
ఐదేళ్ల బాలుడి ఇంటరాగేషన్!
ముంబై: ఐదేళ్ల బాలుడిని మహారాష్ట్ర పోలీసులు ఇంటరాగేషన్ చేశారన్న ఆరోపణలపై బాంబే హైకోర్టు సుమోటుగా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తోటి విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అన్ టాప్ హిల్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడిని గతేడాది డిసెంబర్ లో పోలీసులు అరెస్ట్ చేసిన ప్రశ్నించారు.
మీడియాలో వచ్చిన ఈ వార్తను చూసి సెంటర్ ఫర్ క్రిమినాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అశు ముకుందన్ రాసిన లేఖను జస్టిస్ వీఎం కనాడే నేతృత్వంలోని బెంచ్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఏడేళ్లలోపు వారు నేరం చేసినట్టు పరిగణించరాదని భారత శిక్షాస్మృతి చెబుతోందని ముకుందన్ లేఖలో పేర్కొన్నారు. బాధిత బాలికపై గాయాలు పరిశీలిస్తే పెద్దవాళ్లెవరో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టుగా తోస్తుందని తెలిపారు.