marina beach protest
-
వేడెక్కిన తమిళనాడు.. దీక్షలకు స్టాలిన్ సై
చెన్నై: తమిళనాడులో మరోసారి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ డీఎంకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసన తర్వాత ఈ నెల 22 నుంచి నిరసన కార్యక్రమాలకు డీఎంకే పిలుపునిచ్చింది. తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించింది. ఆ రోజు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని డీఎంకే పిలుపునిచ్చింది. తమిళనాడు పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలతో కలిసి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం ముందు పోలీసుల అనుమతి లేకుండానే ఆందోళన నిర్వహించి నానా రచ్చచేశారని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దిగారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పార్టీ కార్యాలయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులతో స్టాలిన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాలు వెలువరించారు. శాంతియుతంగా ఆవేదనను, నిరసనను తెలియజేసిన తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 22న నిరహార దీక్షలకు పిలుపునిచ్చారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి స్టాలిన్‌పై కేసు నమోదు స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ -
స్టాలిన్‌పై కేసు నమోదు
-
స్టాలిన్‌పై కేసు నమోదు
చెన్నై: తమిళనాడు పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌పై కేసు నమోదు చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించి నానా రచ్చచేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం శనివారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు మిన్నంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. మరోపక్క, అసెంబ్లీ నుంచి నేరుగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన స్టాలిన్ అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్ దురుసుతనం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసి మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్ నిరసన చేపట్టారు. దీనికి మద్దతుగా జల్లికట్టు తరహాలో జనాలు రావడంతో బుజ్జగించిన పోలీసులు ఆయనను అరెస్టు చేయకుండా పంపించేశారు. అనూహ్య గందరగోళానికి తెరతీసిన స్టాలిన్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధిత వార్తలకై చదవండి స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
‘వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులు’
-
‘వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులు’
చెన్నై: జల్లికట్టుపై ఆందోళన సందర్భంగా పోలీసులు ఆటోలకు నిప్పు పెట్టిన ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ మండిపడ్డారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగించిందని, దీనిపై పోలీసు శాఖ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జల్లికట్టు కోసం 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. మెరీనా బీచ్ లో సోమవారం జరిగిన ఘటనలు బాధించాయని చెప్పారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపైనా పోలీసులు దౌర్జన్యం చేశారని వాపోయారు. పోలీసులే విధ్వంసానికి పాల్పడడం శోచనీయమని, వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులని వ్యాఖ్యానించారు. జల్లికట్టుపై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. మూగజీవాల హక్కులపై తనకు అవగాహన లేదన్నారు. ఎద్దులు కూడా పెంపుడు జంతువులేనని అన్నారు. జల్లికట్టుతో పోల్చుకుంటే ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపారు. జల్లికట్టుపై సీఎం పన్నీరు సెల్వం వ్యవహరించిన తీరు బాగుందని కమల్ ప్రశంసించారు. ఇది జల్లికట్టు కోసం జరుగుతున్న పోరాటం కాదని సంస్కృతి పరిరక్షణకు జరుగుతున్న ప్రజా ఉద్యమం అని వివరించారు. మనుషులు మధ్య అడ్డుగోడలు అవసరం లేదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ‘సరిహద్దులు అనేవి మనమే సృష్టించుకున్నాం. వీటిని కూలగొట్టాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్ ను ద్వేషించను. ఒకవేళ నేను 1924లో పుట్టివుంటే మహాత్మ గాంధీ ముందు కూర్చుని భారత్, పాకిస్థాన్ కలిసికట్టుగా ఉండాలని అడిగేవాడిని. దేనిపైనా నిషేధం విధించడం సరికాదు. నియంత్రణ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాన’ని చెప్పారు.