జయలలితకు స్టాలిన్ పరామర్శ
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు రాజకీయ పార్టీ నేతల పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఎంకే
స్టాలిన్ శనివారం సాయంత్రం చెన్నై అపోలో ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆయన పరామర్శించారు. జయ ఆరోగ్యంపై స్టాలిన్ ఆరా తీశారు. ఆమెకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఎండీఎంకే నేత వైకో కూడా శనివారమే జయలలితను పరామర్శించారు. త్వరలోనే మంచి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని వైకో ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.