తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై మళ్లీ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఒత్తుళ్లు వచ్చినా ఇప్పటివరకూ తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తాను రాజకీయాల్లోకి వస్తానని కానీ రానని కాని రజనీకాంత్ ప్రకటించలేదు. అయితే రజనీకాంత్ సతీమణి లత నిన్న చేసిన వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశమైంది.