ఆయన శశికళ భర్త నటరాజన్ కాదు..!
చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతూ, గందరగోళంగా మారాయి. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను శనివారం కలసి మద్దతు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి పాండ్యరాజన్ ఈ రోజు (ఆదివారం) అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త ఎం నటరాజన్ను కలిసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక్క రోజులోనే పాండ్యరాజన్ ప్లేట్ ఫిరాయించారా అని పన్నీరు సెల్వం వర్గీయులు ఆరా తీశారు. అయితే మంత్రి కలిసింది శశికళ భర్త నటరాజన్‌తో కాదు మైలాపూర్ ఎమ్మెల్యే ఆర్ నటరాజన్‌తో. పాండ్యరాజన్ ఈ విషయం ప్రకటించడంతో గందరగోళానికి తెరపడింది.
నిన్న పన్నీరు సెల్వం వర్గంలో చేరబోతున్నట్టు పాండ్యరాజన్ ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు ఆయనకు మద్దతు ఇస్తానని చెప్పారు. అమ్మ ఆశయాల కోసం అన్నా డీఎంకేని కాపాడేందుకు పోరాడుతానని పాండ్య రాజన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పన్నీరు సెల్వం కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు
డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!
శశి నుంచి మా మంత్రిని కాపాడండి!
అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!