‌లైన్‌లో/కౌంటర్ల వద్ద ఎలాంటి టికెట్లూ విక్రయించడం లేదని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు. 

ఉప్పల్‌ స్టేడియంలో భారత జట్టు గతంలో రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2019లో వెస్టిండీస్‌పై, 2022లో ఆ్రస్టేలియాపై జరిగిన ఈ మ్యాచ్‌లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో భారత్‌–ఇంగ్లండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇచి్చంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement