కామారెడ్డి: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో చేపట్టే పకడ్బందీ చర్యలపై శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సాలూర రోడ్డులోని ఎన్‌ఎన్ కన్వెన్షన్ హాలులో మహారాష్ట్ర పోలీసులతో పాటు, రాష్ట్రంలోని ఆరు జిల్లాల ఎస్పీల సమావేశం జరిగింది. సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడు తూ రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు పటిష్ట నిఘా పెట్టాలన్నారు. మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలన్నారు. నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాందేడ్ జిల్లా సరహద్దుల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చెక్ పోస్టులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసుకొని నిరంతరాయంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు.
నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో ఇరు జిల్లాల, రాష్ట్రాల అధికారులు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులైన సాలూర, కండ్గావ్, కందకుర్తి, పోతంగల్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు అంతర్ జిల్లా చెక్ పోస్టులు డోడ్గాన్ (సోన్) బ్రహ్మంగారి గుట్ట, సిరికొండ, ఇందల్వాయి టోల్‌ప్లాజా, మల్లారం గండి, యంచ (బాసర)ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వారిని నియంత్రించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. సరిహద్దులో హైవే పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్ పెంచాలని, పోలీస్ అధికారులు వాట్సప్‌గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఎన్నికలు సజావు గా సాగేలా చర్యలు చేపట్టాలని కోరారు.
సమావేశంలో అదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ బి శ్రీనివాస్‌రెడ్డి, నాందేడ్ జిల్లా (బోకర్) అదనపు ఎస్పీ కేఏ ధరణి, నిజామాబాద్ జిల్లా అదనపు డిప్యుటీ కమిషనర్ జయరామ్, నిజామాబాద్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారి లావణ్య, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సీఐలు, రోడ్డు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పోలీసు అధికారులు సమీక్ష పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment