Minister Pandiarajan
-
ఆయన శశికళ భర్త నటరాజన్ కాదు..!
చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతూ, గందరగోళంగా మారాయి. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను శనివారం కలసి మద్దతు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి పాండ్యరాజన్ ఈ రోజు (ఆదివారం) అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త ఎం నటరాజన్‌ను కలిసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక్క రోజులోనే పాండ్యరాజన్ ప్లేట్ ఫిరాయించారా అని పన్నీరు సెల్వం వర్గీయులు ఆరా తీశారు. అయితే మంత్రి కలిసింది శశికళ భర్త నటరాజన్‌తో కాదు మైలాపూర్ ఎమ్మెల్యే ఆర్ నటరాజన్‌తో. పాండ్యరాజన్ ఈ విషయం ప్రకటించడంతో గందరగోళానికి తెరపడింది. నిన్న పన్నీరు సెల్వం వర్గంలో చేరబోతున్నట్టు పాండ్యరాజన్ ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు ఆయనకు మద్దతు ఇస్తానని చెప్పారు. అమ్మ ఆశయాల కోసం అన్నా డీఎంకేని కాపాడేందుకు పోరాడుతానని పాండ్య రాజన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పన్నీరు సెల్వం కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! శశి నుంచి మా మంత్రిని కాపాడండి! అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు! నేడు శశికళ భారీ స్కెచ్? శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్! చెన్నైలో హై టెన్షన్ పన్నీర్ మైండ్ గేమ్ షురూ.. దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి -
శశికళకు ఊహించని భారీ షాక్
-
శశికళకు ఊహించని భారీ షాక్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న శశికళకు ఊహంచని భారీ షాక్ తగిలింది. శశికళ విధేయుడు, గట్టి మద్దతుదారుడైన మంత్రి పాండ్యరాజన్ ప్లేటు ఫిరాయించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలందరి అభిప్రాయాన్ని కచ్చితంగా గౌరవించాలని, అమ్మ ఆశయాల కోసం అన్నా డీఎంకేని కాపాడేందుకు పోరాడుతానని పాండ్య రాజన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పన్నీరు సెల్వం కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తమిళనాడు విద్యా శాఖ మంత్రిగా పాండ్యరాజన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు శశికళకు నమ్మినబంటుగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిపై విమర్శలు కూడా చేశారు. పార్టీని చీల్చేందుకు పన్నీరు సెల్వం ప్రతిపక్ష డీఎంకేతో చేతులు కలిపారని ఇటీవల ఆరోపించారు. ఇంతలోనే ఆయన మనసు మార్చుకోవడం గమనార్హం. కాగా పన్నీరు సెల్వంను ఆయన ఎప్పుడు కలిసేది, మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. సంబంధిత వార్తలు చదవండి అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే.. సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం