Search operation
-
మలావీ ఉపాధ్యక్షుడి ఎయిర్‌క్రాఫ్ట్ గల్లంతు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదం ఘటన మరువక ముందే.. మరొ విమానం మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా (Saulos Chilima)తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని సావులోస్ విమానం సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం ఇతర దేశాల సహాయం కోరుతున్నారాయన. మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు వెళ్లింది. సరిహద్దు దేశంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై అనుమానాల నేపథ్యంలో.. ఇంకా తుది వెలువడాల్సి ఉంది. -
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
జైపూర్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..
రాజస్థాన్‌లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు. ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో ఎయిర్‌పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. -
TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్!
కొమురం భీం, సాక్షి: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పులుల మృత్యువాత సంఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. రెండు పులులపై విష ప్రయోగం జరిగినట్టు గుర్తించిన అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకుంది. చివరికి మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన అనంతరం తల్లి పులి రెండు పిల్లల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర రేంజ్ దరిగాం అడవుల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మూడు రోజుల విస్తృత గాలింపు తర్వాత ఎట్టకేలకు కనిపించకుండా పోయిన S6 పులి దాని రెండు పిల్లలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. దరిగాం అడవిలో విష ప్రయోగంతో చనిపోయిన రెండు పులులతో పాటు మరో రెండు పులులు మిస్ అవడంపై అలర్ట్ అయిన జిల్లా అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. మూడు వందల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 72 బృందాలు , 105 ట్రాప్ కెమెరాల తో మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీ శాఖ అధికారులు.. అయితే సిబ్బందికి మిస్ అయిన పులులు కనిపించడంతో ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. ఎస్ 6 తల్లి పులితో పాటు కనిపించకుండా పోయిన పులి పిల్లలు సైతం క్షేమంగా ఉన్నాయంటూ తేల్చింది కొమురంభీం జిల్లా అటవీ శాఖ. గత ఏడాది డిసెంబర్ 27 న దరిగాం అటవి ప్రాంతంలో ఎస్ 9 పులి ఓ పశువు పై దాడి చేయగా.. ఆ పశువును మరోసారి తిన్న కే15 పులి ఈనెల 6 న మృత్యువాత పడింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఐదేళ్ల మగపులి ఎస్ 9 సైతం మరణించింది. దీంతో పులి మరణాల కేసును సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాదికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో.. పశువుపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఆ పశువు మృతి చెందిన సమీపంలో నాలుగు పులుల పాదముద్రలు లభించడంతో ఆందోళన చెందింది అటవీశాఖ. దీంతో అలర్ట్ అయిన అటవిశాఖ చనిపోయిన పులులతో పాటు పశువు మాంసం తిన్న మరో రెండు పులుల కోసం అన్వేషణ సాగించింది. ఈనెల 9 న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభింవింది.. మొదటి రోజు 14 ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. 24 గంటలు దరిగాం అడవిని జల్లెడ పట్టిన మిస్ అయిన పులుల ఆచూకీ లభించకపోవడంతో ట్రాకింగ్ టీంను 72 కు పెంచింది. దరిగాం అటవీ ప్రాంతంతో పాటు సర్కపల్లి, గోంది అటవి ప్రాంతంలోను సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసిన అటవీ శాఖ 105 కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసింది. దీంతో ఈనెల 11 న దరిగాం గోంది అటవి ప్రాంతంలో మరో పశువుపై పులిదాడి చేసి హతమార్చగా.. ఆ పశువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేళ్ల వయస్సున ఆడపులి.. ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ ఊపిరి పీల్చుకుంది. 73వ క్యాంపు వారికి కే 14 పులి పాదముద్రలు 51 క్యాంప్ టీంకు కే 16, 17 పాదముద్రలు లభించడంతో సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేసింది. 62 గంటల పాటు ఓ యుద్దంలా సాగిన టైగర్ సర్చ్ ఆపరేషన్ పులులు క్షేమంగా ఉన్నాయన్న సమాచారంతో సక్సెస్ గా ముగియగా.. దరిగాం అటవీ ప్రాంతంలో లెక్కకు మించి పులుల సంచారం సాగుతుందన్న సమాచారంతో అటవిశాఖకు మరింత దృష్టి సారించింది. ఇప్పుడు ఆ పులులను వేటగాళ్ల కంటపడకుంటా క్షేమంగా కాపాడటం.. ఆ పులులతో మనుషులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడటం తప్పని సరిగా మారింది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ఓ రైతుకు పత్తి చేనులో పులి కనిపించింది. వెంటనే రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పారెస్ట్ అదికారులు గుంపులు గుంపులు చేనులల్లో పనులు చేసుకోవాలని ఫారెస్ట్ కర్జెల్లి రేంజ్ అధికారి నవ్య రైతులకు సూచిస్తున్నారు. ఇటు దరిగాం అటవీ సంఘటన లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగం చేశారు.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేపోలేదని తెలుస్తోంది. -
కొమురంభీం జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ సక్సెస్
-
ఒడిశాలో మావోయిస్టుల ఆయుధ డంప్ స్వాధీనం..
భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు. బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF సిబ్బంది. సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్‌లు, రాకెట్ లాంచర్, రెండు బ్రెన్ 303 ఎల్ఎంజీ స్పేర్ బ్యారెల్స్, 29 జెలటిన్ స్టిక్స్, ఐదు అల్యూమినియం నైట్రేట్ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్ వెయిస్ట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ రెస్క్యూ ఆపరేషన్
-
అమెజాన్ అడవుల్లో.. పాపం పసివాళ్లు
దట్టమైన అమెజాన్ అడవులు. నెల రోజులుగా అలుపెరగకుండా ముందుకు సాగుతున్న సైన్యం. పాపం.. ఆ నలుగురు పసివాళ్లు ఇంకా బతికే ఉంటారనే ఆశ వాళ్లను అలా ముందుకు పోనిస్తోంది. సజీవంగా ఆ చిన్నారులు ఇంటికి చేరాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు ఇప్పుడు. కొలంబియా అమెజాన్ అడవుల్లో నెల కిందట తేలికపాటి విమాన ఒకటి ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అయితే.. అందులో ప్రయాణించిన నలుగురు చిన్నారులకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు బయటపడి ఉంటారని, అడవుల్లోనే ఎక్కడో ఒక దగ్గర సురక్షితంగా తలదాచుకుని ఉండిఉంచొచ్చని కొలంబియా సైన్యం భావిస్తోంది. ఆ ఆశతోనే భారీ సెర్చ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 శాటిలైట్ చిత్రాల్లో.. పిల్లలు విమాన శకలాల నుంచి నడుచుకుంటూ వెళ్లిన కాలిముద్రలు, అలాగే వాళ్ల కోసం గాలిస్తున్న బృందానికి వాళ్లకు సంబంధించిన వస్తువులు, అడవుల్లో తాత్కాలిక ఆశ్రయం కోసం చేసుకున్న ఏర్పాట్లు, సగం తినిపడేసిన పండ్లు.. కిందటి వారం ఒక జత బూట్లు, డైపర్.. ఇలా ముందుకు వెళ్లే కొద్దీ పిల్లల ఆనవాళ్లకు సంబంధించిన వస్తువులు దొరుకుతుండడంతో వాళ్లు బతికే ఉంటారన్న ఆశలతో గాలింపును ఉధృతం చేశారు. 👉 దొరికిన ఆధారాలతో వాళ్లు సజీవంగానే ఉన్నారని భావిస్తున్నాం. వాళ్లకు కనిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందానికి నేతృత్వం వహిస్తున్న జనరల్ పెడ్రో చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు చనిపోయి ఉంటే స్నిఫ్ఫర్ డాగ్స్ సాయంతో ఈపాటికే ఆ మృతదేహాలను కనిపెట్టేవాళ్లం. కానీ, అలా జరగలేదు కాబ్టటి వాళ్లు బతికే ఉంటారని మేం భావిస్తున్నాం అని ఆయన చెబుతున్నారు. 👉 ఏం జరిగిందంటే.. మే 1 ఉదయం, సెస్నా 206 తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. అయితే ఆ ఎయిర్‌ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్‌కు అందకుండా పోయింది. దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 👉 ఆపై అది ప్రమాదానికి గురైందని ధృవీకరించుకుని.. శకలాల కోసం గాలింపు చేపట్టారు. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. అయితే.. లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ కనిపించకుండా పోయారు. 👉 దీంతో 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావిస్తున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తున్నారు. 👉 విమాన ప్రమాదంలో ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో చిన్నారు ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భీకరమైన,దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో.. రోజులు గడిచే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. అడవి మార్గంలో ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఆ ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయి. మూడు కిలోమీటర్లపాటు ఫోకస్ పడేలా సెర్చ్లైట్లను అడవుల్లో ఏర్పాటు చేసింది సైన్యం. తద్వారా పిల్లలు తమవైపు వస్తారనే ఆశతో ఉంది. ఆ నమ్మకమే బతికిస్తోంది.. కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) కమ్యూనిటీకి చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ చిన్నారుల తాత. లెస్లీ తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందేమోనని అంటున్నాడాయన. అయితే.. క్రూర వన్యప్రాణులతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలకు నెలవు ఆ ప్రాంతం. అలాంటి ముప్పును వాళ్లు ఎలా ఎదుర్కొంటారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారాయన. -
విఫలమైన మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్
-
మహిళ అక్రమ నిర్బంధం.. అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: విచారణ పేరుతో వ్యాపారవేత్త భార్యను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో అయిదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో తనను అక్రమంగా నిర్బంధించారని మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలు.. హైరదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు 2019లో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే సోదాల సమయంలో శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డని అధికారులు అక్రమంగా నిర్బంధించారు. ఫిబ్రవరి 27, 2019 రోజున తనను సెర్చ్ ఆపరేషన్ పేరుతో అధికారులు నిర్బంధించారని జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. దీంతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు.. అయిదుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా, ఆనంద్ కుమార్, శ్రీనివాస్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బొల్లినేని గాంధీ , చిలక సుధా సస్పెన్షన్‌లో ఉన్నారు. చదవండి: దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తాం! -
ప్రపంచంలోనే మొదటిసారి.. మిస్సింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్
ఇస్తాంబుల్: కొన్ని రోజలు క్రితం తన నీడ పోయిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేసే కథ ఆధారంగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాటిక్ సంఘటన ఒకటి వాస్తవంగా చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కనిపించకుండా పోయానని చెప్పి.. తనను తానే వెతుక్కున్నాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ సంఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. టర్కీకి చెందిన బెహాన్ ముట్లు(50) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఇనెగల్ నగరానికి సమీపంలో ఉన్న శయ్యక గ్రామీణ ప్రాంతంలో ఓ పార్టీకి వెళ్లాడు. మద్యం ఎక్కువగా తీసుకోవడంతో మత్తులో పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి.. స్పృహ కోల్పోయాడు. బెహాన్ ఎంతకి తిరిగి రాకపోవడంతో.. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?) ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసి.. గాలింపు చర్యలు ప్రారంభించారు. బెహాన్ తప్పిపోయిన అటవీ ప్రాంతానికి వెళ్లి.. అతడి పేరును పెద్దగా పిలుస్తూ.. గాలింపు చర్యలు కొనసాగించారు. స్పృహ కోల్పోయిన బెహాన్‌కి అప్పుడే కొద్దిగా మెలకువ వచ్చింది. పూర్తిగా మత్తు వదలలేదు. ఈ క్రమంలో అతడు పోలీసులతో కలిసి బెహాన్ గురించి అంటే తన గురించి తానే వెతకడం ప్రారంభించాడు. (చదవండి: వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’) మరోసారి పోలీసులు బెహాన్ పేరు పిలవడంతో అతడి మత్తు వదిలిపోయింది. ఓ నిమిషం షాక్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు దగ్గరకు వెళ్లి.. ఎవరి గురించి వెతుకుతున్నారని ప్రశ్నించాడు. అప్పుడు పోలీసులు బెహాన్ అనే వ్యక్తి అడవిలో తప్పిపోయాడని తెలిపారు. వెంటనే బెహాన్.. వారు వెతుకుతుంది తన కోసమే అని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు బెహాన్‌ని అతడి ఇంటికి చేర్చారు. ఇక పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్న బెహాన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనలు.. బహుశా ప్రపంచంలోనే తనను తాను వెతుక్కున్న మొదటి వ్యక్తి ఇతడే అయ్యుంటాడు అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: 1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్.. 1075 ఏళ్ల జైలు శిక్ష -
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
-
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసులు నిందితుడు రాజు కోసం జల్లెడ పడుతున్నారు. అతడి కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్స్టేషన్లకు రాజు ఫొటో పంపించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. విపక్షాలు విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఘటన జరిగిన వారమైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డితో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకోండి అని ఆదేశించారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ ఈ కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రాజు ఫొటోను డిసిప్లే చేయాలని ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జంట నగరాల పరిధిలో గల్లీగల్లీని గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సులో వెళ్లిన రాజు ఎక్కడ దిగారో తెలుసుకుంటున్నారు. వేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను చూస్తున్నారు. టవల్‌తో పాటు టోపీని రాజు మోత్కూరు మార్గంలో పడేసినట్లు గుర్తించారు. ఒక కవర్లో తువ్వాలు, టోపీ, కల్లు సీసా, రూ.700 నగదు ఉన్నట్లు తేలింది. రాజుకు మద్యం అలవాటు ఉండడంతో అన్నీ వైన్‌షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి ఇక వీరితో పాటు నగరంతో పాటు సరిహద్దు జిల్లాల్లో రాజు కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు నిందితుడు రాజు ఫొటోలను బస్సులు, ఆటోలకు వాల్ పోస్టర్లు అంటించారు. మరికొన్ని చోట్ల నిందితుడి ఫొటో చూపిస్తూ మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రాజు ఆనవాళ్లు లభ్యం అయితే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల వాహనదారులను ఆపివేసి తనిఖీలు చేస్తున్నారు కూడా. -
‘ఖాకీ’ని తలపించే చేజింగ్, 45 రోజుల ఆపరేషన్
సాక్షి, కరీంనగర్: కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ఖాకీ కథ తెలుసుగా! ఉత్తర భారతం నుంచి సరుకు రవాణా లారీల్లో వచ్చే కొందరు దుండగులు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడతారు. వారిని పట్టుకోవడానికి ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు భారీ ఎత్తున జాయింట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. తాజాగా తెలంగాణ, కర్ణాటకకు చెందిన పోలీసులు అలాంటి జాయింట్ ఆపరేషన్ చేశారు. 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల పోలీసులు దాదాపు 45 రోజులపాటు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నవీ ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూర్, షోలాపూర్, బీదర్‌లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఎట్టకేలకు గజదొంగ భాకర్ అలీని కరీంనగర్ పోలీసులు షోలాపూర్‌లో శనివారం అరెస్టు చేశారు. అయితే, అతను సాదాసీదాగా పోలీసులకు చిక్కలేదు. పోలీసులపై అటాక్ చేసి తప్పించుకునేందుకు యత్నించాడు. ఆక్రమంలో భాకర్ అలీ చేతిలో పోలీసులు గాయపడ్డారు. చివరకు ఛేజింగ్ చేసి పోలీసులు అతని ఆట కట్టించారు. కాగా, భాకర్ అలీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పీడీ యాక్టు కేసులు ఉన్నట్టు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. 2015 ముందే హైదరాబాద్‌లో వందకుపైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. నేరస్తుడిని పట్టుకునేందుకు వందల సీసీ కెమెరాలను పరిశీలించామని పేర్కొన్నారు. నేరస్తుడి నుంచి గంజాయి సహా కార్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. (చదవండి: 200కు పైగా ఇన్స్టాంట్ లోన్‌యాప్స్ తొలగింపు..) -
ఐదు రోజులాయే.. పెద్దపులి చిక్కేనా..?
సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలోనే తొలిసారిగా పెద్దపులి ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చడంతో అటవీశాఖ అలర్ట్ అయింది. ఆ పులిని బంధించేందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారులు అడవిలో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. కానీ.. ఇప్పటికి 5 రోజులైనా అటువైపు పులి అడుగు జాడలేవీ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11న ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ (22)పై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 12న దిగిడ అడవి, పెద్దవాగు సమీపంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ఆ బోన్లలో లేగ దూడలను ఎరగా వేసి పరిశీలిస్తున్నారు. అయితే అటువైపు పులి సంచరిస్తున్నట్లు ఎటువంటి ఆనవాళ్లూ కనిపించడం లేదు. దీంతో సదరు నరహంతక పులిని బంధించడం అంత సులువుగా జరిగేనా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతునాయి. ఆ పులి బెజ్జూరు మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లిందనే అనుమానాలు ఉన్నప్పటికీ.. ప్రాణహితలో నీటి ప్రవాహం కారణంగా నది దాటే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి మొదట దాడి చేసింది స్థానిక పులి అయి ఉండొచ్చని అధికారులు అనుమానించారు. అయితే ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించాక కొత్తగా వలస వచ్చినదై ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే, స్థానికులను అడవుల్లోకి వెళ్లకుండా అవగాహన కల్పిస్తూ.. పులి సంచారంపై అప్రమత్తంగా ఉంటున్నారు. (చదవండి: పెద్దపులి టెర్రర్: యువకుడ్ని చంపి..) అడవులను ఆనుకునే పత్తి చేలు.. గత దశాబ్ద కాలంగా అటవీ సమీప ప్రాంతాల్లో చెట్లను నరికి పంటలు సాగు చేయడం ఎక్కువైంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతాలు కూడా సాగు భూములుగా మారాయి. పెద్దవాగు, ప్రాణహిత తీరాల వెంబడి వేలాది ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో కొంత మంది రైతులకు అటవీ హక్కు పత్రాలు ఉండగా వేలాది మంది రైతులకు ఎటువంటి గుర్తింపూ లేదు. పండించిన పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రిపూట కాపలా వెళ్తుంటారు. కొందరు విద్యుత్ తీగలతో కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ప్రమాదమే పొంచి ఉంది. అడవుల్లో సంచరించే రైతులకు పులులతో భయం ఉండగా.. విద్యుత్ కంచెలతో పులికి ముప్పు పొంచి ఉంది. అలాగే, అడవుల సమీపంలోనే నివాసాలు, పంట పొలాలు ఉండటంతో రైతులు నిత్యం అడవుల్లోకి వెళ్తుంటారు. ఈ క్రమంలో స్థానికులకు రక్షణ కల్పిస్తూ పులి సంతతి పెంచడం అటవీ అధికారులకు సవాల్‌గా మారింది. మనుషులపై దాడి అరుదే.. పులి జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మానవ సంచారం ఉన్న చోట పులి ఉండదని, మనుషులపై దాడి చేయడం చాలా అరుదని అంటున్నారు. కొత్తగా వచ్చిన పులులు ఆవాసం వెతుక్కునే క్రమంలో చాలా దూరం సంచరిస్తుంటాయని, స్థిర ఆవాసం ఏర్పడితే అటువైపు వెళ్లకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తామని అధికారులు వివరిస్తున్నారు. దాడి చేసింది కొత్త పులి జిల్లా పరిధిలో సంచరించే పులులు కాకుండా కొత్తగా వచ్చిన పులి ‘దిగిడ’లో దాడి చేసిందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆనవాళ్లు స్థానిక పులులతో సరిపోలడం లేదు. కొత్తగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన పులి అనేది తేలాల్సి ఉంది. పులిని బంధించేందుకు 12 బృందాలు పని చేస్తున్నాయి. – శాంతారాం, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్ -
చినతల్లే చిదిమేసింది..!!
