maharashtra police
-
మహారాష్ట్రలో క్యాష్ ఫర్ ఓట్స్ ఆరోపణలు
-
సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్
మహారాష్ట్రతోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనం రేపిన ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలకవిషయం వెలుగుచూసింది మాజీ మంత్రి అయిన సిద్ధిఖీని హత్య చేసే ముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో షూటర్లు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గల ఉద్దేశం తెలియనప్పటీకి నిందితులు స్నాప్‌చాట్ ద్వారా నిందితులు తరచూ అన్మోల్తో సంభాషణలు జరిపినట్లు గుర్తించామని తెలిపారు.కెనడా, అమెరికాలకు చెందిన నిందితులతో అన్మోల్కు పరిచయం ఉందని, నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు స్నాప్‌చాట్ ద్వారా ఒకరితో ఒకరు టచ్‌లో ఉండేవారని, మెసెజ్ వచ్చిన తర్వాత వారు దానిని వెంటనే తొలగించేవారని పేర్కొన్నారు.. అదేవిధంగా అరెస్టు చేసిన నిందితుల స్నాప్‌చాట్‌ను నిశితంగా పరిశీలించగా.. షూటర్లు, ప్రవీణ్ లోంకర్ నేరుగా అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలిందని ముంబై పోలీసులు తెలిపారు.స్నాప్‌చాట్‌లో 24 గంటల్లోపు చాట్ మాయమయ్యే ఆప్షన్‌ను ఉపయోగించి నిందితులు సంప్రదింపులు జరుపుకునేవారని, దానిద్వారానే అన్మోల్ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవ్వడం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో చెట్లను లక్ష్యంగా చేసుకొని షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు పేర్కొన్నారన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.కాగా దసరా సందర్భంగా బాబా సిద్ధిక్ ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం వెలుపల బాణాసంచా పేలుస్తుండగా దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిచంపిన విషయం తెలిసిందే.వెంటనే ఆయన్ని లీలావతి ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు పేర్కొంది. దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. -
‘తక్షణ న్యాయం’ ప్రమాదకరం
సర్వోన్నత న్యాయస్థానంతో సహా దేశంలో వివిధ హైకోర్టులు అడపా దడపా అక్షింతలు వేస్తున్నా ఎన్కౌంటర్ల జాడ్యం పోయేలా లేదు. ఏ పార్టీ ఏలుబడి ఉందన్నదాంతో నిమిత్తం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల తీరూ ఇదే. కనీసం స్క్రిప్టు మార్చడానికి కూడా పోలీసులు ప్రయత్నించరు. ముద్దాయిని/ముద్దాయిలను నేరస్థలానికి తీసుకెళ్లినప్పుడో, న్యాయస్థానంలో హాజరు పరచడానికి వెళ్తున్నప్పుడో హఠాత్తుగా తిరుగుబాటు చేసి పోలీసుల నుంచి తుపాకి గుంజుకుని కాల్చబోవటం, ఈలోగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడం వీటన్నిటి సారాంశం. పోలీసులకు స్వల్ప గాయాలు కావటం కూడా అన్నిచోట్లా డిటో. అక్షయ్ షిండే అనే నేరగాడిని మహారాష్ట్ర పోలీసులు హతమార్చిన తీరుపై బొంబాయి హైకోర్టు బుధవారం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. వాహనంలో వెళ్తుండగా షిండే తిరగబడి పిస్తోల్ గుంజుకుని కాల్పులు జరిపే సమయంలో నలుగురు పోలీసులున్నా అతగాణ్ణి లొంగదీయలేకపోవటం ఏమిటని ప్రశ్నించింది. అసలు తుపాకులు, పిస్తోళ్లు ఉపయోగించటం తెలియని వ్యక్తి ఆయుధాన్ని అన్‌లాక్ చేసి కాల్పులు జరపటం ఎలా సాధ్యమని అడిగింది. ఈ ప్రశ్నలు సహేతుకమైనవి.బద్లాపూర్ స్కూల్ ఉదంతం ఘోరమైనది. గత నెల 13న ఒక పాఠశాలలోని మరుగుదొడ్డి వద్ద ఇద్దరు కిండర్‌గార్టెన్ పిల్లలపై నిందితుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ. ఘటనపై పిల్లల తల్లిదండ్రులకు తెలిసి ఫిర్యాదుచేస్తే ముద్దాయిని ఆగస్టు 17న అరెస్టు చేశారు. స్కూల్ యాజ మాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించాకగానీ ప్రిన్సిపాల్, సంస్థ చైర్మన్, కార్యదర్శిలపై పోక్సో కేసు పెట్టలేదు. ఆ స్కూల్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అసలు ఆడపిల్లలు ఉపయోగించే మరుగుదొడ్డి వద్ద మహిళను నియమించాలని కూడా వారికి తోచలేదు. వీటన్నిటినీ తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇంతమంది నిర్లక్ష్యం ఫలితంగా ఇద్దరు చిన్నారులు బాధితులుగా మారాక మాత్రం కఠిన చర్య తీసుకున్నట్టు కనబడటం కోసం వక్రమార్గం అనుసరించారు. స్కూల్ నిర్వాహకులు బీజేపీకి కావలసినవారు గనుకే ఎన్కౌంటర్ నాటకం ఆడారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపణ. నిజానిజాల మాటెలా ఉన్నా ప్రభుత్వాధికారులు మెతగ్గా వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. గత రెండు నెలల్లో మూడు ఎన్కౌంటర్లు జరిపి తమిళనాడు పోలీసులు ముగ్గురు నిందితులను హతమార్చారు. మావోయిస్టుల ప్రభావం అధికంగావున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లు జరగకపోతే వార్త. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఎన్కౌంటర్ల జోరు అధికమే. గత ఏడున్న రేళ్లలో యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 49 మందిని కాల్చిచంపారు. గత సోమవారమే మరొకరిని హతమార్చి అర్ధ సెంచరీ పూర్తి చేశారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎన్కౌంటర్ మృతులంతా అమాయకులనీ, సచ్ఛీలురనీ ఎవరూ అనరు. ఎన్నో ఆరోపణలున్నవారే. కానీ నేర గాళ్లను శిక్షించటానికి ఒక విధానం ఏర్పర్చుకున్నప్పుడూ, దానికి అనుగుణంగా భిన్న వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడూ ఇష్టారాజ్యంగా కాల్చిచంపే అధికారం పోలీసులకెక్కడిది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇలాంటి కేసులను విచారించినప్పుడల్లా న్యాయస్థానాలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి. కానీ ఎక్కడా ఇవి ఆగుతున్న దాఖలాలు లేవు. 2006లో ఇద్దరు నిందితులను నవీ ముంబైలో పట్టుకుని వారిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన కేసులో 12 మంది పోలీసులకు కిందికోర్టు విధించిన యావజ్జీవ శిక్షను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించటంతోపాటు కింది కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టిన ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’ ప్రదీప్ శర్మకు కూడా యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. న్యాయవాది అయిన ఎన్కౌంటర్ మృతుడి సోదరుడు అతను అరెస్టయ్యాక ఉన్నతాధికారులకూ, న్యాయస్థానానికీ టెలిగ్రామ్‌లు, ఫ్యాక్స్ మెసేజ్‌లు పంపటం, కాల్ రికార్డులు సేకరించటం పర్యవసానంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఎన్ని కేసుల్లో ఎందరు ఇలా చేయగలుగుతారు?ఎన్కౌంటర్లను వ్యతిరేకించే పౌరహక్కుల సంఘాల నేతలనూ, పౌర సమాజ కార్యకర్తలనూ నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నవారిగా ముద్రేయటం పాలకులకూ, పోలీసులకూ అలవాటు. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు సాగిస్తున్న పోలీసులను సమాజంలోని భిన్నవర్గాలవారు ప్రశంసించటం కూడా కనబడుతుంది. ‘తక్షణ న్యాయం’ కోరేవారికి ఇది సబబే అనిపించవచ్చు. కానీ ఈ క్రమంలో ప్రభుత్వాల బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ ఉపేక్షించటం లేదా? అసలు పోలీసు కాల్పుల్లో మరణించినవారే నిజమైన దోషులని ఏ ప్రాతిపదికన నమ్మాలి? ఈ ధోరణివల్ల అసలు దోషులు తప్పించుకునే ప్రమాదంతోపాటు మరిన్ని నేరాలు జరగటానికి ఆస్కారం ఉండదా? కోల్ కతాలోని పీజీ కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతమే తీసుకుంటే సక్రమంగా దర్యాప్తు జరిగింది గనుకే మాఫియాల ఆధిపత్యం, వారి అండతో ఆసుపత్రి ఉన్నతాధి కారులు సాగిస్తున్న తప్పుడు పనులు బయటపడ్డాయి. నేరాలకు తావులేని వాతావరణం ఏర్పర్చటానికీ, వాటి నియంత్రణకు దోహదపడే చర్యలకూ బదులు నేరగాళ్లను హతమార్చే విధానం సమాజాన్ని బండబారుస్తుంది. అధికారులకు తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న భరోసానిస్తుంది. కఠినమైన చట్టాలు, పకడ్బందీ దర్యాప్తు, న్యాయస్థానాల్లో చురుగ్గా విచారణ వంటివి మాత్రమే సమాజ భద్రతకు తోడ్పడతాయి. అది మరిచి ‘తక్షణ న్యాయం’ కోసం వెంపర్లాడటం సరికాదు. -
Shashi Tharoor: కర్కరే మృతిపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్‌చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఆర్ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు. ‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్చేసిన గన్‌లోని బుల్లెట్‌తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు. శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్‌లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్‌కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్ఎస్ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్‌లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్‌చేయడంతో ఆయనపై ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు. -
TS Election 2023: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా..!
కామారెడ్డి: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో చేపట్టే పకడ్బందీ చర్యలపై శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సాలూర రోడ్డులోని ఎన్ఎన్ కన్వెన్షన్ హాలులో మహారాష్ట్ర పోలీసులతో పాటు, రాష్ట్రంలోని ఆరు జిల్లాల ఎస్పీల సమావేశం జరిగింది. సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడు తూ రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు పటిష్ట నిఘా పెట్టాలన్నారు. మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలన్నారు. నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాందేడ్ జిల్లా సరహద్దుల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చెక్ పోస్టులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసుకొని నిరంతరాయంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో ఇరు జిల్లాల, రాష్ట్రాల అధికారులు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులైన సాలూర, కండ్గావ్, కందకుర్తి, పోతంగల్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు అంతర్ జిల్లా చెక్ పోస్టులు డోడ్గాన్ (సోన్) బ్రహ్మంగారి గుట్ట, సిరికొండ, ఇందల్వాయి టోల్‌ప్లాజా, మల్లారం గండి, యంచ (బాసర)ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వారిని నియంత్రించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. సరిహద్దులో హైవే పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్ పెంచాలని, పోలీస్ అధికారులు వాట్సప్గ్రూప్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఎన్నికలు సజావు గా సాగేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో అదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ బి శ్రీనివాస్‌రెడ్డి, నాందేడ్ జిల్లా (బోకర్) అదనపు ఎస్పీ కేఏ ధరణి, నిజామాబాద్ జిల్లా అదనపు డిప్యుటీ కమిషనర్ జయరామ్, నిజామాబాద్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారి లావణ్య, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సీఐలు, రోడ్డు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పోలీసు అధికారులు సమీక్ష పాల్గొన్నారు. -
రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది
తమ ప్రాణాలను పణంగా పెట్టి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులను వివిధ అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో ఒక్క ముంబైలోనే 821 మంది పోలీసులు మృతి చెందినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి సగటున రెండు, మూడు రోజులకు ఒక పోలీసు మృతి చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై నిత్యం వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంటుంది. ముంబైలో నివాసముంటున్న దాదాపు కోటిన్నర జనాభాకు రక్షణ కల్పించాలంటే పోలీసులకు ఒక సవాలుగా మారుతుంది. సాధారణంగా పోలీసులపై నేరాలను నియంత్రించడం, శాంతి, భద్రతలు కాపాడటం, ట్రాఫిక్ నియమాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించడం తదితర కీలక బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలను నేరవేర్చే ప్రయత్నంలో పోలీసులు తమ ఆర్యోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదనంగా కొన్ని గంటలు విధులు నిర్వహించడం, పై అధికారుల ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత విశ్రాంతి లభించకపోవడం వంటి కారణాలతో పోలీసులు వివిధ అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా గుండెపోటు, రక్తపోటు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలతో ఐదేళ్లలో 821 మంది పోలీసులు మృత్యవాత పడ్డారు. ఇందులో అత్యధికంగా గుండెపోటుకు సంబంధించిన వేర్వేరు సమస్యలతో 168 మంది మృతి చెందారు. అదేవిధంగా కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ముంబై పోలీసు శాఖకు చెందిన 123 మంది చనిపోయారు. ఇదే ఐదేళ్ల కాలవ్యవధిలో 31 మంది పోలీసులు ఆత్యహత్య చేసుకున్నారు. అందుకు కుటుంబ కలహాలే ప్రధాన కారణం కాగా.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇందులో కేన్సర్, కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులున్నాయి. ఆత్మహత్యల్లో ఉరేసుకోవడం, భవనం పైనుంచి దూకడం, సరీ్వసు రివాల్వర్‌తో కాల్చుకోవడం, రైలు కింద పడటం లాంటి సంఘటనలున్నాయి. చదవండి: డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ! ఎప్పుడూ చర్చల్లోనే పోలీసులు.. ముంబై పోలీసుల ఆరోగ్య సమస్య అంశం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. అయినప్పటికీ నిర్లక్ష్యం జరుగుతోంది. 2018 నుంచి 2023 ఏప్రిల్ వరకు ఏకంగా 821 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడినట్లు అధికారికంగా లభించిన గుణంకాలు చెబుతున్నాయి. ముంబై నగరం ఎప్పుడు ఏదో కారణంతో బిజీగా ఉంటుంది. ఒకపక్క దేశ ఆర్థిక రాజధాని, మరోపక్క రాష్ట్ర రాజకీయాలకు ప్రధాన నిలయం కావడంతో తరుచూ వీఐపీల రాకపోకలు, రాజకీయ సభలు, సమావేశాలు, ప్రముఖుల భేటీ వల్ల వారికి బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ముంబై పోలీసులపై ఉంది. అంతేగాకండా వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఉంటాయి. దీంతో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసుల వారాంతపు, దీర్ఘకాలిక సెలవులు రద్దు చేస్తారు. అలాగే పోలీసులకు రోజుకు ఎనిమిది గంటలు విధులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. కానీ ప్రత్యక్షంగా అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. దీనికి తోడు ముంబై జనాభాతో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో పోలీసులపై అదనపు భారం పడుతుంది. ఫలితంగా వారి ఆర్యోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మండే ఎండలూ కారణమే.. గత రెండు నెలల నుంచి ముంబైలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీని ప్రభావం కూడా పోలీసుల ఆరోగ్యంపై పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 43 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇందులో ఏడుగురు పోలీసులు డ్యూటీలో ఉండగానే మృత్యువాత పడ్డారు. పోలీసులు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు పోలీసు సంక్షేమ శాఖ తరఫున అనేక సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలు, వర్క్‌షాపులు జరుగుతుంటాయి. కానీ అడపాదడపా చేపట్టడం వల్ల అనుకున్నంతమేర స్పందన రావడం లేదు. 2020–2022 కాలవ్యవధిలో ముంబైలోని ప్రముఖ టాటా కేన్సర్ ఆస్పత్రి 2,738 మంది పోలీసులకు కేన్సర్ పరీక్షలు నిర్వహించింది. 2023, ఫిబ్రవరిలో 15 రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయగా అందులో కేవలం 325 మంది పోలీసులు పాల్గొన్నారు. అదే నెలలో యునైటెడ్ వే తరఫున ఫస్ట్ ఎయిడ్ అంశంపై శిక్షణ శిబిరం జరిగింది. సుమారు 45 వేల మంది ముంబై పోలీసుల కోసం చేపట్టిన ఈ శిబిరం సఫలీకృతం కాలేదు. -
వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే?
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, మంత్రి ఏక్నాథ్ షిండే వర్గం మధ్య రోజరోజుకూ రాజకీయ వివాదం ముదురుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ముంబై పోలీసు కమిషనర్ నగరంలో 144 సెక్షన్ అమలుచేయడమే గాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంవల్ల ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. ఒకపక్క ఉద్దవ్ మద్దతుదార్లు, మరోపక్క షిండే వర్గం మద్దతుదార్లు పోటాపోటీగా ర్యాలీలు, ఆందోళనలు, బలప్రదర్శనలు చేస్తూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. దీనికితోడు తిరుగుబాటు మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకు కేంద్రం భద్రత మరింత పటిష్టం చేయడంతో ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎవరికి, ఎలాంటి భద్రత కల్పించారో అధ్యయనం చేస్తున్నట్లు పోలీసు శాఖకు చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. సంబంధిత వార్త: రెబెల్స్ ఎమ్మెల్యేలను రప్పించేందుకు సీఎం ఉద్దవ్ ఠాక్రే చివరి ప్రయత్నం! శాంతి భద్రతలపైనే దృష్టి... వారం రోజులుగా జరుగుతున్న ఎమ్మెల్యేల తిరుగుబాటు బెడద ఇంతవరకు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఈ వివాదం చట్టపరంగా తేలాలంటే కోర్టుకెక్కే ప్రమాదం ఉంది. ఏదేమైనా షిండే శిబిరంలో తలదాచుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కచ్చితంగా ముంబైకి రావల్సిందే. కేవలం మద్దతుదారులతో కూడిన లేఖ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి పంపిస్తే సరిపోదు. కోశ్యారీ ఎదుట లేదా మంత్రిమండలిలో షిందే తన బలాన్ని నిరూపించాలంటే తన వర్గంలోని ఎమ్మెల్యేందరూ హాజరు కావాల్సిందే. వీరంతా ఒకేసారి ముంబైకి వస్తే శివసైనికులు, ఇతర పార్టీల కార్యకర్తలు వారిపై దాడి చేయడం లేదా వారికి వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు కచ్చితంగా చేస్తారు. అదే సమయంలో శివసైనికులు, షిండే వర్గం కార్యకర్తలు పరస్పరంగా ఎదురుపడితే అప్పుడు పరిస్ధితి ఏంటి.. శాంతి, భద్రతలు కచ్చితంగా అదుపు తప్పే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా ఉండాలంటే ముంబై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అందుకు ముంబై పోలీసు శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైంది. ముంబై పోలీసు కమిషనర్ సంజయ్ పాండే ఇదివరకే రెండుసార్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. తాజా పరిస్ధితులపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించడంతో ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగే వాతావరణం కనిపించడం లేదు. చదవండి: Maharashtra Crisis: ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు.. రాజకీయ వివాదం సద్దుమణిగేదాకా ఈ పరిస్ధితి ఇలాగే ఉంటుందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుదారులు ముంబైకి వస్తే శాంతి, భద్రతల అంశం తెరమీదకు రానుంది. ముంబైలో పరిస్ధితులు అదుపుతప్పి అల్లర్లకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పాండే నిర్ధేశించినట్లు తెలిసింది. అవసరమైతే అదనంగా వివిధ భద్రతా బలగాలను సమకూర్చునేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. -
వినోద్ కోసం ‘మహా’ పోలీసుల వేట!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయిన డ్యాన్స్ మాస్టర్‌ను డ్రగ్ పెడ్లర్‌గా మార్చిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న వినోద్ కోసం మహారాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇతడి మాజీ సహోద్యోగి అయిన కూకట్పల్లి వాసి శివశంకర్‌ను నాగ్‌పూర్‌లోని బెల్ట్రారోడి పోలీసులు గత వారం అరెస్టు చేశారు. ఇతడి విచారణలోనే నగరానికి చెందిన వినోద్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ నుంచి ఓ ప్రత్యేక బృందం సిటీకి చేరుకుని గాలింపు చేపట్టింది. వరంగల్‌కు చెందిన ఇసాంపల్లి శివశంకర్ భార్య ఇద్దరు పిల్లలతో కూకట్పల్లి పరిధిలోని రామ్‌నగర్‌లో నివసిస్తూ అక్కడి ఓ ప్రముఖ పాఠశాలలో డ్యాన్స్ టీచర్‌గా చేరాడు. అయితే గత ఏడాది లాక్డౌన్ ఎఫెక్ట్ ఇతడిపై పడింది. పాఠశాల మూతపడటంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న ఇతగాడికి తన మాజీ సహోద్యోగి వినోద్ తారసపడ్డాడు. తాను మరికొందరితో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నానంటూ చెప్పిన వినోద్ సహకరించాలని కోరాడు. దీనికి శివశంకర్ అంగీకరించడంతో తాము గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను నింపిన కారు అందిస్తామని, దాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి రిసీవర్లకు ఇచ్చి రావాలంటూ వినోద్ చెప్పాడు. ట్రిప్పుకు రూ.10 వేలు చెల్లిస్తాననటంతో శివశంకర్ అంగీకరించాడు.ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని వార్ధా రోడ్డులో ఉన్న పంజారి ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డాడు. ఆ ప్రాంతంలో రాత్రి వేళ లాక్డౌన్ అమలులో ఉండటంతో బెల్ట్రారోడి పోలీసులు వివిధ ప్రాంతాల్లో నాకాబందీలు ఏర్పాటు చేశారు. ఓ పికెట్‌లో ఉన్న పోలీసులను చూసిన శివశంకర్ కారును వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడు. అదుపులోకి తీసుకొని రూ.13.73 లక్షల విలువైన 91 కేజీల గంజాయి, గుర్తు తెలియని మాదకద్రవ్యాలు వెలుగులోకి వచ్చాయి. శివశంకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో బెల్ట్రారోడి పోలీసులకు చెందిన బృందం నగరానికి చేరుకుని గాలిస్తోంది. ఈ వ్యవహారం వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. శివశంకర్ నడిపిన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ తరచు నగరానికి వచ్చివెళ్లడమో, ఇక్కడి వారి వద్దే ఉండటమో జరిగిందని భావిస్తున్నారు. గత నెల 11న ఈ వాహనం రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లో వెళ్తుండగా మేడ్చెల్ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీసు కెమెరాకు చిక్కింది. ఈ నేపథ్యంలోనే దీనిపై అధికారులు రూ.1100 జరిమానా కూడా విధించారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు వినోద్ లేదా ఆ ముఠాకు చెందిన మరో వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని అనుమానిస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న ‘గసగసాల’ నిందితుల అరెస్టులు -
‘అందుకే నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు’
ముంబై : ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడాన్ని ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. అర్నాబ్‌ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేశారని అన్వే నాయక్ భార్య అక్షత, కూతురు అద్య్నా నాయక్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఆడపడుచుకు ఇచ్చిన మాటను పోలీసులు నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అర్నాబ్‌పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) కాగా, రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్.. 2018లో తన తల్లి కుముద్ నాయక్‌తో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించడంతో మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. అయితే మన విజ్ఞప్తికి స్పందించి అర్నాబ్‌ను అరెస్ట్ చేసినందుకు మహారాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి : ఎమర్జెన్సీని గుర్తు చేసింది : అమిత్‌షా) ‘ నా భర్త సూడైడ్ నోట్లో ముగ్గురి పేర్లు ఉన్నాయి. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని 2018 నుంచి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. నా భర్త ఆత్మహత్య వెనుక అర్నాబ్ గోస్వామి హస్తం ఉంది. అతనిపై చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయాలి. అర్నాబ్‌కు ఒక్కరు కూడా సహాయం చేయొద్దని భారతీయులందరికి విజ్ఞప్తి చేస్తునా. మహారాష్ట్ర పోలీసులు మాకు న్యాయం చేశారు. అర్నబ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని అన్వే నాయక్ భార్య అక్షత మీడీయాతో పేర్కొన్నారు. ‘ మా నాన్న తన డబ్బు, శ్రమను రిపబ్లిక్ టీవీ స్టూడియో ప్రాజెక్టు కోసం ఖర్చు చేశాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ, గోస్వామి నా తండ్రికి బకాయిలు అందకుండా చూసుకున్నాడు. డబ్బులు అడిగితే మా నాన్న కెరీర్‌తో పాటు నా కెరీర్‌ను నాశనం చేస్తాని బెదిరించాడు. అందుకే మా నాన్న చనిపోయాడు’ అని అన్వే నాయక్ కూతురు అద్న్యా అన్నారు. అర్నాబ్‌పై మరో కేసు ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మరో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో అర్నాబ్ ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌పై ఆయన దాడికి పాల్పాడ్డారని మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
అమ్మ దొంగా! చిల్లర అడిగి మరీ..
థానే : కిరాణా వ్యాపారస్తులే టార్గెట్‌గా దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నలసోపరాకు చెందిన మనీష్ అంబేకర్ గొంతు మార్చి మహిళా గొంతుతో చుట్టుపక్కల కిరాణా షాపులకు ఫోన్ చేసేవాడు. కొంత సామాగ్రిని ఆర్డర్ చేసి ఇంటికి తీసుకురావాలని దగ్గరలో ఉన్న ఓ ఇంటి అడ్రస్ చేప్పేవాడు. అలాగే సామాగ్రితో పాటు తనకు రెండు వేల రూపాయల చిల్లర కావాలని అడిగేవాడు. (చదవండి : 25 కత్తిపోట్లు, కామాంధుడు హతం!) ఎలాగో సామాగ్రి కొన్నారు కదా చిల్లర ఇద్దామని రూ.2000 లకు సరిపడా చేంజ్ ఇచ్చి డెలివరీ బాయ్‌ని పంపేవారు. ఆ డెలివరీ బాయ్ చెప్పిన అడ్రస్‌కు రాగానే మనీష్ ప్రత్యేక్షమయ్యేవాడు. మీకు ఫోన్ చేసిన మహిళ నన్ను పంపిదంటూ.. సామాగ్రి తీసుకునేవాడు. అలాగే రెండువేల చిల్లర కూడా ఇవ్వమని అడిగేవాడు. డెలివరీ బాయ్ చేంజ్ ఇవ్వగానే మహిళను అడిగి రెండు వేల రూపాయల నోటు తీసుకొస్తానని చెప్పి ఉడాయించేవాడు. అలా ఆ ఏరియాలో పలువురు కిరాణాదారులను, బంగారు షాపు , మెడికల్ షాపు యజమానులకు టొకరా పెట్టాడు. దీంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పక్కా ప్లాన్‌తో అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి లక్షా 60 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. -
మావోయిస్టు నేత దేవ్‌జీ భార్య ఎన్కౌంటర్
కాళేశ్వరం/కోరుట్ల/చర్ల: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ భార్య సృజనక్క (48) ఎన్కౌంటర్లో మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా జారవండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీన్‌బట్టి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బాల్కావుడే కథనం ప్రకారం.. మావోయిస్టులు రహస్య ప్రదేశంలో సమావేశమైనట్లు సమాచారం రావడంతో శనివారం సాయంత్రం పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టు కసన్సూర్ దళం డివిజన్ ఇన్చార్జి సృజనక్క అలియాస్ చిన్నక్క అలియాస్ చైతు ఆర్కా మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారని పేర్కొన్నారు. సృజనక్క ఇరవై ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తోందని, ఆమెపై రూ.16 లక్షల రివార్డు ఉందని, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. సంఘటన స్థలంలో ఏకే 47, ప్రెషర్ కుక్కర్, క్లైమోర్మైన్, విప్లవ సాహిత్యాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవ్‌జీది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల కాగా, సృజనక్క స్వస్థలం గడ్చిరోలి జిల్లా అహేరి. కొన్నేళ్లుగా వీరిద్దరు మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. -
బెయిల్‌పై ఇలా.. కస్టడీకి అలా..!
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ చంచల్‌గూడ జైలు నుంచి గురువారం ఇలా బయటకు వచ్చి... అలా అరెస్టయ్యారు. ఈమెపై ఇక్కడ నమోదైన కేసుల్లో హైకోర్టు గత వారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో బయటకు వచ్చిన ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఆ రాష్ట్రంలో నౌహీరాపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు 2018 అక్టోబర్ 16న అరెస్టు చేశారు. ఆపై దేశ వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో వరుస అరెస్టులు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర, బెంగళూరుల్లోని జైళ్లకు వెళ్లి వచ్చిన నౌహీరా చంచల్గూడలోని మహిళా జైలుకు చేరారు. ఈమెపై నమోదైన కేసుల్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (ఎస్ఎఫ్ఐఏ) బదిలీ చేసిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ గత నెలాఖరి వారంలో ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదల కావడానికి రూ.5 కోట్లు డిపాజిట్ చేయాలని, రెండు పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. ఈ నిబంధనలను పూర్తి చేసిన నౌహీరా షేక్ గురువారం విడుదలయ్యారు. ఆమెకు తెలంగాణలో బెయిల్ మంజూరైన విషయం తెలుసుకున్న ముంబై ఎకనమికల్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు పీటీ వారంట్లతో చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు వస్తున్న నౌహీరాను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో అక్కడకు తరలించారు. అక్కడి కోర్టులో శుక్రవారం హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద నౌహీరాను అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆమె న్యాయవాదులకు, మహారాష్ట్ర పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. -
బాయ్‌ఫ్రెండ్‌తో బయటకెళ్లి..
నాగ్‌పూర్ : బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన ఓ యవతి.. ఇంట్లో ఈ విషయాన్ని దాచేందుకు కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఓ యువతి తల్లిదండ్రులు సోమవారం నాగ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కళాశాలకు వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కారులో ఆమెను బలవంతంగా ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని.. ఈ క్రమంలో వారినుంచి ఆమె తప్పించుకొని సురక్షితంగా బయటపడిందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. అసలు కిడ్నాపే జరగలేదని, యువతి కావాలనే ఫేక్ కిడ్నాప్ స్టోరీని అల్లిందని తేల్చారు. కిడ్నాపర్లు ఎక్కడికి తీసుకెళ్లారో యువతిని అడిగిన పోలీసులు ఆ ఘటనా స్థలానికి ఆమెను తీసుకొని వెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాగ్‌పూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని యువతిని విచారించారు. ఈ క్రమంలో ఆమె చెప్పిన సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో అనుమానం వచ్చి కాలేజీ వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ రోజు తరగతులు పూర్తయిన తర్వాత యువతి ఓ వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు ప్రశ్నించగా తాను కట్టుకథ చెప్పినట్టు అంగీకరించిందని వివరించారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యువతి నాగ్‌పూర్ నగర శివారుకు వెళ్లిందనీ.. ఆ తర్వాత అతడే ఇంటి వద్ద వదిలి వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. తాను బయటకు వెళ్లినట్టు తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారని భయపడి యువతి ఈ కిడ్నాప్ నాటకమాడిందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేశారని చెబితే విని ఊరుకుంటారని యువతి భావించిందనీ.. అయితే వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం డ్రామా బయటపడిందని వివరించారు. ఈ వ్యవహారంపై ఇంకా ఎలాంటి కేసూ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. -
‘మహా’ పోలీసుల అదుపులో మావో అగ్రనేతలు
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో పనిచేస్తున్న కిరణ్ కుమార్ (63), అతని భార్య నర్మద (60)ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిద్దరూ ఏప్రిల్ 9న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిపై జరిగిన బాంబు దాడి అమలు వ్యూహంలో నిందితులుగా ఉన్నారు. అలాగే గడ్చిరోలిలో 16 మంది మృతికి వీరు కారణమయ్యారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు వీరి కోసం గాలిస్తూ ఎట్టకేలకు పట్టుకున్నారు. కిరణ్ అలియాస్ కిరణ్ దాదా మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నారు. అతనిపై రూ. 20 లక్షలకు పైగా రివార్డు ఉంది. కిరణ్‌తో పాటు అతని భార్య విజయవాడకు చెందిన మహిళగా గుర్తించారు. 2019 మే 1వ తేదీన గడ్చిరోలిలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేయగా 16 మంది పోలీసులు దుర్మరణం చెందారు. ఈ దాడికి మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ కిరణ్ వ్యూహం అమలు పరిచినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. -
మహారాష్ట్రలో మన మద్యం పట్టివేత
బేల(ఆదిలాబాద్): బేల మండల కేంద్రానికి దగ్గర్లో ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చంద్రపూర్ జిల్లాలోని కోర్పణ పట్టణ సమీపంలోని సావల్‌హీర గ్రామ రోడ్డు మార్గంలో మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అక్కడి పోలీసులు పట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లుగా మద్యపాన నిషేధం అమలులో ఉన్న చంద్రపూర్ జిల్లా సావల్‌హీర ప్రాంతం వైపు బేల మండలకేంద్రం నుంచి తరలిస్తుండగా తెలియవచ్చిన ఈ ఘటనపై స్థానికంగా రచ్చరచ్చ జరుగుతోంది. అక్కడి లెక్కల ప్రకారం ఈ మద్యం విలువ రూ.6,44,400 ఉంటుందట! ఆరేడు నెలల నుంచి వారంలో ఒకట్రెండుసార్లు ఈ తరలింపు మాములేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోనూ ఎన్నికల ఎలక్షన్ కోడ్ ఉండగానే ఈ అక్రమ తరలింపు జరగడం గమనార్హం! పట్టుబడ్డ మద్యం వివరాలు ఐబీ క్వాటర్లు 39 పెట్టెలు (1872క్వాటర్లు), రాయల్ స్టాగ్ ఫుల్‌బాటిళ్లు 20, ఐబీ ఫుల్‌బాటిళ్లు 24తోపాటు మరో 24 ఆఫ్ బాటిళ్ల రాయల్ స్టాగ్ మద్యాన్ని పట్టుకున్నారు. వీటి మొత్తం ఇక్కడి విలువ ప్రకారం రూ.2.86 లక్షలు కాగా, అక్కడి ప్రకారం రూ.6,44,400 ఉంటుందని ఓ మహా రాష్ట్ర పోలీసు అధికారి వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారిలా.. బేల మండల కేంద్రంలోని రెండు వైన్సుల్లో నౌకరీనామాతో పని చేస్తున్న పలువురు ఎప్పటిలాగే ఈసారి మద్యాన్ని మండలంలోని చప్రాల, చంపె ల్లి, భవానీగూడ(సి) గ్రామాల మీదుగా మహారా ష్ట్రలోని తిప్ప, మాంగల్‌హీర, సావల్‌హీర ప్రాంతా నికి ఎంహెచ్ 04 ఈఎస్ 9510 నంబరు గల ప్రత్యేక టవేరా వాహనంలో గత సోమవారం రాత్రి పకడ్బందీగా తరలించారు. అయినా, ఈ సమాచారం ఎక్కడ లీకైందో గానీ పక్కా సమాచారం తెలుసుకున్న మహారాష్ట్రలోని కోర్పణ పోలీసులు మాంగల్‌హీర ప్రాంతంలో ఈ మద్యం వాహనాన్ని ఆపి తనిఖీ చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆగకుండా వేగంగా దూసుకుపోవడంతో అధికారులు ఆ వాహనాన్ని వెంబడించా రు. ఈ క్రమంలో సావల్‌హీర ప్రాంతం సమీప రోడ్డు మార్గంలో గుంతలు తవ్వి ఉండడంతో, వాహనాన్ని వదిలేసి అందులో ఉన్నవారు పరారయ్యారు. దీంతో అధికారులు వాహనంతోపాటు అందులో తరలిస్తున్న మద్యాన్ని, వాహనంలో దొరికిన ఒక సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ సంఘటనపై సదరు పోలీస్‌స్టేషన్ సీఐ కిశోర్కార్ను ‘సాక్షి’ వివరణ కోరగా అక్రమ మద్యాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు స్పస్టం చేశారు. సీజ్ చేయబడిన మద్యం, సెల్‌ఫోన్, వాహనం విలువ మొత్తంగా రూ.11,45,400 ఉంటుందని ఆయన వివరించారు. ఈ మద్యం తరలింపుదారులు మా త్రం పరారయ్యారనీ, సీజ్ చేసి సెల్‌ఫోన్ డాటా అధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ సీఐ వెల్లడించారు. ఫోన్ తాలుకు నిందితుడిని త్వరలోనే పట్టుకుని, తర్వాత మిగతా నిందితులను సైతం అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
‘ఓటీపీ అడిగితే.. అభినందన్ డైలాగ్ చెప్పండి’
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీ పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వినూత్నంగా ఆలోచించారు. ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడానికి భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ చెప్పిన డైలాగ్‌తో ప్రచారం చేశారు. శత్రు చెరలో బందీగా ఉండి కూడా దైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ను చూసి దేశం మొత్తం గర్వించిన సంగతి తెలిసిందే. మాతృ దేశంపై దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను తిప్పికొడుతున్న క్రమంలో ఆయన విమానం పాక్ భూభాగంలో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆయన.. పాక్ సైన్యం చేతికి చిక్కారు. ఆ తర్వాత ఆయన్ని బందీగా చేసుకుని పాక్ సైన్యం నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. దాయాది దేశం ఎన్ని చిత్ర హింసలు పెట్టిన ఆయన వాటికి తట్టుకుని నిలబడ్డారు. పాక్ సైనిక అదికారులు అభినందన్‌ను విచారిస్తున్న సమయంలో తన మిషన్ గురించి వివరాలు రాబట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. వారు ఎంతగా ప్రయత్నించిన అభినందన్ మాత్రం ‘అవన్నీ నేను మీకు చెప్పకూడదు(I am not supposed to tell you this)’ అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు కూడా తాను శత్రు దేశం చెరలో ఉన్నానని భయపడకుండా, ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాక్.. అభినందన్‌ను రోజున భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్‌పూర్ పోలీసులు ‘ఓటీపీ’లతో జరుగుతున్న మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అభినందన్ చెప్పిన మాటలను ఉపయోగించారు. దుండగులు బ్యాంకుల పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ చేసి వినియోగదారుల నుంచి ఓటీపీలను సేకరించి వారి ఖాతాల నుంచి డబ్బును దోచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇటువంటి మోసాలు అధికంగా జరుగుతుండటంతో.. ఇకపై ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే.. అభినందన్ చెప్పినట్టు ఈ వివరాలు నేను మీకు చెప్పకూడదనే సమాధానం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ మేరకు నాగ్‌పూర్ పోలీసుల చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పోలీసులు ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. When someone asks for your OTP : "I am not supposed to tell you this"#WelcomeHomeAbhinandan 🇮🇳#NagpurPolice — NagpurCityPolice (@NagpurPolice) March 1, 2019 -
హైదరాబాద్: విరసం నేత వరవరరావు అరెస్ట్
-
అరెస్ట్‌పై హైకోర్టుకు వరవరరావు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసులు తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. వరవరరావు అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, చిక్కడపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతోపాటు మహారాష్ట్ర విశ్రాంబాగ్ ఎస్హెచ్ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన అరెస్ట్‌తోపాటు తనను పుణేకు తరలించేందుకు వీలుగా హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ ఏడాది ఆగస్టు 28న జారీచేసిన ట్రాన్సిట్ రిమాండ్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వరవరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.సురేశ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఆగస్టు 28న తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు కలిసి వరవరరావు ఇంటిలో సోదాలు నిర్వహించి, అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారన్నారు. ఇలా మరికొందరిని కూడా అరెస్ట్ చేశామని, తర్వాత వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని కోర్టుకు నివేదించారు. దీంతో అరెస్టయిన వారిలో ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారన్నారు. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ వ్యక్తి విడుదలకు ఆదేశాలిచ్చిందని, ఈ నేపథ్యంలో పిటిషనర్ కూడా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. -
12 వరకూ గృహనిర్బంధం
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతో అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 12 వరకూ పొడిగించింది. ఈ సందర్భంగా పోలీసులు మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి కేసు వివరాలను వెల్లడించడంపై కోర్టు మండిపడింది. పుణె ఏసీపీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అత్యున్నత న్యాయస్థానానికే దురుద్దేశాలు అంటగడుతున్నారని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న అంశాలపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీ పోలీసులకు చెప్పండి. ఈ కేసు విచారణ ఇప్పుడు మాముందు ఉంది. మేము తప్పు చేస్తున్నామని పోలీసుల నోటి నుంచి వినాలనుకోవడం లేదు’ అని మహారాష్ట్ర తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న జరిగిన ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా మావోలతో కలసి హింసకు కుట్ర పన్నారని విరసం సభ్యుడు వరవరరావు, వెర్మన్ గంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా వంటి హక్కుల కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర పోలీసులపై బాంబే హైకోర్టు సీరియస్
-
మహారాష్ట్ర పోలీసులకు బాంబే హైకోర్టు షాక్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర పోలీసులకు మరోసారి షాక్ తగిలింది. దేశ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అయిదుగురు పౌరహక్కుల నేతల అరెస్టుల కేసులో రాష్ట్ర పోలీసుల వ్యవహరాన్ని కోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పరంబీర్ సింగ్ మీడియా సమావేశంపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమర్ధించింది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించడాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఒకవైపు ఈ కేసును ఇన్ కెమెరా విచారణను కోరుతున్న పోలీసులు మరోవైపు మీడియా సమావేశంలో సాక్ష్యాలను బహిరంగ పర్చడటంపై పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కోరారు. దేశవ్యాప్తంగా పౌరహక్కుల నేతల ఇళ్లలో సోదాలు, అరెస్టుల పర్వాన్ని సమర్ధించుకున్న రాష్ట్ర ఏడీజీ పరంబీర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. వీరికి మావోయిస్టులకు సంబంధాలున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయనీ, అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. తమవద్ద వేలకొద్దీ సాక్ష్యాలున్నాయంటూ కొన్ని లేఖలను మీడియా ముందు ప్రదర్శించారు. కాగా భీమా కోరేగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర చేసారనే అభియోగాలతో విప్లవకవి వరవరరావుతోపాటు, సుధా భరద్వాజ్, గౌతం నావ్లాక్, తెల్తూంద్డే, వెర్నన్ గొన్జాల్వేస్‌ను పుణే పోలీసులు గతవారం అరెస్ట్ చేసింది. అయితే ఈ అరెస్టులపై వచ్చిన అభ్యంతరాలను సమర్ధించిన సుప్రీంకోర్టు వీరిని సెప్టెంబరు 6వరకు హౌస్ అరెస్ట్‌లోఉంచాల్సిందిగా ఆదేశించింది. గత జూన్‌లో మావోయిస్టు వ్యతిరేక దాడుల్లో పూణే పోలీసులు ముంబై కు చెందిన సుధీర్ దవాలేను, ఢిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర గడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, నాగపూర్ నుంచి ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్‌ను అరెస్టు చేసారు. మరోవైపు ఇది బీజేపీ రాజకీయ కుట్ర అని ఆ లేఖలన్నీ కల్పితాలనీ న్యాయమూర్తి సుధా భరద్వాజ్ ఖండించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేతకు యత్నమని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
పౌర హక్కుల నేతల అరెస్టు: సంచలన ఆరోపణలు
ముంబై: దేశవ్యాప్తంగా అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ హింసాకాండకు సంబంధించి దేశవ్యాప్తంగా హక్కుల నేతల ఇళ్లపై దాడులు, అరెస్టులపై చెలరేగిన విమర్శలు, కోర్టు మొట్టికాయల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం స్పందించారు. మహారాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పరమ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ హత్య తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే తాము ఈ అరెస్టులు చేశామన్నారు. మావోయిస్టులు, పౌర హక్కుల నేతలకు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుర్తాలకు సంబంధించిన లేఖలు తమకు లభించాయన్నారు. ఈ లేఖలను ఏడీజీ తన ప్రెస్మీట్లో మీడియా ముందు ప్రదర్శించారు. ఇప్పటివరకు తాము సేకరించిన లేఖలు కొన్ని వేలు ఉన్నాయనీ, అందులో ముఖ్యమైన వాటినే మీడియా ముందు ఉంచుతున్నామని తెలిపారు. అయితే మావోయిస్టుల కుట్రలకు పౌర హక్కుల నేతలు సహకరించారన్నారని ఈ లేఖలు స్పష్టం చేస్తున్నాయని పరమ్ బీర్ సింగ్ చెప్పారు. ముఖ్యంగా సుధా భరద్వాజ్ కామ్రేడ్ ప్రకాశ్‌కు ఒక లేఖ రాశారనీ, హక్కుల దుర్వినియోగంపై సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో అందులో రాశారన్నారు. శత్రువులకు వ్యతిరేకంగా తమ పని మొదలైందని కూడా ఆమె రాశారని ఏడీజీ పేర్కొన్నారు. మావోయిస్టు నేతలు, ఇతర సంస్థలతో కలిపి మయన్మార్‌లో రహస్యంగా సమావేశమయ్యారనీ, జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో భారీ ఎత్తున కుట్ర చేశారని, గ్రెనేడ్ లాంచర్స్ లాంటి ఆయుధాల కొనుగోలుకు నిధులు సేకరించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీమా కోరేగావ్ అల్లర్లలో అరెస్టయిన కేడర్ కోసం మావోయిస్టు సెంట్రల్ కమిటీ రూ.15 లక్షల మంజూరు చేసిందన్నారు. 2017, డిసెంబర్ 31వ తేదీన బీమా కోరేగావ్‌లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన కేసును జనవరి 8వ తేదీన నమోదు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేయడం వల్ల కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఏడీజీ తెలిపారు. కాగా, భీమా కోరెగావ్ హింసాకాండ కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావు, అరుణ్ పెరీరా, గౌతమ్ నవ్లఖా, వెర్నాన్ గొంజాల్విస్, సుధా భరద్వాజ్ లను పుణే పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ తేదీ (సెప్టెంబరు 6) వరకు వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని బుధవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరంతా గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. -
వరవరరావుపై ఆందోళన వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావును పోలీసులు బహిరంగంగానే అరెస్ట్ చేసినందున ఆయన ప్రాణాలకు హాని ఉంటుందనే అందోళన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఒక వైపు జాతి ప్రయోజనాలు–మరోవైపు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సున్నిత అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట నిబంధనలకు అనుగుణంగానే వరవరరావును అరెస్ట్ చేశారో లేదో అనే అంశంపైనే విచారణ జరపాల్సివుందని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్ర పోలీసులు తన భర్త వరవరరావును అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పి.హేమలత అత్యవసర వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని బుధవారం ధర్మాసనం విచారిస్తూ.. వరవరరావు అరెస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వరవరరావును అరెస్ట్ చేసి మహారాష్ట్ర తీసుకువెళ్లేప్పుడు ఇచ్చిన ట్రాన్సిస్ట్ ఆర్డర్ కాపీని తెలుగులో అనువదించి హేమలతకు అందజేయాలని తెలంగాణ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ అరెస్ట్‌పై కౌంటర్ వేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మహారాష్ట్ర డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ట్రాన్సిస్ట్ ఆర్డర్ మరాఠీ బాషలో హేమలతకు అందజేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ చెప్పడంతో ధర్మాసనం పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకోడానికి కారణం చెప్పలేదనీ, మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్‌లో గత జనవరిలో జరిగిన అల్లర్లకు వరవరరావుకు సంబంధం లేదని, ఆ కేసులో ఆయన పేరు కూడా లేదని సురేష్ ధర్మాసనానికి చెప్పారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
విరసం నేత వరవరరావు అరెస్ట్
పుణే, న్యూఢిల్లీ, ముంబై, రాంచీ, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టులు సంచలనం సృష్టించాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో వారి నివాసాలపై పుణే పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గతేడాది డిసెంబర్లో మహారాష్ట్రలోని కోరెగావ్–భీమాలో చెలరేగిన హింసాత్మక ఘటనల కేసు విచారణలో భాగంగా ఈ దాడులు కొనసాగగా.. విరసం నేత వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్, గౌతం నవలఖాల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ అరెస్టుల్ని మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు, అభ్యుదయ రచయితలు, న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ చర్యలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, ప్రజామద్దతు కోల్పోతున్నామనే భయంతోనే అరెస్టులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఏకకాలంలో పలు నగరాల్లో సోదాలు గతేడాది డిసెంబర్ 31న పుణేకి సమీపంలోని కోరెగావ్–భీమా గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణే పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం(విప్లవ రచయితల సంఘం)నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖా ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో వరవరరావు, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్, ముంబైలో ఫెరీరా, గొంజాల్వెజ్, ఢిల్లీలో నవలఖాలపై ఐపీసీలోని 153(ఏ), ఇతర సెక్షన్లతో పాటు, మావోలతో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే నవలఖాను బుధవారం ఉదయం వరకూ ఢిల్లీ నుంచి బయటకు తీసుకెళ్లద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నవలఖా తరఫున ఆయన న్యాయవాది వరిషా ఫరాసత్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్‌పై కూడా పంజాబ్, హరియాణా హైకోర్టు స్టే విధించింది. మరోవైపు హైదరాబాద్‌లో క్రాంతి టేకుల, కూర్మనాథ్, రాంచీలో సుసాన్ అబ్రహం, ఫాదర్ స్టాన్ స్వామి, గోవాలో ఆనంద్ టెల్టుంబ్డే ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మావోలతో సంబంధాలున్నాయనే అరెస్టు చేశాం: పోలీసు వర్గాలు ‘ఈల్గర్ పరిషద్ ఆందోళనలతో సంబంధాలపై దర్యాప్తు చేయగా ... నిషేధిత సంస్థ సభ్యులకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. దాని ఆధారంగా పోలీసులు చత్తీస్‌గఢ్, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు’అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టులతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లతో పాటు.. జూన్‌లో అరెస్టైన ఐదురుగు వ్యక్తులతో ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా సంబంధమున్న వారి ఇళ్లలోను సోదాలు జరిగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దాడుల్లో నిషేధిత సంస్థలతో సంబంధాలపై కొన్ని పత్రాల్ని స్వాధీనం చేసుకున్నామని, వారి ఆర్థిక లావాదేవీల్ని, ఫోన్ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా కొద్ది నెలల క్రితం మహారాష్ట్ర పోలీసుల తనిఖీల్లో దొరికిన రెండు లేఖల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హత్యకు మావోయిస్టుల కుట్ర పన్నారన్న సమాచారం నేపథ్యంలోను ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కోరెగావ్–బీమా కేసు దర్యాప్తులో భాగంగానే.. కోరెగావ్–బీమా హింసతో సంబంధమున్న అనుమానంతో ఈల్గర్ పరిషద్‌కు చెందిన ఐదుగురు కార్యకర్తల్ని ఈ ఏడాది జూన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దళిత కార్యకర్త సుధీర్ ధావలేను ముంబైలోని తన ఇంట్లో అరెస్టు చేయగా.. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, కార్యకర్తలు మహేశ్ రౌత్, షోమా సేన్లను నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇక న్యాయవాది రోనా విల్సన్‌ను ఢిల్లీలోని తన ఇంట్లో అరెస్టు చేశారు. వారికి మావోలతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విల్సన్ ఇంట్లో సోదాల్లో దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని అప్పట్లో పుణే పోలీసులు ప్రకటించారు. రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నినట్లు ఆ లేఖలో ఉందని పోలీసులు చెప్పడం అప్పట్లో సంచలనమైంది. భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ విమర్శించారు. దళితులు వర్సెస్ పీష్వాలు దళిత సైనికుల సాయంతో జనవరి 1, 1818న పీష్వా పాలకుల్ని బ్రిటిష్ సైన్యం ఓడించింది. పీష్వా పాలకులపై విజయానికి చిహ్నంగా దళిత సంఘాలు ఏటా మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తాయి. గతేడాది డిసెంబర్ 31న ఆ వేడుకల్లో హింస నెలకొంది. కొన్ని హిందూసంస్థలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో విధ్వంసం చోటుచేసుకుంది. ముంబయితో పాటు పలు ప్రాంతాలకు అల్లర్లు వ్యాపించడంతో మూడు రోజులు మహారాష్ట్ర స్తంభించింది. భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ విమర్శించారు. -
రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రజాసంఘాల పిలుపు
సాక్షి, హైదరాబాద్ : విరసం నేత వరవరరావు అరెస్ట్‌కు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వరవరరావు అరెస్ట్‌పై ఎవరేమన్నారంటే.. ప్రో. హరగోపాల్ : దేశ వ్యాప్తంగా దాడులు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులను ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గేస్తుంది. పూణే పోలీసులు హైదరాబాద్‌లో చేస్తున్న సోదాలపై డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ ఎవరూ అందుబాటులోకి రాలేదు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము. కేసీఆర్ కోసం ఉద్యమం చేయలేదు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలా దాడులు చేయలేదు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తాము. వరవరరావు అరెస్ట్‌పై ప్రజా సంఘాలు : ప్రజల హక్కుల గురించి మాట్లాడితే ప్రభుత్వం ఇలా దాడులు చేస్తుందని హెచ్చరికలు పంపింది. ఉదయం 6గంటల నుండి దేశ వ్యాప్తంగా దాడులు జరిపారు. వరవరరావు ఇంట్లోకి ప్రవేశించిన మహారాష్ట్ర పోలీసులు ల్యాండ్ లైన్ ఫోన్ వైర్ కట్ చేశారు. వరవరరావు, అతని భార్య హేమలత సెల్ ఫోన్స్ లాక్కున్నారు. ఎవరితో మాట్లాడకుండా 8గంటల పాటు తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు బంధించారు. క్రాంతితో పాటు అతని బందువుల ఇళ్లపై దాడి చేశారు. జూన్ 6న కూడా ఇదే తరహాలో దాడులు చేశారు. భీమా కోరేఘం పేరుతో రాంచీ, మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్‌లో అరెస్టులు చేశారు. లెటర్లు అన్ని బోగస్ దొంగ ఉత్తరాలు. మోదీ తన గ్రాఫ్ పడిపోతుందని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అబద్ధపు ఉత్తరం మీద అక్రమ కేసులు పెట్టారు. కోర్టులో ఇలాంటి కేసు నిలబడదు. ఇంట్లో సోదాలు చేసి పంచనామా రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. వారి వద్ద ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేదు. మాట్లాడే వాళ్లను భయపెట్టే భాగంలో ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ఖండిస్తున్నాము. వరవరరావు భార్య హేమలత : 50 ఏళ్లుగా అరెస్టులు చేస్తున్నారు. 25 కేసులు పెట్టారు. తప్పుడు కేసులన్ని కోర్టులో వీగిపోయాయి. ఇంట్లో అణువణువు గాలించారు. మా కూతుళ్ల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అరెస్టులు మాకు కొత్త కాదు. 70 ఏళ్ల మనిషి.. అనారోగ్యంతో బాధపడుతున్నడు(కన్నీళ్లు తుడుచుకుంటూ). అక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో. క్రాంతి(జర్నలిస్ట్) : రాత్రి 8 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి ఫోన్లు లాక్కున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఓ కాగితం చేతిలో పెట్టి 20మంది తెల్లవార్లు సోదాలు చేశారు. మా అమ్మ హార్ట్ పేషెంట్ అని చూడకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఎఫ్ఐఆర్లో పెరు లేకుండా తన ఇంట్లో సోదాలు చేశారు. నా వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం లాగేసుకున్నారు. పలాన కేసు విషయంలో సోదాలు చేస్తున్నామనే విషయాన్ని కూడా చెప్పలేదు. కుర్మా నాథ్ (జర్నలిస్ట్) : మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు 5 గంటలపాటూ మా ఇంట్లో చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆంధ్రపాలకుల సమయంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చేయలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే సందర్భంలో అతని వ్యతిరేక శక్తులు ఉండోదనే మోదీని ప్రసన్నం చేసుకున్న కేసీఆర్ ఈ దాడులు చేయించారు. ఇంట్లో ఉన్న విలువైన మా వ్యక్తి గత సమాచారాన్ని ఎత్తుకెళ్లారు.