
తమిళనాడులో త్వరలో ఎన్నికలు : స్టాలిన్
చెన్నై : తమిళనాడు రాజ్‌భవన్ వేదికగా కీలక భేటీలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం స్థిరంగా ఉండదన్నారు.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతిస్తామని డీఎంకే నేతలు మొదట్లో ప్రకటించారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో డీఎంకే వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లడం, ఆ పార్టీలో నేతల వివాదాలను డీఎంకే క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో అస్థిరత్వం నెలకొనడంతో త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశముందని భావిస్తోంది.
మరో వైపు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సభలో కాంపొజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే గత కొంతకాలంగా జరుగుతున్న తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడుతుంది.
తమిళనాడు మరిన్ని అప్‌డేట్స్ చూడండి..
గవర్నర్ కీలక నిర్ణయం!