
సీనియర్ నటి ఖుష్బు సుందర్ అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ పలు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపిస్తోంది. కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. సినిమాల్లో నటిస్తూనే 2000వ సంవత్సరంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. హీరో, డైరెక్టర్ అయిన సుందర్‌ను ఆమె పెళ్లాడింది.
తాజాగా ఇవాళ తమ 25వ వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు ఖుష్బు - సుందర్ దంపతులు. ఈ సందర్భంగా ప్రముఖ మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఖుష్బు సుందర్న్తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ప్రత్యేకమైన రోజున తన వెడ్డింగ్ శారీని ధరించినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
I very proudly wear my wedding saree on my 25th anniversary today. I added few borders to give a twist.
We couldn't have asked for a better way to start our day than taking the blessings of ##LordMuruga in Palani.
What we have today wouldn't be possible without the blessings of… pic.twitter.com/5JobnMNkdF— KhushbuSundar (@khushsundar) March 9, 2025
Comments
Please login to add a commentAdd a comment