సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి.
మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment