తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న శశికళకు ఊహంచని భారీ షాక్ తగిలింది. శశికళ విధేయుడు, గట్టి మద్దతుదారుడైన మంత్రి పాండ్యరాజన్ ప్లేటు ఫిరాయించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలందరి అభిప్రాయాన్ని కచ్చితంగా గౌరవించాలని, అమ్మ ఆశయాల కోసం అన్నా డీఎంకేని కాపాడేందుకు పోరాడుతానని పాండ్య రాజన్ ట్వీట్ చేశారు.