కమల్ కు ఖుష్బూ మద్ధతు | Khushboo Support Kamal Hasan | Sakshi
Sakshi News home page

కమల్ కు ఖుష్బూ మద్ధతు

Published Tue, Aug 1 2017 9:47 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

కమల్ కు ఖుష్బూ మద్ధతు

కమల్ కు ఖుష్బూ మద్ధతు

అదే మాటమీద నిలబడండి మీకు నేను ఉన్నా అంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకర్త, నటి కుష్బూ నటుడు కమలహాసన్ కు మద్దతు పలికారు.

పెరంబూరు: అదే మాటమీద నిలబడండి మీకు నేను ఉన్నా అంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకర్త, నటి కుష్బూ నటుడు కమలహాసన్ కు మద్దతు పలికారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని నటుడు కమలహాసన్  చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఏడపాడి పళనిస్వామితో సహా మంత్రి జగదీశ్‌కుమార్‌ తదితరులు కమల్‌పై ప్రతి విమర్శల దాడికి దిగుతున్నారు.

కాగా ఇదంతా ఒక కంట కనిపెడుతున్న కుష్బూ సోమవారం సోషల్ మీడియా ద్వారా కమలహాసన్ ను ఉద్దేశించి పేర్కొంటూ మీరు ఇదే మాటపై నిలబడండి. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. రాజకీయాల్లో రెక్కలు విరిగిన కొందరు మీ మీద సవారీ చేసి ప్రచారం పొందాలనుకుంటున్నారు. మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉండండి. మంచి మార్పు కోసం మీ పోరాటం కొనసాగాలి. మీకు నేను ఉన్నాను అంటూ మద్ధతు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement