పుట్టినరోజు, పెళ్లిరోజు.. పోలీసులకు సెలవు! | Police personnel to get off on birthday, marriage anniversary | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు, పెళ్లిరోజు.. పోలీసులకు సెలవు!

Published Fri, Aug 29 2014 3:55 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Police personnel to get off on birthday, marriage anniversary

పోలీసులు అంటే.. సంవత్సరానికి 365 రోజులూ పని చేస్తారు. వారాంతపు సెలవులు గానీ, సాధారణ సెలవులు గానీ ఉండటం దాదాపు అసాధ్యం. అలాంటిది మహారాష్ట్రలో పోలీసులకు వాళ్ల పుట్టినరోజు నాడు, పెళ్లిరోజు నాడు తప్పనిసరిగా సెలవు ఇస్తామని అక్కడి హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ తెలిపారు. పోలీసు అధికారులకు ఒత్తిడి, టెన్షన్ తగ్గిండచానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

మరాఠీ దినపత్రిక 'నవకల్' ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయనీ విషయం వెల్లడించారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ల పిల్లలకు పోలీసు నియామకాల్లో 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను సన్మానించారు. రాష్ట్రంలో 55 వేల మంది సిబ్బంది నియామకం పూర్తయిందని, మరో 64వేల మంది నియమాక ప్రక్రియ కొనసాగుతోందని అది పూర్తయితే ప్రస్తుతమున్న పోలీసులకు భారం తగ్గుతుందని పాటిల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement