గవర్నర్ కీలక నిర్ణయం!
చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు సభలో కాంపొజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహించనున్నారు. అసెంబ్లీలోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఏఐఏడీఎంకే శాసనసభ పక్షనేత పళని స్వామి బల నిరూపణకు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది.
పళనిస్వామి తన వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో బుధవారం రాత్రి గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీయ్యారు. సమావేశమనంతరం అన్నాడీఎంకే నేత జయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారు. 124 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినట్లు చెప్పారు. పన్నీర్ వెంట ఎమ్మెల్యేలు లేరని..అలాంటప్పుడు బలపరీక్ష ఎందుకని జయ్‌కుమార్ ప్రశ్నించారు. పన్నీర్ వర్గం కూడా ఎమ్మెల్యేల సంతకాల లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో పన్నీర్ సెల్వం వర్గం భేటీయ్యారు.
తమిళనాడు మరిన్ని అప్‌డేట్స్ చూడండి..