సీనియర్ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు కుష్బూ ప్రస్తుతం షూటింగులతో బిజీగా ఉన్నారు. అయితే ఆమె ఎడమ చేతి కండరాలు ఎలర్జీకి గురైంది. సాధారణంగా ఇలాంటి ఎనర్జీ తీవ్ర నొప్పికి గురి చేస్తుంది. నటి కుష్బూ ఇప్పుడు నొప్పితో బాధపడుతున్నారు. క్రీడాకారులు తీవ్ర ఎక్సర్‌సైజులు చేయడం కారణంగా ఇలాంటి కండరాల ఎలర్జీకి గురవుతుంటారు. ఇంతకుముందు చాలా బొద్దుగా ఉండే నటి కుష్బూ కూడా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైన విషయం తెలిసిందే.
లేకపోతే ఈమె అంత నొప్పితోనూ మంగళవారం కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా మరో పక్క వైద్యులు ఆమె చేతికి ఫిజియోథెరపీ వైద్యం అందిస్తున్నారు. కాగా తన చేతికి కట్టుతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆమె ఫోటోలు చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. కుష్బూ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment