tamilnadu politics
-
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరో?
రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. కానీ వచ్చిన తర్వాత ప్రజల ఆదరణ పొందడమే ప్రధానం. అప్పట్లో తమిళనాడు మక్కల్ తిలకంగా ఎంజీఆర్.. రాజకీయాల్లో సత్తాచాటి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందే సినీ రంగానికి చెందిన అన్నాదురై, కరుణానిధి లాంటివారు తమిళనాడుని ఏలారు. ఎంజీఆర్ తర్వాత ఆయన పార్టీని జయలలిత ముందుకు నడిపించి సీఎం అయ్యారు. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్) ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్.. చివరి క్షణంలో వెనకడుగు వేశారు. ఆయన తర్వాత నిర్ణయం తీసుకున్న కమలహాసన్.. మక్కల్ నీతి మయ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలవకపోయారు. ప్రముఖ హీరో దళపతి విజయ్.. ఈ మధ్యే రాజకీయాల్లో వచ్చేశారు. పార్టీ పేరుతో సహా నోట్ విడుదల చేశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అంటున్నట్లు తాజా సమాచారం. చెప్పాలంటే విశాల్ చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ మధ్య శాసనసభ ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. కానీ దీన్ని తిరస్కరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా విశాల్ తన అభిమాన సంఘాన్ని ప్రజా రక్షణ సంఘంగా మార్చి ప్రజాసేవలో మమైకమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తన సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిశీలిస్తూ వస్తున్నారు. రాబోయే 2026 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?) -
తమిళనాడులో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
-
హాట్‌హాట్‌గా తమిళ రాజకీయాలు
-
ఓట్ల కోసం ఏ నాటకమైనా ఓకేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల పంపిణీపై తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఎండ వేడికి ఇవి మరింత మంటెక్కనున్నాయి. కావేరి బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా పార్లమెంట్లో ప్రతిరోజు అన్నాడిఎంకే సభ్యులు ఆందోళన చేస్తున్నా, తమిళనాడు వీధుల్లో కేంద్రం వైఖరికి నిరసనగా డీఎంకే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఉలుకూ లేదు. పలుకూ లేదు. ఏప్రిల్ ఐదవ తేదీన తమిళనాడు బంద్‌కు డీఎంకే పిలుపు కూడా ఇచ్చింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎలా కావేరి జలాలను పంపిణీ చేయాలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి వీలుగా ఓ ‘స్కీమ్’ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 29వ తేదీన ఈ స్కీమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, జాప్యానికి ఎలాంటి సాకును చూపించడానికి వీల్లేదని, గడువులోగా కచ్చితంగా స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 29వ తేదీ వచ్చిందీ, వెళ్లింది. స్కీమ్ ఏర్పాటుకు పార్లమెంట్ లోపల, వెలుపలా ప్రతి రోజు ప్రజాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా స్కీమ్ ఏర్పాటు దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీరిగ్గా ఈరోజు కోర్టు ముందుకు వచ్చి అసలు ‘స్కీమ్’ అంటే ఏమిటీ? ఎలాంటి స్కీమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఎంతో అమాయకంగా సుప్రీం కోర్టు ముందకు వచ్చి వివరణ కోరింది. నదీ జలాల పంపిణీకి స్కీమ్ అంటే నిపుణులతో కూడిన ఓ బోర్డును ఏర్పాటు చేయడం అన్నది అటు కేంద్రానికి, ఇటు సుప్రీం కోర్టుకు తెలుసు. మరి మధ్యలో ఈ మాయా నాటకం ఎందుకు? కావేరీ జలాల పంపిణీ బోర్డును ఏర్పాటు చేయడం కర్ణాటకకు ఇష్టం లేదు. మిగులు జలాలను ఎలాగు వదిలేస్తామని, వాటిని వినియోగించుకోవాలన్నది కర్ణాటక ప్రభుత్వం వాదన. ఈ నెల 11వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈలోగా బోర్డును ఏర్పాటు చేస్తే కర్ణాటక ప్రజలు రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయరన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిష్టానం భయం. కావేరీ, జలాల విషయంలో గతంలో రక్తపాతం జరిగినందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ‘స్కీమ్’ అంటే అది ఎలా ఉండాలో చెబితే అమలు చేస్తామని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. తమిళనాడు బంద్ జరిగినా, పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేలోగా కేంద్రం స్పందించే అవకాశం లేదు. -
ఎంజీఆర్ తరహాలోనే కమల్ కూడా
సాక్షి, చెన్నై : తమిళనాడులో రాజకీయాలు, సినిమాలు అన్నదమ్ముల లాంటివనే విషయం అందరికి తెల్సిందే. అందుకనే సినిమా నటులు ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చి హిట్టవుతుంటారు. అలాంటి హిట్లను ఆశిస్తూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఎంజీ రామచంద్రన్ సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి ఇలాంటి వారికి ముందుగానే మార్గదర్శకం చేశారు. ఎంజీఆర్ రాజకీయాల్లో రాణింపుకు ఆయన సినిమాల్లోని పాటలు ఆయనకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఎంజీఆర్‌ను సినిమాల్లో ఎక్కువగా నిలబెట్టిందీ ఎంఎస్ విశ్వనాథన్ సమకూర్చిన పాటలు కాగా, ఆ పాటలను రాసిందీ కన్నదాసన్, వాలీ. 1965లో వచ్చిన ‘ఉంగల్ వీటు పిల్లయ్’ సినిమాలోని నాన్ అనయిట్టల్ అతు నాదంతువిట్టల్ (నేను ఏది ఆదేశిస్తే అదవుతుంది) అన్న పాట అప్పట్లో ఉర్రూతలూగించింది. ఆయన డీఎంకే నుంచి విడిపోయి అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీని పెట్టినప్పుడు ఈ పాట పార్టీ గీతంగా ఊరు, వాడ మారుమోగిపోయింది. ఇప్పుడు ఆయన తరహాలోనే రాజకీయాల్లో రాణించేందుకు కమల్ హాసన్ తాను నటించిన సినిమాల్లోని, ముఖ్యంగా రాజకీయ సినిమాలు లేదా సినిమాల్లోని రాజకీయపరమైన పాటలను ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తున్నారని తెల్సింది. ఎంజీఆర్‌కు ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకుడిగా ఉన్నట్లుగా, కమల్ హాసన్‌కు కూడా ఇళయరాజా సమకూర్చిన పాటలే ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెల్సిందే. నిజంగా చెప్పాలంటే ఆయన నటించిన చాలా సినిమాల్లో ఇళయరాజా సమకూర్చిన పాటలే ఆయనకు ప్రాణం పోశాయి. కమల్ హాసన్ మొన్న బుధవారంనాడు తన కొత్త పార్టీని పకటించినప్పుడు తమిళనాడులోని ఎనిమిది గ్రామాలను ఆదర్శగ్రామాలుగా దిద్దుతానని చెప్పారు. తాను హీరోగా నటించిన దర్శకుడు కే. బాలచందర్ 1988లో తీసిన ‘ఉన్నల్ ముడియం తంబీ (నీవు సాధించగలవు, సోదరా!)’ చిత్రంలోనిదే ఆ ఐడియా. అదే సినిమాను బాలచందర్ అదే ఏడాది తెలుగులో చిరంజీవి హీరోగా ‘రుద్రవీణ’ను తీశారు. మద్యం మత్తును వదిలించుకోవాలంటూ ఆ సినిమాలో టైటిల్ సాంగ్ సాగుతుంది. రాజకీయ నాయకులు మద్యాన్ని ప్రోత్సహించడాన్ని తూర్పార పడుతుంది. ఈ పాటను కూడా ఆయన తన ప్రచారానికి ఎక్కువ వాడుకుంటారని తెల్సింది. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1989లో వచ్చిన ‘అపూర్వ సహోదరర్గళ్ (తెలుగులో–విచిత్ర సోదరులు)’ చిత్రంలోని అవినీతికి వ్యతిరేకంగా సాగే ఓ పాటను కూడా ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో తరతరాలుగా పెరుగుతూ వస్తున్న అవినీతిని అంతం చేయాల్సిన అవసరం కూడా తనను పార్టీని పెట్టేల ప్రేరేపించిందని కూడా పార్టీ ఆవిర్భావ సభలో కమల్ హాసన్ ప్రకటించారు. ఇక ‘తేవర్ మగన్’ చిత్రంలో ఎంజీఆర్‌తో కలిసి ఆయన నటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న తేవర్ కులస్థుల దర్పానికి ప్రతిబింబంగా పేరు పొందిన ఈ సినిమాల్లోని పాటలను కూడా ఆయన ప్రచారానికి వాడుకుంటారనడంలో సందేహం లేదు. -
కమల్ హాసన్‌కు ‘స్పష్టత’ రావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ పేరుతో రాజకీయ రంగప్రవేశం చేసిన ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బుధవారం ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో వాక్చాతుర్యం తప్ప విషయ పరిజ్ఞానం లేదని స్పష్టమవుతోంది. సినిమాల్లో ఇంతకాలం ముఖానికి రంగు పులుముకున్న తాను తెలియని రంగులుగల రాజకీయ రంగంలోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందో చెప్పలేదు. ఇలా అనేక కీలకమైన అంశాలపై స్పష్టతనివ్వడంలో కమల్ విఫలమయ్యారు. తన పార్టీ సిద్ధాంతాలేమిటో అంతకన్నా వివరించలేదు. అవినీతిని నిర్మూలించడం, అభివృద్ధికి కృషి చేయడం లాంటివి తన ఆదర్శాలని చెప్పుకున్నారంతే. అయితే, వాటినైనా ఎలా సాధిస్తారో స్పష్టం చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల పట్ల తన వైఖరేమిటో వెల్లడించలేదు. ఆయనలో తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జలాల వివాదం పరిష్కారం పట్ల అవగాహన కనిపించలేదు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కుల, మతాల ఆదిపత్య కుమ్ములాటలను ఎలా ఎదుర్కోవాలో అంతకన్నా తెలియదు. ‘నువ్వు లెఫ్ట్వా, రైట్వా’ అని అడిగితే తాను సెంటర్నని చెప్పుకున్నారు. ఇక్కడ సెంటర్ అంటే తటస్థమనే అర్థం చేసుకోవచ్చు. ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ లాగా రాజకీయాల్లో తటస్థానికి తావుండదు. స్పష్టత ఉండాలి. అవినీతిని నిర్మూలించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న కమల్ హాసన్, అవినీతికి మారుపేరుగా విమర్శల్లో వినతికెక్కిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఆదర్శం అని చెప్పడం తటస్థం అనుకోవాలా, అవగాహనా రాహిత్యం అనుకోవాలా! ‘రైట్’ నుంచి వచ్చే మంచి సూచనలను తప్పకుండా స్వీకరిస్తానని అనడమంటే ‘లెఫ్ట్’ నుంచి వచ్చే సూచనలు స్వీకరించను అని అర్థమా? లేదా ఇప్పటికే ‘లెఫ్ట్’ సూచనలు స్వీకరిస్తున్నానని చెప్పడమా! 1989లో ఎస్. రామదాస్ నాయకత్వాన ఏర్పాటైన ‘పట్టాలి మక్కాళ్ కాచ్చి, 1997లో ఏర్పడిన ‘పుథియా తమిళగం’ మినహాయిస్తే తమిళనాడులో ద్రావిడ అనే పదం లేకుండా కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు. పార్టీ పేరులో లేకపోయినా తనదీ ద్రవిడ సిద్ధాంతమనే ఆయన చెప్పకనే చెప్పుకున్నారు. ఆరు ద్రవిడ రాష్ట్రాల (పుదుచ్చేరిని కలుపుకొని) ఐక్యతకు చిహ్నంగా తన పార్టీ జెండాలోని ఆరు చేతులను చూపించారు. ఆరు చేతుల్లో మూడు చేతులు ఎరుపు రంగులో ఉండగా, మూడు చేతులు తెలుపురంగులో ఉన్నాయి. మధ్య నలుపులో తెలుపు నక్షత్రం ఉంది. ఎరుపు, నలుపు, తెలుపు...ఈ మూడు రంగులు ద్రావిడ ఉద్యమానికి బండ గుర్తులు. 1917లో తరామత్ మాధవన్ నాయర్ ఏర్పాటు చేసిన ‘జస్టిస్ పార్టీ’ నాటి నుంచి ద్రవిడ పార్టీలు ఈ రంగులనే ద్రవిడ స్ఫూర్తిగా వాడుతున్నాయి. ద్రవిడ రాష్ట్రాలపై హిందీని, సంస్కృతాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ వైఖరిని ఓ ద్రవిడ పార్టీగా తప్పనిసరిగా బహిరంగంగానే విమర్శించాలి. రాష్ట్రంలోని డీఎంకే, ఏఐడిఎంకే లాంటి ద్రవిడ పార్టీలకు, తన ద్రవిడ పార్టీకి ఉన్న తేడా ఏమిటో స్పష్టం చేయాలి. కావేరి సమస్యను ఎలా పరిష్కరిస్తారంటే ‘బెంగుళూరు నుంచి రక్తం తీసుకొచ్చినవాడిని, నీళ్లు తీసుకరానా‘ అన్నంత సులువు కాదు ఆ సమస్యను పరిష్కరించడం. అక్కడ మీకు రక్తం ఇచ్చే అభిమానులు ఉన్నారు. నీళ్లిచ్చే అభిమానులు లేరు. 1974 నుంచి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వాన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ని విడతలుగా చర్చోపచర్చలు జరిపినా సమస్య పరిష్కారం లభించలేదన్న విషయాన్ని కొంత అర్థం చేసుకోవాలి! అవినీతి కావాలంటే డీఎంకే, ఏఐఏడిఎంకేలను ఎన్నుకోండీ! అవినీతి నిర్మూలన, పాఠశాలలు, వైద్యశాలలలాంటి అభివృద్ధి కావాలంటే కమల్ హాసన్‌ను ఎన్నుకోండీ!’ అంటూ పార్టీ ఆవిర్భావ వేదిక నుంచి ప్రజలకు పిలుపునిచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాటలకు తలూపుతూ తనదీ అదే ఉద్దేశం తందానా! అంటే సరిపోదు. స్పష్టత, స్పష్టత ఉండాలి. తటస్థం అంటే మాట తూలరాదనుకోవాలిగానీ తూలనాడరాదనుకోకూడదు! ఏ రంగులో తెలియని రాజకీయ రంగంలో స్పష్టత, అవగాహన లేకుండా రాణించడం కష్టం. ఎప్పటికీ సెంటర్లోనే ఉండాలనుకుంటే రాజకీయ భవిష్యత్తులో ‘లెఫ్ట్ అండ్ రైట్’ ఆటుపోట్లు తప్పవు! -
కమల్ హాసన్ ఓ గందరగోళం వ్యక్తా!?
సాక్షి, న్యూఢిల్లీ : సరికొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్న ప్రముఖ దక్షిణాది నటుడు కమల్ హాసన్ బుధవారం రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారక భవనాన్ని సందిర్శించడం వెనక మతలబు ఏమైనా ఉందా? కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాజకీయ పార్టీకి ముస్లింల మద్దతు కూడగట్టడంలో భాగంగానే ఆయన అక్కడికి వెళ్లినట్లు స్పష్టం అవుతుంది. అబ్దుల్ కలామ్‌ను మైనారిటీల నాయకుడిగా ఎవరూ పరిగణించనప్పటికీ దేశాధినేతగా దేశ ప్రజల్లో ఆయనకు సముచిత గౌరవం ఉంది. ముఖ్యంగా తమిళనాడు ముస్లిం ప్రజల్లో కలాంకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మొదటి నుంచి హేతువాదిగా చెప్పుకునే కమల్ హాసన్‌కు అబ్దుల్ కలాం స్మారక భవనం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం ద్వారా ముస్లింలకు ఆకర్షించవచ్చని భావించి ఉండవచ్చు. తమిళనాడు జనాభాలో ఏడు శాతం ముస్లింలు ఉన్నారు. వారిలో కమల్ హాసన్ పట్ల సానుకూలత ఉందో, లేదోగానీ వ్యతిరేకత మాత్రం ఉంది. 2013లో కమల్‌హాసన్ నటించి, నిర్మించిన ‘విశ్వరూపం’ చిత్రం వివాదాస్పదం అవడమే కాకుండా దాన్ని నిషేధించాలంటూ తమిళ ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ చిత్రంలో ముస్లింలను టెర్రరిస్టులుగా చూపించడమే అందుకు కారణం. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను, డైలాగులను తొలగిస్తే సినిమా విడుదలకు అనుమతిస్తామని, లేదంటే లేదని ముస్లిం నాయకులు నాడు హెచ్చరించారు. తన సినిమా విడుదల చేయకపోతే తాను దేశం విడిచి మరో దేశానికి వలసపోతానుగానీ సినిమాలో ఒక్క సన్నివేశాన్నిగానీ, డైలాగునుగానీ తొలగించే సమస్యే లేదని కమల్ హాసన్ ప్రతిఘటించారు. చివరకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత జోక్యంతో సమస్య పరిష్కారమైంది. కొన్ని డైలాగులను తొలగించి సినిమాను విడుదల చేశారు. సినిమా విడుదలకు సహకరించినందుకు కమల్ హాసన్, జయలలితను కలసుకొని మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ముస్లింలు కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా మారారు. ఆయన తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తనే కోపం కూడా వారికి ఉంది. ఇలాంటి కులాలు, మతాల పట్టింపు తమిళ ముస్లింలకు ఒకప్పుడు అసలు ఉండేదికాదు. అందుకనే మొదటి నుంచి తమిళనాడు ముస్లింలు ద్రావిడ పార్టీలను, ముఖ్యంగా డీఎంకే పక్షాన ఉంటూ వచ్చారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం మొదటిసారి వారిలో ర్యాడికల్ భావాలను రేకెత్తించాయి. ‘క్వాయిద్ ఏ మిల్లాత్’ (మత సామరస్యానికి స్ఫూర్తిదాత)గా గుర్తింపు పొందిన మొహమ్మద్ ఇస్మాయిల్ నాయకత్వంలోని ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ ప్రభావంతో అన్ని కులాలు, మతాలు సమానమన్న స్ఫూర్తితోనే తమిళ ముస్లింలు జీవించారు. తమిళ భాషాభివృద్ధికి వారు కూడా కృషి చేశారు. ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు ఈవీ రామస్వామి కూడా ముస్లింల పట్ల ఎంతో సానూభూతితో వ్యవహరించేవారు. 1972లో మొహమ్మద్ ఇస్మాయిల్ మరణంతో ముస్లింలీగ్‌లో విభేదాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఆ లీగ్ ద్రవిడ పార్టీలతోనే కొనసాగింది. బాబ్రీ మసీదు విధ్వంసంతో లీగ్‌లో ర్యాడికల్ భావాలు ఊపందుకున్నాయి. ముస్లిం వ్యాపారస్థుల ప్రయోజనాలకు పనిచేస్తున్నారనే ఆరోపణలు, వివాదాలు తలెత్తాయి. పర్యవసానంగా పలువురు నాయకులు బయటకు వచ్చి 1994లో ‘ఇండియన్ నేషనల్ లీగ్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 1998లో కోయంబత్తూరు వరుస బాంబు పేలుళ్లతో తమిళనాడులో హిందువులు, ముస్లింలు అంటూ స్పష్టమైన విభజన ఇరువర్గాల ప్రజల్లో ఏర్పడింది. ‘అల్ ఉమ్మా’ అనే రాడికల్ ఇస్లాం గ్రూపునకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ హత్యకు ప్రతీకారంగా జరిగినట్లు భావిస్తున్న నాటి వరుస బాంబు పేలుళ్లలో 58 మంది అమాయకులు మరణించారు. 2000 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘ఇండియన్ తవీద్ జమాత్, తమిళనాడు తవీద్ జమాత్’ కరడుగట్టిన ముస్లిం సంస్థలు పుట్టుకొచ్చాయి. 1995లో ‘తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం’ అనే సంస్థ ఏర్పడగా, దాని రాజకీయ పార్టీ 2009లో ‘మానితనేయ మక్కల్ కాచి’ ఏర్పాటయింది. ఈ పార్టీలు ఇప్పటికీ డీఎంకే లేదా ఏఐడీఎంకే ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ దశలో కమల్ హాసన్ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వచ్చారు. ఆయనకు ముస్లింలు మద్దతిచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ముస్లింల రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చేందుకు సొంతంగానే పలు పార్టీలు ఉన్నాయని, మరో పార్టీ అవసరం లేదని ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయన రాజకీయాలేమిటో తమకు తెలియవని, ప్రజలు మాత్రం ఆయన ‘విశ్వరూపం’ మరచిపోలేదని అన్నారు. కమల్ హాసన్ ‘ఓ గందరగోళం నాయకుడు’ అని తమిళ ముస్లింల మత చరిత్ర, సంస్కృతిని డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించిన ప్రముఖ రచయిత, చిత్ర నిర్మాత కొంబాయ్ ఎస్. అన్వర్ వ్యాఖ్యానించారు. -
దినకరన్ కు పోటీగా కృష్ణప్రియ?
సాక్షి, చెన్నై : చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబాలకు రాజకీయ లాభం చేకూర్చకపోగా విభేదాల చిచ్చుపెట్టింది. దినకరన్‌కు వ్యతిరేకంగా పలువురు కుటుంబ సభ్యులు రాజకీయబాటలు వేస్తుండగా, శశికళ అన్న కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ (ఇళవరసి కుమార్తె) ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున రాజకీయ ప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడంతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలు ఏకమైన ఆర్కేనగర్ ఎమ్మెల్యే, శశికళ అక్క కుమారుడైన టీటీవీ దినకరన్‌ను పార్టీతో సంబంధం లేకుండా ఏకాకిని చేశారు. ఈపీఎస్, ఓపీఎస్లను లెక్కచేయకుండా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు దినకరన్ పక్షాన నిలిచారు. ఆ తరువాత పార్టీ, రెండాకుల చిహ్నం ఎడపాడి వశం కావడంతో దినకరన్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎడపాడి వైపు వెళ్లిపోయారు. దీంతో దినకరన్ బలం 18 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది. ఈ 18 మందిపై కూడా స్పీకర్ చేత సీఎం అనర్హత వేటు వేయించారు. ఈ వేటు వివాదం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలను సవాలుగా తీసుకున్న దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య అభ్యర్దిగా పోటీచేసి వ్యూహాత్మకంగా గెలుపొందారు. దినకరన్ గెలుపు ఎడపాడిని బెంబేలుకు గురి చేసింది. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం, అధికారం చేతిలో ఉన్నా దినకరన్ గెలుపొందడంతో ఎడపాడి, పన్నీరు కంగారుపడగా, జైల్లో ఉన్న శశికళకు అంతులేని ఆనందం కలిగింది. అంతేగాక కొత్తపార్టీ పెట్టాలనే ఆలోచన ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆర్కేనగర్లో గెలుపు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడాలనే ఆశ దినకరన్లో ఏర్పడింది. కొత్త పార్టీపై దినకరన్ తరచూ శశికళను కలుస్తున్నారు. అంతేగాక జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు అప్పుడప్పుడూ దినకరన్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దినకరన్ రాజకీయ ఎదుగుదల, శశికళకు మరింత చేరువకావడం కుటుంబ సభ్యులకు కంటగింపుగా మారింది. పైగా శశికళ భద్రంగా దాచి ఉంచిన జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకోసం దినకరన్ వినియోగించుకోవడం మరింత మనస్పర్థలకు దారితీసింది. ఇదే అంశంపై కృష్ణప్రియ, దినకరన్‌ల మధ్య విభేధాలు తలెత్తాయి. కృష్ణప్రియ సైతం దినకరన్‌ను వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. ఈనెల 24వ తేదీన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ వివాదమే కృష్ణప్రియను రాజకీయ అరంగేట్రానికి పురిగొల్పినట్లు భావిస్తున్నారు. కాగా, శశికళ తమ్ముడు దివాకరన్, ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియల అడుగు జాడలోనే దినకరన్ సోదరుడు భాస్కరన్ సైతం రాజకీయ ప్రవేశంపై తహతహలాడుతున్నారు. శశికళ మనస్తాపం.. 2015 డిసెంబరు 4వ తేదీనే జయ కన్నుమూసినట్లు దివాకరన్ ప్రకటించి వివాదం లేవనెత్తడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇకపై అలాంటి ప్రకటనలు చేయరాదని ఖండించారు. ఇలా ఒక్కొక్కరుగా దినకరన్‌కు దూరం జరిగిపోవడమేగాక కుటుంబ సభ్యుల మధ్య కీచులాటలతో శశికళ మనస్తాపానికి గురవుతున్నారని తెలుస్తోంది. విబేధాలు తీవ్రం.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీచేస్తామని దినకరన్ సోదరుడు భాస్కరన్ ఇటీవల ప్రకటించారు. భాస్కరన్ చేసిన ప్రకటన దినకరన్ అనుచరుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దినకరన్ సోదరుడే రాజకీయాల్లోకి దిగితే ఎవరివైపు నిలవాలనే ఆలోచనలో పడ్డారు. కాగా తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే క్యాడర్లో కొంతవరకు శశికళ తమ్ముడు దివాకరన్ వైపు ఉండేది. అయితే జయ మరణం తరువాత కొందరు చేజారిపోగా మరి కొంతమంది దినకరన్ పక్షాన నిలిచి ఉన్నారు. వీరందరినీ తనవైపు తిప్పుకోవాలని దివాకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. -
రాజకీయాల్లోకి?
తమిళనాడు రాజకీయాలు సినిమా స్టార్స్ ఎంట్రీతో రసవత్తరంగా మారాయి. నటుడు కమల్‌హాసన్, రజనీకాంత్ సొంత పార్టీలు పెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అలాగే నటుడు విశాల్ కుడా ఆ మధ్య బై ఎలక్షన్స్‌లో పోటీ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్‌లోకి విజయ్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని చెన్నై మీడియా టాక్. వాస్తవానికి విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అని ఆయన అభిమానులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట విజయ్ అండ్ టీమ్. ‘విజయ్ మక్కళ్ ఇయక్కమ్’ అని విజయ్ ఫ్యాన్స్ ఓ వెబ్‌సైట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ వెబ్సైట్లో ప్రతి జిల్లా ఫ్యాన్స్ క్లబ్ మెంబర్స్‌ను ఎంట్రీ చేసి, వారికి ఐడీ కార్డ్స్ ఇస్తున్నారట. త్వరలోనే ఓ యాప్‌ను కూడా తయారు చేయనున్నారని సమాచారం. ఇవన్నీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసమా? అని కొందరు అడిగితే.. ‘అలాంటిదేం లేదు. కేవలం టెక్నాలజీని వాడుకొని ఫ్యాన్స్‌ను రెగ్యులేట్ చేయడం కోసమే.. పాలిటిక్స్ సెకండరీ’ అని పేర్కొన్నారట విజయ్ సన్నిహిత వర్గాలు. పాలిటిక్స్ పై అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ ఇవ్వనప్పటికీ విజయ్ ప్రతి సినిమాలోనూ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందన్నట్టుగా మెసేజ్ ఇస్తూ వస్తున్నారు. మరి పాలిటిక్స్‌లోకి ఎప్పుడు వస్తారు? అన్నది కాలమే నిర్ణయించాలి. -
కండక్టర్ నుంచి రాజకీయ పార్టీ వరకూ..
చెన్నై : రజనీకాంత్ అనే పేరును తలుచుకుంటూ, ఒక్కసారి ఆయన్ను కలిస్తే చాలూ అనుకునే అభిమానులకు లెక్కేలేదు. అలాంటి రజనీ రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులకు మరికొద్ది గంటల్లో రానున్న నూతన సంవత్సరం ఇప్పటికే వచ్చేసినట్లు అయింది. బస్సు కండక్టర్ స్థాయి నుంచి రాజకీయ పార్టీ స్థాపనపై ప్రకటన వరకూ రజనీ జీవితం అనన్య సామాన్యం. 67 ఏళ్ల రజనీకాంత్ రాజకీయ రంగం ప్రవేశంపై కొద్ది నెలలుగా చర్చ కొనసాగింది. దీనిపై పలుమార్లు మాట్లాడిన ఆయన రాజకీయాలు భ్రష్టు పట్టాయని.. అందులోకి దిగాలంటే భయమేస్తోందని అన్నారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంబనకు ఆదివారం ఫ్యాన్స్ మీట్లో తెరదించారు రజనీ. త్వరలో పార్టీని స్థాపించి రాజకీయాల్లో బుడిబుడి అడుగులు వేస్తానని అన్నారు. తమిళనాడు వ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బ్లాక్‌బస్టర్స్ అండ్ ఫ్లాప్స్ పలు రాజకీయ పార్టీల తరఫున గతంలో రజనీకాంత్ చేసిన ప్రచారం కొన్నిచోట్ల విజయం సాధించిపెట్టగా.. మరొకొద్ది చోట్ల ప్లాప్ షోగా మారింది. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-టీఎంసీ కూటమి గెలుపునకు కారణం రజనీకాంతే. ‘జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయితే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడు’ అనే స్టేట్మెంట్ను రజనీకాంత్ ఎన్నికల ప్రచారంలో వినియోగించారు. ఆ తర్వాతి ఎన్నికల్లో డీఎంకే - బీజేపీ కూటమి తరఫు రజనీ మళ్లీ ప్రచారం చేసినా ఫలితాలు నిరాశకు గురి చేశాయి. 39 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే డీఎంకే - బీజేపీ కూటమి విజయం సాధించింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పీఎంకేకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని రజనీ ప్రజలను కోరినా ఫలితం తలకిందులైంది. ఈ ఎన్నికల్లో పీఎంకే పోటీ చేసిన అన్నిచోట్లా గెలుపొందింది. కష్టాల కలబోత.. రజనీకాంత్ జీవితం కష్టసుఖాల కలబోత. ఆయన మధ్యతరగతిలో కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. అయితే, బెంగుళూరులో నివాసం ఉండేవారు. రజనీకాంత్ తండ్రి శివాజీ రావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. రజనీకి ఐదేళ్లు వయసు ఉన్నప్పుడు తల్లి మరణించారు. అక్కడినుంచి రజనీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రెండు పూట్ల తిండి తినేందుకు కూడా ఆయన కుటుంబం మొత్తం శ్రమించాల్సి వచ్చేది. యుక్తవయసు వచ్చాక రజనీ పలు ఉద్యోగాలు చేశారు. కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్లో బస్ కండక్టర్‌గా స్థిరపడ్డారు. బస్సులోని ప్రయాణీకులను అలరిస్తూ రోజు గడిపేసే వారు రజనీ. రజనీ టిక్కెట్లు ఇచ్చి, చిల్లర తిరిగిచ్చే స్టైల్‌ను చూసేందుకు ప్రయాణీకులు ఆయన బస్సు వచ్చే వరకూ బస్‌స్టేషన్‌లో ఎదురుచూసేవారు. 1973లో ఓ స్నేహితుడి నుంచి కొంత ఆర్థిక సాయం తీసుకున్న రజనీ.. మద్రాస్ ఫిల్మ్ మేకింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అదే సమయంలో రజనీ ఇచ్చిన ఓ రంగస్థల ప్రదర్శన డైరెక్టర్ కే బాలచందర్ కంట్లో పడింది. రజనీని కలిసిన బాలచందర్.. తమిళం నేర్చుకోమని సలహా ఇచ్చారు. అపూర్వ రాగాంగళ్ సినిమాలో కేన్సర్ పేషెంట్ పాత్రకు రజనీని ఎంపిక చేసుకున్నారు బాలచందర్. ఆ తర్వాత మరో సినిమాలో కూడా రజనీకి బాలచందర్ అవకాశం ఇచ్చారు. ఆ రెండు సినిమాలు భారీ హిట్ కావడంతో రజనీకాంత్ వెనక్కు తిరిగిచూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. -
తమిళ తక్కెడ.
-
‘తెర మీదకు చెన్నై పోరంబోకు’
నవంబరు ఏడున కాదు. ఐదో తేదీన బర్త్‌డే వేడుకలకు విశ్వనాయకుడు కమల్‌హాసన్ సిద్ధం అయ్యారు. చెన్నై శివారులోని కేలంబాక్కం వేదికగా ఐదో తేదీన వేడుకలకు అభిమానలోకం భారీ ఏర్పాట్లలో నిమగ్నం అయింది. ఈ వేడుకకు దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్య అభిమానుల్ని మాత్రం ఆహ్వానించనున్నారు. పేదలకు సంక్షేమ పథకాల పంపిణీ సాగనుంది. ఇందులో కమల్ ప్రసంగం ఎలా ఉంటుందో అని ఎదురు చూపులు పెరిగాయి. సాక్షి, చెన్నై : ఏడో తేదీన కమల్ హాసన్ జన్మదినం. అయితే, ఐదో తేదీన వేడుకలు నిర్వహించేందుకు తాజాగా ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. లోక నాయకుడు కమల్ ట్విట్టర్ విమర్శలు, ఆరోపణల పర్వం నుంచి శనివారం ప్రజల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం కుశస్థలి నదీ తీరంలో సాగిన తన పర్యటన గురించి కొన్ని అంశాలను ట్వీట్లో వివరించిన కమల్, ఆ నదీ తీరం అన్యాక్రాంతానికి తగ్గ ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ప్రకటించారు. గతంలో షూటింగ్ నిమిత్తం ఆ నదిలోకి తాను దూకిన క్షణాల్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అక్కడున్న పరిస్థితిని వివరించారు. ఉత్తర చెన్నైని పరిరక్షించుకుందామన్న నినాదానికి బలం చేకూర్చే రీతిలో కమల్ ఓవైపు పిలుపునిస్తే, మరోవైపు ఆయన పుట్టిన రోజు వేడుకలు ముందుగానే నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్ల మీద అభిమాన వర్గాలు దృష్టి పెట్టడం గమనార్హం. కీలక ప్రకటన చేస్తారా? కమల్ జన్మదినం రోజైన ఏడో తేదీన రాజకీయంగా ప్రకటన వెలువడవచ్చని తొలుత ప్రచారం సాగింది. అయితే, అభిమాన సంక్షేమం నినాదంతో ముందుకు సాగబోతున్నట్టుగా ప్రకటన వెలువడింది. అయినా, రాజకీయ ప్రవేశాన్ని ధ్రువీకరించే విధంగా కీలక ప్రకటనను కమల్ చేయవచ్చన్న ఎదురుచూపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏడో తేదీన కాదు, ఐదో తేదీనే బర్త్‌డే వేడుకలకు కమల్ నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ముఖ్య అభిమానులతో సమాలోచన సమావేశానికి చర్యలు తీసుకోవడంతో ఏడో తేదీన రాజకీయ అరంగ్రేటం ప్రకటన వెలువడే అవకాశాలు ఉండొచ్చన్న చర్చ ఊపందుకుంది. ఈ వేడుకలకు వేదికగా ఓఎంఆర్ రోడ్డులోని కేలంబాక్కంలో ఉన్న చెట్టినాడు విద్యా సంస్థల ఆడిటోరియంను ఎంపికచేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి కేవలం మూడు గంటల పాటు వేడుక నిర్వహించేందుకు ముందస్తుగా చర్యలు తీసుకుని ఉండటం గమనార్హం. సంక్షేమ పథకాల పంపిణీ, పేదరికంలో ఉన్న అభిమానులకు భరోసాతో పాటు, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని అభిమాన సంఘాల ముఖ్య నేతలతో ఈ సమావేశం నిమిత్తం ఆçహ్వానాలు పంపించేందుకు నిర్ణయించి ఉన్నారు. దీంతో కమల్ రాజకీయ ప్రవేశ ఎదురుచూపులు మరింతగా పెరిగి ఉన్నాయి. ఇక, అభిమాన లోకాన్ని ఏకం చేస్తూ, ఈ వేదిక నుంచి మొబైల్ యాప్‌ను కమల్ విడుదల చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. చెన్నై పోరంబోకు ఇక, కుశస్థలి నదీ తీరంలోని ఆక్రమణలను ఎత్తిచూపుతూ చెన్నై పోరంబోకు అన్న పాటను తెర మీదకు తెచ్చే పనిలో కమల్ అభిమాన లోకం నిమగ్నం అయింది. ఇందులో భాగంగా కమల్‌తో కలిసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన నిత్యానంద్ జయరామన్ ఈ పాటను రాశారు. థర్మల్ విద్యుత్ కేంద్రం, అక్కడి నుంచి వెలువడే బూడిద, ఎన్నూర్ హార్బర్, కుశస్థలి తీరంలో ఆక్రమణాల గురించి వివరిస్తూ రాసిన ఈ పాటను కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణన్ పాడుతారు. కబీర్ వాసుకి సంగీతాన్ని అందిస్తారు. గ్రామీణ , జానపదం, కర్ణాటక సంగీత మేళవింపుతో ఈ పాట వీనుల విందుగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయ్యారు. -
‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’
-
‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’
మద్రాస్ : పద్దెనిమిదిమంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ అనర్హత వేటు వేయడం సహజ న్యాయానికి విరుద్ధం అని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ తరుపు న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం మద్రాస్ హైకోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేలు పార్టీకి విరుద్ధంగా ఏమీ చేయలేదని, వారు కేవలం నాయకత్వ మార్పును మాత్రమే కోరుకున్నారని, అవినీతిపరుడైన పళనీస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అడిగారని, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాదని చెప్పారు. దినకరన్ వైపు ఉండిపోయిన అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ వేలు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తొలుత దినకరన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టుకు ఆయన ఏం చెప్పారంటే.. ‘18మంది ఎమ్మెల్యేలపై వేలు వేస్తు తమిళనాడు స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయానికి విరుద్థం. పార్టీకి విరుద్ధంగా ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. వాళ్లు నాయకుడిని మాత్రమే మార్చాలని కోరారు. వారు వేరే పార్టీలోకి వెళ్లలేదు.. దీని ప్రకారం వారి చర్య పార్టీ ఫిరాయింపు పరిధిలోకి రాదు. గవర్నర్‌కు వారు ఇచ్చిన లేఖలో కూడా ముఖ్యమంత్రిని మార్చాలనే అడిగారు. ఆ పద్దెనిమంది ఎమ్మెల్యేలకు కనీసం సమయం కూడా ఇవ్వలేదు. మూడు వారాల్లో త్వరత్వరగా మొత్తం కానిచ్చేశారు. ఎమ్మెల్యేలపై వేటు వేశారు’ అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం స్పీకర్ తరుపు న్యాయవాది వాదనలు చేస్తూ స్పీకర్ నిర్ణయం సరైనదే అన్నారు. చట్టప్రకారమే ఆయన వ్యవహరించారని తెలిపారు. -
పళనీ త్వరలోనే అత్తగారింటికి : దినకరన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామిని త్వరలోనే అత్తగారింటికి(జైలు)కు పంపిస్తానని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ అన్నారు. త్వరలో జైలుకు వెళ్లేది ఆయనేనని తాను కాదని తెలిపారు. పళనీస్వామి ఇప్పటికే భయపడుతున్నారని, ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ మొదలుపెడితే ఎక్కడ జైలుకు వెళతారోనని బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతోనే 19మంది ఎమ్మెల్యేలను డబ్బుతో కొని మీ పక్కన పెట్టుకున్నారని పళనీస్వామి వర్గం ఆరోపిస్తుందని గుర్తు చేయగా.. 'అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి నేను బాంబులు పెట్టానని కూడా నా విరోధులు ఆరోపిస్తారు. వాటిని మీరు నమ్ముతారా?(మీడియాను ప్రశ్నిస్తూ).. నమ్మరుగా.. దయచేసి అలాంటి అడగకండి' అంటూ దినకరన్ అన్నారు. -
భయపడను..కొత్త పార్టీ పెట్టే తీరుతా..
సాక్షి, చెన్నై: రాజకీయ ప్రవేశంపై గట్టి సంకేతాలు పంపుతున్నసినీ నటుడు కమల్ హాసన్ ఈ నెలాఖరున కొత్త పార్టీని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నవంబర్‌లో జరిగే స్ధానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టిన కమల్ 4000 మంది అభ్యర్ధులను ఈ ఎన్నికల్లో బరిలో దింపాలని యోచిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై మరికొన్ని రోజుల్లో కమల్ ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఏఐఏడీఎంకేలో చీలిక నేపథ్యంలో తన రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయమని కమల్ భావిస్తున్నట్టు సమాచారం. అభిమానులతో మంతనాలు, పలు వర్గాలతో సంప్రదింపులతో పాటు పార్టీ ముసాయిదాకు తుదిరూపు ఇవ్వడంలో ఆయన బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఇతర కూటముల్లో చేరకుండా సొంత పార్టీ ఏర్పాటుకు కమల్ పూనుకోవడం డీఎంకేకు ఇబ్బందికరమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘నన్ను హతమారుస్తామనే హెచ్చరికలతో బెదిరింపులు వస్తున్నాయి, వాటికి బెదిరిపోయే పరిస్థితే లేదు కొత్త పార్టీ పెట్టే తీరుతాను, మరే ఇతర ఏ పార్టీలో చేరబోను’ అని స్పష్టం చేశారు. దేశంలో మార్పు అవసరం, ఆ మార్పు నాతోనే, తమిళనాడు నుంచే రావాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. ముంబై నుంచి వెలువడే ఓ వెబ్‌సైట్‌కు కమల్ ఇచ్చిన ఇంటర్వ్యూ తమిళ సాయంకాల దినపత్రికల్లో (మాలైమురసు, మాలైమలర్) గురువారం ప్రచురితమైంది. కమల్ ఏమన్నారంటే... ‘‘ప్రత్యేకంగా పార్టీ పెడుతున్నారా అని కొందరు అడుగుతున్నారు. పార్టీ పెట్టాలనే ఆలోచనే ఉంది. ప్రతి పార్టీకీ ఒక సిద్దాంతం అంటూ ఉంటుంది. అలాగే నా ఆలోచనలను అమలు చేసేందుకు వేరుగా ఏర్పాటు చేసే పార్టీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. నా జీవితంలో ఎందరో రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నా, ఫొటోలు దిగాను. అయితే ఏ పార్టీ సిద్దాంతాలకు నేను లోబడలేదు. నా ఆశయాలు, ఆలోచనలకు అనువుగా మరేపార్టీ ఉన్నట్లుగా తోచడం లేదు. శశికళను తొలగించడం అన్నాడీఎంకేలో మంచితో కూడుకున్న ముందడుగు. ఈ చర్య కొంత ఆశాభావం రేకెత్తించినా రాష్ట్రంలో మార్పు అవశ్యం. ఆ మార్పును నేనే తీసుకురావాలని, ముందుండి నడిపించాలని ఆశిస్తున్నాను. మార్పు తీసుకురావడంలో నా వల్ల ఎంత జాప్యం జరుగుతుందో ముఖ్యం కాదు. ఎన్నికల్లో నిలబడి గెలిస్తే ఓటర్లు నా పనితీరును లెక్కగట్టాలి. అసలు దేశంలోనే రాజకీయ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటనే ఆ ప్రజాప్రతినిధిని బాధ్యతల నుంచి తప్పించగలగాలి. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే ఇదే ఏకైక మార్గం. అవినీతి రహిత సమాజం ఏర్పడాలి. అవినీతి ఉన్నచోట నేను ఉండను, నేను ఉన్న చోట అవినీతి ఉండకూడదు.. అదే నా ఆశ ఆశయం. దేశాన్ని బాగుచేయాలని అనుకునే ముందు రాష్ట్రాన్ని బాగుచేసుకోవాలి. రాజకీయాల్లోకి రావడానికి నాకు ఇదే సరైన సమయం. రాష్ట్రంలో అన్నీ అవకతవకలుగా తయారైనాయి. రాత్రికి రాత్రే మార్పు రావాలని కోరుకోవడం లేదు. అయితే ఈమార్పు తమిళనాడు నుండే ప్రారంభం కావాలి. అందుకు అవసరమైన పనులను ప్రారంభించాను. ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం అవసరం. అయితే ఈ జీవితకాలంలో నేను ఆశించిన మార్పు జరగకపోవచ్చు. రాజకీయాలను శుభ్రం చేసే పనులను భావితరం వారు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నన్ను అంతం చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒకటి నేను పోవాలి లేదా దేశంలో అవినీతి అంతరించిపోవాలి. రెంటినీ ఒకటిగా చూడటం కుదరదు.’’ అని అన్నారు. -
ఛాలెంజ్.. పళనీ ప్రభుత్వం ఇంటికే..
-
ఛాలెంజ్.. పళనీ ప్రభుత్వం ఇంటికే..: దినకరన్
చెన్నై: తాను తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతానని అన్నాడీఎంకే బహిష్కృతనేత టీటీవీ దినకరన్ శపథం చేశారు. తమిళనాడు ప్రజలను, కార్యకర్తలను ముఖ్యమంత్రి పళనీ స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సమావేశమైన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పార్టీ చీఫ్, డిప్యూటీ చీఫ్ పదవుల నుంచి శశికళ, దినకరన్‌లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినకరన్ మధురై నుంచి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాను. పళని స్వామికి ఎవరూ ఓటేయలేదు. మరోసారి మేం అమ్మ పరిపాలనను తీసుకొస్తాం. పోటీ అనేది మాకు, డీఎంకేకి మధ్య మాత్రమే పోరాటం జరుగుతుంది. పళనీస్వామిని సీఎం కుర్చీలో నేను చూడలేను. పన్నీర్ సెల్వం కారణంగా మా ఎన్నికల గుర్తు పోయింది. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. మేం పన్నీర్, పళనిలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. వారికి కావాల్సిందల్లా పదవిలో ఉండటం.. దానిని అనుభవించడం మాత్రమే. నేనే నిజమైన అమ్మ వారసుడిని.. ప్రజలు కూడా నన్నే అమ్మ విశ్వసనీయుడిగా పరిగణిస్తారు. వారికి బలమే లేదు. ఆ విషయం కోర్టు తేలుస్తుంది. ఇప్పటికే 21మంది ఎమ్మెల్యేలకు పళనీస్వామిపై తమకు నమ్మకం లేదని గవర్నర్‌కు లేఖ పంపించాం. నిజంగా వారికి మెజారిటీ ఉంటే బలపరీక్షకు దిగాలి. ఒక వేళ నిజంగా ఆయన సీఎం కాగలిగితే సీఎం పదవికి రాజనామా చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావచ్చుకదా. దమ్ముంటే మీరు ఎన్నికలు రండి.. నేను సవాల్ చేస్తున్నా. ఈ ప్రభుత్వానికి ఈ 117మంది ఎమ్మెల్యేల బలం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని దినకరన్ చెప్పారు. మరోపక్క, అసలు తమను విమర్శించడానికి దినకరన్‌కు ఎలాంటి అర్హత లేదని సీఎం పళనీస్వామి అన్నారు. ‘‘మమ్మల్ని విమర్శించడానికి దినకరన్‌కు ఎలాంటి అర్హత లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆయనను 10 యేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంచారు’ అని గుర్తు చేశారు. -
దెబ్బ మీద దెబ్బ.. శశికళ పరిస్థితేమిటో?
చెన్నై : ఇప్పటికే అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఆమె ఏది అనుకుంటే దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. విధి వెక్కిరించడం, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచే అనే మాటలు ప్రస్తుతానికి శశికళ విషయంలో నిజమేమో అనిపించక మానదు.. ఆమె విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ‘చిన్నమ్మ’ శశికళ చేతికి పార్టీ పగ్గాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం, పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయడం తర్వాత పార్టీలో చీలిక రావడం మొదలైంది. సరిగ్గా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు అనుకునే సందర్భంలోనే అప్పటి వరకు ఎలాంటి కదలిక లేని ఆస్తులకు మించిన ఆదాయం కేసు కాస్త ఒక్కసారిగా ఆమెపై పిడుగులాగా పడింది. ఈ కేసులో దోషిగా తేలడంతో ఆమె ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో ఆమెకు మొత్తం నాలుగేళ్ల జైలు శిక్ష పడగా దాదాపు రూ.10కోట్ల జరిమానా కూడా పడింది. అవి చెల్లించలేకుంటే మరో 13 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే 2014లో ట్రయల్ కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా ప్రస్తుతం ఉన్న జైల్లోనే అప్పట్లో ఆమె 21 రోజుల జైలు శిక్ష అనుభవించారు. దాని ప్రకారం మూడు సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఫిబ్రవరి 14న జైలుకెళ్లిన ఆమె అక్కడి నుంచే చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఎవరూ ఊహించని విధంగా పళనీ స్వామిని ముఖ్యమంత్రిని చేయడం, పార్టీ బాధ్యతలు దినకరన్ చూసుకునే ఏర్పాట్లు చేయడంలాంటి పరిణామాలు జరిగాయి. దినకరన్‌ను ఉంచడం ద్వారా తన చేతిలోకి ఎప్పటికైనా పార్టీ పగ్గాలు వస్తాయని భావించింది. అయితే, సీఎం పదవి నుంచి పక్కకు తప్పించిన పన్నీర్ సెల్వం కాస్త పట్టువీడని విక్రమార్కుడిలా మారి అమ్మపేరిట ప్రజల్లోకి వెళుతూ శశికళ, దినకరన్ వర్గాన్ని ఎండగట్టే యత్నం మొదలుపెట్టారు. చివరకు దినకరన్ ఆదిపత్యం చెలాయిస్తుండటం అన్నాడీఎంకే పార్టీలో కొంతమంది నేతలకు నచ్చకపోవడంతోపాటు, వారి కారణంగా తామెందుకు విడిపోవాలనే ఆలోచనలోకి వచ్చిన పళనీ, పన్నీర్ వర్గాలు కాస్త ఒక్కటయ్యాయి. ఏకంగా ప్రత్యేక కౌన్సిల్ మీటింగ్ పెట్టి అసలు పార్టీకి శశికళకు, దినకరన్‌కు ఏ సంబంధం లేదని, వారిని పార్టీ నుంచి, అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు తాజాగా తీర్మానం చేశారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన చిన్నమ్మకు దెబ్బమీద దెబ్బలు తగలడం మొదలుపెట్టాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శశికళ ఎలాంటి వ్యూహం పన్నుతారో వేచి చూడాల్సిందే. -
రాజకీయాల్లోకి రా!
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితి ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను కలవరపెడుతోందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వర్గం, పన్నీర్‌సెల్వం వర్గం ఏకమవడం శశికళ వర్గానికి మింగుడుపడని పరిస్థితి. అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తప్పించడంతో ఆమె సోదరుడు, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. మరో ప్రక్క ప్రధాన ప్రతి ప్రక్షపార్టీ నేత స్టాలిన్ అన్నాడీఎంకే బల నిరూపణకు పట్టుపడుతున్న వైనం, ఇలా తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న తరుణంలో ప్రముఖ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్ సోదరి వివాహం ఈ నెల 27వ తేదీన చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు డీఎంకే నేత స్టాలిన్‌తో పాటు పలువురు రాజకీయనాయకులు, నటుడు రజనీకాంత్, విజయ్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శుభాకాంక్షలు అందించారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బుధవారం విశాల్ నివాసానికి వెళ్లి ఆయన చెల్లెలు ఐశ్వర్యరెడ్డి, ఉమ్మడి క్రిష దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దినకరన్ మాట్లాడుతూ నటుడు విశాల్‌లో నాయకత్వం లక్షణాలు ఉన్నాయని, ఆయన రాజకీయాల్లోకి వస్తే తాను సంతోషిస్తానని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లోనూ, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించిన విశాల్ రాజకీయ మోహం పుట్టిందనే విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనకు రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేసినా, తాజాగా టీటీవీ దినకరన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీయవచ్చనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది. -
రంగంలోకి నిర్మల సీతారామన్..
►అమిత్ షా కొత్త అడుగు ►తమిళనాట ప్రాధాన్యత పెంపు సాక్షి, చెన్నై : తమిళనాట బలాన్ని పుంజుకోవడం లక్ష్యంగా బీజేపీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నిర్మల సీతారామన్‌ను రంగంలోకి దించనుంది. తమిళనాడుకు సుపరిచితురాలుగా ఉన్న ఆమెకు ప్రాధాన్యతను పెంచేందుకు నిర్ణయించారు. ఆమె నేతృత్వంలో బీజేపీ తమిళనాట కొత్త పుంతలు తొక్కే రీతిలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహరచన చేసి ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమిళనాట బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ కూటమి కొనసాగుతుందని భావించారు. అయితే, మధ్యలో కూటమిలో చీలిక అనివార్యం కావడంతో డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు తలా ఓ దారి అన్నట్టుగా పయనం సాగించే పనిలో పడ్డాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా నిలవక తప్పలేదు. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పూర్తి దృష్టిని తమిళనాడు మీద కేంద్రీకరించింది. అమ్మ జయలలిత మరణంతో తమిళనాట పాగా వేయడానికి కమలనాథులు తీవ్ర వ్యూహ రచనల్లో ఉన్నారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలో బలమైన నాయకులు ఇక లేని దృష్ట్యా, ఆ పార్టీ ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నాల్లో కమలం ఢిల్లీ పెద్దలు సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే, బలమైన నాయకత్వం అవసరమన్న విషయాన్ని పరిగణించారు. అన్నాడీఎంకే బలం, బీజేపీ బలంతో పాటుగా ఇతర పార్టీల్ని కలుపుకుని ముందుకు సాగడం ద్వారా డిఎంకేకు చెక్ పెట్ట వచ్చన్న ధీమా బీజేపీ బాస్ అమిత్‌షాలో నెలకొంది. అందుకే తన వ్యూహాల అమలు లక్ష్యంగా ఈనెల 22 నుంచి మూడు రోజులు తమిళనాట పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి బలమైన నేతగా నిర్మల సీతారామన్‌ను రంగంలోకి దించేందుకు నిర్ణయించడం గమనార్హం. పూర్తిస్థాయిలో నిర్మల సీతారామన్ సేవలు 1959 ఆగస్టు 18వ తేదీన నారాయణ సీతారామన్, సావిత్రి దంపతులకు మదురైలో నిర్మల సీతారామన్ జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా తమిళనాటే సాగింది. తిరుచ్చిలో బీఏ పట్టా పొందారు. ఢిల్లీలో పరిశోధనలతో పీహెచ్డీ చేశారు. తమిళనాడుకు చెందిన నాయకురాలైనా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆమెను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. కేంద్ర సహాయమంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. కేంద్రమంత్రి హోదాలో తమిళనాట ఇటీవల కాలంగా ఆమె పర్యటనలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలో పెద్దలు ప్రకటించాల్సిన తమిళనాడుకు చెందిన కొన్ని కీలక విషయాల్లోని అంశాలను నిర్మల సీతారామన్ ఇక్కడ వెల్లడిస్తూ రావడం గమనించాల్సిన విషయం. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే నీట్‌కు ఏడాది మినహాయింపు విషయంగా తన నిర్ణయాన్ని తమిళనాడుకు వచ్చి మరీ ఆమె ప్రకటించడం, తదుపరి ఆగమేఘాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధం కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. వాక్చాతుర్యంతో పాటు విద్యార్హతలు కలిగిన నిర్మల సీతారామన్ సేవల్ని పూర్తి స్థాయిలో తమిళనాడులో ఉపయోగించుకోవడం ద్వారా తమ బలం మరింతగా పెరగడంతో పాటు డీఎంకేకి దీటుగా ఎదిగే అవకాశం ఉందని అమిత్ షా అంచనా వేసినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీలో ప్రజాకర్షణ ఉన్న వాళ్లు అరుదే కావడంతో, ఆ లోటును నిర్మల సీతారామన్ ద్వారా భర్తీచేసి, అధికారం లక్ష్యంగా ముందుకు సాగేందుకు అమిత్ షా సర్వాస్త్రాలతో చెన్నైలో అడుగు పెట్టబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అధికార పగ్గాలు తమ గుప్పెట్లోకి చేరిన పక్షంలో బీజేపీ సీఎంగా నిర్మల సీతారామన్ పగ్గాలు చేపట్టేందుకు తగ్గ ప్రయత్నాలతో తమిళనాట మూడు రోజుల పాటు అమిత్ పర్యటన సాగనుందని కమలనాథులు పేర్కొనటం గమనార్హం. -
జయలలిత మరణంపై న్యాయ విచారణ
►అమ్మ మరణంపై జ్యుడీషియల్ విచారణ.. ►శశికళ, దినకరన్‌కు పళనిస్వామి చెక్.. ►త్వరలో ఒకటికానున్న ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే పొయెస్ గార్డెన్స్‌లోని జయ నివాసమైన వేద నిలయాన్ని జయలలిత స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పళనిస్వామి తెలిపారు. ఆ కమిటీ విచారణ జరిపి త్వరలో నివేదిక సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా జయలలిత మరణం అనుమానాస్పదమేనని, అపోలో ఆసుపత్రిలో అడ్మిట్కాక ముందే కుట్ర జరిగిందని అన్నాడీఎంకే నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘అమ్మ’ మృతిపై అనుమానం ఉందని, దీని గురించి న్యాయ విచారణ జరపాలంటూ మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా డిమాండ్ చేశారు. కాగా అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పళినిస్వామి తాజా నిర్ణయంతో శశికళ, దినకరన్‌కు చెక్ పెట్టినట్లు అయింది. మరోవైపు అన్నాడీఎంకేలో రెండు వర్గాల విలీనానికి పన్నీర్ సెల్వం పెట్టిన డిమాండ్లను పళినిస్వామి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇటీవలే దినకరన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించారు కూడా. తాజా సంకేతాలతో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు త్వరలో ఒకటి కానున్నాయి. ఇక జయ మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడాన్ని పన్నీర్ సెల్వం స్వాగతించారు. కాగా జయలలితకు సరైన చికిత్స అందినట్లు సీఎం పళనిస్వామి ఇప్పటివరకూ చెప్పారని, అకస్మాత్తుగా విచారణకు ఎందుకు ఆదేశించారని డీఎంకే ప్రశ్నించింది. కాగా జయలలిత గత ఏడాది సెప్టెంబరులో హఠాత్తుగా అస్వస్థత గురి అయ్యారు. సుమారు 70 రోజులకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న హఠాత్తుగా మృతి చెందారు. -
జయలలిత మరణంపై జ్యుడీషియల్ విచారణ
-
కమల్ కు ఖుష్బూ మద్ధతు
పెరంబూరు: అదే మాటమీద నిలబడండి మీకు నేను ఉన్నా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త, నటి కుష్బూ నటుడు కమలహాసన్ కు మద్దతు పలికారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఏడపాడి పళనిస్వామితో సహా మంత్రి జగదీశ్‌కుమార్ తదితరులు కమల్‌పై ప్రతి విమర్శల దాడికి దిగుతున్నారు. కాగా ఇదంతా ఒక కంట కనిపెడుతున్న కుష్బూ సోమవారం సోషల్ మీడియా ద్వారా కమలహాసన్ ను ఉద్దేశించి పేర్కొంటూ మీరు ఇదే మాటపై నిలబడండి. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. రాజకీయాల్లో రెక్కలు విరిగిన కొందరు మీ మీద సవారీ చేసి ప్రచారం పొందాలనుకుంటున్నారు. మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉండండి. మంచి మార్పు కోసం మీ పోరాటం కొనసాగాలి. మీకు నేను ఉన్నాను అంటూ మద్ధతు పలికారు. -
‘రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి నాకు తెలియదు’
న్యూఢిల్లీ : దక్షిణాది సూపర్ట్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్పందించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి తనకు తెలియదని, అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తామని, ఆయన మంచి వ్యక్తి అని పన్నీర్ సెల్వం అన్నారు. బీజేపీ ఆహ్వానిస్తేనే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన తెలిపారు. మరోవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, కొత్త పార్టీ పెడతారంటూ ఆయన సన్నిహితులు, బంధువులు ఫీలర్లు వదులుతున్నారు. రజనీ జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. -
దేశం ఎదురుచూస్తోంది.. రజనీ రా!
సినిమాల్లోంచి రాజకీయాలలోకి వచ్చిన హీరోలలో షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా ఒకరు. 1986లో వచ్చిన అస్లీ నక్లీ అనే సినిమాలో ఆయన రజనీకాంత్‌తో కలిసి నటించారు. ఇప్పుడు అదే శత్రుఘ్న సిన్హా.. తన పాతమిత్రుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని పిలుస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న ఏ పార్టీలోనూ చేరొద్దని, దానికి బదులు సొంత పార్టీ పెడితే మిగిలినవాళ్లంతా వచ్చి అందులో చేరుతారని ఆయన చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో వరుసపెట్టి ట్వీట్లు చేశారు. ''టైటానిక్ హీరో ఆఫ్ తమిళనాడు అండ్ సన్ ఆఫ్ ఇండియా.. డియరెస్ట్ రజనీకాంత్, సరైన సమయం ఇదే, కమాన్ లే. దేశం నీకోసం ఎదురుచూస్తోంది. సూపర్‌స్టార్ రజనీ ఎప్పుడు నిర్మాణాత్మక రాజకీయాలలోకి వస్తారా అని, ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు'' అని ఆయన అన్నారు. దేవుడు శాసిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని ఇంతకుముందు రజనీకాంత్ చెప్పిన విషయం తెలిసిందే. యుద్ధం వచ్చినప్పుడు పిలుస్తానని, అప్పటివరకు ఎవరి పనుల్లో వాళ్లు ఉండాలని అభిమానులతో ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీకి కొంత దూరంగా ఉంటూ వస్తున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా.. ఇప్పుడు రజనీకాంత్‌ను ఏ పార్టీలోనూ చేరొద్దని చెప్పడం విశేషం. ఒకవైపు ఆయన బీజేపీలో చేరుతారని, లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని కథనాలు వస్తున్న తరుణంలో స్వయంగా బీజేపీ ఎంపీ అయి ఉండి సొంతంగా పార్టీ పెట్టుకోవాలి తప్ప ఎందులోనూ చేరద్దని శత్రుఘ్న చెప్పారు. ''ప్రజలంతా నీతో ఉన్నారు, సూపర్‌స్టార్ రజనీతో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరితోనైనా చేరడానికి బదులు వాళ్లే వచ్చి నీతో చేరితే బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను, నిపుణులను సంప్రదించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎంత త్వరగా అయితే అంత మంచిది'' అని కూడా శత్రుఘ్న సిన్హా సూచించారు. ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా తాను ఎప్పుడూ రజనీకాంత్‌కు అండగా ఉంటానని, ఆయనకు అన్నిరకాలుగా మద్దతివ్వడంతో పాటు రాజకీయాల్లో గైడ్ చేస్తానని తెలిపారు. తనను నమ్మొచ్చని, ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెబుతూ చివర్లో 'లాంగ్‌లివ్ సూపర్‌స్టార్ రజనీ' అని ముగించారు. Titanic Hero of Tamil Nadu & son of India - dearest @superstarrajini #Rajinikanth ! Rise, Rise, Rise!! It's high time & the right time! 1>2 — Shatrughan Sinha (@ShatruganSinha) 25 May 2017 Nation is waiting with bated breath for @superstarrajini 's leap into constructive politics to shape the future of your people & nation 2>3 — Shatrughan Sinha (@ShatruganSinha) 25 May 2017 The people are with you and ready to join @superstarrajini and instead of joining anyone, it is best when others join you...3>4 — Shatrughan Sinha (@ShatruganSinha) 25 May 2017 Hope, wish & pray that after consulting with your family, dear ones & experts, you take the right decision soon - sooner the better...4>5 — Shatrughan Sinha (@ShatruganSinha) 25 May 2017 I have always stood by @superstarrajini as a friend, supporter, well wisher & even guide. Even today, if I can be of any help or support 5>6 — Shatrughan Sinha (@ShatruganSinha) 25 May 2017 ..you can bank on me. I'm bankable, dependable & available to you - anytime & everytime. Regards to your family & long live @superstarrajini — Shatrughan Sinha (@ShatruganSinha) 25 May 2017 -
‘రజనీ అంటే ఏమిటో నేను స్వయంగా చూశాను’
న్యూఢిల్లీ: తాను రాజకీయాలకు తగినవాడిని కాదని ప్రముఖ దక్షిణాది నటుడు రజనీకాంత్ తనతోఅన్నారని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్‌గడ్కరీ అన్నారు. తాను ఎప్పుడు వెళ్లినా చెన్నైలో రజినీని కలుస్తానని, ఆ సమయంలో తామిద్దరం రాజకీయాలు మాట్లాడుకుంటామని, ఆయనతో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఒక వేళ రజనీ రాజకీయాల్లోకి వస్తే అది జరగాలనే కోరుకుంటానని చెప్పిన ఆయన రజినీ బీజేపీలో చేరిత తప్పకుండా సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. అయితే, రజనీ బీజేపీలో చేరితే ఏ స్థానం ఇస్తారని ప్రశ్నించగా తనకు అలా చెప్పే అధికారం ఉన్నా, నిర్ణయం తీసుకునేవాడినే అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జయలలిత స్థానాన్ని భర్తీ చేయగల స్థాయి తమిళనాడులో ఒక్క రజనీకాంత్‌కే ఎందుకుందని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. రజినీకి గొప్ప సపోర్ట్ ఉందన్నారు. చెన్నైలో తాను ఒకసారి రజనీని కలిసేటప్పుడు ఒక ఇంజినీర్‌ను తనతో తీసుకెళ్లి ఆయనను కలిపించానని, ఆ సమయంలో రజనీ అతడితో కరచాలనం చేశారని, అప్పటి నుంచి కూడా మూడు రోజులపాటు ఆ ఇంజినీర్ తన చేతులను మడిచే ఉంచారని చెప్పారు. ఇది రజనీ అంటే అక్కడి ప్రజలకు ఉన్న ప్రేమ, ఆకర్షణకు ఉదాహరణ అని తెలిపారు. రజనీది మహారాష్ట్ర అని, కొల్లాపూర్ నుంచి తమిళనాడుకు వచ్చారని, ఆయన ఇంటి ముందు చత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద చిత్ర పటం కూడా ఉంటుందని గుర్తు చేశారు. తాను మాత్రం రజనీ రాజకీయాలకు వచ్చేందుకు కచ్చితమైన సమయం ఇదేనని సూచించాని తెలిపారు. బీజేపీలోనే రజనీ ఎందుకు చేరాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా..తాను రజనీ మంచి కోరుకునే వాళ్లలో ఒకడినని, ఇప్పటికీ ఆయనను ప్రత్యేకంగా వెళ్లి కలిసే ఉద్దేశం లేదని, తాను ఎప్పుడంటే అప్పుడు పార్టీలోకి రావొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు. -
రజనీ రాజకీయాలపై నేతలు ఏమన్నారు?
''యుద్ధం వచ్చినపుడు చెబుతా.. సిద్ధంగా ఉండండి''... ఇదీ తన అభిమానులకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సందేశం. అంటే, తాను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు చెబుతానని, అందుకు ఇప్పటినుంచే మానసికంగా రెడీగా ఉండాలని పరోక్షంగా చెప్పినట్లేనని అంతా భావిస్తున్నారు. అయితే ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా మరే పార్టీ వచ్చినా అది మఖలో పుట్టి పుబ్బలో పోయినట్లే అవుతోందన్నది చరిత్ర చెబుతున్న నిజం. మరి రజనీకాంత్ చరిత్రను తిరగరాస్తాడా.. సొంతంగా పార్టీ పెడతాడా లేదా ఇప్పటికే ఉన్న ఏవైనా పార్టీలో చేరుతారా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తమిళ రాజకీయ వర్గాలలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రజనీకాంత్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అన్నారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చేసినట్లే ఆయన మాట్లాడారు. అయితే కేంద్ర మాజీమంత్రి, పీఎంకే నాయకుడు డాక్టర్ అన్బుమణి రాందాస్‌కు మాత్రం రజనీ రాజకీయాలు పెద్దగా నచ్చినట్లు లేవు. రజనీకాంత్ మంచివాడేనని, ఆ విషయం అందరికీ తెలుసని చెబుతూనే... తమిళ రాజకీయాలకు ఇప్పుడు డాక్టర్ కావాలి గానీ యాక్టర్ అక్కర్లేదన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఐసీయూలో ఉందని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా వైద్యుడిని కావడంతో.. ఆయనిలా స్పందించారని అనుకుంటున్నారు. యాక్టర్లు రాష్ట్రాన్ని 50 ఏళ్ల పాటు నాశనం చేశారని, అది ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు అందరూ అలాగే చేశారని అన్నారు. కేవలం నటనా నైపుణ్యాలు మాత్రమే రాష్ట్రానికి సరిపోవన్న విషయం యువతకు బాగా తెలుసని ఆయన చెప్పారు. బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యంస్వామి కూడా రజనీ విషయంలో నెగెటివ్‌గానే స్పందించారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఆయన ఈరోజు ఒకమాట చెబితే రేపు మరోమాట చెబుతారని, ఎల్టీటీఈ బెదిరింపుల కారణంగా ఆయన ఎప్పటికప్పుడు తన మనసు మార్చుకుంటారని స్వామి ఆరోపించారు. ఇప్పటికే ఉన్న నాయకులను ప్రశంసిస్తూనే.. వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పడం ద్వారా తాను రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్న విషయాన్ని రజనీ చెప్పకనే చెప్పినట్లయింది. ''మనకు స్టాలిన్, అన్బుమణి రాందాస్, సీమన్ లాంటి మంచి నాయకులున్నారు. కానీ, వ్యవస్థ పాడైనప్పుడు, ప్రజాస్వామ్యం కుప్పకూలినప్పుడు వాళ్లేం చేస్తారు? వ్యవస్థను మార్చాలి. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. నాకు నా వృత్తి ఉంది, మీకు మీ ఉద్యోగాలున్నాయి. మీరు వెళ్లి మీ ఉద్యోగాలు చేసుకోండి. సమరానికి సమయం ఆసన్నమైనప్పుడు మనం తిరిగి కలుద్దాం'' అని 67 ఏళ్ల సూపర్ స్టార్ తన అభిమానులతో అన్నారు. తాను తమిళుడిని కానన్న విమర్శలను ఆయన దీటుగా తిప్పికొట్టారు. తాను 23 ఏళ్లు కర్ణాటకలో ఉంటే 43 ఏళ్లుగా తమిళనాడులోనే ఉన్నానని చెప్పారు. ''కర్ణాటక నుంచి వచ్చిన మరాఠీని అయినా, మీరంతా కలిసి నన్ను మలిచారు, నన్ను అసలైన తమిళుడిగా మార్చారు'' అని అన్నారు. -
మమ్మీ రిటర్న్స్ ?
-
మళ్లీ రజనీకాంత్ వాల్ పోస్టర్ల కలకలం
-
మళ్లీ రజనీకాంత్ వాల్ పోస్టర్ల కలకలం
చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతుంటే...మరోవైపు దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ వాల్ పోస్టర్లు మళ్లీ కలకలం రేపుతున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. "ప్రజలు జీవించాలంటూ నువ్వు పాలించాలి. మిమ్మల్నే ఈ భూమి నమ్మి ఉంది. ప్రజలకు మంచి దారి చూపించు'' అంటూ పోస్టర్లలో స్లోగన్లు రాసి ఉన్నాయి. రజనీకాంత్ నివాసం పొయిస్ గార్డెన్ సమీపంలోని రాధాకృష్ణన్ శాలై, జెమినీ ఫ్లైఓవర్ వద్ద ఈ పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లపై రజనీకాంత్ స్పందించాల్సి ఉంది. కాగా రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి దించేందుకు గతంలో అభిమాన లోకం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. అభిమానుల ఒత్తిడి శ్రుతి మించడంతో తలొగ్గిన రజనీ కాంత్ ‘దేవుడు ఆదేశిస్తే... రాజకీయాల్లోకి వస్తా..’ అన్న మెలిక పెట్టారు. దీంతో అభిమానుల నోళ్లకు తాళం వేయించారు. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దింపే ప్రయత్నాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీతో రజనీ కాంత్‌కు ఉన్న మిత్రత్వం ఇందుకు ఓ కారణం. దక్షిణాదిలో కర్ణాటకలో బలంగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బలం పుంజుకుంటున్నా, తమిళనాడులో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా బీజేపీ పరిస్థితి ఉంది. మోదీ ప్రభావంతోపాటు, సినీ గ్లామర్‌ను తోడు చేసి తమిళనాడులోనూ పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ అధిష్టానం వ్యూహ రచన చేసినా, రజనీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నేపథ్యంలో జయలలిత మరణంతో మళ్లీ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం అంశం తెరమీదకు వచ్చింది. దీనిపై ఆయన మాత్రం పెదవి విప్పడం లేదు. గతంలోనూ రజనీ అభిమానులు ... సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిపించిన విషయం తెలిసిందే. -
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?
-
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?
అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు విలీనం గురించి రెండు వర్గాల మధ్య చర్చలు సోమవారం మొదలవుతుంటే.. మరోవైపు ఆర్థికమంత్రి డి.జయకుమార్ తాను రాజీనామా చేస్తానంటూ ముందుకొచ్చారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలంటే ఇప్పుడున్న మంత్రుల్లో కొంతమంది త్యాగాలు చేయక తప్పదని, ముందుగా తానే త్యాగం చేస్తానని ఆయన చెప్పడం గమనార్హం. పార్టీ సంక్షేమం కోసం తన పదవి పోయినా పర్వాలేదని ఆయన విలేకరులతో చెప్పారు. అయితే, అదే మంత్రివర్గంలోని మరో మంత్రి దిండిగల్ సి శ్రీనివాసన్ మాత్రం మరోరకంగా స్పందించారు. మెజారీటీ ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పూర్తి కాలం పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంత సులభం కాదని తెలుస్తోంది. పన్నీర్ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ గురించి ఆర్థిక మంత్రి జయకుమార్‌ను ప్రశ్నించగా.. ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అయితే ఓపీఎస్ వర్గం డిమాండ్లు వినేందుకు సుముఖంగా ఉన్నామని మాత్రం చెప్పారు. వాళ్ల డిమాండ్లు ఏంటో బయటపెట్టాలని, రెండు వైపుల నుంచి కూడా డిమాండ్లు ఉండటం సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జయకుమార్ అన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, వాళ్లు పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి చర్చలు మొదలుపెడితే అప్పుడు అన్ని విషయాలూ అర్థం అవుతాయని చెప్పారు. పళనిసామి వర్గం ఓ రాజీ ఫార్ములాతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పళనిసామి వర్గానికే ఇవ్వాలని, పన్నీర్ సెల్వానికి ఉపముఖ్యమంత్రి పదవి, పార్టీ కోశాధికారి పదవి ఇస్తామని వాళ్లు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. వైద్యలింగాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి, పళనిసామిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అన్నాడీఎంకే ఎంపీ ఒకరు అన్నారు. మరోవైపు.. పార్టీకి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని, వాటిలో రెండు వర్గాలు తలొకటి తీసుకోవచ్చని కూడా పళనిసామి వర్గం చెబుతోంది. ఏది ఏమైనా సాయంత్రానికి మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత పార్టీ కార్యాలయంలో చర్చలు మొదలవుతున్నాయి. రెండు వర్గాలు ఎవరికి వారే డిమాండ్లు తీసుకొచ్చారు. ఒకరికి ప్రభుత్వాన్ని, మరొకరికి పార్టీని అప్పగించాలని మధ్యేమార్గంగా సూచిస్తున్నారు. కొంతమంది మంత్రులపై వేటు వేయాలని కూడా అంటున్నారు. రెండు వర్గాల వెనక బీజేపీ ఉందని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎటు తిరుగుతాయో ప్రశ్నార్థకంగా ఉంది. -
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
-
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ ఓ పన్నీర్ సెల్వం అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీన చర్చలలో భాగంగా ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, వీలైనంత త్వరలో పళని స్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలన్న ప్రతిపాదనకు ఎక్కువ మద్దతు లభించింది. అయితే ప్రస్తుతం పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవిలో శశికళ ఉన్నారు కాబట్టి, ఇప్పటికిప్పుడే పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కూడా సాధ్యం కాని పనే అవుతుంది. ముందుగా ఎన్నికల కమిషన్‌కు గతంలో పళనిస్వామి వర్గం తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళా నటరాజన్‌ను ఎన్నుకున్నట్లుగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత పార్టీలో అంతర్గత ఎన్నిక నిర్వహించి, అప్పుడు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలి. దీనంతటికీ ఎంత లేదన్నా రెండు నుంచి మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా చేసి, పళని స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఇప్పటివరకు ఉన్న మంత్రివర్గాన్ని ఇంచుమించు యథాతథంగా కొనసాగించడం లాంటి అవకాశాలను కూడా చర్చిస్తున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. ముందుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొంతవరకు తగ్గడం, రెండోది.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోయి రెండాకుల గుర్తు మీద పోటీ చేయడం.. తద్వారా జయలలిత వారసత్వం పూర్తిగా తమకు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవడం. ఇదే లక్ష్యంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రెండు వర్గాల విలీనం జరిగితేనే ఇది సాధ్యమని.. ఎన్నికల కమిషన్ జూన్ 16 వరకు సమయం ఇచ్చినా ఈలోపే విలీనానికి సంబంధించిన లేఖలను కూడా ఇచ్చి, అంతా కలిసి ఒకే వర్గంగా రెండాకుల గుర్తును క్లెయిమ్ చేసుకుంటే మంచిదని కూడా భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇరు వర్గాల నాయకుల మధ్య చిన్న చిన్న విషయాలలో తప్ప చాలావరకు ఏకాభిప్రాయం కుదిరిందనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
యూ టర్న్ తీసుకున్న దినకరన్
-
యూ టర్న్ తీసుకున్న దినకరన్
చెన్నై: తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తన స్వరం మార్చారు. పార్టీపై తన పట్టును నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఆయన ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అలాగే పార్టీ ఆదేశాలను ధిక్కరించనని దినకరన్ స్పష్టం చేశారు. దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని పళనిస్వామి మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినకరన్ మాట్లాడుతూ తనను పక్కన పెట్టినా బాధపడటం లేదన్నారు. అయితే పార్టీ ఒక్కటిగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, పార్టీ, ప్రభుత్వానికి దూరంగా ఉంటానని ఆయన తెలిపారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. పార్టీకి మేలు చేసే నిర్ణయాలకు సహకరిస్తానన్నారు. పార్టీలో అందరూ తనకు సోదరులేనని అన్నారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలయికను తాను వ్యతిరేకించనని దినకరన్ అన్నారు. తనవల్ల పార్టీ బలహీనపడటం తనకు ఇష్టం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, నిన్నటి నుంచి తాను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా ఫెరా కేసు విచారణ నిమిత్తం దినకరన్ ఈరోజు ఎగ్మూరు కోర్టుకు హాజరు కాగా, విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. మరోవైపు రెండాకుల గుర్తును సొంతం చేసుకునేందుకు దినకరన్...మధ్యవర్తి ద్వారా ఈసీకి లంచం ఇవ్వచూపి, అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఓవైపు కేసులు, మరోవైపు పార్టీలో అసంతృప్తి నేపథ్యంలో దినకరన్ యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. -
టెన్షన్.. టెన్షన్
♦ ఐటీ దాడులు, అసంతృప్తి సెగలు ♦ గవర్నర్ విద్యాసాగర్‌రావు రాక ♦ ప్రభుత్వ తీరుపై రహస్య చర్చలు ♦ మంత్రులకు పన్నీర్‌సెల్వం గాలం ♦ శశికళ వద్దకు దినకరన్ పరుగు అధికార పార్టీ, ప్రభుత్వం రెండూ టెన్షన్లో పడిపోయాయి. ఐటీ దాడులు, అసంతృప్తి సెగలు, దినకరన్‌కు సమన్లు ఒకటి తరువాత ఒకటిగా పడుతున్న దెబ్బలతో కుదేలైపోతున్నాయి. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆకస్మిక ఆగమనం వారిని మరింత ఆందోళనకు గురిచేయగా, ఎటువంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికలు అధికార పార్టీని పూర్తిగా అప్రతిష్టపాలు చేశాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచినట్లుగా సాక్షాత్తు వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే సాక్ష్యాధారాలతో ఐటీ అధికారులకు ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టింది. ఐటీ అధికారులను బెదిరించినట్లుగా ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు, మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ సమన్లు, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు సీఎం ఎడపాడికి వ్యతిరేకంగా, అనుకూలంగా చీలిపోవడం తదితర పరిణామాలతో రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం నెలకొని ఉంది. గవర్నర్ రాక రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. ఐటీ నుంచి సమన్లు ఎదుర్కొంటున్న విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని కొందరు మంత్రులే డిమాండ్ చేస్తున్నారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు మంత్రులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్‌కు ఉద్వాసన తప్పదని కొందరు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే గవర్నర్ అత్యవసర రాక ఏదో ఒక సంచలనానికి దారితీయడం ఖాయమని అంటున్నారు. శశికళ వద్దకు దినకరన్ పరుగు రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు దినకరన్ బెంగళూరుకు పరుగులు పెట్టారు. మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ దాడులు, రెండాకుల చిహ్నం కోసం రూ.60 కోట్ల ఎర ఆరోపణలు, రూ.1.30 కోట్లతో బ్రోకర్ పట్టుబడడం, ఢిల్లీ పోలీసుల సమన్లు తదితర అంశాలను ఆమెతో చర్చించేందుకు వెళ్లారు. పన్నీర్ ఆహ్వానం... మంత్రులు ఓకే అనేక ఆరోపణలు, అప్రతిష్టల సుడిగుండంలో అన్నాడీఎంకే చిక్కుకుని ఉండగా ఇదే అదనుగా పన్నీర్‌సెల్వం పాచిక విసిరారు. రెండు వర్గాలను విలీనం చేసేందుకు సీనియర్ మంత్రులు వస్తే చర్చలకు సిద్ధమని ఆహ్వానించారు. మధురైకి వెళుతున్న సందర్భంగా సోమవారం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, రెండాకుల చిహ్నం ఎవరికి అనే అంశంపై ఢిల్లీలో విచారణ జరుగుతున్నదని తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండాకులు గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం కోసం దినకరన్ లంచం ఇవ్వజూపే ప్రయత్నాలపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టిన విషయంపై తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు. ఇరువర్గాలు ఒకటి కావాలని తాను కోరుకుంటున్నానని, ఈ దిశగా సీనియర్ మంత్రులు వస్తే చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు పన్నీర్ వర్గంలో చేరిపోయేందుకు మంత్రులు, సీనియర్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత కోల్పోయిన ప్రతిష్టను పొందాలంటే ఇరువురూ రాజీనామా చేయాలని శశికళ, దినకరన్‌లను మంత్రులు కోరినట్లు, వారు నిరాకరించినట్లు సమాచారం. దీంతో శశికళ వర్గం నుండి తప్పుకుని పన్నీర్ వర్గంలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకునే పన్నీర్‌సెల్వం వారికి ఆహ్వానం పలికారని అంటున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్ పక్షం చేరితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో కంగారు పడిన లోక్‌సభ ఉప సభాపతి, శశికళ విశ్వాసపాత్రుడు తంబిదురై హడావిడిగా సీఎం ఎడపాడితో సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే చీలిపోలేదు, వర్గాలు లేవు, ప్రజాస్వామ్యంలో చిన్నపాటి అసంతృప్తులు సహజమని తంబిదురై వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి చాప కిందకు నీళ్లు?
తమిళనాడు రాజకీయాలలో మళ్లీ అనిశ్చితి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో మరోవైపు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోలేక నిరాశలో ఉన్న పన్నీర్ సెల్వం క్యాంపులో మళ్లీ ఉత్సాహం మొదలైంది. జూన్ నెలలో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ స్మారకార్థం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో సెమినార్లు, డిబేట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ పేరుతో అటు పళనిస్వామి వర్గం నుంచి చీలిక తీసుకురావాలని పన్నీర్ వర్గం భావిస్తోంది. శశికళ వర్గం కూడా పళనిస్వామి మీద అసంతృప్తితో ఉండటం లాంటివి పన్నీర్‌కు కలిసొచ్చే అంశాలు. ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడం, ఆ తర్వాత రెండాకుల గుర్తు కోసం టీటీవీ దినకరన్ ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడం లాంటి పరిణామాలతో శశికళ క్యాంపు ఖంగుదింది. శశికళ క్యాంపులో చీలికలు రావడం, ఆదాయపన్ను శాఖ దాడులు లాంటి విషయాలు ప్రభుత్వంలో అస్థిరతకు కారణమయ్యాయని పన్నీర్ సెల్వం వర్గం భావిస్తోంది. సీనియర్ నాయకుడు ఇ. మధుసూదనన్, మాజీమంత్రి పాండ్యరాజన్, ఎంపీ వి. మైత్రేయన్, మాజీ మంత్రి మునుసామి, మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ లాంటివాళ్లంతా కలిసి పన్నీర్ సెల్వంతో సమావేశమయ్యారు. వ్యూహాల గురించి చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారని, బహుశ బుధవారం నాడు పెద్ద ప్రకటన ఏదో ఒకటి రావచ్చని అంటున్నారు. శశికళ వర్గం నుంచి కొంతమంది సీనియర్ మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు వచ్చి పన్నీర్‌సెల్వం వర్గంలో చేరే అవకాశం కనిపిస్తోంది. శశికళ కుటుంబ సభ్యులు పార్టీలో ఉండకూడదని పన్నీర్ వర్గం గట్టిగా చెబుతోంది. తాజా పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు సీనియర్‌నాయకుడు మైత్రేయన్ నిరాకరించారు. నాయకులు రావాలనుకుంటే వస్తారని, వాళ్లు రావాలని తాము ఎదురు చూడట్లేదని చెప్పారు. వాళ్ల విషయం వాళ్లే నిర్ణయించుకుంటారన్నారు. -
తమిళ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేలో చీలిక సంక్షోభం నుంచి బయటపడ్డ పళనిస్వామి ప్రభుత్వానికి ఆర్కే నగర్ ఉప ఎన్నికలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్కే నగర్ ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచినట్టుగా ఐటీ అధికారుల దాడుల్లో దొరికిపోయిన మంత్రి విజయ్‌భాస్కర్‌పై ముఖ్యమంత్రి పళని స్వామి త్వరలో వేటు వేయనున్నట్టు సమాచారం. విజయ్‌భాస్కర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో పళనిస్వామి ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్‌భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపైనా వేటు వేసే యోచనలో పళనిస్వామి ఉన్నట్టు సమాచారం. కాగా కొందరు మంత్రులు అన్నా డీఎంకే అమ్మ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ పట్ల అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనపై ఎవరికీ అసంతృప్తి లేదని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని దినకరన్ చెప్పారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ విజయం కోసం మంత్రి విజయభాస్కర్ నాయకత్వంలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఐటీ అధికారుల దాడుల్లో ఆధారాలు లభించాయి. ఈనెల 7వ తేదీన మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసింది. -
అభిమానులకు రజనీకాంత్ విజ్ఞప్తి
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై రాష్ట్రంలో మరోసారి దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తన కార్యచరణ ఏంటన్నది తెలిపేందుకు చెన్నైలో ఈ నెల 12 నుంచి 16 తేదీల మధ్య రాఘవేంద్ర కళ్యాణ మండపంలో సమావేశాలు నిర్వహించాలని భావించారు. అనివార్య కారణాల వల్ల అభిమానులతో సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు సూపర్ స్టార్ రజనీ ప్రకటించారు. తమిళనాడులో జిల్లాల వారీగా విడిగా సమావేశాలు నిర్వహించి అందులో పాల్గొటానని తెలిపారు. ఈ నెల 12-16 తేదీలలో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ సమావేశాల్లో ప్రతి ఒక్క అభిమాని తనను నేరుగా కలిసి ఫొటో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారని ఆయన తెలుసుకున్నారు. ప్రతి ఒక్క అభిమానితో ఫొటో దిగడం సాధ్యం కాదని స్పష్టం చేసిన రజనీకాంత్.. జిల్లాల వారీగా సమావేశాలలో పాల్గొంటానని చెప్పారు. అప్పుడు అందరికీ తనను కలిసే వీలు కుదురుతుందని.. దయచేసి అభిమానలు తన పరిస్థితిని అర్థం చేసుకోగలరని కోరారు. మరోవైపు జయలలిత మృతితో ఖాళీ ఏర్పడ్డ ఆర్కే ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 12న జరగనుంది. అయితే అదేరోజు ప్రారంభం కానున్న సమావేశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. అవి రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో అనివార్య కారణాలతో రజనీ తన సమావేశాలను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ 2న అభిమానులతో తొలిసారి సమావేశం అవ్వాల్సి ఉన్నా రద్దు చేసుకున్నారు. -
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ...?
-
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ...?
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై మళ్లీ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఒత్తుళ్లు వచ్చినా ఇప్పటివరకూ తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తాను రాజకీయాల్లోకి వస్తానని కానీ రానని కాని రజనీకాంత్ ప్రకటించలేదు. అయితే రజనీకాంత్ సతీమణి లత నిన్న చేసిన వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశమైంది. రజనీకాంత్ రాజకీయాల్లో వచ్చే అవకాశాలు లేకపోలేదని, సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని ఆమె అన్నారు. దీంతో మరోసారి రజనీ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వచ్చేనెల 2వ తేదీన అభిమానులతో చెన్నైలో సమావేశం కానున్నారు. అభిమానుల సమావేశంలో రజనీకాంత్... ఓ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా రజనీకాంత్ గతంలో బీజేపీలో చేరుతారంటూ వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అంతకు ముందు ఆయన సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. పలువురు ప్రముఖులు స్వయంగా కలసి, మరికొందరు బహిరంగం ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అయితే వస్తానని కానీ రానని కాని రజనీకాంత్ ప్రకటించలేదు. మరోవైపు జయలలిత మరణం అనంతరం రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై గట్టి చర్చ జరుగుతోంది. దీంతో రజనీకాంత్ అభిమానులతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
విజయ్ రాజకీయ ప్రవేశం ఉంటుందా?
చెన్నై: తమిళ సినీప్రేక్షకుల మధ్య ఇళయ దళపతిగా అభిమానం పొందుతున్న ప్రముఖ నటుడు విజయ్. ఇటీవల కాలంలో చాలా మంది సినిమా తారలు రాజకీయ రంగప్రవేశం చేసి, కరుణాస్ లాంటి వారు శాసన సభ్యులుగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే చాలా కాలం క్రితమే నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి ఆ తరువాత వెనక్కు తగ్గారు. తమిళనాట ప్రస్తుత పరిణాల్లో విజయ్ రాజకీయ తెరంగేట్రం చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ శుక్రవారం కన్యాకుమారిలో బదులిస్తూ నటుడు రాజకీయాల్లోకి రావడం సులభమేనన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారాయని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల క్రితం తాను విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ప్రయత్నించానన్నారు. అయితే ఇప్పటి రాజకీయ వ్యాపారం పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానన్నారు. త్వరలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ చట్ట నిబంధనల ప్రకారం నటుడైనా, నిర్మాత అయినా నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చంద్రశేఖర్ అన్నారు. అయితే తమకున్న విధి విధానాల ప్రకారం ఒక సంఘానికి ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తూ, మరో సంఘంతో అదే స్థాయి పదవీ బాధ్యతల్ని నిర్వహించడం సాధ్యం కాదని పరోక్షంగా నటుడు విశాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో పైరసీని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు పోలీసు అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నాయని, తమిళ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. -
హాలీవుడ్‌కు విజయ్, రాజకీయాల్లోకి అజిత్!
ఇళయదళపతి విజయ్ హాలీవుడ్‌లోకి, అల్టిమేట్ స్టార్ అజిత్ రాజకీయాల్లోకి. ఇది సాధ్యమేనా? అలా సాధ్యం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక ప్రముఖ దర్శకుడు పేర్కొన్నారు. విజయ్, అజిత్ వీరిద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు. వీరికి వృత్తిపరంగా పోటీ ఉంది. ఇద్దరికీ తమిళనాడు దాటి తెలుగు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లోనూ వీరి చిత్రాలు వసూళ్లను సాధిస్తాయి. వీరిలో ఒకరిని రాజకీయాల్లోకి, మరోకరిని హాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి రాజ్ తిరుసెల్వన్ అనే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈయన ప్రవాస భారతీయుడన్నది గమనార్హం. రాజ్ తిరుసెల్వన్ తాజాగా లేక్ ఆష్ ఫైర్ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను రెండు కథలను తయారు చేశానన్నారు. అందులో తమిళనాడు రాజకీయాల గురించి కథ ఒకటన్నారు. తమిళనాడులో రెండు పార్టీలే మార్చి మార్చి అధికారంలోకి వస్తున్నాయని, దీనికి కారణం ఏమిటి? వీటి వెనుక ఎవరున్నారన్న వాస్తవాలను తెలిపే కథలో నటుడు అజిత్ హీరోగా చిత్రం చేయాలనుకుంటున్నానని, అందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా ఒక ప్యూర్ లవ్ స్టోరీని సిద్ధం చేశానన్నారు. ఇందులో నటుడు విజయ్ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఇక్కడ చాలా సాధించారని, హాలీవుడ్లో సాధించేలా ఈ కథను ఆయన కథానాయకుడిగా హాలీవుడ్ చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజ్ తిరుసెల్వన్ తెలిపారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా? తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్, అజిత్ ఆయన చిత్రాల్లో నటించడానికి అంగీకరిస్తారా అన్న అంశాలు ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. -
ఢిల్లీలో పళని వర్సెస్ పన్నీరు
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు (మంగళవారం) ఇరు వర్గాలు ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. అన్నా డీఎంకే ఎంపీల బృందంతో కలసి సీఎం పళనిస్వామి.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. పలువురు కేంద్రమంత్రులను కూడా పళనిస్వామి బృందం కలవనుంది. మాజీ సీఎం పన్నీరు సెల్వం కూడా తన మద్దతుదారులైన ఎంపీలతో కలసి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పన్నీరు సెల్వం వర్గం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. ఈ మేరకు వారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని పన్నీరు సెల్వం వర్గం కోరనుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. స్పీకర్ అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారని, పళనిస్వామి బలపరీక్ష చెల్లదని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, పన్నీరు సెల్వం, ఇతర పార్టీల నాయకులు ఆరోపించారు. స్టాలిన్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌కు ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ సహా ఇతర నేతలను కలిశారు. తాజాగా పన్నీరు సెల్వం వర్గం ఇదే విషయంపై ఫిర్యాదు చేయనుంది. కాగా సీఎం పళనిస్వామి వర్గీయులు తమిళనాడుకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. -
గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
-
గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు. నిన్న బలపరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ
-
స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఉత్కంఠగా మారాయి. రేపు (శనివారం) అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌తో సమావేశమయ్యారు. రహస్య ఓటింగ్ ద్వారా బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పన్నీరు వర్గంలో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, శశికళ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పళనిస్వామి బెంగళూరు పర్యటనను రద్దు చేసుకుని.. ఎమ్మెల్యేలను క్యాంపుగా ఉంచిన గోల్డెన్ బే రిస్టార్కు వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇక ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పార్టీ నేతలతో సమావేశమై రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణం చేయడం, రేపు బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు మళ్లీ దూకుడు పెంచారు. దెబ్బకు దెబ్బ తీస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అన్నా డీఎంకే నుంచి శశికళను, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్‌లను బహిష్కరించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఈ ముగ్గురిపై వేటు వేసినట్టు ప్రకటించారు. అమ్మ వారసత్వం కోసం, పార్టీ కోసం శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, మధుసూదన్‌లను తొలుత శశికళ పార్టీ నుంచి బహిష్కరించగా.. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదని, తమను బహిష్కరించే హక్కు ఆమెకు లేదని మధుసూదన్ చెప్పారు. శశికళతో పాటు దినకరన్, వెంకటేష్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని మధుసూదన్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఆయన వర్గీయులు నేరుగా కలసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఈసీ పరిశీలనలో ఉంది. జయలలిత గతంలో దినకరన్, వెంకటేష్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. జయ మరణం తర్వాత శశికళ మళ్లీ వాళ్లను పార్టీలోకి తీసుకుని దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం
-
రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి?
-
ఎమ్మెల్యేల ఝలక్.. పళనిస్వామికి టెన్షన్!
గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం కల్పించారు.. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేశారు. అంతవరకు బాగానే ఉంది గానీ, అసెంబ్లీలో బలం నిరూపించుకునే విషయం వచ్చేసరికి మాత్రం కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిసార్టులో ఉన్న మొత్తం 124 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా తనకు మద్దతిస్తారన్న నమ్మకం లేకపోవడమే ఈ ఆందోళనకు కారణం. అందుకే ఆయన చిన్నమ్మ శశికళను చూసేందుకు బెంగళూరు జైలుకు వెళ్లాల్సిన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ అయిన నటరాజ్ శుక్రవారం ఉదయమే ముందుగా పళనిస్వామికి ఝలక్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తాను అమ్మ ఫొటో పెట్టుకుని గెలిచానని, అందువల్ల అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన చెప్పారంటున్నారు. కావాలంటే అమ్మ ఫొటోతో మరోసారి ఎన్నికలకు వెళ్తానని కూడా ఆయన తెగేసి చెప్పారని తెలుస్తోంది. ఈ ఊహించని పరిణామం కారణంగానే పళనిస్వామి బెంగళూరు వెళ్లడం మానుకుని నేరుగా రిసార్టుకు వెళ్లి అక్కడున్న ఎమ్మెల్యేలందరినీ బుజ్జగించే ప్రయత్నాల్లో పడ్డారంటున్నారు. సెంగొట్టియాన్ లాంటి వాళ్లకు మంత్రిపదవి ఇవ్వడం కూడా అమ్మ భక్తులైన కొంతమంది ఎమ్మెల్యేలలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇంతకుముందు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్న సెంగొట్టియాన్‌కు, రెండోసారి వరుసగా ఎన్నికైన జయలలిత తన కేబినెట్లో అవకాశం కల్పించలేదు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలే అందుకు కారణం. అలాంటి వ్యక్తికి పళనిస్వామి రెడ్‌కార్పెట్ పరవడం, శశికళ కుటుంబ సభ్యులు కూడా పార్టీ పైన, ప్రభుత్వంలోను పట్టు పెంచుకోవడం లాంటి పరిణామాలను అమ్మ భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల వాళ్లు ఎదురు తిరిగే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఒక్క నటరాజ్ మాత్రమే కాక.. దాదాపు మరో 18 మంది వరకు ఎమ్మెల్యేలు కూడా రిసార్టులో ఎదురు తిరిగినట్లు సమాచారం. ఇదే జరిగితే పళనిస్వామి రేపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అయితే, నిజంగానే ఈ 18 మంది ఎదురు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా లేదా అన్నది మాత్రం బలపరీక్ష తర్వాతే తెలియాల్సి ఉంది. పన్నీర్ క్యాంపులో ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. పళనిస్వామితో కలిపి ఆ వర్గానికి 124 మంది బలం ఉంది. మేజిక్ ఫిగర్ 117. అంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలలో కనీసం 117 మంది అనుకూలంగా ఓటు వేస్తే తప్ప పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండదు. ఉన్న 124 మందిలో ఒక్క ఎనిమిది మంది అటూ ఇటూ అయినా కూడా ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో అవకాశం కూడా ఉండబోదు. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. నిజానికి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయి ఉంటే, ఆ ప్రభుత్వాన్ని పడగొడితే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పాటు పన్నీర్‌కు సానుభూతి కూడా పెరుగుతుంది. అది రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పుడున్నది మాత్రం శశికళ వర్గీయుడైన పళనిస్వామి కాబట్టి.. ప్రజల్లో ఆ వర్గం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాన్ని పడగొట్టినా పెద్ద నష్టం ఉండబోదు. అన్నాడీఎంకే ఎటూ రెండు వర్గాలుగా చీలిపోతోంది కాబట్టి, రాబోయే ఎన్నికల్లో సులభంగా తాము గెలిచి రాజమార్గంలో అధికారం చేపట్టవచ్చన్నది స్టాలిన్ వ్యూహంలా కనిపిస్తోంది. ఎటూ కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకే మిత్రపక్షమే కాబట్టి వాళ్లది కూడా అదే నిర్ణయం కావచ్చు. -
ఈ రోజు చిన్నమ్మను కలవడం లేదు
-
రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగే బలపరీక్షలో తటస్థంగా ఉండాలని ప్రతిపక్ష డీఎంకే యోచిస్తోంది. కాసేపట్లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం కాబోతోంది. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి మెజార్టీ నిరూపించుకుంటారా? మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఎలా వ్యవహరిస్తారన్న విషయాలపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. కాగా అన్నా డీఎంకే రాజకీయాల్లో తలదూర్చరాదని, బలపరీక్షలో తటస్థంగా ఉండాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం స్టాలిన్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశమై చర్చించనున్నారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామి రేపు ప్రత్యేకంగా సమావేశమయ్యే తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
ఈ రోజు చిన్నమ్మను కలవడం లేదు
చెన్నై: బెంగళూరుకు ఈ రోజు (శుక్రవారం) వెళ్లడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు. కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశంకానున్నట్టు తెలిపారు. నిన్న తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన పళనిస్వామి.. రేపు (శనివారం) అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోనున్నారు. ఇందుకోసం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఈ నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్ట్‌లో పళనిస్వామి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కలసి చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రేపు సభలో మెజార్టీ నిరూపించుకునేందుకు దృష్టిసారిస్తున్నారు. గోల్డెన్ బే రిసార్ట్‌లో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తున్నారు. రేపు వీరిని ఇక్కడి నుంచి అసెంబ్లీకి తీసుకు వెళతారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన అన్నా డీఎంకే పార్టీ చీఫ్ శశికళ.. బెంగళూరులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ రోజు పళనిస్వామి బెంగళూరుకు వెళ్లి చిన్నమ్మ ఆశీర్వాదం తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పళనిస్వామి స్పందిస్తూ.. ఇవాళ బెంగళూరు వెళ్లే యోచనలేదని, ఎమ్మెల్యేలను కలుస్తానని చెప్పారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ
-
జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లినా, ముఖ్యమంత్రి పదవి చేజారినా.. అన్నా డీఎంకే చీఫ్ శశికళ తమిళనాడు ప్రభుత్వాన్ని, పార్టీని నియంత్రణలో ఉంచుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకుని, తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడంలో ఆమె విజయం సాధించారు. గురువారం తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చిన్నమ్మ.. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి టీవీలో చూశారు. జైలులో మహిళల బ్యారక్‌లో శశికళ తన వదిన ఇలవరసి, ఇతర ఖైదీలతో కలసి టీవీలో పళనిస్వామి ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని చూసినట్టు అధికారులు చెప్పారు. నిన్న శశికళ జైలులోని లైబ్రరీకి వెళ్లి తమిళ, ఇంగ్లీష్ పత్రికలు చదివారు. తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ గవర్నర్ విద్యాసాగర్ రావు.. పళనిస్వామితో సీఎంగా ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన శశికళ.. బుధవారం బెంగళూరు జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఇలవరసికి కూడా శిక్షపడింది. పళనిస్వామి ఈ రోజు బెంగళూరు జైలులో చిన్నమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకోనున్నారు. శశికళను కలిసేందుకు అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో జైలు వద్ద భద్రతను పెంచారు. అంతేగాక శశికళ జైలుకు వస్తున్నప్పుడు తమిళులు ఆమె కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
తమిళనాడుకు పళని 'స్వామి'
► రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణం ► పళని కేబినెట్లోనూ జయలలిత టీం ► ప్రమాణం అనంతరం జయ సమాధి వద్ద నివాళి ► బెల్లం మండీ నుంచి సీఎంగా ఎదిగిన నేత ► నాడు సెంగోట్టయన్ మద్దతుదారుడు ► నేడు పళనిస్వామి కేబినెట్లో మంత్రిగా సెంగోట్టయన్ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తమిళనాడు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ఎడపాడి కె.పళనిస్వామి ప్రమాణస్వీకారం చేశారు. సేలం జిల్లా ఎడపాడిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పళనిస్వామితో రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో గురువారం సాయంత్రం 4.39 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిం చారు. అనంతరం 30 మందిæ మంత్రులు ఒకేసారి మాతృభాష తమిళంలో ప్రమాణం చేశారు. గవర్నర్ కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమిళంలోనే ప్రమాణం చేయించడం విశేషం. నూతనంగా ప్రమాణం చేసిన మంత్రివర్గంలో సెంగోట్టయన్ మినహా మిగిలిన 29 మంది జయలలిత కేబినెట్లో పనిచేసినవారే. ఇన్నాళ్లూ ఆపద్ధర్మ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన పన్నీర్‌సెల్వం స్థానంలో సెంగోట్టయన్ని కేబినెట్లోకి తీసుకుని విద్యాశాఖ అప్పగించారు. మిగతా 29 మందికి జయ కేబినెట్లో ఏయే శాఖలు అప్పగించారో.. వాటినే కొనసాగించారు. ప్రమాణ స్వీకారోత్సవానంతరం జయలలిత, చిన్నమ్మకు మద్దతుగా అన్నాడీఏంకే నేతలు నినాదాలు చేశారు. ‘అమ్మ అమర్ రహే.. చిన్నమ్మకు జై’అంటూ నినదించారు. కొద్దిరోజులుగా గోల్డెన్‌బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి, 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ నుంచి నేరుగా మెరీనా బీచ్ వద్ద ఉన్న జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ జయ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అదే విధంగా ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి నినాదాలు చేశారు. బలపరీక్షలో నెగ్గి అమ్మ పాలన సాగిస్తామని శపథం చేశారు. బెల్లం మండీ నుంచి సీఎంగా.. సాక్షి, చెన్నై: బెల్లం మండీతో నాడు బతుకు జీవన పయనంలో అడుగుపెట్టిన ఓ రైతు, నేడు ఓ రాష్ట్రానికి సీఎంగా అవతరించారు. ఆయనే తమిళనాడుకు 13వ సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎడపాడి కే పళనిస్వామి. ఒకప్పుడు అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా చక్రం తిప్పిన సెంగోట్టయన్‌కు మద్దతుదారుడిగా రాజకీయల్లోకి అడుగు పెట్టిన పళనిస్వామి, ప్రస్తుతం ఆయన్నే మించిపోయారు. నేడు పళనిస్వామి కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా సెంగోట్టయన్ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఎడపాడి నియోజకవర్గం నుంచి గెలుస్తూ రావడంతో కే పళనిస్వామి కాస్తా ఎడపాడి కే పళనిస్వామి అయ్యారు. సేలం జిల్లా ఎడపాడి నెడుంకుళం గ్రామం శిలువం పాళయంకు చెందిన కరుప్ప గౌండర్, తవ సాయమ్మాల్ దంపతుల చిన్న కుమారుడు పళని స్వామి(63). ఈరోడ్‌లోని శ్రీ వాసవీ కళాశాలలో బీఎస్సీ(పూర్తి కాలేదు) చేశారు. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి తండ్రి అడుగు జాడల్లో వ్యవసాయంతో పాటు బెల్లం మండీతో జీవన పయనాన్ని సాగించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. భార్య రాధ, కుమారుడు మిథున్‌లతో కలిసి ఓ వైపు బెల్లం మండీని నడుపుతూ, మరో వైపు నాగలి పట్టి పొలం పనులు చేసుకుంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి మంత్రి ఈరోడ్ ముత్తుస్వామి భూములు తన భూముల పక్కనే ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. అన్నాడీఎంకేలో చేరగానే, శిలువం పాళయం గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెడుంకుప్పం పంచాయతీ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవి చూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మరణంతో ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు పళనిస్వామికి రాజకీయంగా బలాన్ని పెంచాయి. ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాల్లో అన్నాడీఎంకేకు కీలకనేతగా ఉన్న సెంగోట్టయన్ మద్దతుదారుడిగా జయలలిత శిబిరంలో చేరారు. సెంగోట్టయన్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఆయన మద్దతుతో పళనిస్వామి సేలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే, అమ్మ సెంగోట్టయన్‌ను దూరం పెట్టడంతో ఆ స్థానం పళనిస్వామికి దక్కింది. అప్పటినుంచి చిన్నమ్మకు విధేయుడిగా ఉంటూ వచ్చిన పళనిస్వామిని ప్రస్తుతం సీఎం పదవి వరించడం విశేషం. అప్పట్లో పళనిస్వామి రాజకీయంగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన సెంగోట్టయన్ ప్రస్తుతం ఆయన కేబినెట్లో విద్యాశాఖ మంత్రి అయ్యారు. పార్టీ పరంగా ప్రస్తుతం సెంగోట్టయన్ ప్రిసీడియం చైర్మన్‌గా ఉన్నా, ప్రభుత్వ వ్యవహారాల్లో మంత్రుల వరసలో కూర్చోవాల్సిందే. ఇదే కేబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న తంగమణి, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న కరుప్పనన్ సీఎంకు దగ్గరి బంధువులు. పళని స్వామి ఆస్తి రూ. 9.69 కోట్లు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కే పళనిస్వామి ఆస్తి రూ. 9.69 కోట్లు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఈ మేరకు తన ఆస్తిని ప్రకటించారు. ఎలాంటి అప్పులు లేవని, తన కుటుంబీకులు ఎవరి పేరిట ఎలాంటి వాహనం కూడా లేదని అందులో పేర్కొని ఉండడం గమనార్హం. రాజకీయ పయనం... ► 1989 కోడిపుంజు చిహ్నంతో ఎడపాడి నుంచి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ► 1991 అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో అదే నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపు. ► 1992–1996 వరకు ఆవిన్ సంస్థ అధ్యక్షుడు ► 1996 ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ► 1998 లోక్‌సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నుంచి తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నిక ► 1999 లోక్‌సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నియోజకవర్గం నుంచి ఓటమి ► 1999–2004 వరకు తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ► 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ► 2011 అసెంబ్లీ ఎడపాడి నుంచి గెలుపు. తొలిసారిగా రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి పదవి. ► 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు. ప్రజా పనులు, రహదారులు, చిన్న హార్బర్ల శాఖ కేటాయింపు ► 2017 ఫిబ్రవరి 14 అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక ► 2017 ఫిబ్రవరి 16 తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం -
తమిళనాట కొత్త ఏలిక
పదిరోజులుగా తమిళనాడులో ఎడతెగకుండా కొనసాగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు కాస్తంత విరామం చిక్కింది. వీకే శశికళ స్థానంలో అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం ద్వారా గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ఆలస్యంగానైనా సరైన నిర్ణయం తీసుకున్నారు. బలనిరూపణ కోసం గవర్నర్ పక్షం రోజుల వ్యవధినిచ్చినా ఈ శనివారమే పళనిస్వామి అందుకు సిద్ధపడుతున్నారు. బహుశా సాధ్యమైనంత త్వరలో ఈ సంక్షోభాన్ని అధిగమించాలని పళనిస్వామి అను కుంటున్నారేమో. అయితే అదంత సులభమేమీ కాదు. ఒకవేళ ఈ గండం గట్టెక్కినా ఆయన పదవి పదిలం అనుకోవడానికి లేదు. సంక్షోభం సమసిపోతుంద నుకోవడానికి లేదు. నిజానికి ఈ క్షణం నుంచి అది మరింత తీవ్రమవుతుంది. స్వీయ పదవీ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన ఇక నిరంతరం నిమగ్నం కావాల్సివస్తుంది. ఎందుకంటే పట్టుమని 15మంది ఎమ్మెల్యేలు ప్రధాన విపక్షమైన డీఎంకేకు లేదా పన్నీర్‌సెల్వం పక్షానికి ఫిరాయిస్తే ప్రభుత్వం పేకమేడలా కూలి పోతుంది. ఈ గొడవలో ఆయన పాలనపై దృష్టి కేంద్రీకరించగలరా అన్నది అనుమానమే. ఫిర్యాదులొచ్చినప్పుడు పార్టీలోని వైరి పక్షాలను పిలిచి నయానో, భయానో రాజీ కుదర్చడం... అందరూ సమైక్యంగా పనిచేసేలా చూడటం నాయ కత్వ స్థానంలో ఉన్నవారు చేసే పని. అధికారంలో ఉన్నారా, విపక్షంలో ఉన్నారా అన్న అంశంతో సంబంధం లేకుండా సమర్థులైన నేతలకు అది సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి సారథ్యం వహించడం పళనిస్వామికి కొత్త. అటు శశికళకు పార్టీ నాయకత్వం మాత్రమే కాదు... పార్టీలో క్రియాశీలంగా పనిచేయడమే కొత్త. ఈలోగా ఆమెకు జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ఆమె నియమించి వెళ్లిన నాయకత్వం సత్తా చాటగలదా? పార్టీలో అసంతృప్తులను బుజ్జగించగలదా? శశికళ కర్ణాటక జైలు నుంచి రిమోట్ కంట్రోల్‌తో పార్టీని నియంత్రించగలరా? తాను నియ మించిన నాయకులకు అండగా నిలబడగలరా? పార్టీని ఏకతాటిపై నడపగల బలమైన నాయకత్వం ఇప్పుడు అన్నా డీఎంకేకు లేదు. ఆ పార్టీ నాయకత్వ సంక్షోభంలో చిక్కుకుంది. పార్టీని తన కనుసైగలతో శాసించిన జయలలిత కనీసం కొందరినైనా విశ్వాసంలోకి తీసుకుని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని రూపొందించి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదు. అభద్రతాభావమో, తన తదనంతరం పార్టీ ఏమైతే తనకేమిటన్న నిర్లిప్తతో... ఆమె అలాంటి ప్రయ త్నానికి పూనుకోలేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ మొగ్గు మొదటినుంచీ పన్నీర్ సెల్వంవైపే ఉందని స్పష్టంగా కనబడుతూనే ఉంది. అలాంటి మొగ్గు లేకపోయి ఉంటే, తన పాత్ర తటస్థమైనదేనని బీజేపీ చెబుతున్న మాట నిజమైతే పన్నీర్ స్థానంలో లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన శశికళకు వెనువెంటనే ముఖ్యమంత్రి పీఠం దక్కేది. రెండురోజులైన తర్వాతే పన్నీర్ తిరగబడ్డారని, తనను బెదిరించి రాజీనామా లేఖ తీసుకున్నారన్న ఆరోపణ చేశారని గుర్తుంచుకోవాలి. ఆ రెండు రోజులూ ఎందుకు వేచిచూడాల్సి వచ్చిందన్న అంశంలో గవర్నర్‌నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది గనుకే ఆయన ఆ వ్యవధి తీసుకున్నారన్న వాదనలో పసలేదు. వివిధ కేసుల్లో విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్న సీఎంలు, విచారణ సాగుతున్నా ఆ పదవిని వదలని సీఎంలు దేశంలో చాలామందే ఉన్నారు. తమిళనాడుకే ఎందుకీ మినహాయింపు? ఈ సంక్షోభం నుంచి లబ్ధిపొందాలన్న ప్రయత్నం వల్లనే ఇదంతా జరిగిందన్న కథనాలకు బీజేపీ నుంచి సంతృప్తికరమైన సంజాయిషీ లేదు. పన్నీర్‌సెల్వం పార్టీలో అందరి విశ్వాసాన్ని చూరగొని ఉంటే జయలలిత సమాధి వద్ద ధ్యానంలో నిమగ్నమైన క్షణంలోనే ఎమ్మెల్యేలంతా ఆయనవైపు క్యూ కట్టేవారు. కేంద్రంనుంచి అండదండలున్నా, తానే జయ అసలు సిసలు వార సుడినని ఎంతగా చెప్పుకున్నా శశికళ శిబిరం నుంచి నలుగురైదుగురు మాత్రమే పన్నీర్ శిబిరానికి ఫిరాయించారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు, శశికళ స్థానంలో పళనిస్వామి ఎన్నిక తర్వాత దీన్నుంచి మర్యాదగా బయటపడటానికి ఇదే అదునని కేంద్రం భావించింది. పన్నీర్‌ను పట్టుకోవడంవల్ల ఒరిగేదేమీ ఉండదని నిర్ణయించుకుంది. అందుకే తాజా పరిణామం సాధ్యపడిందన్నది వాస్తవం. పన్నీర్‌కు మెతక మనిషిగా, బోళా శంకరుడిగా పేరుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం వంటివి ఆయనకు తెలియని విద్యలు. ఎవరో చెప్పడంవల్లనో లేదా తాను అంటున్నట్టు జయ ఆత్మ ఆదేశించడంవల్లనో తిరు గుబాటు చేసినంత మాత్రాన ఆ లక్షణాలు ఇప్పటికిప్పుడు పరుగెత్తుకు రావడం కల్ల. అందుకే చేతిలో అధికార దండం ఉన్నా... నిత్యం అమ్మ నామమే జపిస్తున్నా శశికళ శిబిరంనుంచి ఎవరినీ రప్పించలేక ఆయన నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇటు కొత్త సీఎం పళనిస్వామి కూడా ఆయనకు డిటో. తన ఆప్తులుగా జయలలిత భావించిన అయిదుగురిలో పన్నీర్ తర్వాత స్థానం పళనిదే. ఇద్దరు మెతక మనుషులు వైరి పక్షాల నేతలుగా మోహరించి ఉంటే సమరం ఎలా సాగుతుందో... జయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే. పళనిస్వామి తన మెతకదనం తగ్గించుకుని శశికళ ఆదేశాల మేరకు కేంద్రంతో ఘర్షణ వైఖరికి దిగాలని నిర్ణయించుకుంటే సహజంగానే పన్నీర్ సెల్వంకు అటువైపునుంచి అందుతున్న సహకారం మరింత పెరుగుతుంది. చివరికది రాష్ట్రపతి పాలనవైపు దారితీసినా ఆశ్చర్యం లేదు. ఎలా చూసినా అన్నా డీఎంకే స్థితి ఇప్పుడు గాల్లో దీపం వంటిది. సాధారణ ప్రజలంతా పన్నీర్ వైపే ఉన్నారంటున్నా... ప్రముఖ సినీ నటులు సైతం ఆయనకే మద్దతిస్తున్నా శశికళ శిబిరం ఎమ్మెల్యేల్లో కదలిక లేదు. ఉప ఎన్నికలొచ్చి ఎవరి బలమెంతో నిర్ధారణయ్యేవరకూ వారిలో చాలామంది ఉన్నచోటే ఉంటారు. పదవుల కోసం పోటీ ముదిరితే అంతకుముందే ఏమైనా జరగొచ్చు. ఏదేమైనా ప్రజలకు మెరుగైన పాలన అందాలని, రాష్ట్రంలో సుస్థిరత ఏర్పడాలని ఆశిద్దాం. -
శశికళ ఎన్నికపై ఈసీకి ఫిర్యాదు
-
కాసేపట్లో ఈసీని కలవనున్న సెల్వం వర్గం
న్యూఢిల్లీ: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఈసీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. పార్టీ నియమావళి ప్రకారం శశికళ ఎన్నికపై అభ్యంతరాలున్నాయని సెల్వం వర్గీయులు వివరించనున్నారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావాలంటే ఐదేళ్లు పార్టీ సభ్యత్వం ఉండాలని, ఈ పదవికి శశికళ అనర్హురాలంటూ పన్నీరు సెల్వం వర్గీయులు ఇటీవల ఈసీకి లేఖ రాశారు. ఈసీ దీనిపై అన్నా డీఎంకేను వివరణ కోరింది. ఈ నేపథ్యంలో సెల్వం వర్గీయులు ఈసీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. జయలలిత మరణించాక ఆమె స్థానంలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఆ తర్వాత పన్నీరు సెల్వం స్థానంలో సీఎం కావాలని శశికళ ప్రయత్నించడంతో తమిళనాట ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
పన్నీరు తప్ప ఎమ్మెల్యేలందరూ మావైపే
-
పన్నీరు తప్ప ఎమ్మెల్యేలందరూ మావైపే
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నా డీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. పన్నీరు సెల్వం తప్ప పార్టీకి చెందిన మిగతా 134 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని చెప్పారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించడంపై తంబిదురై స్పందిస్తూ.. చివరకు ధర్మమే గెలిచిందని అన్నారు. పన్నీరు సెల్వానికి ఇక పార్టీతో సంబంధం లేదని చెప్పారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి గవర్నర్‌కు అందజేయగా, తనకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని పన్నీరు సెల్వం గవర్నర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
రిసార్ట్‌లో శశకళ వర్గీయుల సంబరాలు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో శశికళ శిబిరం కళకళలాడుతోంది. గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నా డీఎంకే చీఫ్ శశికళకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరినా గవర్నర్ వేచిచూడటం, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీరు సెల్వం వర్గంలోకి చేరుతుండటం, ఇంతలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడటం, బెంగళూరు పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లడంతో ఆమె వర్గీయులు ఢీలాపడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ గవర్నర్.. పళనిస్వామిని ఆహ్వానించడంతో శశికళ వర్గీయులకు కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది. కాగా పళనిస్వామి అప్పుడే సీఎం అయినట్టు కాదని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు లేదని పన్నీరు సెల్వం వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికి ఎవరిబలమెంత అన్నది అసెంబ్లీలో బలపరీక్షలో తేలనుంది. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి.. పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! ఎవరీ పళనిస్వామి..? ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ పళనిస్వామికే మెజార్టీ ఉంది... పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం
-
నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం
బెంగళూరు: జయలలిత నెచ్చెలిగా శశికళ.. చెన్నైలోని పోయెస్ గార్డెన్లో విలాసవంతమైన జీవితం అనుభవించారు. అమ్మతో సమానంగా చిన్నమ్మ రాజమర్యాదలు అందుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు వంగివంగి దండాలు పెట్టారు. ఇదంతా గతం. ప్రస్తుతం చిన్నమ్మ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి కావాల్సిన 61 ఏళ్ల చిన్నమ్మ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అవమానాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొని బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయారు. ఆమెకు ఖైదీ నెంబర్ 9234 కేటాయించారు. మూడున్నరేళ్లు జైలులో చిన్నమ్మ శిక్ష అనుభవించాలి. ఈ శిక్షా కాలంలో ఓ రోజు భారంగా గడిచింది. బుధవారం జైలుకు వెళ్లిన శశికళ.. తొలిరోజు రాత్రి నేలపైనే పడుకున్నారు. జైలు సిబ్బంది ఆమెకు ఓ దుప్పటి, దిండు, ఫ్యాన్, బెడ్ షీట్ ఇచ్చారు. తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని శశికళ చేసిన విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఏసీ, టీవీ, ఇంటి భోజనం, మినరల్ వాటర్, వారానికోసారి నాన్ వెజ్ కావాలన్న కోరికను మన్నించలేదు. దీంతో జైలు సిబ్బంది ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారు. ఆమెకు ఓ గది కేటాయించారు. ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ వదిన ఇలవరసిని కూడా ఇదే గదిలో ఉంచారా లేదా అన్న విషయం తెలియరాలేదు. ఇదిలావుండగా జైలు శిక్ష అనుభవించే కాలంలో శశికళ కొవ్వొత్తులు తయారు చేసే పనిని ఎంచుకున్నారు. క్యాండిల్స్ తయారు చేసినందుకు ఆమెకు రోజుకు 50 రూపాయలు వేతనం ఇవ్వనున్నారు. వచ్చే ఆదివారం నుంచి ఆమెకు జైలు అధికారులు పనిని అప్పగించనున్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
ఈ రోజే గవర్నర్ నిర్ణయం తమిళనాట ఉత్కంఠ
-
ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ
చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు (గురువారం) ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన శశికళ విధేయుడు పళనిస్వామిని ఆహ్వానిస్తారని భావిస్తున్నారు. గవర్నర్ నిర్ణయం కోసం తమిళనాట సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిన్న (బుధవారం) తొలుత పళనిస్వామి, ఆ తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇద్దరూ గవర్నర్‌తో సమావేశమయ్యారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి గవర్నర్‌కు అందజేయగా, తనకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని పన్నీరు సెల్వం గవర్నర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా అవకాశం ఇవ్వాలని ఇద్దరూ గవర్నర్‌ను కోరారు. దీంతో సంఖ్యారీత్యా పళనిస్వామికి ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున గవర్నర్ ఆయన్నే ఆహ్వానిస్తారని విశ్వసనీయ సమాచారం. శశికళ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినందువల్ల గవర్నర్ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలని రాజకీయనాయకులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఊహించని, అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళ స్థానంలో ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. మరోవైపు శశికళపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఎంపీలు, ప్రజల మద్దతు లభిస్తున్నా.. ఆయన ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రావడం లేదు. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
గవర్నర్ కీలక నిర్ణయం!
-
తమిళనాడులో త్వరలో ఎన్నికలు : స్టాలిన్
చెన్నై : తమిళనాడు రాజ్‌భవన్ వేదికగా కీలక భేటీలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం స్థిరంగా ఉండదన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతిస్తామని డీఎంకే నేతలు మొదట్లో ప్రకటించారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో డీఎంకే వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లడం, ఆ పార్టీలో నేతల వివాదాలను డీఎంకే క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో అస్థిరత్వం నెలకొనడంతో త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశముందని భావిస్తోంది. మరో వైపు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సభలో కాంపొజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే గత కొంతకాలంగా జరుగుతున్న తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడుతుంది. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. గవర్నర్ కీలక నిర్ణయం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
గవర్నర్ కీలక నిర్ణయం!
చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు సభలో కాంపొజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహించనున్నారు. అసెంబ్లీలోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఏఐఏడీఎంకే శాసనసభ పక్షనేత పళని స్వామి బల నిరూపణకు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది. పళనిస్వామి తన వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో బుధవారం రాత్రి గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీయ్యారు. సమావేశమనంతరం అన్నాడీఎంకే నేత జయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారు. 124 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినట్లు చెప్పారు. పన్నీర్ వెంట ఎమ్మెల్యేలు లేరని..అలాంటప్పుడు బలపరీక్ష ఎందుకని జయ్‌కుమార్ ప్రశ్నించారు. పన్నీర్ వర్గం కూడా ఎమ్మెల్యేల సంతకాల లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో పన్నీర్ సెల్వం వర్గం భేటీయ్యారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. గవర్నర్‌తో పళనిస్వామి భేటీ చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
గవర్నర్‌తో పళనిస్వామి భేటీ
చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి మరోసారి కలిశారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని పళనిస్వామి కోరారు. ఆయన వెంట 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా ఆయన గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి కోరారు. కాగా మరికాసేపట్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కూడా గవర్నర్‌ను కలవనున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు సెల్వంకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. శశికళ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ ఇక ఆలస్యం చేయడం తగదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం!
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన మంత్రి పళనిస్వామికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని సమాచారం. గవర్నర్ ఈ రోజే ఈ విషయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. నిన్న (మంగళవారం) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శశికళను దోషిగా ప్రకటించాక.. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా అసెంబ్లీలో బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా గవర్నర్‌ను కోరినా ఆయనకు తగినంత ఎమ్మెల్యేల బలం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్.. పళనిస్వామికి అవకాశం ఇస్తారని సమాచారం. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ ఇక ఆలస్యం చేయడం తగదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
కోర్టులో లొంగిపోయిన శశికళ
-
నన్ను ప్రత్యేక ఖైదీగా గుర్తించండి: శశికళ
-
కోర్టులో లొంగిపోయిన శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించిన అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన కోర్టు హాల్లో ఆమె న్యాయమూర్తి అశ్వర్థనారాయణ ఎదుట హాజరయ్యారు. శశికళతో పాటు ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా కోర్టులో లొంగిపోయారు. కోర్టులో వీరి వాంగ్మూలాలను నమోదు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు వారికి వైద్య పరీక్షలు చేయించి పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. తనను ప్రత్యేక ఖైదీగా పరగిణించాలన్న శశికళ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. శశికళ రాక ముందే ఆమె భర్త నటరాజన్, లోక్‌సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. అన్నా డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులతో అన్నా డీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన శశికళ నేరుగా బెంగళూరు పరప్పణ కోర్టుకు చేరుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ముగ్గురిని దోషులుగా సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో శశికళ గతంలో అనుభవించిన ఆరు నెలల శిక్షాకాలాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవించాలి. ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా ఇదే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
నన్ను ప్రత్యేక ఖైదీగా గుర్తించండి: శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష పడ్డ అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయిన నేపథ్యంలో పరప్పణ అగ్రహార జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆమె బెంగళూరు చేరుకున్నారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని శశికళ న్యాయస్థానాన్ని కోరారు. ఇంటి భోజనం, మినరల్ వాటర్, ఏసీ, టీవీ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని దోషులుగా సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. వెంటనే లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శశికళ బెంగళూరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో జయలలితతో కలసి శశికళ గతంలో ఆర్నెళ్లు పరప్పణ అగ్రహార జైలులో ఉన్నారు. ఈ ఆరు నెలల శిక్షకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు శశికళ మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవించాలి. ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా ఇదే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ కేసులో దిగువ కోర్టులో దోషిగా తేలిన జయలలిత మరణించిన నేపథ్యంలో ఆమెపై దాఖలైన అప్పీళ్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. -
ఎమ్మెల్యేలూ.. వెంటనే రిసార్ట్ ఖాళీ చేయండి