ఘనంగా రన్ ఫర్ యూనిటీ | 'Run for Unity' in Mumbai; Fadnavis joins in | Sakshi
Sakshi News home page

ఘనంగా రన్ ఫర్ యూనిటీ

Published Fri, Oct 31 2014 10:36 PM | Last Updated on Tue, Aug 21 2018 12:00 PM

ఘనంగా రన్ ఫర్ యూనిటీ - Sakshi

ఘనంగా రన్ ఫర్ యూనిటీ

సాక్షి, ముంబై: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్కవారం ఉదయం గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ‘రన్ ఫర్ యూనిటీ’ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా బిల్డింగ్ నుంచి ప్రారంభమై మెరైన్ డ్రైవ్‌లోని పార్శీ జింఖానా వద్ద ముగిసింది. రెండు కి.మీ.మేర సాగిన ఈ కార్యక్రమంలో బజ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, రావ్‌సాహెబ్ దాన్వే తదితరులు పాల్గొన్నారు.

వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజైన అక్టోబరు 31వ తేదీని ‘రాష్టీయ ఏక్తా దివస్’ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా గవర్నర్ దేశ ఐక్యతను, శాంతి, భద్రతలను కాపాడేందుకు తనవంతు కృషిచేస్తానని కార్యక్రమానికి హాజరైన వారిచేత ప్రమాణం చేయించారు. అలాగే ఈ సందేశాన్ని దేశ ప్రజలందరికి చేరవేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement