తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు సభలో కాంపొజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహించనున్నారు. అసెంబ్లీలోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఏఐఏడీఎంకే శాసనసభ పక్షనేత పళని స్వామి బల నిరూపణకు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది.