ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్– బంగ్లాదేశ్ టీ20 క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సు«దీర్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2,600 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాలను తమ అ«దీనంలోకి తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ గదికి అనుసంధానం చేసినట్లు తెలిపారు.
3 గంటల ముందే అనుమతి..
సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందుగానే స్డేడియంలోకి అనుమతిస్తారు. ఈవ్‌టీజింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోకి బయటి వస్తువులు, తినుబండారాలను తీసుకురావద్దు. కారు పాస్ ఉన్న వారు రామంతాపూర్ నుంచి వచ్చి గేట్ నంబర్ 1, 2 ద్వారా తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. దివ్యాంగులు రామంతాపూర్ గేట్– 3 ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. గేట్ నంబర్ –4 నుంచి 10కి వచ్చే వారు తమ వాహనాలను ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద, రామంతాపూర్ చర్చి గ్రౌండ్‌లో పార్క్ చేసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ సేవలను రాత్రి ఒంటి గంట వరకు పొడిగించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ నుంచి స్టేడియం వైపు, సికింద్రాబాద్ నుంచి స్టేడియం వైపు వచ్చే అన్ని దారులను మళ్లించనున్నారు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్ రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్‌ఎఫ్‌సీ నుంచి వెళ్లాలి. ఎల్‌బీనగర్ నుంచి వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సైతం నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment