Sardar Vallabhbhai Patel Jayanti
-
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్‌లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్‌లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్‌ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్‌లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్ సొంతం
కేవాడియా/న్యూఢిల్లీ: అన్ని రకాల అంతర్గత, బహిర్గత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విషయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ నుంచి దేశం స్ఫూర్తిని పొందుతోందని అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ సందర్భంగా మోదీ ఆదివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తే మన దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చవచ్చని పిలుపునిచ్చారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కోసం వల్లబ్‌భాయ్ పటేల్ అలుపెరుగని పోరాటం సాగించారని కొనియాడారు. ఆయన కేవలం చరిత్రలో కాదు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. పౌరులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించడమే పటేల్‌కు నివాళి అని సూచించారు. సమగ్రతను దెబ్బతీయలేరు: అమిత్ షా సర్దార్‌పటేల్ రాబోయే తరాలకు సైతం స్ఫూర్తినిస్తూనే ఉంటారని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత్ భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండబోతోందని, ఐక్యత, సమగ్రతను దెబ్బతీయడం ఎవరి తరమూ కాదని తేల్చిచెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా ఆదివారం గుజరాత్‌లోని కేవాడియాలో ఐక్యతా శిల్పం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. పటేల్ కృషి వల్లే భారత్ ఐక్యంగా నిలిచిందని అన్నారు. అయినప్పటికీ ఆయనకు తగిన గౌరవ మర్యాదలు లభించలేదని ఆక్షేపించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పటేల్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని, ఆయనకు నివాళిగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పిందని అమిత్ షా తెలిపారు. దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం నివాళులర్పించారు. ప్రజాస్యామ్యాన్ని రక్షించడమే పటేల్‌కు నిజమైన నివాళి అవుతుందన్నారు. -
సర్దార్ పటేల్‌కు గవర్నర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: దివంగత తొలి ఉపప్ర ధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉక్కు మనిషిగా పేరొందిన వల్లభాయ్ పటేల్ సంస్థానాల విలీనానికి, ఏకీకృత భారతావనిని నెలకొల్పడంలో చేసిన కృషి దేశ చరిత్రలో ఎనలేనిదని గవర్నర్ కొనియాడారు. పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రత్యేక కా ర్యక్రమంలో రాజ్‌భవన్ అధికారులు, సి బ్బందితో గవర్నర్ రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు లక్డీకాపూల్ వద్ద ఉన్న పటేల్ విగ్రహానికి తమిళిసై పూలమాల వేసి నివాళులర్పి ంచారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి ఉత్సవాలు
-
దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?
కేవాడియా: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పుల్వామా దాడి ఘటనలో వాస్తవాలను పాకిస్తాన్ పార్లమెంట్లో అక్కడి నేతలు అంగీకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన జవాన్లు వీర మరణం పొందితే దేశమంతా సంతాపం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం స్వప్రయోజనాల కోసం నీచ రాజకీయాలకు తెరతీశారని పరోక్షంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. భారత భూభాగాన్ని కాజేయాలని చూస్తున్న శక్తులకు సరిహద్దుల్లో మన సైనికులు సరైన సమాధానం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుల్వామా దాడి ఘటన తర్వాత ఇండియాలో కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను, వారి నీచ రాజకీయాలను దేశం మరచిపోదని చెప్పారు. పొరుగు దేశం పాకిస్తాన్ పార్లమెంట్లో వాస్తవాలను అంగీకరించిన తర్వాత అలాంటి వ్యక్తుల నిజ స్వరూపం బట్టబయలైందని పేర్కొన్నారు. సైనిక దళాల మనోసై్థర్యాన్ని దెబ్బతీయకండి పుల్వామా దాడి తర్వాత తనపై కొందరు వ్యక్తులు విమర్శలు చేసినా, దారుణమైన పదాలు ఉపయోగించినా మౌనంగానే ఉన్నానని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతారని అన్నారు. సైనిక దళాల మనోస్థై్ౖథర్యాన్ని దెబ్బతీసే రాజకీయాలకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మీ స్వలాభం కోసం జాతి వ్యతిరేక శక్తుల చేతుల్లో పావులుగా మారకండి అని రాజకీయ నాయకులకు హితవు పలికారు. రామాలయం నిర్మాణానికి ప్రజలే సాక్షులు సోమనాథ్ ఆలయ నిర్మాణం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు సర్దార్ పటేల్ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం ఆ యజ్ఞం అయోధ్యలో కొనసాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. భవ్య రామమందిరం నిర్మాణానికి ప్రజలు సాక్షులుగా నిలుస్తున్నారని తెలిపారు. సీప్లేన్ సేవలను ప్రారంభించిన మోదీ కేవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు సీప్లేన్ సేవలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. నీటిపై, గాలిలో ప్రయాణించే విమానాన్ని సీప్లేన్ అంటారు. ఐక్యతా శిల్పం నుంచి సీప్లేన్‌లో మోదీ ప్రయాణించారు. 40 నిమిషాల్లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు చేరుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. సీప్లేన్ సర్వీసును స్పైస్‌జెట్ సంస్థకు చెందిన స్పైస్ షటిల్ సంస్థ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్–కేవాడియా మధ్య నిత్యం రెండు ప్లేన్లను నడపనుంది. ఒక వైపు ప్రయాణానికి రూ.1,500 రుసుం వసూలు చేస్తారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అహ్మదాబాద్: నిర్ణయాలు తీసుకునేటప్పు డే దేశ హితాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రొబేషనరీ సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అనే మంత్రాన్ని పాటించాలని ఉద్బోధించారు. నిత్యం వార్తల్లో ఉండేం దుకు ప్రయత్నించకూడదని చెప్పారు. రొటీ న్కు భిన్నంగా పనిచేస్తేనే గుర్తింపు వస్తుం దన్నారు. మోదీ శనివారం కేవాడి యా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొబే షనరీ సివిల్ సర్వీసు అధికారులను ఉద్దేశిం చి మాట్లాడారు. పాలనలో మీలాంటి అధికారుల పాత్ర వల్లే దేశం ప్రగతి సాధిస్తోందని అన్నారు. ప్రజలు సాధికారత సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వారి జీవితాల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కేవలం విధానాలపైనే(పాలసీలు) ఆధార పడి ప్రభుత్వం నడవకూడదన్నారు. -
మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నారు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా దేశమంతా ఏక్తా దివస్ నిర్వహిస్తున్నాం. దేశ సమగ్రత కోసం ఐక్యతా దివస్ నిర్వహిస్తున్నాం. దేశాన్ని చిన్నచిన్న సంస్థానాలతో బ్రిటీష్ వారు విచ్చిన్నం చేశారు. వీటిని దేశంలో కలిపిన మహనీయులు సర్దార్. భారత దేశంలో విలీనం కాము. అవసరమయితే పాకిస్తాన్‌తో కలుస్తామని అప్పట్లో కొన్ని సంస్థానాలు ప్రకటించాయి. (పటేల్‌కు ప్రధాని మోదీ నివాళి) నిజాం మరో అడుగుముందుకేసి ఐక్యరాజ్యసమితిలో కూడా విడిగా ఉంటామని దరఖాస్తు చేసుకున్నాడు. రజాకార్లతో తెలంగాణ ప్రజలు, హిందువులపై, మహిళలపై దాడులు చేసి రక్తపాతం సృష్టించారు. సర్దార్ ఆనాడు తెలంగాణ ప్రజలకు స్వంతంత్రం కల్పించేందుకు పోలీస్ యాక్షన్ ప్రకటించారు. ఏడాది తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనమై జాతీయ జెండా ఎగిరింది. తెలంగాణ ప్రజలు దేవుడిలా చూసుకునే సర్దార్‌ను టీఆర్ఎస్ సర్కార్ విస్మరించింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మజ్లిస్ కనుసైగల్లో పాలన చేస్తూ.. వారి మోచేతి నీళ్లు తాగుతున్నారు. తెలంగాణ ప్రజలు సర్దార్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. పటేల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ విమోచన దినోత్సవంను పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిర్వహించాలి. ఆగస్టు 15, జనవరి 26 తరహాలోనే సెప్టెంబర్ 17ను జాతీయ పండుగలా నిర్వహించాలి. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులకు లెంపలేసుకొని సెప్టెంబర్‌ను జాతీయ పండగలా నిర్వహించాలి' అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ముందుకెళ్లేందుకే ఏక్తా దివస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పటేల్ దేశం కోసం, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నిజాం మెడలు వంచిన వ్యక్తి సర్దార్. పటేల్ లేకపోతే తెలంగాణకు స్వంతంత్రం వచ్చేది కాదు. సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని చెబుతున్నా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తెలంగాణ కోసం, ప్రజల ఆకాంక్షల కోసం ఏర్పడిన పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. సెప్టెంబర్ 17ను గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఈ రోజైనా కేసీఆర్ సర్దార్ పటేల్‌కు నివాళులర్పించాలి. ఆయన స్ఫూర్తితో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతా అని చెప్పాలి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సర్దార్ ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన స్పూర్తితో అఖండ భారత నిర్మాణం కోసం ముందుకెళ్తాం' అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
భారత ఐక్యతా వారధి సర్దార్ పటేల్
సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప దేశభక్తుడు, రాజనీతి జ్ఞుడు. దేశ సమగ్రత, సమైక్య తపట్ల దృఢమైన సంకల్పం, ఆయన దూరదృష్టి, చాతుర్యం దేశాన్ని తొలినాళ్లలో పలు విపత్కర సమస్యలని ఎదుర్కొని ముందుకు నడిపించడానికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. ప్రముఖంగా రెండు ఘట నలను ప్రస్తావిస్తాను. గుజరాత్‌లోని జాం నగర్ పూర్వ రాజైన జాం సాహిబ్‌కు సంబంధించినది. అధికార బది లీకి ఇంకా రెండు నెలలు గడువు ఉండగా,ఈలోపే కతియవార్ రాష్ట్రాలన్నింటినీ కలిపి పాకిస్తాన్ సహా యంతో ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని తోటి సంస్థానాధీశులను కలవబోతున్నాడని తెలుసుకొన్న పటేల్ ఇక సమయాన్ని వృథాచేయకుండా జాం సాహిబ్ సోదరుడైన కల్నల్ హిమ్మత్ సింగ్ ద్వారా వారిని తన ఇంటికి విందుకి తీసుకురావాలని కోరాడు. భోజనసందర్భంలో పటేల్ తన ఆత్మీయతతో, ప్రేమతో జాంసాహిబ్, మహారాణి వారి హృదయాలని గెలుచుకున్నాడు. దీంతో జాంసాహిబ్ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలనే ప్రణాళికను విరమించుకున్నాడు. మరో సంఘటన షేక్ అబ్దుల్లాకు సంబంధించినది. రాజ్యాంగ పరిషత్తులో ఆర్టికల్ 370ని చర్చిస్తున్న సమయంలో అసహనంతో ఉన్న షేక్ అబ్దుల్లా తన స్థానం నుండి లేచి, ‘నేను తిరిగి కశ్మీరుకు వెళుతున్నాను’ అని సభలో ప్రకటించాడు. దీంతో ప్రధాని నెహ్రూ లేని కారణంగా అక్కడే ఉన్న పటేల్.. కశ్మీర్ వెళ్లడానికి రైలు పెట్టెలో కూర్చున్న అబ్దుల్లాకు ‘ఈరోజు సభను వదిలివెళ్లగలవు కానీ ఢిల్లీని మాత్రం విడిచి వెళ్ళలేవు’ అనే సందేశాన్ని తెలియజేశారు. దాని పరిణామాలను గ్రహించిన షేక్ అబ్దుల్లా రైలు నుంచి దిగి తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అంతటి గట్టి సందేశాన్ని నిర్భీతితో ఇవ్వగల ధీశాలి పటేల్. జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలను, భావాలను సరైన దృష్టికోణం నుండి అర్థం చేసుకున్న రాజకీయ నాయకులలో సర్దార్ పటేల్ ఒకరు. గాంధీజీ స్వరాజ్యం నుంచి సురాజ్యం గురించి చెబితే, సర్దార్ పటేల్ గారు స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్పు చేసే సుపరిపాలనకు, సంస్కరణకు దారితీసిన ఆద్యుడు. వల్లభాయ్ పటేల్ 1917 నవంబర్‌లో మొదటిసారి గాంధీజీతో పరిచయం ఏర్పడ్డప్పుడు ఆ సమయంలో వారి వేషధారణ హ్యాట్, సూట్, బూట్, ఇంగ్లిష్తో పాశ్చాత్యమైనది. కానీ గాంధీజీ సంపర్కంతో పూర్తిగా పరివర్తన చెంది ఖాదీ, ధోతి, కుర్తా, చెప్పులు స్వీకరించి స్వదేశీ వస్త్రధారణలోకి వచ్చారు. గాంధీజీ సత్య, అహింస సిద్ధాం తాల ప్రభావంతో, పటేల్ విదేశీ వస్తువులని, దుస్తుల్ని బహిష్కరించినారు. జాతీయ వ్యవహారాలలో అత్యంత కఠినంగా వ్యవహరించే పటేల్ వ్యక్తిగత విషయాలలో మాత్రం మృదువుగా ఉండే వారు. పటేల్‌తో సమావేశమై సంభాషించిన తర్వాత.. మన దేశ భవిష్యత్తు సరైన నాయకత్వం చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తున్నాను అని జంషెడ్ జీ టాటా అన్నారు. భారత్ తొలి హోంమంత్రిగా వ్యవహరించే రోజుల్లో తన ఇంటికి ఔపచారికంగా నలభై–యాభై మంది ఐసీఎస్ అధికారులను పిలిపించుకొని వారితో దేశ ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా సేవా భావనతో, మెలగాల్సి ఉంటుందనీ, మంత్రులు ఐదేళ్లకు వస్తుంటారు పోతుం టారు కానీ మీరు ఈ వ్యవస్థలో దీర్ఘకాలంగా పని చేసేవారు, అందుకే స్వతంత్రంగా నియమావళి ప్రకారం మెలగాలనీ కోరారు. 565 పైగా సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడం వారి దృఢమైన సంకల్ప శక్తికి, నాయకత్వ సామర్థ్యాలకు నిదర్శనాలు. జూనాగఢ్ సంస్థానం సౌరాష్ట్రకు సమీపంలో ఉన్న ఒక చిన్న రాచరిక రాజ్యం. దాని నవాబు పాకిస్తాన్లో విలీనం చేస్తామని ప్రకటించినప్పుడు అత్యధిక ప్రజలు భారత్‌లోనే విలీనం కావాలని కోరుకున్నారు. అపుడు పటేల్ భారత సైన్యాన్ని జూనాగఢ్ సంస్థానానికి పంపి 1947 నవంబర్ 9న జూనాగఢ్‌ను భారతదేశంలో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే సైనిక వ్యవస్థను కలిగి ఉండడంతో హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటిం చుకోవాలనే వాంఛ. అతను విలీనం కాకుండా భారత యూనియన్‌తో సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని పటేల్ గ్రహించి నిజాంకు సమయం ఇవ్వడం ఉత్తమమని భావించారు. లార్డ్ మౌంట్‌బాటన్, నె్రçహూ సైతం నిజాంకు సాన్నిహిత్యంగా ఉండేవారు. వారు పటేల్‌తో చర్చలు జరిపి హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్య ఉండవద్దని నిర్ణయించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న నిజాం నవాబు ఒకవైపు విదేశాలతో సంబంధాలు నెరపుతూ మరోవైపు ఆయుధాలు కొనుగోలు చేస్తూ తన సైనిక శక్తిని పెంచుకొన్నారు. సంస్థానంలో హిందూ ప్రజలపై పైశాచిక దాడులను చేసి, మతాంతరీకరణలను ప్రోత్సహించారు. ఇంకోపక్కన ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌ను స్థాపిం పజేశారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను పెంపొందింప జేశారు. దీన్నంతటినీ పటేల్ బాగా గమనిస్తూ హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ జనరల్‌గా మున్షిని నియమించారు. ఆయన హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని ఇచ్చేవారు. ఆనాటి వైస్రాయి లార్డ్ మౌంట్ బాటన్ పదవీ కాలం ముగిసిన వెంటనే ఇక పాత ఒప్పం దాలు చెల్లిపోయాయని భావించిన సర్దార్ పటేల్ సాహసంతో ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను చేపట్టి రజాకార్లను అంతం చేసి హైదరాబాద్ సంస్థానాన్ని 17 సెప్టెం బర్ 1948 న భారత యూనియన్‌లో విలీనం చేసి మువ్వన్నెల భారత పతాకాన్ని ఎగరవేయించారు. అలాగే గుజరాత్‌లోని ఖేడా, బార్డోలీ ప్రాంతంలో గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, అపూర్వమైన రైతాంగ ఉద్యమం ఆయనకు చరిత్రలో చిరస్థానం కల్పిం చాయి. భారత ప్రభుత్వం 1991లో సర్దార్ పటేల్‌ను ‘భారత రత్న’తో సత్కరించింది. ఆయన జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాము, ఈ భావాం జలితో ఆయనకు నివాళులు అర్పిస్తూ వారికి శత కోటి వందనాలు సమర్పించుకుందాం. -బండారు దత్తాత్రేయ వ్యాసకర్త గవర్నర్, హిమాచల్‌ప్రదేశ్ -
ఆర్టికల్ 370 రద్దు పటేల్‌కు అంకితం
కెవాడియ: కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఉగ్రవాదానికి ద్వారాలు తెరవడం తప్ప ఇంకేం చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశామని స్పష్టం చేశారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జన్మదినమైన జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని పటేల్‌కు అంకితమిస్తున్నానని ప్రకటించారు. పటేల్ 144వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ‘జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ’ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ సమగ్రతకు చిహ్నమని, ఈ దేశానికి గర్వకారణమనీ మోదీ అన్నారు. కశ్మీర్ ఉగ్రవాదం కారణంగా మూడు దశాబ్దాల్లో 40,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యుద్ధంలో గెలవలేని వాళ్ళు’’ వేర్పాటు వాదంతో, ఉగ్రవాదంతో ఈ దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్నారనీ పాకిస్తాన్‌ని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. అయితే శతాబ్దాలుగా వారా ప్రయత్నం చేస్తున్నా ఈ దేశాన్ని జయించడం అసాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌గా విడగొట్టడం ఈ ప్రాంత ప్రజల మధ్య బలమైన విశ్వాసాన్ని పాదుకొల్పాలన్న లక్ష్యమే తప్ప ప్రాంతాల మధ్య విభజనరేఖను గీయాలన్న ఉద్దేశ్యం లేదన్నారు. కశ్మీర్ సమస్యను తాను డీల్ చేసినట్టయితే సమస్య పరిష్కారానికి ఇంతకాలం పట్టేది కాదన్న పటేల్ వ్యాఖ్యానాన్ని ప్రస్తావించారు. ఏపీ సీఎం జగన్ నివాళి సాక్షి, అమరావతి: వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పటేల్ మహనీయుడు ధృఢ దీక్షతో సమైక్య భారతదేశం రూపుదిద్దుకోవడంలో చేసిన కృషిని దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని, సర్వదా ఆయనకు రుణపడి ఉంటారని ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ శ్లాఘించారు. -
ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
నవ కశ్మీరం
శ్రీనగర్: అక్టోబర్ 31. ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి ఇదే రోజు. 500కిపైగా విడివిడిగా ఉన్న సంస్థానాలను మన దేశంలో కలపడానికి కృషి చేసిన మహనీయుడాయన. అప్పటి ప్రధాని నెహ్రూ పాక్ సరిహద్దుల్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతమైన కశ్మీర్‌ను భారత్‌లో కలపడానికి పటేల్‌కు అనుమతినివ్వలేదు. ఫలితంగా ఇన్నాళ్లూ ఆ సమస్య రావణకాష్టంలా రగిలింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు పటేల్ జయంతి రోజే కశ్మీర్లో నవ శకానికి నాంది పలికింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ అప్పట్లో రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఆగస్టు 5న రద్దు చేసింది. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఓకే చెప్పింది. పటేల్ జయంతి అయిన నేటి నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో 173 ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మూ కశ్మీర్ కథ ఇక గతం. జమ్ము కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ అవతరించాయి. శాంతి భద్రతలు కేంద్రం చేతుల్లోనే జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలన్నీ గురువారం నుంచి నేరుగా కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. పోలీసు యంత్రాంగం యావత్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నడుచుకుంటుంది. కేంద్రం నియమించిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కే సర్వాధికారాలు ఉంటాయి. భూ లావాదేవీల వ్యవహారాలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. యూటీగా మారిన కశ్మీర్ అసెంబ్లీకి శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం, పబ్లిక్ ఆర్డర్ మినహా మిగిలిన అన్ని అంశాల్లోనూ చట్టాలు చేసే అధికారాలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఏసీబీ వంటివన్నీ కేంద్రం నియమించిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పరిధిలోనే పనిచేస్తాయి. ఇక జమ్మూ కశ్మీర్లో ఎన్నికయ్యే ప్రభుత్వ అసెంబ్లీ స్థానాలు 107గా ఉన్నాయి. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చాక తర్వాత వాటి సంఖ్య 114కి పెరుగుతుంది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సిఫారసు లేనిదే ఆర్థిక బిల్లులేవీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అధికారాలు కొత్త ప్రభుత్వానికి ఉండవు. ఇక, లదాఖ్‌కు శాసనసభ అంటూ ఏమీ ఉండదు. ఇది పూర్తిగా కేంద్ర నియంత్రణలోనే ఉంటుంది. ఎల్జీల ప్రమాణం నేడే జమ్మూ కశ్మీర్ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) గా ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లదాఖ్æ ఎల్జీగా ఆర్కే మాథూర్‌లను కేంద్రం నియమించింది. గురువారం నాడు శ్రీనగర్, లేహ్‌లలో జరిగే కార్యక్రమాల్లో ఈ ఇద్దరు లెఫ్ట్‌నెంట్ గవర్నర్స్ పదవీ ప్రమాణం చేయనున్నారు. వీరిద్దరితో కశ్మీర్ హైకోర్టు సీజే గీత ప్రమాణం చేయిస్తారు. -
ఉక్కుమనిషికి నిలువెత్తు నివాళి
కెవాడియా (గుజరాత్): సమైక్య భారత నిర్మాత, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు సమున్నత గౌరవం... విచ్ఛిన్నంగా ఉన్న భారత భూభాగాల్ని ఏకం చేసిన ధీశాలికి నిలువెత్తు నివాళి. పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల(597 అడుగులు) సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యాంకు సమీపంలో సాధు బెట్ అనే దీవిలో కొలువుదీరిన ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు. వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లు జాతీయ పతాక రంగులు వెదజల్లుకుంటూ విగ్రహానికి సమీపంగా దూసుకెళ్లిన దృశ్యాలు కనువిందు చేశాయి. ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ప్రకృతి సోయగాల నడుమ, సంప్రదాయ దుస్తుల్లో పటేల్ ఠీవిగా నడుస్తున్నట్లున్న ఈ విగ్రహాన్ని.. సాధు కొండల్లో నక్షత్ర ఆకారం లోని పునాదిపై నిర్మించారు. సమైక్య భారత కలను నిజం చేయడానికి తమ రాజ్యాల్ని వదులుకున్న రాజ వంశాల జ్ఞాపకార్థం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని మోదీ గుజరాత్ ప్రభుత్వానికి సూచించారు. పటేల్ విగ్రహం మన దేశ ఇంజినీరింగ్, సాంకేతిక నైపుణ్యాలకు నిలువుటద్దం అని కొనియాడారు. నర్మదా డ్యాంకు సమీపంలో నివసిస్తున్న గిరిజనులకు ఈ విగ్రహం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ఆ ప్రాంతంలో పర్యాటక రంగం ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లి, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజ నిర్వహించిన మోదీ..విగ్రహం పాదాల వరకు వెళ్లి పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు. విగ్రహం కింది భాగంలో నిర్మించిన మ్యూజియంతో పాటు, 135 మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేసిన పర్యాటకుల గ్యాలరీని సందర్శించారు. భారత మనుగడకు భరోసా భారత్‌ను ముక్కలు చేయాలనుకున్న కుట్రలకు ఎదురునిలిచిన పటేల్ ధైర్యానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆనాడు దేశ అస్థిత్వంపై సందేహాలు వ్యక్తం చేసినవారికి భారత మనుగడపై అచంచల భరోసాను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై కూడా ప్రధాని ధ్వజమెత్తారు. పటేల్ లాంటి జాతీయ హీరోలకు స్మారకాలు నిర్మించడం ద్వారా తాము ఏమైనా నేరాలకు పాల్పడ్డామా? అని ప్రశ్నించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన తరువాత మోదీ 55 నిమిషాలు ప్రసంగించారు. 550 సంస్థానాలను విలీనంచేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సేవల్ని కొనియాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. పటేల్ భౌగోళిక సమైక్యతకు పాటుపడితే తమ ప్రభుత్వం జీఎస్టీ లాంటి సంస్కరణల ద్వారా ఆర్థిక సమైక్యతకు కృషిచేస్తోందని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లలో జాతి హీరోల గౌరవార్థం నిర్మించిన పలు స్మారకాల్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’కు స్ఫూర్తి ‘భారత జాతిని విచ్ఛిన్నం చేయాలనుకున్న కుట్రలను అడ్డుకున్న పటేల్ ధైర్యం, శక్తిసామర్థ్యాలు, అంకితభావాన్ని ఈ విగ్రహం ప్రపంచానికి, భావి తరాలకు చాటిచెబుతుంది. ఇదే స్ఫూర్తితో ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ సాధన దిశగా ముందడుగు వేయాలి. జాతి హీరోలకు స్మారకాలు నిర్మించాలన్న మా ఆశయాల్ని కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. పటేల్ లాంటి యోధుల సేవల్ని కీర్తించినందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇవన్నీ వింటుంటే మేము ఏమైనా నేరం చేశామా అని అనిపిస్తుంది. జాతిని ఏకం చేసిన గొప్ప వ్యక్తికి తగిన గౌరవం దక్కాలని దేశం మొత్తం కోరుకుంటోంది. దేశ విభజనకు జరుగుతున్న దుష్ట ప్రయత్నాలకు ప్రజలంతా గట్టి జవాబు ఇవ్వాలి. ఒకవేళ ఆనాడు పటేల్ వల్ల దేశం ఏకం కానట్లయితే హైదరాబాద్‌లో చార్మినార్ సందర్శనకు, గుజరాత్‌లోని జునాగఢ్‌లో సింహాల్ని చూసేందుకు, సోమనాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు ప్రజలకు వీసాల అవసరం వచ్చి ఉండేది’ అని మోదీ అన్నారు. డీజీపీల సదస్సు ఇక్కడే! ఈ సంవత్సరం జరగనున్న అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీల వార్షిక సమావేశానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమ షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా, పటేల్ విగ్రహం వద్దే ఈ సమావేశాలు నిర్వహించడానికి కేంద్ర హోం శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబర్ ద్వితీయార్థంలో ఈ కాన్ఫరెన్స్ జరిగే అవకాశాలున్నాయి. విగ్రహం సమీపంలోని కెవాడియా గ్రామంలో గుడారాల్లో డీజీపీలు, ఐజీలకు బస కల్పించాలని యోచిస్తున్నట్లు హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సివిల్ సర్వీసుల పితగా పేరొందిన సర్దార్ పటేల్ పేరిట హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారులకు శిక్షణనిచ్చే అకాడమీ(ఎన్పీఏ)ని నెలకొల్పారు. ఐక్యతా విగ్రహం విశేషాలివీ.. ► విగ్రహ నిర్మాణానికి వాడిన సామగ్రి: 70 వేల టన్నుల సిమెంట్, 24,500 టన్నుల ఉక్కు, 1,700 మెట్రిక్ టన్నుల కంచు ► నిర్మాణ వ్యయం: రూ. 2,989 కోట్లు ► విగ్రహం ప్రాజెక్టు విస్తీర్ణం: 20,000 చదరపు మీటర్లు ► పర్యాటకులు సమీపంలోని ప్రకృతి అందాల్ని చూసేందుకు విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులో గ్యాలరీ ఏర్పాటు ► ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తయిన చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కన్నా పటేల్ విగ్రహం రెట్టింపు ఎత్తయినది. ► పెద్ద రాయిని తొలిచి విగ్రహాన్ని చెక్కాలని భావించినా, అంతటి కఠినమైన రాయి లభించకపోవడంతో సిమెంట్, స్టీల్, కంచుతో నిర్మించారు. ► గుజరాత్ సీఎంగా ఉండగా పటేల్‌కు భారీ విగ్రహం నిర్మించాలని మోదీ సంకల్పించారు. 2013లో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ► లార్సెన్ అండ్ టుబ్రో సంస్థ రికార్డుస్థాయిలో 33 నెలల్లో కట్టింది. ► 2 వేలరకాల పటేల్ ఫొటోల్లో ఒకదాని ఓకే చేసి దానిలా విగ్రహాన్ని మలిచారు. ► విగ్రహాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించారు. ఒకటో జోన్లో మోకాళ్ల కింది భాగం, రెండో జోన్లో తొడలు(149 మీటర్లు), మూడో జోన్లో పర్యాటకుల గ్యాలరీ(153 మీటర్లు), నాలుగో జోన్లో మెయింటెనెన్స్, ఐదో జోన్లో తల, భుజాలు ఉన్నాయి. 4, 5 జోన్లలోకి ప్రవేశం నిషేధం. ► విగ్రహంలో ఏర్పాటుచేసిన లిఫ్ట్ సెకనుకు 4 మీటర్ల వేగంతో సందర్శకులను 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీకి తీసుకెళ్తుంది. ► పర్యాటకుల గ్యాలరీలోకి ఒకేసారి 200 మంది వెళ్లొచ్చు. ► సందర్శకుల గ్యాలరీ నుంచి సర్దార్ సరోవర్ డ్యాంతో పాటు 12 కి.మీ పొడవైన గరుడేశ్వర రిజర్వాయర్‌ను వీక్షించవచ్చు. ► విగ్రహం దగ్గరికి వెళ్లాలంటే రూ.120, విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీలోకి వెళ్లాలంటే టికెట్ రూ.350 చెల్లించాలి. ► విగ్రహ ప్రవేశంలోని మ్యూజియంలో పటేల్ జీవిత విశేషాలు, స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాలపై ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గాంధీకి భారీ విగ్రహం ఏదీ?: విపక్షాలు న్యూఢిల్లీ: ఉక్కుమనిషి సర్దార్ పటేల్ మాదిరిగా జాతిపిత మహాత్మా గాంధీకి భారీ విగ్రహం ఎందుకు ఏర్పాటుచేయలేదని విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. పటేల్ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని బీజేపీ హైజాక్ చేసిందన్నాయి. పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూనే, ఆయన చలవతో ఏర్పడిన వ్యవస్థలను కేంద్రం ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని నాశనంచేయడం ద్రోహానికి ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. దళిత నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేసినప్పుడు తనపై విమర్శలు గుప్పించిన బీజేపీ, ఆరెస్సెస్‌లు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీకి ఎక్కడా సర్దార్ పటేల్ అంతటి భారీ విగ్రహం లేదని, బీజేపీ అలాంటి నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేదో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కోరారు. పటేల్ కాంగ్రెస్ నాయకుడని, ఆయన్ని తమవాడిగా చెప్పుకునే హక్కు బీజేపీకి లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే బీజేపీ పటేల్ విగ్రహంతో రాజకీయాలు చేస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పటేల్, గాంధీ, అంబేడ్కర్.. ఇలా ఒక్కోసారి ఓ మహానాయకుడిని బీజేపీ గుర్తుచేసుకుంటుందని, అవన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనని అన్నారు. పటేల్ భారీ విగ్రహం పాదాల చెంత నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ సర్దార్ పటేల్ విగ్రహం కింది భాగంలో ఏర్పాటుచేసిన మ్యూజియంలో మోదీ విగ్రహం లోపల పర్యాటకుల గ్యాలరీ నుంచి సర్దార్ సరోవర్ డ్యాం విహంగ వీక్షణం -
ఏకం చేసిన ఘనత పటేల్‌దే
న్యూఢిల్లీ: దేశవిభజన తర్వాత వందలాది స్వతంత్ర రాజ్యాలుగా మిగిలిపోయిన భారత్‌ను ఏకం చేసిన ఘనత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. అప్పటి హోంమంత్రిగా ఉన్న పటేల్ సరైన సమయంలో ప్రతిస్పందించడంతో జమ్మూకశ్మీర్‌ను విదేశీ దురాక్రమణ నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్టోబర్ మాసాంతపు ’మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రసంగించిన మోదీ.. ఈ నెల 31 సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ‘రన్ ఫర్ యూనిటీ’ మారథాన్‌లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు మనం భారత్‌ను ఒక దేశంగా చూస్తున్నామంటే సర్దార్ పటేల్ తెలివితేటలు, వ్యూహాత్మక నిర్ణయాలే కారణం. అక్టోబర్ 31న çపటేల్ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడమే ఆయనకు మనం ఇవ్వబోయే నిజమైన నివాళి. గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన సర్దార్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనది. ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎత్తయిన రెండో విగ్రహంగా ఉన్న న్యూయార్క్‌లోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’కి రెండింతల ఎత్తులో పటేల్ విగ్రహం ఉండనుంది. భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి కూడా అక్టోబర్ 31నే. ఈ సందర్భంగా ఇందిరాజీకి నివాళులు అర్పిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. అభివృద్ధితోనే నిజమైన శాంతి.. ‘యుద్ధం లేకపోవడం నిజమైన శాంతి కాదు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తులకు అందడమే నిజమైన శాంతికి సూచిక. ప్రపంచశాంతి గురించి ఎక్కడైనా ప్రస్తావించాల్సి వస్తే అందులో భారత్ పాత్రను సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధంలో మనకు ఎలాటి సంబంధం లేకపోయినా భారతీయ సైనికులు కదనరంగంలో దూకారు. ఈ యుద్ధంలో కోటి మంది సైనికులతో పాటు మరో కోటి మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రపంచానికి శాంతి ప్రాముఖ్యత అర్థమయింది. గత వందేళ్లలో శాంతి అన్న పదానికి నిర్వచనమే మారిపోయింది. ఇప్పుడు శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ఇందుకోసం ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం తదితర సమస్యల పరిష్కారినికి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. క్రీడారంగంలో రాణించాలంటే స్పిరిట్ (స్ఫూర్తి), స్ట్రెంత్ (శక్తి), స్కిల్ (నైపుణ్యం), స్టామినా (సామర్థ్యం) ఉండటం కీలకమన్నారు. సైనిక చర్యలో ఆలస్యం ఉండొద్దన్న సర్దార్ ‘కశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాక్ బలగాలను తరిమికొట్టేందుకు భారత సైన్యాన్ని పంపడంలో జరుగుతున్న జాప్యంపై సర్దార్ పటేల్ అప్పట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత సైనిక చర్యలో ఎలాంటి ఆలస్యం ఉండరాదని అప్పటి ఫీల్డ్ మార్షల్ మానెక్ షాకు పటేల్ సూచించారు. ఆతర్వాత వెంటనే రంగంలోకి దిగిన భారత బలగాలు కశ్మీర్‌ను పాక్ దురాక్రమణ నుంచి కాపాడాయి. భారత్‌కు ఏకం చేయగల, దేశ విభజన గాయాలను మాన్పగల శక్తిఉన్న వ్యక్తిగా పటేల్‌ను 1947, జనవరిలో ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ కీర్తించింది. స్వదేశీ సంస్థా నాలను దేశంలో విలీనం చేసే సామర్థ్యం కేవలం పటేల్‌కే ఉందని మహాత్మా గాంధీ సైతం గుర్తించారు. హైదరాబాద్, జునాగఢ్, ట్రావెన్కోర్.. ఒకటితర్వాత మరొకటి ఇలా 562 స్వదేశీ సంస్థానాలను పటేల్ భారత్‌లో విలీనం చేశారు. ఇందులో పూర్తి ఘనత పటేల్‌కే దక్కుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
జాతి గుండెల్లో ఉక్కు మనిషి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేసినా.. జాతి మాత్రం మరువదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పటేల్ 142వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఐక్యతా పరుగును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం మేజర్ ధ్యాన్‌చంద్ మైదానంలో మోదీ ప్రసంగించారు. ‘‘స్వాతంత్ర్యానంతరం దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు పటేల్ చేసిన కృషి అమోఘనీయం. భారతదేశం భిన్న మతాల, సంస్కృతుల సమ్మేళనం. అలాంటి దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు అహర్నిశలు ఆయన కృషిచేశారు. అంతటి మహనీయుడి జయంతి వేడుకలపై గత పాలకులు పక్షపాతం చూపారు. కానీ, దేశ ప్రజలు మాత్రం ఆయన్ని ఎప్పుడూ తమ గుండెల్లో నిలుపుకుంటారు’’ అని మోదీ తెలిపారు. జాతి పునర్నిర్మాణానికి కృషి చేసిన ఉక్కుమనిషికి నేటి యువత గౌరవం ఇవ్వటం విశేషమని ఆయన తెలిపారు. వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించటంపై తమ ప్రభుత్వం ఎంతో గర్వపడుతుందని మోదీ పేర్కొన్నారు. ఇంకా ఇదే వేదికపై నేడు ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన ఉక్కు మహిళ గురించి ప్రస్తావించారు. ఇక ఐక్యతా పరుగు కార్యక్రమంలో 20,000 మంది పాల్గొనగా.. వారిలో పీవీ సింధు, మిథాలీ రాజ్ లాంటి సెలబ్రిటీలు ఉన్నారు. అంతకు ముందు పటేల్ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు, మోదీ, రాజ్‌నాథ్ సింగ్ లు నివాళులర్పించారు. ఇందిరమ్మకు ఘన నివాళులు మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 33వ వర్థంతి సందర్భంగా పలువురు ప్రముఖులు శక్తిస్థల్ వద్దకు క్యూ కట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, ఇందిర మనవడు- కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఘాట్ వద్ద ఆమెకు నివాళులర్పించారు. -
ఉక్కుమనిషి పట్ల ఇదా గౌరవం!: నాగం
సీఎం కేసీఆర్‌ను నిలదీసిన నాగం హైదరాబాద్: నిజాం చెర నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొనకుండా సీఎం కె.చంద్రశేఖరరావు అనుచిత ధోరణితో వ్యవహరించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దనరెడ్డి విమర్శించారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంకు పటేల్ జయంతి కార్యక్రమంలో పాల్గొనే తీరిక లేదా అని ప్రశ్నించారు. అక్టోబర్ 31న జాతీయ ఏక్తాదివస్ పాటించాలని అన్ని విభాగాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ దాన్ని తానే ఎందుకు ఉల్లంఘించారని విమర్శించారు. -
ఘనంగా రన్ ఫర్ యూనిటీ
సాక్షి, ముంబై: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్కవారం ఉదయం గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ‘రన్ ఫర్ యూనిటీ’ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా బిల్డింగ్ నుంచి ప్రారంభమై మెరైన్ డ్రైవ్‌లోని పార్శీ జింఖానా వద్ద ముగిసింది. రెండు కి.మీ.మేర సాగిన ఈ కార్యక్రమంలో బజ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, రావ్‌సాహెబ్ దాన్వే తదితరులు పాల్గొన్నారు. వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజైన అక్టోబరు 31వ తేదీని ‘రాష్టీయ ఏక్తా దివస్’ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా గవర్నర్ దేశ ఐక్యతను, శాంతి, భద్రతలను కాపాడేందుకు తనవంతు కృషిచేస్తానని కార్యక్రమానికి హాజరైన వారిచేత ప్రమాణం చేయించారు. అలాగే ఈ సందేశాన్ని దేశ ప్రజలందరికి చేరవేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.