panneru selvam
-
దూకుడు పెంచిన శశికళ.. వారితో దోస్తి!
చెన్నై: రాష్ట్రంలో వేర్వేరుగా రాజకీయాలు నడుపుతున్న శశికళ, దివాకరన్ ఏకమవుతున్నట్లు ఆదివారం ఓ వార్త ఆసక్తి కలిగించింది. శశికళ సోదరుడు దివాకరన్, అక్క కుమారుడైన టీటీవీ దినకరన్ మధ్య తీవ్రస్థాయిలో చోటుచేసుకున్న విబేధాల నుంచి కొత్తపార్టీ పుట్టుకొచ్చింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు పోటీగా అన్నా ద్రవిడ కళగం అనే పార్టీ ప్రారంభమైంది. రెండు పార్టీల్లో పెద్దగా బలం, బలగం లేకున్నా వారివురూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, శశికళ వర్గం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. శశికళ నాయకత్వంలోని అన్నాడీఎంకేలో అన్నా ద్రవిడ కళగం విలీనం కాబోతున్నట్లు, ఇందుకు సంబంధించి ఈనెల 12వ తేదీన తంజావూరులో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నాడేఎంకేలో పన్నీర్ సెల్వం వెర్సస్ పళణి స్వామి అన్నట్లు రాజకీయ వివాదం జరుగుతోంది. మరో వైపు శశికళ నాయకత్వంలోని పార్టీకి ఈ వీలినం చూస్తుంటే అన్నాడేఎంకేలో పట్టు బిగించే పనిలో ఆమె దృష్టి పెట్టినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. చదవండి: OPS Vs EPS: పన్నీర్ సెల్వానికి షాక్.. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
సీఎం అభ్యర్థిపై పేచీ: రజనీతో అమిత్ షా భేటీ!
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య మిత్రభేద రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై రెండు పార్టీల నడుమ పొలిటకల్ వార్ నడుస్తుండగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈనెల 14న చెన్నైకి వస్తున్నారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు రెండు నెలల క్రితమే అన్నాడీఎంకే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్రశాఖ వ్యతిరేకిస్తోంది. ఇటీవల చెన్నైకి వచ్చిన కేంద్రమంత్రులు సైతం ఎడపాడి పేరును అంగీకరించలేదు. అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ ఉందని ఆన్నాడీఎంకే నేతలు ఒకవైపు, ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే ఉందని బీజేపీ నేతలు మరోవైపు వాదిస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదీ తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షులు మురుగన్ బహిరంగంగా ప్రకటించారు. (‘అమ్మ’కు వారసులు లేరా?) ఎడపాడి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తేనే కూటమిలోకి రండి లేకుంటే పొండి అన్నట్లుగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోంది. కూటమిలో ఇలాంటి మిత్రబేధ పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో గత ఏడాది నవంబర్ 21న అమిత్‌షా చెన్నైకి వచ్చారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ కొనసాగుతుందని పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం ఆనాడు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీకే 60 సీట్లు కేటాయిస్తే కూటమిలోని పీఎంకే, డీఎండీకేలు సైతం ఎక్కువ సీట్లను డిమాండ్ చేసే పరిస్థితులు తలెత్తుతాయని వాదించి 34 సీట్లకు అన్నాడీఎంకే అంగీకరించినట్లు తెలుస్తోంది. 60 సీట్లు కేటాయిస్తే తాము పుదియనీది కట్చి, తమిళ మక్కల్ మున్నేట్ర కళగం తదితర చిన్న పార్టీలకు సీట్ల సర్దుబాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. దీనికి అన్నాడీఎంకే సమ్మతించడం లేదు. ఇదే అదునుగా 40 సీట్లు కోరాలని పీఎంకే నిర్ణయించుకుంది. వన్నియర్ సామాజిక వర్గ మద్దతు బలంగా ఉన్న పీఎంకేకు గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉంది. రాజ్యసభ సీటు ఒప్పందంపైనే గడిచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే చేరింది. ఒప్పందం ప్రకారం పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్‌ను రాజ్యసభకు పంపింది. (తలైవా.. నువ్వు రావాల్సిందే) రజనీ మద్దతు కోసం అమిత్ షా.. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చి అధికసీట్లలో తమ అభ్యర్థులు గెలిస్తే ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పందం కుదుర్చుకోవాలని పీఎంకే భావిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేతో సీట్ల సంధి కుదరకుంటే డీఎంకే వైపు వెళ్లాలని పీఎంకే భావిస్తోంది. 14వ తేదీన జరగనున్న బీజేపీ – అన్నాడీఎంకే చర్చల కన్నా ముందే తమ డిమాండ్లను తెరపైకి తేవాలన్న ఉద్దేశంతో పీఎంకే ఈనెల 9వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుండగా, బీజేపీకి 60, పీఎంకేకి 40 కేటాయిస్తే, అన్నాడీఎంకే సహా కూటమిలోని మిగిలిన రెండు మూడు పార్టీలకు మిగిలేది 134 మాత్రమే. నటుడు విజయకాంత్ నేతృత్వంలోని మరో మిత్రపక్ష పార్టీ డీఎండీకే సీట్లపై ఇంకా నోరువిప్పలేదు. ఇలా కూటమిలో ప్రధానపార్టీలు అన్నాడీఎంకే మెడపై వేలాడుతున్న కత్తిలా మారాయి. సీట్ల సర్దుబాటులో పట్టుదలలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై విభేదాలు నెలకొన్న తరుణంలో ఈనెల 14న అమిత్‌షా చెన్నై రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. అమిత్‌షా సమక్షంలో రెండు ప్రధాన సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నారు. ఈ పర్యటనలో నటుడు రజనీకాంత్‌ను సైతం అమిత్‌షా స్వయంగా కలిసి, మద్దతు కోరుతారని సమాచారం. -
దర్యాప్తు కమిషన్ ముందు హాజరవుతా: పన్నీర్ సెల్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలిత మృతిపై అనుమానాలున్నాయని తాను ఆనాడే చెప్పానని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. జయలలిత హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసేందుకు కూడా నన్నుఅనుమతించలేదని, ఆమె మృతిపై దర్యాప్తు చేయాలని తాను కోరానని గుర్తుచేశారు. ‘అమ్మ’ మృతిపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ తనను విచారణకు హాజరుకావాలని నాలుగు సార్లు కోరిందనీ, కానీ పని ఒత్తిడి వల్ల వెళ్లలేకపోయాననీ స్పష్టం చేశారు. ఈ సారి పిలిస్తే కచ్చితంగా వెళ్తానని తెలియజేశారు. కాగా, జయలలిత మృతికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఇంకొంత సమయం కావాలని తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు జులై ఒకటిన అనుమతించింది. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో పన్నీర్ సెల్వం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మళ్లీ చెడిందా!
సాక్షి, చెన్నై: రెండాకుల చిహ్నం తమకు దక్కడంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మదురైలో శనివారం నిర్వహించిన విజయోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంను సీఎం పళనిస్వామి శిబిరం ఆహ్వానించకపోవడం చర్చకు దారితీసింది. తామిద్దరం ఒక్కటేనని చెప్పుకుంటూ వచ్చిన సీఎం, ఈ వేడుకలో పన్నీరు ఊసెత్తకుండా ప్రసగించడం గమనార్హం. పన్నీరు శిబిరానికి సీఎం ప్రాధాన్యం ఇవ్వడంలేదని వారం రోజులుగా తమిళనాట ప్రచారం జరుగుతోంది. పన్నీరు మద్దతు ఎంపీ మైత్రేయన్ ట్విట్టర్లో అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రెండాకుల చిహ్నం విజయోత్సవ వేడుక పళని, పన్నీరు మధ్య విభేదాల్ని బయటపెట్టింది. శనివారం రామనాథపురంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మదురై నుంచి 120 కి.మీ దూరంలో ఉన్న రామనాథపురం వరకు రోడ్డు మార్గమంతా రెండాకులు, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితతో పాటు సీఎం పళనిస్వామి చిత్ర పటాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు హోరెత్తాయి. అయితే, ఎక్కడా పన్నీరుకు చోటు కల్పించలేదు. అలాగే మదురై తిరుప్పర గుండ్రం వద్ద వంద అడుగులతో కూడిన భారీ జెండా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవ స్తూపం శిలాఫలకంలో ఆ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి, మంత్రి ఆర్బీ ఉదయకుమార్, సీఎం పళనిస్వామి పేరును మాత్రం పొందుపరిచారు. అలాగే, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంను ఆహ్వానించకుండా ఈ వేడుక జరిగింది. తమ శిబిరానికి చెందిన ఏ ఒక్కరినీ ఈ వేడుకకు పిలవకపోవడంపై పన్నీరు మద్దతు నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక, సాయంత్రం రామనాథపురంలో జరిగిన ఎంజీఆర్ శత జయంతి వేడుకలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా కూర్చోవడం తమిళనాట చర్చకు దారితీసింది. -
ఢిల్లీలో పళని వర్సెస్ పన్నీరు
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు (మంగళవారం) ఇరు వర్గాలు ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. అన్నా డీఎంకే ఎంపీల బృందంతో కలసి సీఎం పళనిస్వామి.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. పలువురు కేంద్రమంత్రులను కూడా పళనిస్వామి బృందం కలవనుంది. మాజీ సీఎం పన్నీరు సెల్వం కూడా తన మద్దతుదారులైన ఎంపీలతో కలసి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పన్నీరు సెల్వం వర్గం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. ఈ మేరకు వారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని పన్నీరు సెల్వం వర్గం కోరనుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. స్పీకర్ అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారని, పళనిస్వామి బలపరీక్ష చెల్లదని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, పన్నీరు సెల్వం, ఇతర పార్టీల నాయకులు ఆరోపించారు. స్టాలిన్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌కు ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ సహా ఇతర నేతలను కలిశారు. తాజాగా పన్నీరు సెల్వం వర్గం ఇదే విషయంపై ఫిర్యాదు చేయనుంది. కాగా సీఎం పళనిస్వామి వర్గీయులు తమిళనాడుకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. -
శపథం చేసిన శశికళ పంతం నెగ్గింది
-
శశికళ ప్లాన్ గ్రాండ్ సక్సెస్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది. విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. మొత్తంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనగా, పళనికి అనూకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో మెజార్టీ ఓట్లు సాధించిన పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో పళని విజయం నల్లేరుపై నడకగా మారింది. రిసార్ట్ రాజకీయాలు నెగ్గాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పది రోజుల కిందటి వరకూ ఎవరికీ తెలియని కువతూర్కు సమీపంలోని గోల్డెడ్ బే రిసార్టులో చిన్నమ్మ శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అక్కడ నిర్బంధించారని కథనాలు వచ్చాయి. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలను తనవైపు ఎక్కడ లాగేసుకుంటారోనని శశికళ చేసిన ప్రయత్నం నేడు ఫలించింది. అయితే ఆ ప్రయోజనాన్ని మాత్రం పళనిస్వామి పొందనున్నారు. సుప్రీంకోర్టు శశికళను దోషీగా తీర్పివ్వడంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయి అక్కడే మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ ఆశలు గల్లంతు కాగా.. అమ్మ జయలలితకు, తనకు విధేయుడైన పళనిస్వామిని గోల్డెన్ బే రిసార్ట్ లోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి మద్ధతు ఇవ్వకుండా చేయడంలోనూ శశికళ పన్నిన గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపు వ్యూహం సక్సెస్ అయింది. అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు తనకే మద్ధతు ఇవ్వాలని కోరుతూ రిసార్టులో శశికళ చేసిన ప్రసంగాలు వారిని ఐకమత్యంగా ఉంచాయనడంలో సందేహమే అక్కర్లేదు. గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలుసుకోవడం.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉందని వివరించడం.. ఆపై పళనితో గవర్నర్ ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. నేడు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారిలో శశికళ క్యాంపులోని రిసార్ట్ ఎమ్మెల్యేల ఓటింగే పళనిస్వామి సీఎం పీఠాన్ని అందించింది. పన్నీర్ క్యాంపులోని ఆరుగురు ఎమ్మెల్యేలు సహా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేశారు. దాదాపు వారం రోజులపాటు గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలలో 122 మంది ఆయనకు మద్ధతు తెలుపుతూ ఓటేయడంతో మెజార్టీ సాధించి చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామి.. జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వంపై మరోసారి విజయం సాధించారు. -
గోల్డెన్ బే రిసార్ట్ మూసివేత
చెన్న: గోల్డెన్ బే రిసార్ట్.. పది రోజుల క్రితం వరకు దీని గురించి చాలామంది తెలియదు. చెన్నైకు దాదాపు 80 కిలో మీటర్ల దూరంలో కువతూర్కు సమీపంలో ఈ రిసార్ట్ ఉంటుంది. శశికళపై పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడటం, ఆ తర్వాత శశికళ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పది రోజుల పాటు ఇక్కడ ఉంచాక గోల్డెన్ బే రిసార్ట్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. రోజూ వార్తల్లో నిలిచింది. పది రోజులగా అక్కడ మీడియా ప్రతినిధులు మకాం వేశారు. పోలీసులను భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేలను విచారించి, వారి వాంగ్మూలం తీసుకున్నారు. ఎట్టకేలకు శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలను భారీ భద్రత మధ్య తీసుకెళ్లడంతో రిసార్ట్ ఖాళీ అయ్యింది. కాసేపటి తర్వాత గోల్డెన్ బే రిసార్ట్‌ను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. రిసార్ట్‌కు మరమ్మత్తులు చేయించాలని, దీని కారణంగా మూసివేస్తున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఈ రిసార్ట్‌లో ఉన్నప్పుడు వారిని కలిసేందుకు శశికళతో పాటు సీఎం పళనిస్వామి కూడా వెళ్లారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి: స్పీకర్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా సభ్యులు ప్రవర్తించిన తీరుపై స్పీకర్ ధనపాల్ అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశారు. తన చొక్కా చింపి అవమానించారని, తనపై జరిగిన దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్ధంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. తన నిర్ణయంపై ఇతరులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న డిమాండ్‌ను తిరస్కరించినందుకు డీఎంకే సభ్యులు స్పీకర్‌ను ఘొరావ్ చేశారు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంటూ స్పీకర్‌పై కుర్చీలు, పేపర్లు విసిరేసి, ఆయన ముందున్న టేబుల్‌ను విరగొట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ డీఎంకే సభ్యులు బయటకు వెళ్లాలని ఆదేశించారు. సభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
అసెంబ్లీలో పళని వర్సెస్ పన్నీరు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రణరంగంగా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలంటూ ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు సభలో రభస చేశారు. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కూడా స్వరం కలిపారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత ఏర్పడటంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేశారు. తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పళనిస్వామి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను కలవకుండా కట్టడి చేస్తున్నారు. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కో మంత్రికి చొప్పున బాధ్యతలు అప్పగించారు. కాగా సభ మళ్లీ ప్రారంభమయ్యే లోపు పళనివర్గం ఎమ్మెల్యేల మనసు మార్చేందుకు డీఎంకే, పన్నీరు సెల్వం వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
పన్నీరు, స్టాలిన్లది ఒక్కటే డిమాండ్ కానీ..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మధ్య బలపరీక్ష జరుగుతోంది. ప్రజాభిప్రాయం విన్న తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌ను కోరారు. స్పీకర్ వీరి డిమాండ్‌ను తిరస్కరిస్తూ డివిజన్ వారీగా ఓటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్ రావు 15 రోజులు సమయం ఇచ్చారని, ఎందుకు హడావుడిగా ఓటింగ్ నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బలపరీక్షను మరోరోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షని స్టాలిన్ చెప్పారు. సభలో పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. కువతూర్‌లోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఉంచిన విషయం అందరికీ తెలుసునని, ప్రజాభిప్రాయం విన్న తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని కోరారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన సభలో నిరసనకు దిగారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌ను తిరస్కరించడంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు డీఎంకే, పన్నీరు సెల్వం వర్గీయులు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కూడా రహస్య ఓటింగ్‌కు పట్టుపట్టాయి. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
పళని వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద రెండు వేలమంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు బలగాలు సిద్ధంగా ఉంచారు. పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం: ఈ రోజు ఉదయం గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయల్దేరిన పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. చెన్నైలో ఈసీఆర్ రోడ్డులో అన్నా డీఎంకే కార్యకర్తలు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నినాదాలు చేస్తూ, వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తరలించారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
చివర్లో పళనికి షాక్.. మరో ఎమ్మెల్యే జంప్
-
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
-
బలపరీక్షకు కరుణానిధి దూరం!
చెన్నై: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ డీఎంకే చీఫ్ కరుణానిధి (92) కాసేపట్లో జరిగే బలపరీక్షకు దూరంగా ఉండనున్నట్టు సమాచారం. అనారోగ్యం కారణంగా కరుణ అసెంబ్లీకి రారని, బలపరీక్షలో పాల్గొనబోరని డీఎంకే వర్గాలు తెలిపాయి. ఇటీవల అస్వస్థతకు గురైన కరుణానిధి కొన్ని రోజులు చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. డీఎంకేకు మొత్తం 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కరుణ మినహా మిగతా 88 మంది ఎమ్మెల్యేలు.. బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్
చెన్నై: అన్నా డీఎంకే రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఎదుర్కొనే బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కాసేపట్లో బలపరీక్ష జరగనుండగా, పళనిస్వామి శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. అసెంబ్లీలో పళనిస్వామికి మద్దతుగా ఓటు వేయబోనని ఎమ్మెల్యే అరుణ్ కుమార్ ప్రకటించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గూటికి చేరారు. నిన్నరాత్రి వరకు పళనిస్వామి శిబిరంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అరుణ్ కుమార్ జంప్ కావడంతో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పన్నీరు సెల్వం శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న కోయంబత్తూరు ఎమ్మెల్యే నటరాజన్ పన్నీరు సెల్వం వర్గంలో చేరారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు రావడంతో ఈ రోజు బలపరీక్షలో ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. బలపరీక్షలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నాయి. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
చెన్నై: కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు (శశికళ వర్గం) భారీ భద్రతతో అసెంబ్లీకి బయల్దేరారు. ఈ రోజు (శనివారం) తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కోనుండటంతో.. ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు. బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పళనిస్వామి శిబిరంలో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరిలో 20 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరగగా, పళనిస్వామి వారిని బుజ్జగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇక మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. అమ్మకు ఓటేయండి అంటూ బలపరీక్షలో పళనిస్వామిని ఓడించాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరారు. ఆయన వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (89), కాంగ్రెస్ పార్టీలు (8) బలపరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఏం జరుగుతుందనే దానిపై తమిళనాడు పాటు దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ
-
స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఉత్కంఠగా మారాయి. రేపు (శనివారం) అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌తో సమావేశమయ్యారు. రహస్య ఓటింగ్ ద్వారా బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పన్నీరు వర్గంలో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, శశికళ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పళనిస్వామి బెంగళూరు పర్యటనను రద్దు చేసుకుని.. ఎమ్మెల్యేలను క్యాంపుగా ఉంచిన గోల్డెన్ బే రిస్టార్కు వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇక ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పార్టీ నేతలతో సమావేశమై రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణం చేయడం, రేపు బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు మళ్లీ దూకుడు పెంచారు. దెబ్బకు దెబ్బ తీస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అన్నా డీఎంకే నుంచి శశికళను, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్‌లను బహిష్కరించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఈ ముగ్గురిపై వేటు వేసినట్టు ప్రకటించారు. అమ్మ వారసత్వం కోసం, పార్టీ కోసం శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, మధుసూదన్‌లను తొలుత శశికళ పార్టీ నుంచి బహిష్కరించగా.. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదని, తమను బహిష్కరించే హక్కు ఆమెకు లేదని మధుసూదన్ చెప్పారు. శశికళతో పాటు దినకరన్, వెంకటేష్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని మధుసూదన్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఆయన వర్గీయులు నేరుగా కలసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఈసీ పరిశీలనలో ఉంది. జయలలిత గతంలో దినకరన్, వెంకటేష్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. జయ మరణం తర్వాత శశికళ మళ్లీ వాళ్లను పార్టీలోకి తీసుకుని దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం
-
గవర్నర్ కీలక నిర్ణయం!
-
గవర్నర్ కీలక నిర్ణయం!
చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు సభలో కాంపొజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహించనున్నారు. అసెంబ్లీలోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఏఐఏడీఎంకే శాసనసభ పక్షనేత పళని స్వామి బల నిరూపణకు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది. పళనిస్వామి తన వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో బుధవారం రాత్రి గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీయ్యారు. సమావేశమనంతరం అన్నాడీఎంకే నేత జయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారు. 124 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినట్లు చెప్పారు. పన్నీర్ వెంట ఎమ్మెల్యేలు లేరని..అలాంటప్పుడు బలపరీక్ష ఎందుకని జయ్‌కుమార్ ప్రశ్నించారు. పన్నీర్ వర్గం కూడా ఎమ్మెల్యేల సంతకాల లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో పన్నీర్ సెల్వం వర్గం భేటీయ్యారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. గవర్నర్‌తో పళనిస్వామి భేటీ చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
గవర్నర్‌తో పళనిస్వామి భేటీ
చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి మరోసారి కలిశారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని పళనిస్వామి కోరారు. ఆయన వెంట 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా ఆయన గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి కోరారు. కాగా మరికాసేపట్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కూడా గవర్నర్‌ను కలవనున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు సెల్వంకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. శశికళ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ ఇక ఆలస్యం చేయడం తగదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం!
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన మంత్రి పళనిస్వామికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని సమాచారం. గవర్నర్ ఈ రోజే ఈ విషయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. నిన్న (మంగళవారం) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శశికళను దోషిగా ప్రకటించాక.. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా అసెంబ్లీలో బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా గవర్నర్‌ను కోరినా ఆయనకు తగినంత ఎమ్మెల్యేల బలం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్.. పళనిస్వామికి అవకాశం ఇస్తారని సమాచారం. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ ఇక ఆలస్యం చేయడం తగదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
పళనిస్వామే ఎందుకు!
తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే కొత్త శాసనసభ పక్ష నేతగా పీడబ్ల్యూడీ మంత్రి ఎడపాడి కె పళనిస్వామిని ఎంపిక చేయడంలో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ వ్యూహం ఏమిటనే ప్రశ్నకు కులం ప్రధాన కారణమనే జవాబు వినిపిస్తోంది. సొంత (తేవర్) కులానికి కాకుండా మరో పెద్ద సామాజిక వర్గానికి (గౌండర్) ప్రాధాన్యం ఇచ్చారనే ‘ఇమేజ్’ సంపాదించడానికి ఆమె ఈ పనిచేశారని భావిస్తున్నారు. తమిళనాడులో జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం రీత్యా గౌండర్లు, తేవర్లు, వన్నియార్లు సామాజిక వర్గాల వారు బలమైనవారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ ఇద్దరూ తేవర్లే. 234 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో తేవర్ ఎమ్మెల్యేలే ఎక్కువ. అన్నా డీఎంకేలో మాత్రం గౌండర్లు 28 మంది , తేవర్లు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. దివంగత సీఎం జయలలిత, ప్రస్తుతం ఓపీఎస్ కేబినెట్లలో తేవర్లకు 9 మంత్రి పదవులు లభించగా, గౌండర్లకు ఐదే దక్కాయి. పాలకపక్షంలో 19 మంది ఎమ్మెల్యేలున్న బీసీ వర్గమైన వన్నియార్లకు కూడా 5 పదవులే లభించాయి. 1967లో డీఎంకే, మళ్లీ 1977లో అన్నాడీఎంకే అధికారంలో వచ్చినప్పటి నుంచీ ఈ రెండు ద్రవిడ పార్టీలు బ్రాహ్మణేతర సీఎంల పాలనలో ప్రధాన కులాల ఆధిపత్యం లేకుండా రాజకీయాలు నడిచాయి. 1991లో జయలలిత తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ ఏఐఏడీఎంకే పాలనలో తేవర్లకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బ్రాహ్మణేతరులకు సామాజిక న్యాయం, తమిళానికి ప్రాధాన్యం వంటి నినాదాలతో బలమైన ద్రవిడ సైద్ధాంతిక బలం ఉన్న డీఎంకే నేత ఎం.కరుణానిధిని జయలలిత విజయవంతంగా ఎదుర్కోగలిగారు. అనేక కులాలతో బలమైన సామాజిక సంకీర్ణం నిర్మించి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. కులానికి అతీతంగా ఆమె గట్టి పునాదివర్గాన్ని పార్టీకి ఏర్పాటుచేశారు. గౌండర్లు గెలిపించారు ఓటర్లు ప్రతి అయిదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే సంప్రదాయం 1989 నుంచీ బలపడిన తమిళనాట గతేడాది (2016) అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను వరుసగా రెండోసారి గెలిపించారు. స్వల్ప మెజారిటీతో విజయం సాధించడానికి జయలలిత వెనుక పశ్చిమ ప్రాంతం (కొంగునాడు) గట్టిగా నిలబడింది. ఈ ప్రాంతంలోని దాదాపు 50 సీట్లలో అన్నాడీఎంకే కైవసం చేసుకున్న 44 సీట్లే మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 118ని దాటి 135 స్థానాలు సాధించడానికి ఇక్కడి ఆధిపత్యవర్గమైన గౌండర్లు తోడ్పడ్డారు. నమ్మిన తేవర్ తిరుగుబాటు చేశాక గౌండర్! జయ తర్వాత ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనే విషయంలో ఒక దశలో గౌండర్ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి వైపు మొగ్గుచూపారని, అదే కులానికి చెందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై పేరును కూడా శశికళ పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. చివరికి గతంలో జయ రెండుసార్లు తన బదులు సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ఓపీఎస్‌నే శశికళ ఎంపిక చేయడంతో రెండు ప్రధాన పదవులు తేవర్ల చేతుల్లోకి వచ్చాయని వాదన వినిపించింది. తాను కోరినట్టు రెండు నెలలకే రాజీనామా చేసిన ఓపీఎస్ వారం లోపే తిరుగుబాటు చేయడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శిక్షను ఖరారు చేయడంతో శశికళ వ్యూహం మార్చారు. అసంతృప్తిగా ఉన్న గౌండర్ల మద్దతు పొందడానికి పళనిస్వామిని సీఎం పదవికి ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నా డీఎంకే నిలుస్తుందా? దాదాపు రెండు దశాబ్దాల క్రితం(1988) ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే చీలిపోయింది. రెండు చీలిక వర్గాలూ ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 27 సీట్లు గెల్చుకున్న జయలలిత వర్గంలో ఎంజీఆర్ భార్య వీఎన్ జానకి నేతృత్వంలోని పార్టీ విలీనమైంది. ఎంజీఆర్ తర్వాత అంతటి జనాకర్షక నేతగా జయలలిత రుజువు చేసుకుని పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐఏడీఎంకే మరోసారి చీలిపోతే, జయలలితలా పార్టీ పగ్గాలు చేపట్టి మళ్లీ జనాదరణ సంపాదించే సత్తా ఉన్న నేతలెవరూ రెండు వర్గాల్లో లేరు. శశికళ, ఓపీఎస్, తంబిదురై, పళనిస్వామి, ఇ మధుసూదనన్.. వీరిలో ఎవరికీ అంతటి శక్తియుక్తులు లేవు. చీలిక తర్వాత రెండు వర్గాలు పూర్తిగా దెబ్బతింటే ఆ శూన్యాన్ని మరో కొత్త ద్రవిడ రాజకీయ పార్టీతో పూరించవచ్చని పరిశీకులు భావిస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే రెండు చీలిక వర్గాలు, డీఎంకే మధ్య ఓట్లు చీలితే పూర్వ వైభవం సాధించవచ్చని భావించిన కాంగ్రెస్‌కు 1989 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే మరోసారి చీలితే బీజేపీకి లబ్ధిపొందే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం ఇచ్చినా లేదా అన్నా డీఎంకే శాసన సభ పక్ష నేతగా శశికళ స్థానంలో ఎన్నికైన పళనిస్వామిని ఆహ్వానించినా.. సభలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేకిత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే.. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 235. వీరిలో ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కాగా 234 మంది నేరుగా ఎన్నికైన వారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు 89 మంది, ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేల బలముంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ఉన్నారు. మెజార్టీ మార్క్ 117 సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అన్నాడీఎంకేకు మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంతమంది పన్నీరు సెల్వంకు మద్దతు ఇస్తారు? ఎంతమంది పళనిస్వామి వెంట నిలుస్తారు? అన్నది తేలాల్సివుంది. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వర్గంలో ఆయనతో కలిసి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 225 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గంలో అంటే పళనిస్వామికి మద్దతుగా ఉన్నట్టు చెబుతున్నారు. కాగా శశికళ వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారుకుంటున్నారు. అన్నాడీఎంకే తమకు ప్రత్యిర్థి పార్టీ అని, తాము మద్దతు ఇవ్వబోమని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకేకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీదీ ఇదే వైఖరి. ఏం జరగకవచ్చు..? ఈ నేపథ్యంలో మెజార్టీ మార్క్ 117 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంట నిలుస్తారా లేదా పార్టీ ఎమ్మెల్యేలందరూ తమ వైపు వస్తారని చెబుతున్న పన్నీరు సెల్వం వర్గీయుల మాట నిజమవుతుందా లేదా త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన స్టాలిన్ అన్నంతపనీ చేస్తారా లేదా ఎవరూ మెజార్టీ నిరూపించుకోని పక్షంలో రాష్ట్రపతి పాలన వస్తుందా? అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
ఎవరీ పళనిస్వామి..?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలుశిక్ష పడటంతో ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఫ్యాక్స్ ద్వారా గవర్నర్‌కు ఈ విషయం తెలియజేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. పళనిస్వామి గురించి తెలుసుకోవాలంటే.. పన్నీరు సెల్వం కేబినెట్లో పళనిస్వామి సీనియర్ మంత్రి. రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రి. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎడపాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. జయలలిత బతికున్నరోజుల్లో ఆమెకు వీరవిధేయుడిగా పళనిస్వామి ఉండేవారు. అలాగే చిన్నమ్మ శశికళకు కూడా నమ్మినబంటు. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినపుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. శశికళ.. పళనిస్వామినే ముఖ్యమంత్రిని చేయాలని భావించినట్టు సమాచారం. అయితే అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి పడదు. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యాక పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక పళనిస్వామి చిన్నమ్మకు మద్దతుగా నిలిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి పేరు తెరపైకి వచ్చింది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
-
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
చెన్నై: శశికళ, ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఉన్న కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిస్టార్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో.. సంబరాలు చేసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతుదారులు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు వెళ్లారు. సెల్వం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభిమానులు ర్యాలీగా గోల్డెన్ బే రిస్టార్కు వెళ్లారు. రిసార్ట్ బయటే సెల్వం మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. రిసార్ట్‌లో శశికళతో పాటు ఆమె వర్గం ఎమ్మెల్యేలు, అన్నా డీఎంకే పార్టీ నేతలు ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష పడిన నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. రిసార్ట్ బయట పన్నీరు సెల్వం వర్గీయులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయగా.. లోపల ఉన్న ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లబోమని చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రిసార్ట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. పన్నీరు సెల్వం వర్గీయులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
అమ్మ చివరి మాట కోసం పోరాటం!
-
అమ్మ చివరి మాట కోసం పోరాటం!
చెన్నై: అక్రమాస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అమ్మ చివరి మాటలను నిజం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. 'దివంగత ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత ఆత్మ ఇంకా సజీవంగానే ఉంది. అమ్మ ఆశయ సాధన కోసం పోరాడతాను. అమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం. పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులు కాస్త సంయమనం పాటించాలి. అన్నాడీఎంకేను చీల్చేందుకు కుట్ర జరుగుతోంది' అని పేర్కొన్నారు. తనకు మద్ధతు తెలిపిన అన్నాడీఎంకే నేతలు, ప్రజలు అందరికీ ఈ సందర్భంగా పన్నీర్ కృతజ్ఞతలు తెలిపారు. కుర్చీ కోసం బరిలో ఉన్న వీకే శశికళకు వ్యతిరేకంగా తీర్పు రావడాన్ని ఆమె వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో మెజార్టీ ఎమ్మెల్యేలున్న శశికళ వర్గం.. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వాన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. కోర్టు తీర్పు అనంతరం శశికళ వర్గీయులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పళనిస్వామిని తమ తరఫు నుంచి సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ శశికళ వర్గం నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామి ప్రస్తుతం రాష్ట్ర రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్నారు. తమిళనాడు రాజకీయాలు .. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు!
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించడంపై ప్రతిపక్ష పార్టీ డీఎంకే శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షనేత స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'అక్రమాస్తుల కేసులో చివరికి న్యాయమే గెలిచింది. ఎంత కాలం గడిచినా చివరికి న్యాయమే గెలుస్తుందని ఈ కేసు తీర్పు మరోసారి నిరూపించింది. అక్రమాలకు పాల్పడి ప్రజల్లో కలిసిపోయి స్వేచ్ఛగా తిరగలేరని రాజకీయ నేతలు గుర్తుంచుకోవాలి' అని స్టాలిన్ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వెంటనే స్పందించాలని ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావును ఈ సందర్భంగా స్టాలిన్ కోరారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రాజకీయ సంక్షోభానికి తెరదించాలన్నారు. ప్రత్యక్షంగా తమ మద్ధతు తెలపకపోయినా.. పరోక్ష రాజకీయాలు నడుపుతూ పన్నీర్ సెల్వానికి మద్ధతిస్తూ.. శశికళకు వ్యతిరేకంగానే డీఎంకే శ్రేణులు వ్యవహరిస్తూ వచ్చాయి. శశికళతో పాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని కూడా సుప్రీంకోర్టు తాజా తీర్పులో దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గవర్నర్ కు ముందే తెలుసా?
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. శశికళతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా నిర్ధారించింది. దీంతో తమిళ రాజకీయ డ్రామాకు నేటితో తెరపడనుంది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో శశికళ వర్గానికి సుప్రీం తీర్పు మింగుడు పడటం లేదు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 5న సీఎం పదవికి పన్నీర్ రాజీనామా చేసినా గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం శశికళకు చాన్స్ ఇవ్వకపోవం వెనక ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. వాస్తవానికి పన్నీర్ రాజీనామా తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు తనకుందని తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ విద్యాసాగర్ రావును నేరుగా కలిసి అన్నాడీఎంకే శాసనసభాపక్షనేతగా శశికళ విజ్ఞప్తి చేశారు. దాంతో పాటుగా రెండు పర్యాయాలు ఈ విషయంపై గవర్నర్ కు లేఖ రాశారు. అయినా విద్యాసాగర్ రావు నుంచి ఆమెకు స్పందన కరువైంది. దీన్నిబట్టి చూస్తే గవర్నర్ కు జరగబోయే పరిణామాలు ముందే తెలిసినందు వల్లే తన నిర్ణయాన్ని వాయిదావేస్తూ వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విద్యాసాగర్ రావు తన నిర్ణయాన్ని వెల్లడించకుండా జాప్యం చేస్తూ తెలివిగా వ్యవహరించారని, ఇందులో భాగంగానే కేంద్ర సలహా కోరారన్న వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని త్వరగా తెరదించాలని ఆయనపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో గతవారం విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో వెలువడే తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వస్తే మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను అంగీకరించినా శశికళకు మాత్రం ప్రమాణ స్వీకారం చేసి.. మెజార్టీ నిరూపించుకునే చాన్స్ మాత్రం ఇవ్వక పోవటం.. ఆయనకు ఈ కేసులో తీర్పు ఎలా రానుందో ముందే తెలిసి ఉండొచ్చునని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిర్దోషిగా తేలితే మాత్రం ప్రమాణ స్వీకారానికి శశికళను ఆహ్వానించేవారని, అలాంటి పరిస్థితులు లేవని తీర్పు వచ్చే వరకు తన నిర్ణయాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావు వాయిదా వేస్తూ వచ్చారు. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. -
గవర్నర్‌కు సలహా.. సెల్వంకు ఫస్ట్ ఛాన్స్?
-
గవర్నర్‌కు సలహా.. సెల్వంకు ఫస్ట్ ఛాన్స్?
చెన్నై: తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి.. ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు న్యాయ సలహా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని, సభలో ఎవరికి మెజార్టీ ఉంటే వారినే సీఎంను చేయాలని గవర్నర్‌కు సూచించినట్టు సమాచారం. అసెంబ్లీలో ఎవరికి మెజార్టీ ఉంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది సభ సాక్షిగా తేలాలని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాసాగర్ రావుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహిస్తే పారదర్శకంగా, ప్రజాస్వామ్యంగా జరుగుతుందని అటార్నీ జనరల్ భావిస్తున్నారు. కాగా సభలో బలపరీక్షకు సంబంధించి గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అవకాశం ఇస్తారా లేదా అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మెజార్టీ నిరూపించుకోమని ఆమెకు చెబుతారా అన్నది తేలాల్సివుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గవర్నర్ తొలుత పన్నీరు సెల్వంకే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. గవర్నర్ త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే శశికళ వర్గీయులు తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు కోరితే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సంచలన ప్రకటన చేసిన పన్నీరు సెల్వం.. సభలో బలప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. మరోవైపు అన్నాడీఎంకే శాసన సభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన శశికళ.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో తమిళనాట రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
పన్నీరు సెల్వం వ్యూహాలు ఏంటో తెలియవు
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వ్యూహాలేంటో తనకు తెలియవని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు. సోమవారం స్టాలిన్ సెక్రటేరియట్‌కు వచ్చారు. ఇదే రోజు పన్నీరు సెల్వం కూడా సెక్రటేరియట్‌కు వచ్చారు. వీరిద్దరూ భేటీ అవుతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అన్నా డీఎంకేను చీల్చేందుకు డీఎంకే కుట్రపన్నిందని, పన్నీరు సెల్వం ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారని శశికళ ఆరోపించడంతో స్టాలిన్ వెనక్కు తగ్గినట్టు సమాచారం. సెక్రటేరియట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన స్టాలిన్.. అన్నా డీఎంకే వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభంలో పన్నీరు సెల్వం ఏం చేస్తారు, ఆయన వ్యూహాలు ఏంటన్నవి తనకు తెలియవని స్టాలిన్ చెప్పారు. శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్టాలిన్ తొలుత సెల్వంకు మద్దతు ఇస్తామనే అర్థం వచ్చేలా సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత త్వరలోనే డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
వారం తర్వాత ఆఫీసుకు పన్నీరు సెల్వం
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వారం రోజుల తర్వాత సెక్రటేరియట్‌లోని తన కార్యాలయానికి వచ్చారు. సోమవారం పన్నీరు సెల్వంతో పాటు ఆయనకు మద్దతు ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ కూడా సెక్రటేరియట్‌కు వచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా ఈ రోజు సెక్రటేరియట్‌కు వెళ్లారు. ఆయన పన్నీరు సెల్వంతో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే సచివాలయంలో కాసేపు ఉన్న స్టాలిన్.. సెల్వంతో కలవకుండానే వెనుదిరిగారు. ఈ రోజు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పోయెస్ గార్డెన్లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆమె గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే శశికళ వర్గీయులు తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు కోరితే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తర్వాత సెల్వం సంచలన ప్రకటన చేశారు. దీంతో అన్నా డీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతూ వేడెక్కాయి. శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం వర్గాలుగా ఆ పార్టీ నాయకులు విడిపోయారు. ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం వర్గం ప్రయత్నిస్తుండగా, ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు శశికళ వర్గం ప్రయత్నిస్తోంది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
జయలలిత చనిపోయినపుడే తెలిసింది
చెన్నై: అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడ్డాక సహనంతో వ్యవహరిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ విమర్శలను తీవ్రం చేశారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ప్రతిపక్ష డీఎంకేలను ఇప్పటి వరకు విమర్శిస్తూ వస్తున్న చిన్నమ్మ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేశారు. పార్టీలో సంక్షోభానికి బీజేపీ, డీఎంకేలే కారణమని నిందించారు. పన్నీరు సెల్వం ఎప్పుడూ పార్టీకి విధేయుడిగా లేరని విమర్శించారు. సోమవారం పోయెస్ గార్డెన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. జయలలిత చనిపోయినపుడే పార్టీని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని తెలిసిందని చెప్పారు. జయలలిత వెంట 33 ఏళ్లు ఉన్నానని, ఈ 33 ఏళ్లలో వెయ్యిమంది పన్నీరు సెల్వాలను చూశానని శశికళ అన్నారు. తాను ఎవరికీ భయపడేదిలేదని చెప్పారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా పార్టీ భవిష్యత్ కోసం భరిస్తున్నానని, నిజానిజాలు ఏంటో కచ్చితంగా అందరికీ తెలుసునని అన్నారు. తనకు అధికార కాంక్ష లేదని, పన్నీరు సెల్వంను తమిళనాడు ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెప్పారు. అన్నా డీఎంకే ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నానని, కానీ సెల్వం డీఎంకేకు మిత్రుడిలా వ్యవహరించడం బాధించిందన్నారు. త్వరలోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీలో అమ్మ ఫొటోలను ఏర్పాటు చేస్తామని శశికళ చెప్పారు. అనంతరం గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లారు. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
జయలలిత చనిపోయినపుడే తెలిసింది
-
పన్నీరుకు సీనియర్ నటుడి మద్దతు
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తమిళ దర్శకుడు, నిర్మాత, నటుడు మనోబాల.. పన్నీరు సెల్వంను కలిసి మద్దతు ప్రకటించారు. పన్నీరు సెల్వంతో కలసి తాను పనిచేశానని, ఆయన చాలా మంచి వ్యక్తని మనోబాల ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. పన్నీర్ సెల్వంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్, అరవింద స్వామి, శరత్ కుమార్, ఆర్య, ఖుష్బూ, గౌతమి తదితరులు ఆయనకు మద్దతుగా మాట్లాడారు. ఇదే సమయంలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు గళమెత్తారు. కాగా విజయశాంతి, కొందరు సినీ ప్రముఖులు.. శశికళకు మద్దతు ప్రకటించారు. తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! శశి నుంచి మా మంత్రిని కాపాడండి! అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు! నేడు శశికళ భారీ స్కెచ్? శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్! చెన్నైలో హై టెన్షన్ పన్నీర్ మైండ్ గేమ్ షురూ.. దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి -
ఆయన శశికళ భర్త నటరాజన్ కాదు..!
చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతూ, గందరగోళంగా మారాయి. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను శనివారం కలసి మద్దతు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి పాండ్యరాజన్ ఈ రోజు (ఆదివారం) అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త ఎం నటరాజన్‌ను కలిసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక్క రోజులోనే పాండ్యరాజన్ ప్లేట్ ఫిరాయించారా అని పన్నీరు సెల్వం వర్గీయులు ఆరా తీశారు. అయితే మంత్రి కలిసింది శశికళ భర్త నటరాజన్‌తో కాదు మైలాపూర్ ఎమ్మెల్యే ఆర్ నటరాజన్‌తో. పాండ్యరాజన్ ఈ విషయం ప్రకటించడంతో గందరగోళానికి తెరపడింది. నిన్న పన్నీరు సెల్వం వర్గంలో చేరబోతున్నట్టు పాండ్యరాజన్ ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు ఆయనకు మద్దతు ఇస్తానని చెప్పారు. అమ్మ ఆశయాల కోసం అన్నా డీఎంకేని కాపాడేందుకు పోరాడుతానని పాండ్య రాజన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పన్నీరు సెల్వం కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! శశి నుంచి మా మంత్రిని కాపాడండి! అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు! నేడు శశికళ భారీ స్కెచ్? శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్! చెన్నైలో హై టెన్షన్ పన్నీర్ మైండ్ గేమ్ షురూ.. దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి -
శశికళకు ఊహించని భారీ షాక్
-
శశికళకు ఊహించని భారీ షాక్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న శశికళకు ఊహంచని భారీ షాక్ తగిలింది. శశికళ విధేయుడు, గట్టి మద్దతుదారుడైన మంత్రి పాండ్యరాజన్ ప్లేటు ఫిరాయించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలందరి అభిప్రాయాన్ని కచ్చితంగా గౌరవించాలని, అమ్మ ఆశయాల కోసం అన్నా డీఎంకేని కాపాడేందుకు పోరాడుతానని పాండ్య రాజన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పన్నీరు సెల్వం కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తమిళనాడు విద్యా శాఖ మంత్రిగా పాండ్యరాజన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు శశికళకు నమ్మినబంటుగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిపై విమర్శలు కూడా చేశారు. పార్టీని చీల్చేందుకు పన్నీరు సెల్వం ప్రతిపక్ష డీఎంకేతో చేతులు కలిపారని ఇటీవల ఆరోపించారు. ఇంతలోనే ఆయన మనసు మార్చుకోవడం గమనార్హం. కాగా పన్నీరు సెల్వంను ఆయన ఎప్పుడు కలిసేది, మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. సంబంధిత వార్తలు చదవండి అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే.. సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం -
సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పెరుగుతోంది. అన్నాడీఎంకే చెందిన మరో ఇద్దరు ఎంపీలు సెల్వం వర్గంలో చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉండాలని, ఆయనకు తాము మద్దతు ఇస్తామని ఎంపీలు అశోక్ కుమార్, పీఆర్ సుందరం ప్రకటించారు. నిన్నటివరకు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మద్దతుగా ఉన్న వీరు ఆమెకు ఝలక్ ఇచ్చి సెల్వం గూటికి చేరారు. అన్నా డీఎంకేలో చీలికలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని ఆందోళన చెందుతున్న శశికళ వర్గానికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నా డీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్.. సెల్వం వర్గంలో చేరిన సంగతి తెలిసిందే. అంతేగాక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఈసీకి లేఖ రాశారు. సెల్వం వెంట ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు ఉండగా, శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు ఇటువైపు దూకేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక అన్నా డీఎంకే కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో పాటు ఇతర పార్టీలు, సినీ ప్రముఖులు సెల్వంకు మద్దతు పలికారు. సంబంధిత వార్తలు చదవండి అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే.. గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం -
సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన