తమిళ రాజకీయ చదరంగంలో సీఎం కుర్చీకోసం సాగుతున్న గేమ్ క్లై్లమాక్స్‌కు చేరింది! ముఖ్యమంత్రి పీఠంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కూర్చుంటారా? లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని పదవి వరిస్తుం దా? ఇప్పుడిది రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ నిర్ణయానికి తీసుకునే కాలవ్యవధి కూడా ఇద్దరి జాతకాలను తారుమారు చేయగలదని పలువురు విశ్లేషిస్తున్నారు.