అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామికే మెజార్టీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి కోరారు. రాష్ట్రంలో విపక్షాల కుట్రలు సాగవని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆమె బుధవారమిక్కడ అన్నారు. కాగా పళనిస్వామి మంగళవారం సాయంత్రం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే.