
వేడెక్కిన తమిళనాడు.. దీక్షలకు స్టాలిన్ సై
చెన్నై: తమిళనాడులో మరోసారి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ డీఎంకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసన తర్వాత ఈ నెల 22 నుంచి నిరసన కార్యక్రమాలకు డీఎంకే పిలుపునిచ్చింది.
తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించింది. ఆ రోజు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని డీఎంకే పిలుపునిచ్చింది. తమిళనాడు పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ కార్యకర్తలతో కలిసి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం ముందు పోలీసుల అనుమతి లేకుండానే ఆందోళన నిర్వహించి నానా రచ్చచేశారని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దిగారంటూ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పార్టీ కార్యాలయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులతో స్టాలిన్ భేటీ అయ్యారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాలు వెలువరించారు. శాంతియుతంగా ఆవేదనను, నిరసనను తెలియజేసిన తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 22న నిరహార దీక్షలకు పిలుపునిచ్చారు.
మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి
స్టాలిన్‌పై కేసు నమోదు
స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు
జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి
చెన్నైకు చిన్నమ్మ?
విజేత పళని
అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్