బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. ఢిల్లీకి చెందిన మయాంక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టి20లు ఆడిన 116వ, 117వ ఆటగాళ్లుగా నిలిచారు. మ్యాచ్‌కు ముందు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేతుల మీదుగా నితీశ్... టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ చేతుల మీదుగా మయాంక్ క్యాప్‌లు అందుకున్నారు.
వైజాగ్‌కు చెందిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డికి ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్‌లో ఆకట్టుకోవడంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా... చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా నితీశ్ ఆ టూర్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు నితీశ్ 20 టి20ల్లో 128.24 స్ట్రయిక్‌రేట్‌తో 395 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు.
22 ఏళ్ల మయాంక్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఐపీఎల్–2024 సీజన్‌లో తన ఎక్స్‌ప్రెస్ బౌలింగ్‌తో చెలరేగాడు. నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒకసారి 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. 14 టి20ల్లో అతను 14.31 సగటుతో 19 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment