marriage day
-
అనుష్క.. నీ ఇంటిపేరును అలాగే ఉంచు: విరుష్క జోడీకి నాడు రోహిత్ శర్మ విషెస్(ఫొటోలు)
-
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
సీతారామం మూవీతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. అంతేకాదు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో గుంటూరుకారం భామ మీనాక్షి చౌదరి అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా దుల్కర్ సల్మాన్ తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇవాళ తన తల్లిదండ్రులు మమ్ముట్టి, సల్ఫత్ 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విషెస్ తెలిపారు. వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాకుండా తన పేరేంట్స్ గురించి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దుల్కర్ ఇన్స్తాలో రాస్తూ..'మీ ఇద్దరి 45 ఏళ్లబంధం ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి. మీ సొంత మార్గాల్లో మికోసం చిన్న ప్రపంచాన్ని సృష్టించారు. మీలో నేను భాగమై మీ ప్రేమను పొందడం నా అదృష్టం. హ్యాపీ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా, నాన్న! మీరిద్దరూ కలిసి అత్యంత అసాధారణమైన వాటిని కూడా సాధిస్తారు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవీంద్రతో కాంబోలో వస్తోన్న చిత్రంలో దుల్కర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు దుల్కర్ సూరారై పొట్రు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తోన్న పురాణనూరు చిత్రానికి సంతకం చేసినట్లు కూడా ప్రకటించారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట
గ్వాటెమాలాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ జంటకు ఉబెర్ చుక్కలు చూపించింది తమరైడ్కు ఏకంగా 24 లక్షలు వసూలు చేయడం చూసి పాపం గుడ్లు తేలేసారు. ఎంతో ఆనందంగా తమ వివాహ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాలను పరిశీలిస్తే.. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం ఆస్ట్రేలియన్ జంట డగ్లస్ ఆర్డోనెజ్ డొమినిక్ ఆడమ్స్ గ్వాటెమాలాకు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సుందరమైన పర్యాటక ప్రాంతం గ్వాటెమాలా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి నిర్దేశిత బిల్లు 55 డాలర్లు (దాదాపు రూ. 4,500) దీనికి దాదాపు 600 శాతం ఎక్కువగా 29,994 డాలర్ల (సుమారు రూ. 24 లక్షలు) వసూలు చేసింది. దీంతో ఏకంగా అకౌంట్మొత్తం ఖాళీ అయిపోయింది. (AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్) ఈ విషయాన్ని డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నో సఫీషియంట్ ఫండ్స్ అని మెసేజ్ వచ్చినపుడు గానీ గమనించలేదు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుని 24 లక్షల రూపాయలు ఖతం కావడంతో లబోదిబోమన్నారు. ఇది తమ ఉత్సాహాన్ని నీరు గార్చేసిందని డగ్లస్ ఆర్డోనెజ్ వాపోయాడు. అయితే కొన్ని రోజుల తరువాత అదృష్టవశాత్తూ మొత్తం రీయింబర్స్మెంట్ అయినప్పటికీ, ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆందోళనలో మునిగి పోయాయని సంస్థ కస్టమర్ సర్వీస్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆడమ్స్. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) ఈ ఎర్రర్‌ను గుర్తించి, రీయింబర్స్మెంట్ చేశామని ఉబెర్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్ లోపం కారణంగా పొరపాటుగా కాలన్లలో కాకుండా డాలర్లలో ఫీజు వచ్చిందని తెలిపింది. కస్టమర్లు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటామని, స్వీకరించిన, వారి సమస్యను తమ టీం త్వరగా సరిదిద్దిందని వెల్లడించారు. నిర్దిష్ట బ్యాంకుల విధానాల ఆధారంగా రీఫండ్ సమయం మారుతుందని ప్రతినిధి పేర్కొన్నారు. -
స్పెయిన్‌లో సెలబ్రేషన్
ఫారిన్ టూర్‌కు వెళ్లారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూ΄÷ందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ త్వరలో ఆరంభం కానుంది. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి మహేశ్ స్పెయిన్ వెళ్లారని సమాచారం. ఫిబ్రవరి 10 (శుక్రవారం) మహేశ్, నమ్రతల పెళ్లి రోజు. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసమే స్పెయిన్‌కు వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. -
అయ్యో భగవంతుడా! పెళ్లిరోజే.. చివరిరోజు
సాక్షి,జైనథ్(ఆదిలాబాద్): మండలంలోని కామాయి ఎక్స్ రోడ్ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాండగాడకు చెందిన టక్కూరి ఉమేష్ మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన టక్కూరి ఉమేష్(28) మ్యారేజ్‌డే సందర్భంగా ఉదయం తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ వెళ్లి వచ్చాడు. బైక్‌లో పెట్రోల్ పోసుకునేందుకు కామాయి ఎక్స్‌రోడ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుని తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు. చదవండి: దారుణం.. భర్త నిద్రపోతుంటే.. రాత్రి ప్రియుడితో కలిసి కారులో.. -
భార్యకి పెళ్లి రోజు కానుక.. బాత్రూమ్లో గొయ్యి తవ్వి..
యశ్వంతపుర/ చెళ్లకెరె రూరల్: పెళ్లి రోజున కానుకలు ఇవ్వాల్సిన భర్త భార్య ప్రాణం తీశాడు. వివరాలు..చిత్రదుర్గ తాలూకా కోణనూరు గ్రామంలో సుమ (26), నారప్ప దంపతులు నివాసం ఉంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 25న వీరి పెళ్లి రోజు. అదే రోజు నారప్ప భార్యను హత్య చేసి బాత్రూమ్లో గొయ్యి తవ్వి ప్లాస్టింగ్ చేసి ఉంచాడు. భార్య కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటికి వచ్చి తనిఖీ చేయగా మృతదేహం బయటపడింది. తానే హత్యచేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై వరకట్న వేధింపులు, హత్య కేసు నమోదు చేశారు. (చదవండి: ఎన్నో కలలతో మెట్టినింట కాలు మోపింది.. ఏడాదిన్నర కాకుండానే.. ) మరో ఘటనలో.. కామాంధుడికి పదేళ్ల జైలు కోలారు: బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 15 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాలు... 2019 జనవరి 17న ముళబాగిలు తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని పలమనేరులో బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసి కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పదేళ్ల జైలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బీపీ దేవెమానే శుక్రవారం తీర్పు వెలువరించారు. -
సమంత: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. పోస్ట్ వైరల్
ChaySam Divorce: సమంత-నాగచైతన్య.. కొన్ని రోజుల క్రితం వరకు కూడా టాలీవుడ్లో మోస్ట్ లవ్లీ, రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. అన్ని బాగుంటే.. ఈ రోజు (అక్టోబర్7)వీరు నాల్గో వివాహా వార్షికోత్సవం జరుపుకునేవారు. కానీ కొన్ని రోజులు క్రితం చై-సామ్‌లు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం సమంత చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్ తాజాగా మరో సారి వైరలవుతోంది. ఈ జంట కలిసి ఉంటే ఈ రోజు మ్యారేజ్ డే జరుపుకునేవారు. ఈ క్రమంలో గతేడాది పెళ్లి రోజు సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి.. ‘‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్’’ అని క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. (చదవండి: చై-సామ్ విడిపోవడానికి గల కారణాన్ని ప్రీతమ్ ఇలా బయట పెట్టాడా?) తాజాగా ఈ పోస్ట్ మరోసారి వైరలవుతోంది. ఇప్పటికి వీరు విడిపోవడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు.. ‘‘గతేడాది ఇదే సమయంలో మీ ఇద్దరి మధ్య హద్దుల్లేని ప్రేమ, అభిమానాలు.. ఇప్పుడు అంతంలేని దూరం.. ఎందుకిలా జరిగింది.. ఏడాదిలోపే ఇంత కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నారు.. మీరిద్దరు తిరిగి కలిసిపోతారని నేను గట్టిగా నమ్ముతున్నాను.. ఈ ఫోటో చూస్తే నాకు చాలా బాధగా ఉంది.. మీరు మా హృదయాలను ముక్కలు చేశారు’’ అంటూ నెటిజనులు బాధపడుతున్నారు. ఇక చై-సామ్ ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాస్తవం వారిద్దరికి మాత్రమే తెలుసు. ఇప్పుడు వీరిద్దరు తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాలను ఎలా మలుపుతిప్పుతుందో కాలమే నిర్ణయిస్తుంది. చదవండి: నాగ చైతన్య-సమంతలకు అభిమానుల విజ్ఞప్తి ChaySam Divorce: ఏం జరిగిందో తెలియదు..చైతన్య చాలా కూల్: రాజీవ్ కనకాల ChaySam Divorce: చై-సామ్ విడిపోవడానికి గల కారణాన్ని ఆమె స్టైలిష్ట్ ఇలా బయట పెట్టాడా? ChaySam Divorce: ‘మరోసారి ఆలోచించుకోమని సామ్‌కు చెప్పాను’ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
విషాదం: పెళ్లి రోజును భార్యపిల్లలతో కలిసి..
సాక్షి, నిజామాబాద్: పెళ్లి రోజును కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుదామని అనుకున్న యువకుడు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నడిపల్లి తండా సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. డిచ్పల్లి ఎస్సై సురేశ్‌కుమార్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మర్పల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన గడ్డం రాజేశ్వర్ (31)కు భార్య లతాశ్రీ, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. ఇటీవల కొనుగోలు చేసిన పంట కోత మిషన్ ద్వారా కర్నాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతంలో పంట కోతలు నిర్వహిస్తున్నాడు. సోమవారం తన వివాహ వార్షికోత్సవం కావడంతో భార్యా పిల్లలతో గడిపేందుకు ఆదివారం తెల్లవారుజామునే తన బైక్‌పై (నంబర్ టీఎస్ 16 ఈబీ 7972) బయలుదేరాడు. రాత్రికి కామారెడ్డిలో భోజనం చేసి భార్యా పిల్లల కోసం బిర్యాని, స్వీట్లు పార్శిల్ చేయించుకుని బయలుదేరాడు. 44వ నంబరు జాతీయ రహదారిపై నడిపల్లి తండా సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప గ్రిల్స్‌పై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో భర్త ఇంటికి వస్తాడని ఆనందంతో ఎదురు చూస్తున్న భార్య దుఃఖంలో మునిగిపోయింది. అందరితో కలిసి మెలిసి ఉండే రాజేశ్వర్ మృతి చెందినట్లు తెలియడంతో సోమవారం నాగాపూర్‌లో విషాదం నెలకొంది. -
పోలీసులకు మ్యారేజ్ డే సెలవు
సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా మ్యారేజ్ డే సెలవు మంజూరు కానుంది. బుధవారం ఎస్పీ రాధాకృష్ణన్ ఈ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సుమారు లక్షన్నర మంది విధుల్ని నిర్వర్తిస్తున్నారు. ఇందులో లక్ష మంది మేరకు పోలీసులు ఉన్నారు. వీరికి సెలవులు దొరకడం అరుదే. ఈ కరోనా కాలంలో అయితే, రేయింబవళ్లు శ్రమించక తప్పడం లేదు. సెలవుల కరువు, పనిభారం వెరసి అనేక మంది పోలీసులు మానసిక వేదనకు గురవుతున్నట్టుగతంలో వెలుగు చూసింది. ఇందుకు తగ్గట్టుగానే పలువురు బలన్మరణాలకు సైతం పాల్పడ్డారు. దీంతో పోలీసుల్లో మానసిక వేదనను తగ్గించే రీతిలో అప్పుడుప్పుడు ప్రత్యేకంగా యోగా క్లాస్‌లను సైతం నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో విల్లుపురం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్, కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇక, జిల్లా పరిధిలో ఉన్న పై స్థాయి అధికారి మొదలు, కింది స్థాయి పోలీసు వరకు వారి పెళ్లిరోజున సెలవు తీసుకునే అవకాశం కల్పించారు. జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అందరూ తమ మ్యారెజ్ డే రోజు వివరాలను జిల్లా కేంద్రానికి సమర్పించాలని ఎస్పీ రాధాకృష్ణన్ ఆదేశించారు. ఆయా సిబ్బంది మ్యారేజ్ డే రోజున శుభాకాంక్షలతో కూడిన కార్డును పంపించడమే కాదు, ఆ రోజు సెలవు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ బుధవారం ఐదు మంది సిబ్బందికి శుభాకాంక్షలతో కూడిన కార్డు, సెలవు మంజూరు చేశారు. కుటుంబాలతో గడిపేందుకు పోలీసులకు సమయం అన్నది అరుదేనని, అందుకే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని, ఈ ఒక్క రోజైనా కుటుంబీకులతో ప్రతి పోలీసు ఆనందంగా గడపాలని కాంక్షిస్తున్నట్టు జిల్లా ఎస్పీ పేర్కొనడం విశేషం. -
‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్’
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహబంధంతో ఒక్కటై గురువారం(జూన్ 14) నాటికి ఆరేళ్ళు అయింది. తమ పెళ్ళి రోజు సందర్భంగా రామ్ చరణ్‌తో ఉన్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ రొమాంటిక్ ఫొటోలు వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా తమ తోటలో పండిన మ్యాంగోస్‌ను కొంతమంది సన్నిహితులకు చెర్రీ దంపతులు పంపించారు. నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా మామిడి పండ్ల బుట్టను ఈ దంపతులు పంపించారు. చెర్రీ దంపతులు పంపించిన మామిడి పండ్ల బుట్టను డీవీవీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. థ్యాంక్యూ సో మచ్. ఇద్దిరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ తెలిపారు. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్లీ’, ‘నాయక్’ చిత్రాలను కూడా డీవీవీ దానయ్య నిర్మించారు. -
పెళ్లి రోజే చావు డప్పు
తాడేపల్లిరూరల్: పెళ్లి రోజు సందర్భంగా కొత్త దుస్తులు తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబాన్ని ఇసుక లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. ఆ ప్రమాదంలో మరణించిన శ్రీకాంత్, అతని భార్య సరిత, కూతురు అక్షర అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులు భారీగా తరలివచ్చారు. 2015లో ఇదే తేదీన శ్రీకాంత్, సరితల వివాహమైంది. అంత్యక్రియల సందర్భంగా తాడేపల్లి పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు. -
నిన్న వేడుక.. నేడు లేడిక
ఖమ్మం,ఏన్కూరు: క్షణికావేశమో.. తీవ్ర మనస్థాపమో గానీ..ఆదివారం ఆనందంగా పెళ్లిరోజు సంబరం జరుపుకున్న ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏన్కూరులో సోమవారం చోటు చేసుకుంది. గర్భిణి అయిన భార్యను, కన్నవారిని వీడి..తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భగవాన్‌నాయక్ తండాకు చెందిన గుగులోతు రమేష్(33) జన్నారం పాఠశాలలో విద్యావలంటీర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది మాణుగూరుకు చెందిన అనూషతో వివాహం కాగా..కొన్ని రోజుల కిందట వీరిద్దరి మధ్య గొడవ జరిగి..ఆమె పుట్టింటికి వెళ్లింది. రమేష్ ఈ నెల 19న మాణుగూరులో ఆమె వద్దకు వెళ్లి..20వ తేదీన ఇద్దరూ కలిసి కేక్ కట్‌చేసి పెళ్లిరోజు వేడుకను సంబరంగా జరుపుకున్నారు. తెల్లవారాక..రమేష్ ఒక్కడే భగవాన్‌నాయక్ తండా వచ్చాడు. ఇంట్లో కూర్చొని..తన చావుకు భార్య అనూష, అత్త విజయ కారణమని సూసైడ్ నోట్ రాసి.. ఏన్కూరు వచ్చాడు. పురుగులమందు డబ్బా కొని, పోలీస్‌స్టేషన్ సమీపంలోని పామాయిల్ తోటలోకి వెళ్లి తాగి..ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఐదు నెలల గర్భిణి. వేధింపుల వలనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి బాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తోట నాగరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చంపుకోవాలని యత్నిస్తున్నాం.. కానీ: హీరో భార్య
’గత 16 ఏళ్లుగా ఒకరినొకరు చంపుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ మేం ఇప్పటివరకు విజయవంతం కాలేదు. 16వ వివాహ దినోత్సవం వచ్చేసింది. నేరంలో మేం భాగస్వాములం’ అంటూ ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసింది. బాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా వైవాహిక జీవితంలో అడుగుపెట్టి నేటికి 16 ఏళ్లు. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ గా పేరొందిన ఈ జంట వివాహ వార్షికోత్సవం సందర్భంగా ట్వింకిల్ ఖన్నా ఇలా సరదా కామెంట్ పెట్టి.. అక్షయ్, తాను కరాటే ఫైటింగ్ చేస్తున్న చిన్న వీడియో బిట్ ను పోస్టు చేసింది. ’జుల్మీ’, ’ఇంటర్నేషనల్ ఖిలాడీ’ వంటి సినిమాల్లో కలిసి నటించిన అక్షయ్, ట్వింకిల్ 2001లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2002లో కొడుకు ఆరవ్, 2012లో కూతురు నిటారా జన్మించారు. ప్రస్తుతం వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న అక్షయ్ త్వరలోనే ’జాలీ ఎల్ఎల్బీ-2’ ప్రేక్షకుల ముందుకురానునన్నాడు. అలాగే ’టాయ్‌లెట్: ఏక్ ప్రేమకథ’ చిత్రంలో నటిస్తున్నాడు. 16 years of trying to kill each other and we still haven't succeeded:) #16thanniversary #partnersincrime pic.twitter.com/XqGWQ2BQAI — Twinkle Khanna (@mrsfunnybones) January 17, 2017 -
పెళ్లి రోజే వధువు ఆత్మహత్యాయత్నం
తోగ్గూడెం(పాల్వంచరూరల్) : ప్రేమించి పెళ్లి చేసుకుని 24గంటలు గడవక ముందే నవ వధువు క్వారీ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పాల్వంచ మండలం తోగ్గూడెంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని తోగ్గూడెంలో ఉన్న క్వారీ క్యాంప్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన మంజుల, లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ప్రేమించుకున్నారు. పెద్దమ్మతల్లి గుడి వద్ద గురువారం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రశాంత్ కుటుంబీకులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో గురువారం సాయంత్రం మంజుల గ్రామ సమీపంలోని క్వారీ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్తున్న క్వారీ కార్మికులు గమనించి నీటిలో నుంచి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మంజుల భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ .బి.సత్యనారాయణ తెలిపారు. -
పచ్చని కానుక
యూసఫ్‌గూడలో రామరాజనే పెద్దాయన మనవడి పుట్టిన రోజు వేడుక సందర్భంగా పిల్లలకి ఆటపాటలు, క్విజ్, నృత్యాల పోటీలు నిర్వహించి, గెలిచిన పిల్లలకి మొక్కల్ని కానుక లుగా అందించారు. నల్లకుంటలో పెళ్లికూతురు కాబోయే వరుడి దగ్గర్నుంచి నీట్‌గా ప్యాక్ చేసిన బోన్సాయ్ ప్లాంట్‌ను గిఫ్ట్‌గా అందుకుంది. క్రాస్ రోడ్స్‌లో నివసించే ప్రవీణ్... తమ మ్యారేజ్ డే సందర్భంగా అతిధులకు మొక్కల్ని కానుకగా ఇచ్చి ఆనందం పంచారు. ఈ ధోరణి మరింత పెరిగితే... పచ్చని బహుమతులు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం బలపడితే...హరితహారం...సాకారం కావడం తధ్యం అంటున్నారు పర్యావరణ ప్రియులు. సిటీలో పెరుగుతున్న గ్రీన్ గిఫ్టింగ్ గురించి నేటి ‘సండే స్పెషల్’లో... సాక్షి, సిటీబ్యూరో -
నాలుగేళ్ల సంబరం
'ప్రత్యేక రోజు' వేడుకలకు సిద్ధం ఫిబ్రవరి 29.. నాలుగేళ్లకోసారి వచ్చే రోజు. ఈ అరుదైన రోజున చోటు చేసుకొనే సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లీపు సంవత్సరం అందరికీ కామన్ అయినా, కొందరికి మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ రోజున వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు వీరు. బర్త్ డే, మ్యారేజ్ డేను ఘనంగా జరుపుకొనేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మరీ మనం కూడా వీరికి శుభాకాంక్షలు చెబుదామా..! రెండో పుట్టిన రోజు.. కమ్మర్పల్లి : మండలంలోని హాసాకొత్తూర్‌కు చెందిన వాల్గోట్ రమేశ్, లత దంపతుల రెండో కూతురు శ్రీనిత్య. 2008 ఫిబ్రవరి 29న జన్మించిన ఈ పాప ఇప్పటివరకు ఒకే పుట్టిన రోజును జరుపుకొంది. రెండో బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. మూడో బర్త్ డే ఆర్మూర్ : పెర్కిట్ గ్రామానికి చెందిన మంచిర్యాల సురేశ్, సంధ్యారాణి దంపతుల పెద్ద కుమారుడు లలిత్ చంద్ర. అందరిలా ఏడాదికోసారి కాకుండా నాలుగేళ్లకోసారి బర్త్ డే జరుపుకొంటాడు. 2004 ఫిబ్రవరి 29న జన్మించిన ఆయన ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే పుట్టినరోజు జరుపుకొన్నాడు. సోమవారం మూడో బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకొనేందుకు సిద్ధమయ్యాడు. లలిత్ చంద్ర తమ్ముడు జనవరి 1న జన్మించడం విశేషం. 32 ఏళ్లు.. ఏడో బర్త్ డే! ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి చెందిన నారాయణ, శకుంతల దంపతుల కుమారుడు కుబీర్ శివానంద్ 1984 ఫిబ్రవరి 29న జన్మించాడు. 32 ఏళ్ల యువకుడైన ఇతను ఏడు సార్లు మాత్రమే జన్మదినాన్ని జరుపుకున్నాడు. బీవీఎన్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శివానంద్.. ఎనిమిదో జన్మదినాన్ని సోమవారం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. బీవీఎన్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాడు. నాలుగేళ్లకోసారి వచ్చే జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని చెబుతున్నాడాయన. మొదటి పెళ్లి రోజు.. ఆర్మూర్ అర్బన్ : మాకు 2012 ఫిబ్రవరి 29న వివాహం జరిగింది. మాకు ఇద్దరు కుమారులు వినేశ్ సాయి, మోక్షిత్ సాయి. నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి పెళ్లి రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు వివాహం జరిగిన ఆలయంలో పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవడానికి ప్రణాళిక చేసుకున్నాం. నాలుగు సంవత్సరాలకోసారి వచ్చే మా పెళ్లి రోజును ఘనంగా జరపడానికి మాకుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. - రాస ప్రసాద్, స్వర్ణలత, ఆర్మూర్ మర్చిపోలేని రోజు.. నాగిరెడ్డిపేట : అందరూ సంవత్సరానికి ఒక్కసారి పెళ్లిరోజు వేడుకలు జరుకుంటే మేము మాత్రం నాలుగేళ్లకు ఒకసారి పెళ్లిరోజు జరుపుకొంటాం. అందరికంటే భిన్నం గా ఉండాలనే ఫిబ్రవరి 29న పెళ్లి చేసుకున్నాం. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మా పెళ్లిరోజున ఉత్సాహంగా గడుపుతాం. పిల్లలతో కలిసి గుడికి వెళ్తాం. కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లిరోజు వేడుకలను జరుపుకొంటాం. లీపు సంవత్సరం.. ఎవరూ మర్చిపోకుండా మా బంధువులంతా శుభాకాంక్షలు తెలుపుతారు. - బోయిని రాజశేఖర్, విజయలక్ష్మి, నాగిరెడ్డిపేట థ్రిల్లింగ్‌గా ఉంది మోర్తాడ్ : నా పేరు కొండ శంకర్. మాది తాళ్ల రాంపూర్. 1976 ఫిబ్రవరి 29న జన్మించా. నా వయస్సు 40 సంవత్సరాలు. కానీ, ఇప్పటివరకు 9 పుట్టిన రోజులే జరుపుకొన్నాను. ఇప్పుడు పదో పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకొనేందుకు సిద్ధమయ్యా. అందరికి ఏడాదికి ఒకసారి పుట్టిన రోజు వస్తే నాకు మాత్రం నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. ఇది ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. రికార్డు ప్రకారం వయస్సు 40 ఏళ్లు అయినా జరుపుకొన్న పుట్టిన రోజులను పరిగణలోకి తీసుకుంటే నా వయస్సు నాలుగింతలు తగ్గుతుంది. అదృష్టమే..! బాన్సువాడ టౌన్ : ఈ అబ్బాయి పేరు దీక్షిత్‌కుమార్. బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి, విఠల్‌చారి దంపతుల కుమారుడు. అందరిలాగే ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఉన్నప్పటికీ, 2004 ఫిబ్రవరి 29న జన్మించడం వల్ల ఆ కోరిక తీరకుండా పోయింది. అయితేనేం, మర్చిపోలేని రోజున జన్మించడం ఎంతో అదృష్టం చెబుతున్నాడు దీక్షిత్. నాలుగేళ్లకొకసారి వచ్చే పుట్టిన రోజును తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పుట్టినరోజు, పెళ్లిరోజు.. పోలీసులకు సెలవు!
పోలీసులు అంటే.. సంవత్సరానికి 365 రోజులూ పని చేస్తారు. వారాంతపు సెలవులు గానీ, సాధారణ సెలవులు గానీ ఉండటం దాదాపు అసాధ్యం. అలాంటిది మహారాష్ట్రలో పోలీసులకు వాళ్ల పుట్టినరోజు నాడు, పెళ్లిరోజు నాడు తప్పనిసరిగా సెలవు ఇస్తామని అక్కడి హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ తెలిపారు. పోలీసు అధికారులకు ఒత్తిడి, టెన్షన్ తగ్గిండచానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. మరాఠీ దినపత్రిక 'నవకల్' ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయనీ విషయం వెల్లడించారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ల పిల్లలకు పోలీసు నియామకాల్లో 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను సన్మానించారు. రాష్ట్రంలో 55 వేల మంది సిబ్బంది నియామకం పూర్తయిందని, మరో 64వేల మంది నియమాక ప్రక్రియ కొనసాగుతోందని అది పూర్తయితే ప్రస్తుతమున్న పోలీసులకు భారం తగ్గుతుందని పాటిల్ చెప్పారు. -
వ్యక్తి దారుణహత్య
మ్యారేజ్‌డే రోజునే వెలుగులోకి.. స్నేహితులపైనే అనుమానం జియాగూడ, న్యూస్‌లైన్: దుండగులు ఓ వ్యక్తి ముఖంపై బరువైన వస్తువుతో దాడి చేసి హత్య చేశారు. హతుడి మ్యారేజ్‌డే రోజునే (ఆదివారం) ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. కుల్సుంపుర ఇన్స్పెక్టర్ ఆర్. కరణ్కుమార్సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక వెంకటేశ్వరనగర్‌లోని ఓ భవనం 3వ అంతస్తులో ఆటో డ్రైవర్ వి.రాజేష్ అలియాస్ రాజు (33) నివాసముంటున్నాడు. ఇతనికి భార్య సంతోషిని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీసుకొని సంతోషిని ఈనెల 22న కర్మన్‌ఘాట్ అల్మాస్‌గూడలో ఉంటున్న పిన్ని ఇంటికి వెళ్లింది. దీంతో రాజు ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం నుంచి అతను కనిపించకపోవడంతో భార్య వద్దకు అల్మాస్గూడ వెళ్లి ఉంటాడని ఇరుగుపొరుగు వారు అనుకున్నారు. కాగా ఆదివారం మ్యారేజ్ డే కావడంతో సంతోషిని ఉదయమే జియాగూడలోని ఇంటికి చేరుకుంది. బయట నుంచి తలుపు గడియపెట్టి ఉండటంతో తీసి చూడగా.. భర్త రాజు రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు అతడిని బరువైన వస్తువుతో ముఖంపై బలంగా కొట్టి, హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం హత్య జరిగి ఉంటుందని, ఇద్దరు లేదా ముగ్గురు ఈ ఘటనలో పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్నేహితులే రాజును చంపి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎస్ఐ శాంతారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫొటో కప్పు..అందరు మెచ్చు
క్రిస్మస్.. న్యూ ఇయర్.. సంక్రాంతి.. ఉగాది.. దసరా.. దీపావళి.. బర్త్‌డే.. మ్యారేజ్ డే.. ఇలా పండుగేదైనా.. సంబరమేదైనా ఆనంద సమయాల్లో ఆప్తులకు ఓ బహుమతి ఇవ్వడం రివాజు. మనం ఇచ్చే గిఫ్ట్ ఆనంద క్షణాలకు కొనసాగింపుగా.. ప్రతి రోజూ గుర్తు చేసుకునేలా ఉండాలి. తీసుకునే వారికి మధురానిభూతి .. చూసేవారికి ఆసక్తి కలగాలి. అలాంటి గిఫ్ట్‌లే ఫొటో కప్పులు. ప్రియమైన వారి అందమైన చిత్రాలు ముద్రించిన కప్పులను వారికి బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు పరిపాటిగా మారింది. ఫొటోలను చూస్తూ.. టీని ఆస్వాదిస్తూ.. జ్ఞాపకాలను నెమరేసుకునే కప్పులపై ఈ వారం ట్రెండ్. - న్యూస్‌లైన్, కర్నూలు(అర్బన్) ఇటీవల కాలంలో చాలా ఇళ్లల్లో చిన్న సైజు టీ కప్పుల వాడకం దాదాపు తగ్గిపోయింది. ధనవంతులు, అధికారులు, ఇతర వ్యాపార వర్గాలకు చెందిన వారు పెద్ద పెద్ద కప్పులను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విభిన్న రంగుల్లో ఇవి లభ్యమవుతున్నాయి. వీటిపై తమకు ఇష్టమైన వారి ఫొటోలను ముద్రించి ఇస్తే ఆ అనుభూతి వేరు. ఇటీవల కాలంలో ఇలాంటి కప్పులను బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వివిధ రకాల్లో లభ్యమవుతున్న పెద్ద కప్పులు ఇంటి హూందాతనాన్ని తెలియజేస్తున్నాయి. కేవలం ఓ గంటలో ఈ రకమైన కప్పులపై ఫొటోలను ప్రింట్ వేస్తున్నారు. ముద్రణ చిరకాలం మన్నికగా ఉంటుండడంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇటువంటి ఫొటో కప్పులు ధర రూ. రూ.400 నుంచి రూ.550 వరకు ఉన్నాయి. ఇన్సైడ్ కలర్ తెలుపు రంగు కప్పులకు ఇన్‌సైడ్‌లో ఎరుపు, పసుపు, గోల్డ్, నీలం.. తదితర రంగుల్లో ఉండడంతో ఆకట్టుకుంటున్నాయి. వీటి ధర రూ.350గా ఉన్నాయి. హుందాగా కనిపించేందుకు ఎక్కువగా గోల్డ్ కలర్ వాటిని కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర రూ.400 వరకు ఉన్నాయి. స్టీల్ కప్పులపై తమకిష్టమైన వారి ఫొటోలను ముద్రించుకునేందుకు వీలుంది. వీటి ధర రూ.400గా ఉంది. అలాగే సాదా కప్పుల హ్యాండిల్స్‌పై వివిధ రకాల జంతువుల బొమ్మలు ఉండే ఎనిమల్ కప్పులను చిన్నారులు ఇష్టపడుతున్నారు. వీటి ధర రూ.450గా ఉంది. వి‘చిత్రం’ బ్లాక్ కలర్లో సాధారణంగా కనిపించే ఈ కప్పుల్లో గొప్ప మ్యాజిక్ ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు దానిపై ఉన్న ఫొటో కనిపించదు. అందులో వేడివేడి టీ, కాఫీ, పాలు తదితరాలు పోసిన వెంటనే దానిపై ముద్రించిన ఫొటోలు దర్శనమిస్తాయి. కప్పు ఖాళీ అయిన తర్వాత, ద్రవ పదార్థం చల్లబడిన వెంటనే చిత్రం మాయం అవుతోంది. దీని ధర రూ.500. ప్రజలు ఆసక్తి చూపుతున్నారు రోజు రోజుకు వినియోగదారుల వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా అనేక రకాల వస్తువులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఫొటోలను ప్రింట్ చేసిన కప్పులు, మ్యాజిక్ టీ కప్పులు ఎక్కువ కొనుగోలు చేసున్నారు. ముఖ్యంగా వీటిపై ముద్రించిన ఫొటోలు, ఇతర చిత్రాలు చిరకాలం మన్నికగా ఉంటుండడంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. - టీవీ రాజేష్, కిడ్స్ ఎంపోరియం -
సురేఖ.. మార్చుకోలేక!
ఆడపిల్ల. ఇప్పటికీ ఆడ..పిల్లగానే మిగిలిపోతోంది. యుగాలు మారినా.. మానవ మేధస్సు దినదినాభివృద్ధి చెందినా.. ఆ ఒక్క విషయంలో వీరి దృక్పథం మారకపోవడం ఆడపిల్ల భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతోంది. అసలు పిల్లలే కలగలేదని ఎంతో మంది కనిపించని దేవుళ్లకు మొక్కుతూ.. హస్తవాసి కలిగిన వైద్యులంటూ వారి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే సమయంలో కలిగినది ఆడపిల్ల అయితే మరో సమస్య. అత్తమామల ఎత్తిపొడుపులు.. తప్పు చేసిన దానిలా చూసే భర్తతో వేగలేక అదే ఆడపిల్ల నిత్యనరకం అనుభవిస్తోంది. ఈ కోవలో భర్త, అత్తమామల నుంచి ఎలాంటి వేధింపులు లేకపోయినా.. మగ సంతానం లేదనే బెంగతో ఓ మహిళ పెళ్లి రోజునే అర్ధాంతరంగా తనువు చాలించింది. తన రేఖను.. మగ సంతానంపై పెట్టుకున్న ఆశను మార్చుకోలేక చివరకు ఆమే ఈ లోకం వీడింది. ప్యాపిలి, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ మండలం బాచ్చాపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, సుభద్రమ్మ దంపతుల పెద్ద కుమార్తె సురేఖ(22)కు ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన మద్దిలేటిస్వామితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. గోబి బండి నిర్వహణతో వీరి సంసారం సాఫీగా సాగిపోతోంది. పెళ్లయిన ఏడాదికే ఆడపిల్ల జన్మించడంతో మహాలక్ష్మి కలిగిందని సంతోషపడ్డారు. మొదటి కాన్పులో ఎవరు పుట్టినా.. ఆ తర్వాత మగ సంతానం కలుతుందిలే అనే బంధువుల మాటలు సురేఖ మనసులో బలంగా నాటుకుపోయాయి. మలి విడత గర్భం దాల్చగా.. ఆరు నెలల క్రితం కవలలు జన్మించారు. ఆమె ఆశలను తలకిందులు చేస్తూ రెండో విడతలోనూ ఇరువురూ ఆడపిల్లలే కలగడం తట్టుకోలేకపోయింది. భర్త తరపు నుంచి ఎలాంటి వేధింపులు లేకపోయినా.. ఇదేదో తప్పుగా భావించి ఆమె తనలో తనే కుమిలిపోసాగింది. తల్లికి కూడా ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో.. తనకూ ఇకపై మగ పిల్లలు పుట్టరనే బెంగ పెట్టుకుంది. మంగళవారం పెళ్లి రోజు కావడంతో ఉదయం నుంచి ఆ ఇంట్లో హడావుడి నెలకొంది. సాయంత్రం వేళ పిల్లలతో కలసి వేడుక చేసుకునేందుకు భర్త మద్దిలేటి కేక్ తీసుకొస్తానంటూ డోన్‌కు బయలుదేరాడు. ఈ సమయంలోనే ఆమె మనసును ‘మగ’పురుగు తొలచింది. మగపిల్లలు కలగలేదనే దిగులుతో ఉరేసుకొని తనువు చాలించింది. రాత్రికి ఇంటికి చేరుకున్న భర్త జరిగిన ఘోరాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈమె తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ముగ్గురు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఒక పాపకు మూడేళ్లు.. మరో ఇద్దరు కవలలకు ఆరు నెలలు కావడంతో విగతజీవురాలైన తల్లిని బంధువులు వారికి చూపలేకపోయారు. పిల్లలను బంధువుల ఇంట్లో వదిలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మృతురాలి తల్లి సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్సై జయన్న తెలిపారు.