రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను నాంపల్లి కోర్టుకు హాజరుపరచనున్నట్లు సమాచారం.