స్పెషల్‌ 2020 | siddhartha special role in indian 2 movie | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ 2020

Published Fri, Jan 24 2020 3:59 AM | Last Updated on Fri, Jan 24 2020 3:59 AM

siddhartha special role in indian 2 movie - Sakshi

సిద్ధార్థ్‌

సిద్ధార్థ్‌కి ఈ ఏడాది స్పెషల్‌గా ఉండబోతోందని కోలీవుడ్‌ టాక్‌. తమిళ సూపర్‌స్టార్స్‌ కమల్‌ హాసన్, రజనీకాంత్‌ సినిమాల్లో సిద్ధార్థ్‌ కీలక పాత్రలు చేయడమే అందుకు కారణం. ఇప్పటికే కమల్‌హాసన్‌–శంకర్‌ ‘ఇండియన్‌ 2’లో సిద్దార్థ్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా రజనీకాంత్‌–శివ సినిమాలో ఓ పాత్ర కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించారట. ఈ సినిమాలో మీనా, ఖుష్భూ, కీర్తీ సురేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రజనీకాంత్‌ కుమార్తెగా కీర్తీ సురేశ్‌ కనిపిస్తారు. కీర్తీకి జోడీగా సిద్ధార్థ్‌ పాత్ర ఉండబోతోందట. ఒకేసారి రజనీ, కమల్‌ సినిమాల్లో కీలక పాత్ర చేయడం అంటే సిద్ధార్థ్‌కి ఈ 2020 స్పెషల్‌ ఇయర్‌ అనే చెప్పొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement