న్యూఢిల్లీలోని సైనిక్ ఫాంహౌజ్‌లో చిరుతపులిసంచారం కలకలంరేపింది.శనివారం తెల్లవారుఝామునరాత్రి వాహనదారులకు కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక వీడియోలో, చిరుతపులి గోడపై నుండి దూకి అడవిలోకి పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, రాత్రి బయటకు రావద్దంటూ ప్రకటన జారీ చేశారు.
ఫాంహౌజ్‌కు కొద్ది దూరంలో చిరుత సంచారంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి సుబోధ్ కుమార్ సమాచారం ప్రకారం చిరుత గోడ దూకి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో రెండు కేజ్‌లను ఏర్పాటు చేయడం తోపాటు, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 80-90 కిలోల బరువున్న పూర్తిగా పెరిగిన చిరుతపులి అని తెలిపారు. అటవీ, ఢిల్లీ పోలీసులకు చెందిన 40 మంది సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అధికారి తెలిపారు.
అలాగే ఫాంహౌజ్ వైపు ఎవరూ వెళ్లకుండా స్థానికులను అప్రమత్తం చేశామని ట్రాప్ బోనులను ఏర్పాటు చేసి, వాటి సమీపంలో గుమిగూడ వద్దని ప్రజలకు సూచించినట్లు తెలిపారు. ట్రాప్ బోనులకు సమీపంలో గుమిగూడవద్దని ప్రజలకు సూచించినట్లు పోలీసు అధికారి తెలిపారు.. ఇందులో భాగంగానే అందరూ ఇళ్లనుంచి బయటికి రావద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం.
#WATCH | Announcements are being made in Delhi's Sainik Farm area urging people to stay indoors after a leopard was spotted in the area, earlier today. https://t.co/P4nFo6i3rx pic.twitter.com/HzKnabl7qB
— ANI (@ANI) December 2, 2023
Comments
Please login to add a commentAdd a comment