కిలకిలమని నవ్వుతూ నట్టింట పరుగులు తీసే ఆ చిన్నారి లేలేత పాదాలకున్న మువ్వల పట్టీలు ఘల్లుమంటూ సవ్వడి చేస్తే.. ఆ తండ్రి మది ఆనందంతో మురిసిపోయేది. తన జీవితంలో కొండంత సంతోషాన్ని పంచుతున్న ఆ కుమార్తెను తనకు బహుమతిగా ఇచ్చిన భార్య కన్నుమూస్తే.. ఆ పసిబిడ్డ ఆలనాపాలనా చూడడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. తన బిడ్డకు తల్లి లేని లోటును సవతితల్లి తీరుస్తుందని నమ్మాడు. తనకో కుమారుడు కలిగిన తరువాత.. ఆమెలో అనుమాన బీజాలు నాటుకున్నాయి. మొదటి భార్యకు పుట్టిన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న తన భర్త.. తన కుమారుడికి అన్యాయం చేస్తాడేమోనని సందేహించింది. ఆ అనుమానమే పెనుభూతమవడంతో.. చివరికి తన సవతి కుమార్తెను కడతేర్చింది. కాకినాడ జగన్నాథపురం పాఠశాల వద్ద గత శుక్రవారం ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ ఐసానిని అపహరించి.. గొంతుకు తువ్వాలు బిగించి, తానే హతమార్చినట్టు ఆమె సవతి తల్లి శాంతికుమారి పోలీసుల విచారణలో వెల్లడించింది. అనంతరం ఆ మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి ఇంద్రపాలెం వంతెన వద్ద ఉప్పుటేరులో పడేసినట్టు చెప్పింది. దీప్తిశ్రీ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పగడాలపేటలో నాన్నమ్మ ఇంటి వద్ద విషాదంలో బంధువులు ఏడేళ్ల బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్‌తో కలవరపడిన కాకినాడవాసులు ఆ బాలిక హత్యకు గురైందని తెలియడంతో ఆదివారం తల్లడిల్లిపోయారు. సొంత కుమారుడి కంటే మొదటి భార్య కుమార్తెనే భర్త ప్రేమగా చూస్తున్నాడన్న కక్షతో.. రెండో భార్య.. చిన్నారిని కర్కశంగా హత్య చేసి ఉప్పుటేరులో పారేసింది. తొలుత తనకేమీ తెలియదని బుకాయించిన ఆమె.. ఆధారాలు దొరికిపోవడంతో.. పోలీసుల ఇంటరాగేషన్‌లో.. దీప్తిశ్రీని హత్య చేసినట్టు ఒప్పుకుంది. సవతి తల్లి దురాగతం పగడాలపేట వాసులను ఆవేదనకు గురిచేసింది. బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తుంటే.. ఆమె నాన్నమ్మ, బంధువులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. సాక్షి, కాకినాడ క్రైం: అపహరణనకు గురైన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని (7)ని ఆమె సవతి తల్లి హత్య చేసి ఉప్పుటేరు కాలువలో మూటకట్టి పడేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. జగన్నాథపురం వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న నేతాజీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోన్న చిన్నారిని ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం కిడ్నాప్.. నగరంలో కలకలం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే. ఆ బాలిక తండ్రి సూరాడ సత్యశ్యామ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి అదృశ్యమైన వెంటనే పోలీసులు ఆమె సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకున్నారు. ముందు తనకు ఏమీ తెలియదని పోలీసుల వద్ద బుకాయించింది. చిన్నారి చదువుతున్న పాఠశాలకు తీసుకెళ్లి విద్యార్థులకు ఆమెను పోలీసులు చూపించారు. దీప్తిశ్రీని ఆమె తీసుకెళ్లిందని, మమ్మీతో వెళుతున్నట్టు స్నేహితులకు చెప్పి వెళ్లిందని విద్యార్థులు పోలీసులకు తెలిపారు. దీప్తిశ్రీని తీసుకు వెళుతున్న పినతల్లి సీసీ కెమెరాల్లో చిన్నారిని సవతి తల్లే తీసుకువెళ్లినట్టు రికార్డు అయిందని, అయితే ముఖానికి ముసుగు వేసుకోవడం వల్ల పోలీసులు వెంటనే నిర్ధారించ లేకపోయారు. పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేయడం, పాఠశాల విద్యార్థులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో.. పాఠశాల నుంచి దీప్తిశ్రీని తీసుకువెళ్లి తానే హత్య చేశానని సవతి తల్లి ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పాఠశాల నుంచి నేరుగా సంజయ్‌నగర్‌లోని ఆమె ఇంటికి తీసుకెళ్లి పాప వెనక్కి తిరిగి ఉన్న సమయంలో మెడలో తువ్వాలు వేసి బిగించి చంపేసినట్లు అంగీకరించినట్టు చెబుతున్నారు. పాపను చంపేసిన తరువాత గోనె సంచిలో కట్టేసి సంజయ్‌నగర్ నుంచి బైక్‌పై ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చి ఉప్పుటేరులో పడవేసినట్లు పోలీసుల విచారణలో సవతి తల్లి వివరించినట్లు తెలుస్తోంది. ఉప్పుటేరులో దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టిన పోలీసులు పోలీసుల గాలింపు చర్యలు దీంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు ఉప్పుటేరు, సామర్లకోట–ఇంద్రపాలెం పంట కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ డీఎస్పీలు కరణం కుమార్, భీమారావు పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, ఒన్‌టౌన్ సీఐ రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక పడవలపై కాలువలో గాలించారు. మృతదేహం కోసం గాలిస్తున్నామని, ఆ తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పగడాలపేటలో విషాదం దీప్తిశ్రీ హత్య గురైనట్టు పోలీసులు నిర్ధారణకు రావడంతో పగడాల పేటలో విషాదఛాయలు అలముకున్నాయి. రోజూ అందరినీ ఆప్యాయంగా పలకరించే దీప్తిశ్రీ ఇకలేదని తెలియడంతో ఆమె నాన్నమ్మ సూరాడ బేబీతో పాటు బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా ఉండేదని, మంచిగా చదువుకుంటానని అందరితో చెప్పేదని నాన్నమ్మ ఇంటి పరిసరాల వారు కంటనీరు పెట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో నానమ్మ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. కోడలు చనిపోయిన తరువాత పెళ్లి చేసుకుంటానని తన కుమారుడు చెబితే.. ఈ సంబంధం వద్దని చెప్పామని, వినకుండా శాంతికుమారిని పెళ్లి చేసుకున్నాడని నాన్నమ్మ విలపిస్తూ చెప్పింది ఇప్పుడు బంగారం లాంటి మనుమరాలిని చంపేసిందని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. కేసు దర్యాప్తు ముమ్మరం దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్‌నకు కుటుంబ కలహాలే కారణమని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలి పారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ రామ్మోహన్ రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని, సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇంద్రపాలెం వంతెన వద్ద మృతదేహం ఉందని సమాచారం రావడంతో అక్కడ తనిఖీ చేశామని డీఎస్పీ తెలిపారు. కొడుకును నిర్లక్ష్యం చేస్తారని.. దీప్తిశ్రీ తల్లి చనిపోవడంతో తండ్రి శ్యామ్‌కుమార్ సంజయ్‌నగర్‌కు చెందిన శాంతికుమారిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 13 నెలల బాబు ఉన్నాడు. దీప్తిశ్రీపైనే తండ్రి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని భావించిన సవతి తల్లి.. ఆమెను ఇబ్బందులకు గురి చేస్తుండేది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ చిన్నారి ఈ బాధలను తనలోనే దాచుకుంది. బాలిక వంటిపై కాల్చిన గుర్తు ఉండడంతో తండ్రి నిలదీయడంతో తల్లి పెడుతున్న చిత్రహింసలు బయటపడ్డాయి. దీంతో బాలికను అతడి చిన్నమ్మ ఇంటి వద్ద ఉంచి జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో చదివిస్తున్నాడు. సంజయ్‌నగర్ నుంచి చిన్నమ్మ ఇంటికి వెళ్లి రోజూ పాపను స్కూల్‌కి దింపి వస్తున్నాడు. దీంతో చిన్నారిపై సవతి తల్లి కక్ష పెంచుకుంది. తన బాబుని నిర్లక్ష్యం చేస్తాడన్న అనుమానంతో ఆమెను చంపేస్తే ఇబ్బంది ఉండదని భావించి దీప్తిశ్రీని చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
దీప్తిశ్రీ కిడ్నాప్ మిస్టరీ: రంగంలోకి ధర్మాడి సత్యం!
సాక్షి, కాకినాడ: కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. 48 గంటలైన చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. సవతి తల్లి శాంతికుమారినే దీప్తిశ్రీని హత్యచేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సవతి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో శాంతికుమారి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె విచారణలో వెల్లడించినట్టు సమాచారం. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని తానే చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది. మొత్తం నాలుగు పడవల ద్వారా ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు వద్ద దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. జగన్నాథపురంలో చిన్నారి చదువుతోన్న స్కూల్ ఆవరణంలో కిడ్నాప్‌కు గురైంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటున్న దీప్తిశ్రీని సవతితల్లి తీసుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. తల్లి తీసుకెళ్లడంతో తాము ఏమి అడగలేకపోయామని అంటున్నారు. ఆ తర్వాత చిన్నారి కనిపించడం లేదని తండ్రి తమ దగ్గరకు వచ్చారని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. శాంతికుమారినే ఏమైనా చేసి ఉంటుందంటున్నారు. -
మదురైలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురైలో ఆదివారం ఎన్ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రన్ హషీంకు ఫేస్బుక్ స్నేహితుడైన తమిళనాడుకు చెందిన ఐఎస్ఐఎస్ఐ మాడ్యుల్ సూత్రధారి మహ్మద్ అజారుద్దీన్‌ను కోయంబత్తూరులో ఎన్ఐఏ అధికారులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అజారుద్దీన్ తెలిపిన వివరాల మేరకు ఇదయతుల్లాను అరెస్టు చేయగా, మరో ఐదుగురిని విచారిస్తున్నారు. కోయంబత్తూరుకు చుట్టుపక్కల రెండు రోజుల పాటు సోదాలు చేసిన ఎన్ఐఏ బృందాలు ఆదివారం మదురైకు మకాం మార్చాయి. ఆధ్యాత్మిక నగరం మదురైలో పేలుళ్ల విధ్వంసం సృష్టించేందుకు వ్యూహరచన చేసినట్లుగా లభించిన సమాచారం మేరకు ముగ్గురు యువకుల్ని లక్ష్యంగా చేసుకుని ఎన్ఐఏ వర్గాలు తనిఖీలు, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విల్లాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ సోదాలు పొద్దు పోయే వరకు సాగాయి. సదాం కుమారుడు ముర్షిద్ సహా ముగ్గుర్ని రహస్య ప్రదేశంలో ఉంచి అధికారులు విచారిస్తున్నారు. -
వరవరరావు అరెస్ట్
-
విరసం నేత వరవరరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మోదీ హత్యకు కుట్ర పన్నారంటూ గతంలో దొరికిన ఓ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు మొదలయ్యాయి. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చడంతో పాటు మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై వరవరరావుని పోలీసులు విచారించారు. వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పుణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేపట్టారు. ఆ లేఖలో 27 మంది పేర్లు ఉండగా అందులో వరవరరావు పేరు కూడా ఉండటంతో ఆయన్ను విచారించిన తర్వాత అరెస్ట్ చేశారు. -
వరవరరావు ఇంట్లో పోలీసుల సోదాలు
-
వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసుల సోదాలు
సాక్షి, హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం నేత, కమ్యూనిస్టు నాయకుడు వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు మొదలైనట్లు సమాచారం. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో వరవరరావుని పోలీసులు విచారించారు. మోదీ హత్యకు వరవరరావు నిధులు సమకూర్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పుణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. పుణెలో నమోదైన కేసులో వీరందరినీ పోలీసులు విచారిస్తున్నారు. -
ప్చ్.. నిరాశే!
తూర్పు గోదావరి, యానాం: గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్నా విపత్తు దళాలు సముద్రం, నదీముఖ ద్వారాలలో మృతదేహాల కోసం వేటను కొనసాగిస్తున్నారు. ఎట్టిపరిస్ధితుల్లోనైనా వారి జాడ కనుగొనాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఐ.పోలవరం మండల పరిధిలోని పశువుల్లంక వృద్ధ గౌతమీనదిలో ఈనెల 14న జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఏడుగురిలో మిగిలిన ముగ్గురు బాలికల ఆచూకీ కోసం శుక్రవారం జరిపిన భారీ సంయుక్త ఆపరేషన్ ఫలితానివ్వలేదు. సుమారు వివిధ విపత్తు దళాలైన ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్పీఎఫ్, ఎస్డీఎఫ్, స్థానిక మత్స్యకారులతో కూడిన 25 బృందాలతో పాటు భైరవపాలెం నుంచి మరో ఆరు బృందాలు సముద్రముఖద్వారంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఉదయం 6.30 నుంచే యానాం రాజీవ్బీచ్లో ఏర్పాటు చేసిన బేస్‌క్యాంప్ నుంచి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. భైరవపాలెం, సావిత్రినగర్, మగసానితిప్ప, గోగుళ్లంక, గుత్తెనదీవి, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఈ ఆపరేషన్‌లో ఒక వైపు డ్రోన్లు ఉపయోగించడంతో పాటు మరో వైపు నావికాదళాలకు సంబం«ధించి డైవర్స్, మరోపక్క యానాంకు చెందిన మత్స్యకారుల బోట్లతో ఈ భారీ సర్చ్ ఆపరేషన్ సాయంత్రం వరకు కొనసాగించారు. అయినప్పటికీ ఒక్కరి జాడ కూడా గుర్తించకపోవడంతో విపత్తు దళాలు నిరాశతో వెనుదిరిగాయి. మరోవైపు గల్లంతైన పోలిశెట్టి అనూష, పోలిశెట్టి సుచిత్ర, కొండేపూడి రమ్యల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే రాజీవ్‌బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ఒక్కోదళం టెంట్లను తొలగిస్తుండంతో కొన్ని దళాలు ఇంటిముఖం పడుతున్నాయి. గత ఆరురోజులుగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్కు చెందిన టెంట్‌ను శుక్రవారం సాయంత్రం తొలగించడంతో ఇంకా సర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గాలింపు చర్యలను పర్యవేక్షించిన కలెక్టర్ ఒకేసారి 27 బృందాలతో సముద్ర, నదీముఖద్వారాల్లోని ప్రాంతాల్లో చేపట్టిన గాలింపు చర్యలను శుక్రవారం కలెక్టర్ కార్తికేయమిశ్రా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాజీవ్‌బీచ్ వద్ద ఏర్పాటు చేసిన బేస్‌క్యాంప్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముగ్గురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతుందని, లభ్యమవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీఓ బి.వెంకటరమణ, రామచంద్రపురం ఆర్డీఓ రాజశేఖర్, అమలాపురం సబ్‌డివిజనల్ పోలీస్అధికారి ప్రసన్నకుమార్, ఎస్డీఎఫ్ డీఎస్పీ ఎస్ దేవానందరావు, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అంకితకుమార్, పుష్కరరావు పాల్గొన్నారు. -
ఇంకా దొరకని విమానం ఆచూకీ
-
ఇంకా దొరకని విమానం ఆచూకీ
చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. బంగాళాఖాతంలో విమాన ప్రమాదం జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని నేవీ అధికారులు చెప్పారు. మూడున్నర కిలో మీటర్ల మేర సముద్రంలోతు ఉండటంతో గాలించడానికి కష్టమవుతోందని తెలిపారు. మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్‌మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. -
ఆ శకలం గల్లంతైన విమానానిదేనా?
సాక్షి, చెన్నై : బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం కోసం అన్వేషణ తీవ్రతరమైంది. అయితే చెన్నైకి 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఓ వస్తువు లభించినట్లు సమాచారం. అది విమాన శకలమా లేక మరొకటా అనేది తెలియాల్సిఉంది. వస్తువు లభించిన ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా సెర్చ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్టుగార్డు, వైమానిక దళం వర్గాలు జలాంతర్గామి, ఎనిమిది విమానాలు, 18 నౌకలతో ఆచూకీ కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మంది జాడ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రక్షణ మంత్రి పర్యవేక్షణ: ఏఎన్ -32 గల్లంతు సమాచారంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ఉదయమే తమిళనాడుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అరక్కోణం వైమానిక దళానికి, అక్కడ అదృశ్యమైన విమానానికి సంబంధించి సిద్ధం చేసిన ఫొటోలను పరిశీలించారు. గాలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాలింపులో సాంకేతిక పరిజ్ఞానం, ఆ విమానానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బంగాళాఖాతంలో ఏఎన్-32 విమానంతో సంబంధాలు తెగినట్టుగా భావిస్తున్న ప్రదేశం వరకు పర్యటించారు. గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. తదుపరి తాంబరం ఎయిర్‌బేస్‌కు చేరుకుని వైమానిక, నౌకాదళం వర్గాలతో చర్చించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి పర్యవేక్షణలో ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ కమిటీ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో వైమానిక, నౌకాదళం వర్గాలతో పాటు, సాంకేతిక నిపుణుల్ని నియమించినట్టు తెలిసింది. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో చెన్నైకు చెందిన ముత్తుకృష్ణన్ అనే వ్యక్తి ఉన్నట్టు సమాచారం. -
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రత బలగాలు నిర్ధారించాయి. ఉగ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు భద్రత బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఐఈడీ పేలుడులో నిరంజన్ సింగ్ అనే అధికారి మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదం జరిగింది. శనివారం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
పఠాన్‌కోట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎయిర్‌బేస్ నుంచి ఆదివారం ఉదయం తుపాకీ కాల్పులు, పేలుడు వినిపించినట్టు స్థానికుల సమాచారం. దీంతో మరో ఉగ్రవాది ఎయిర్‌బేస్‌లో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. భద్రత బలగాలు ఈ రోజు ఉదయం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇందులో ఆర్మీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎయిర్ ఫోర్స్, పారామిలటరీ బలగాలు, పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తూ గ్రనేడ్ పేలడంతో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. శనివారం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. భద్రత బలగాలు మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చగా.. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
వరదల్లో ఇద్దరు గల్లంతు
చిత్తూరు: సోమల మండలంలోని అన్నెమ్మగారిపల్లి వద్ద గార్గేయనది వరదల్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటనలో అన్నెమగారిపల్లి పంచాయతీ చిన్నతోపు గ్రామానికి చెందిన రజిత(15), సుబ్రహ్మణ్యం(60) అనే ఇద్దరు గల్లంతైనట్లు తెలిసింది. గల్లంతైన వారి కోసం అధికారలు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరూ తండ్రీకూతుళ్లు. వరదలతో సోమల మండలంలోని 24 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. -
గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు
బళ్లారి: కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా ఏడుగురి ఇళ్లపై ఆ రాష్ట్ర లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శైలేంద్ర కుమార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, బీజేపీ శాసనసభ్యుడు సురేశ్‌బాబు, జనార్ధన్ రెడ్డి అనుచరుడు స్వస్తిక్ నాగరాజు ఇళ్లపై సోదాలు చేసినట్లు సిట్ అధికారి ఒకరు తెలిపారు. కంపలి, బళ్లారి, హోస్పేట్ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు చెప్పారు. -
పాతబస్తీలో కార్డన్ సెర్చ్
-
పాతబస్తీలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: మీర్ చౌక్ ఫైటింగ్ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి రోడ్లపై తిరుగుతున్న400 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకున్నారు.వీరిని డీసీపీ కార్యాలయానికి తరలించారు. తల్లిదండ్రులను పిలిపించి శనివారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. -
సీబీఐ, ఐటీ అధికారుల ఢిష్యుం ఢిష్యుం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో సీబీఐ అధికారులపై ఆదాయపన్ను శాఖ అధికారులు భౌతికదాడికి పాల్పడ్డారు. లక్నోలో ఇన్‌కంట్యాక్స్ అధికారిణి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు ఆదాయపుపన్ను అధికారిణిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆదాయపు పన్ను ఆఫీసులో పనిచేస్తున్న ఇతర అధికారులు సీబీఐ అధికారులపై బౌతిక దాడికి దిగారు. -
సెర్చ్ ఆపరేషన్ : ఆరుగురు అరెస్ట్
-
కూకట్‌పల్లిలో సెర్చ్ ఆపరేషన్ : 10మంది అరెస్ట్
-
సెర్చ్ ఆపరేషన్ : 8మంది అరెస్ట్!
-
మల్లేపల్లిలో ఇంటింటికి సెర్చ్ ఆపరేషన్
హైదరాబాద్ : హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలోని మాంగర్ బస్తీలో పోలీసులు అర్థరాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 350 మంది పోలీసులు 35 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు కొనసాగించారు. ఇందులో 56 మంది నేర ప్రవృత్తి ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 తులాల బంగారం, రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. -
హైదరాబాద్‌లో సెర్చ్ ఆపరేషన్
-
సెర్చ్ ఆపరేషన్
-
ఆపరేషన్ ‘సెర్చ్’
నేరగాళ్ల కోసం సైబరాబాద్ పోలీసుల సెర్చ్ ఆపరేషన్ అర్ధరాత్రి సూరారంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం పాల్గొన్న 250 మంది పోలీసులు ఐదు గంటల్లో 500 ఇళ్లు సోదా అదుపులో 21 మంది అనుమానితులు, 30 వాహనాల స్వాధీనం దాదాపు 200 మంది పోలీసులు ఉన్నట్టుండి ఓ బస్తీని రౌండప్ చేశారు. అక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారి 5 గంటల వరకు ఏకబిగిన సోదాలు.. ప్రతి ఇల్లు.. ప్రతి అంగుళం తనిఖీలు..అనుమానితుల విచారణ... నేరాలను నిరోధించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు బుధవారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ ఇది. ప్రయోగాత్మకంగా సూరారం గ్రామంలో దీన్ని అమలు చేశారు. సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇక అసాంఘిక శక్తులు మకాం వేయలేవు. ఒక వేళ దొంగలు, దోపిడీ గ్యాంగ్‌లు, హంతక ముఠాలు ధైర్యం చేసి మకాం వేసినా రాత్రికి రాత్రే పోలీసు దండు వారుండే బస్తీపై విరుచుకుపడుతుంది. దుండగులు ఏ మూల నక్కినా ఇట్టే పట్టేస్తుంది. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఉత్తమ నగరంతో పాటు నేరరహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపుకు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. ఇందులో భాగంగా క్రైమ్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన నేరగాళ్ల ఆగడాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు సరికొత్త పంథాలు అనుసరించాలని నిర్ణయించారు. పాత, కొత్తనేరస్తులు నివాసముండే బస్తీలు, కాలనీలపై డేగ కన్ను పెట్టాలని సూచించారు. దీంతో పాటు ఆయా బస్తీలపై ఆకస్మిక దాడులు చేసి, విస్తృతంగా సోదాలు నిర్వహించి నేరరహిత ప్రాంతంగా మార్చాలని ఆదేశించారు. నేరం జరిగాక నేరస్తుల కోసం గాలించడం కంటే... ముందుగానే గాలింపు చేపడితే నేరం జరగకుండా నిరోధించేందుకు అవకాశం ఉంటుందని కమిషనర్ అధికారులకు సూచించారు. సెర్చ్ ఆపరేషన్... కమిషనర్ ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా మొదటిసారి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోని సూరారం గ్రామాన్ని సెర్చ్ ఆపరేషన్‌కు ఎంచుకున్నారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్‌లకు చెందిన వారు ఎక్కువగా నివాసం ఉంటుంటారు. బైక్ దొంగలు, ఇళ్లు దోచుకునేవారు, దృష్టిని మరల్చి నేరం చేసేవారు, కేడీలు, అక్రమ ఆయుధాలు కల్గినవారు, స్నాచర్లు, నేర చరిత్ర ఉన్నవారు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు. దీంతో సూరారం భౌగోళిక స్థితిని మరియు రహదారులను గుర్తించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఇలా జల్లెడ పట్టారు... బుధవారం అర్ధరాత్రి దాటాక క్రైమ్ అదనపు డీసీపీ జి.జానకీషర్మిల ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు శ్రీనివాసరావు, నంద్యాల నర్సింహారెడ్డి, ఎం.రజనితో పాటు 20 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 150 మంది కానిస్టేబుళ్లు సూరారం బస్తీపై విరుచుకుపడ్డారు. సోదాలు చేస్తున్నంత సేపు బస్తీలోకి, బయటకు ఎవ్వరినీ అనుమతించలేదు. బస్తీలోని ప్రతీ ఇల్లు.. ముఖ్యంగా నేరగాళ్ల నివాసాల్లో సోదాలు చేశారు. గురువారం ఉదయం 5 గంటల వరకు జరిగిన ఈ సోదాల్లో మొత్తం 500 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10 మంది పాతనేరస్తులు, 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 20 బైక్‌లు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోయినా నేరగాళ్ల కోసం పోలీసులు ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నేరస్తులపై డేగకన్ను ఇలాంటి ఆపరేషన్లు ఇక నుంచి రోజూ కొనసాగుతాయి. ఇప్పటికే నేరస్తులపై డేగకన్ను పెట్టాం. అనుమానం ఉన్న ప్రతీ బస్తీ, కాలనీని ఏ క్షణంలోనైనా రౌండప్ చేసి సోదాలు చేస్తాం. సోదాల సమయంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడమే పోలీసుల విధి. ఇందుకోసం బస్తీ పెద్దల సహకారం కూడా తీసుకుంటున్నాం. నేరస్తులు సైబరాబాద్‌లో అడుగుపెట్టాలంటేనే దడ పుట్టేలా చేస్తాం. అంతర్రాష్ట్ర ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. వారి కదలికలపై వాసన వస్తే చాలు ఇట్టే పట్టేస్తాం. ఇందు కోసం యాంటీ క్రైమ్ బృందాలను సైతం పటిష్టం చేశాం. -సీవీ ఆనంద్. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ( ఫైల్) -
హిమాచల్ ఘటన గాలింపులో కీలకనిర్ణయం
-
ఎం హెచ్ 370: చిమ్మ చీకట్లో నల్లపిల్లి కోసం వెతుకులాట
మలేషియా విమానం కోసం అన్వేషణ చిమ్మ చీకట్లో నల్లపిల్లిపి వెతకడం లాగా మారింది. ఆస్ట్రేలియా దగ్గర సముద్రంలో విమానం శిధిలాలున్నాయని సాటిలైట్లు చెప్పిన ఇరవై నాలుగు గంటల తరువాత కూడా విమానం ఎక్కడుందో తెలియడం లేదు. ఇవన్నీ చాలవన్నట్టు దక్షిణ హిందూ మహాసముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కూడ ఇబ్బందులకు దారితీస్తోంది. ఇప్పటికే వెతుకులాటలో ఉన్న విమానాలు ఆస్ట్రేలియాలోని పెర్త్ కు తిరిగి వచ్చేస్తున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా తీరంలో వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. అమెరికా నేవీకి చెందిన పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్ లోనూ తగినంత ఇంధనం లేకపోవడంతో తిరిగి రాక తప్పలేదు. సాటిలైట్ కెమెరాలకు కనిపించిన శిథిలాలు ఏమిటన్న విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అవి బోయింగ్ విమానపు రెక్కలై ఉండవచ్చునని అంటున్నారు. రెక్కల్లో ఉండే ఫ్యూయల్ టాంకులు ఖాళీ అయిపోవడం వల్ల రెక్కలు పైకి తేలి ఉండవచ్చునని అంటున్నారు. నార్వే కి చెందిన కార్గో నౌక హోయె సెంట్ పీటర్బర్గ్ సెర్చి లైట్ల సాయంతో అన్వేషణ కొనసాగిస్తోంది. సౌత్ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకి కార్లను తీసుకువెళ్తున్న ఈ నౌక శుక్రవారం కూడా తన వెతుకులాట కొనసాగిస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్ నుంచి వెలువడే సందేశాల ఆధారంగా విమాన శకలాలు ఎక్కడున్నాయో గుర్తించవచ్చునని, అయితే ఆ బ్యాటరీ 25 రోజుల వరకూ పనిచేస్తుందని, ఇప్పటికే దాదాపు రెండు వారాలైపోయాయని అధికారులు అంటున్నారు. మలేషియాకి చెందిన రెండు విమానాలు, మూడు హెలీకాప్టర్లు, ఆరు పడవలు, చైనాకి చెందిన మూడు విమానాలు, మూడు హెలికాప్టర్లు, అయిదు పడవలు, ఇండోనీషియాకి చెందిన నాలుగు విమానాలు, ఆరు నౌకలు, ఆస్ట్రేలియాకి చెందిన అయిదు విమానాలు, ఒక పడవ, జపాన్‌కి చెందిన నాలుగు విమానాలు, మన దేశానికి చెందిన రెండు విమానాలు, దక్షిణ కొరియాకి చెందిన రెండు విమానాలు, అమెరికా, న్యూజీలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన చెరొక్క విమానం, ఇంగ్లండ్ కి చెందిన ఒక నౌక అన్వేషణలో ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉన్న నార్వే నౌక కూడా అదే పనిలో ఉంది.