DMK Leader stalin
-
‘ఆయన ఉన్నంత వరకు ఆ పార్టీ గెలవదు’
సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో తమిళనాట రాజకీయాలు రోజుకో మలువు తిరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి డీఎంకే నేత స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలో స్టాలిన్ ఉన్నంత వరకు డీఎంకే గెలవదని జోస్యం చెప్పారు. ఆర్కే నగర్ ఓటమిపై వెంటనే సమీక్ష జరపాలని అళగిరి డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో డీఎంకే విఫలమవుతోందని ఆయన విమర్శించారు. అంతేకాక క్షేత్రస్థాయిలో పార్టీ ప్రక్షాళన జరగాలని అళగిరి అభిప్రాయపడ్డారు. ఆర్కే నగర్లో టీటీవీ దినకరన్ విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వేడెక్కిన తమిళనాడు.. దీక్షలకు స్టాలిన్ సై
చెన్నై: తమిళనాడులో మరోసారి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ డీఎంకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసన తర్వాత ఈ నెల 22 నుంచి నిరసన కార్యక్రమాలకు డీఎంకే పిలుపునిచ్చింది. తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించింది. ఆ రోజు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని డీఎంకే పిలుపునిచ్చింది. తమిళనాడు పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలతో కలిసి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం ముందు పోలీసుల అనుమతి లేకుండానే ఆందోళన నిర్వహించి నానా రచ్చచేశారని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దిగారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పార్టీ కార్యాలయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులతో స్టాలిన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాలు వెలువరించారు. శాంతియుతంగా ఆవేదనను, నిరసనను తెలియజేసిన తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 22న నిరహార దీక్షలకు పిలుపునిచ్చారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి స్టాలిన్‌పై కేసు నమోదు స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ -
స్టాలిన్‌పై కేసు నమోదు
-
స్టాలిన్‌పై కేసు నమోదు
చెన్నై: తమిళనాడు పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌పై కేసు నమోదు చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించి నానా రచ్చచేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం శనివారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు మిన్నంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. మరోపక్క, అసెంబ్లీ నుంచి నేరుగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన స్టాలిన్ అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్ దురుసుతనం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసి మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్ నిరసన చేపట్టారు. దీనికి మద్దతుగా జల్లికట్టు తరహాలో జనాలు రావడంతో బుజ్జగించిన పోలీసులు ఆయనను అరెస్టు చేయకుండా పంపించేశారు. అనూహ్య గందరగోళానికి తెరతీసిన స్టాలిన్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధిత వార్తలకై చదవండి స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
తమిళనాడులో త్వరలో ఎన్నికలు : స్టాలిన్
చెన్నై : తమిళనాడు రాజ్‌భవన్ వేదికగా కీలక భేటీలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం స్థిరంగా ఉండదన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతిస్తామని డీఎంకే నేతలు మొదట్లో ప్రకటించారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో డీఎంకే వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లడం, ఆ పార్టీలో నేతల వివాదాలను డీఎంకే క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో అస్థిరత్వం నెలకొనడంతో త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశముందని భావిస్తోంది. మరో వైపు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సభలో కాంపొజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే గత కొంతకాలంగా జరుగుతున్న తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడుతుంది. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. గవర్నర్ కీలక నిర్ణయం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
కావేఢీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అఖిలపక్ష ఆందోళనతో తమిళనాడు దద్దరిల్లింది. కావేరీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అనేక పార్టీల నేతలు కదం తొక్కారు. రైల్‌రోకోలు నిర్వహిం చడం ద్వారా కేంద్రానికి తమ నిరసన గళం వినిపించా రు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్, వైగో సహా సుమారు వేలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాల తరబడి కావేరీ జలాల సమస్య నెలకొని ఉంది. సుప్రీంకోర్టులో జరిపిన న్యాయపరమైన పోరాటం ద్వారా కావేరీ జలాల వాటాను తమిళనాడు సాధించుకుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కావేరీ పర్యవేక్షణ కమిటీ, కావేరీ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంభన నెలకొంది. కమిటీ, బోర్డు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు తన తీర్పుతో స్పష్టం చేసినా కేంద్రం అడ్డుకుందని అని ఆరోపిస్తూ ఇటీవల అఖిలపక్షం సమావేశమైంది. కావేరీ సమస్యల సాధనకు రైతు సంఘాలతో కలిసి ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. ఉత్తరాది నుంచి తమిళనాడుకు చేరుకునే రైళ్లు 48 గంటల పాటూ పట్టాలపైనే ఉండిపోయేలా రైల్‌రోకోలు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కావేరీ సమస్యపై కేంద్రంపై వత్తిడి తెచ్చేలా భారీఎత్తున ఆందోళనకు అందరూ సన్నద్ధం కావాలని ఆందోళనకు నాయకత్వం వహించిన డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్ పిలుపునిచ్చారు.ఈ పిలుపు మేరకు అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ మినహా దాదాపుగా అన్ని పార్టీల నేతలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకోకు దిగారు. చెన్నై పెరంబూరు రైల్వేస్టేషన్లో స్టాలిన్ నేతృత్వంలో రైల్‌రోకో పోరాటం సాగింది. పెరంబూరు తిరువళ్లూరు రోడ్డులోని రైల్వే క్రీడా మైదానం నుంచి 1500 మందితో కిలోమీటరు దూరంలోని రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కావేరీ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగి పెరంబూరు రైల్వేస్టేషన్‌ను ముట్టడించే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. స్టాలిన్ సహా పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు వేలాది మంది కార్యకర్తలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని రైల్వేస్టేషన్‌లోకి చొరపడ్డారు. చెన్నైబీచ్-ఆవడి లోకల్రైలును కదలనీయకుండా పట్టాలపై కూర్చుండిపోయారు. దీంతో స్టాలిన్ సహా వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. చెన్నై తూర్పు జిల్లా డీఎంకే తరఫున టీ నగర్ బస్‌స్టేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి మాంబళం రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు వెళుతుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సైదాపేట రైల్వేస్టేషన్ వద్ద సైతం డీఎంకే కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా, తమిళ మానిల కాంగ్రెస్ తరపున చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్ వద్ద, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, వామపక్ష పార్టీల నేతలు జీ రామకృష్ణన్, త పాండియన్, ముత్తరసన్ సెంట్రల్ రైల్వేస్టేషన్ వద్ద, విరుదునగర్‌లో ఆర్ నల్లకన్ను, బేసిన్ బ్రిడ్జి వద్ద వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ తదితరులు రైల్‌రోకో నిర్వహించారు. తిరుచ్చిరాపల్లి కుడమురుట్టి వంతెనపై కొందరు ఆందోళనకారులు పశువులను అడ్డంగా నిలబట్టి, అలాగే రైలుపట్టాలపై పడుకుని నిరసన తెలిపారు. అలాగే తంజావూరులో రైలు పట్టాలపై వంటావార్పు, వేలూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి, తంజావూరు, కుంభకోణం, నాగపట్టినం, తిరువారూరు, మధురై, కడలూరు, కోయంబత్తూరు, సేలం, కృష్ణగిరి, తిరునెల్వేలి, విళుపురం జిల్లాల్లో రైల్‌రోకో ఆందోళన భారీ ఎత్తున సాగింది. ఆయా జిల్లాల్లో ఆందోళనలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఇవే డిమాండ్లపై పుదుచ్చేరీలో సైతం రైల్‌రోకోలు నిర్వహించారు. రైల్‌రోకోలు పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలు, రైతులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. రైల్‌రోకో పిలుపును అందుకున్న లక్షలాది మంది కార్యకర్తలు సోమవారం ఉదయం నుంచే రైల్వేస్టేషన్ల్కు రావడం ప్రారంభించగా భారీ సంఖ్యలో పోలీసులు బారికేడ్లను సిద్ధం చేసుకుని అడ్డుకున్నారు. రైల్‌రోకో కారణంగా అనేక చోట్ల రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
జయలలితకు స్టాలిన్ పరామర్శ
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు రాజకీయ పార్టీ నేతల పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శనివారం సాయంత్రం చెన్నై అపోలో ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆయన పరామర్శించారు. జయ ఆరోగ్యంపై స్టాలిన్ ఆరా తీశారు. ఆమెకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎండీఎంకే నేత వైకో కూడా శనివారమే జయలలితను పరామర్శించారు. త్వరలోనే మంచి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని వైకో ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
నిలకడగా బాలచందర్ ఆరోగ్యం
ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటన్లో వెల్లడించారు. కిడ్నీలకు డయాలసిస్ చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు. పలువురు సినీ ప్రముఖులు బాలచందర్‌ను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. డీఎంకే నేత స్టాలిన్, విజయకుమార్, నటి కె ఆర్ విజ య, రాజేష్, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ మొదలగు పలువురు కె.బాలచందర్‌ను పరామర్శించారు. కె ఆర్ విజయ బాలచందర్‌ను చూసి బోరున విలపించారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆమె ఆకాంక్షించారు.