shamshabab airport
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇద్దరు భారతీయుల లగేజ్ తనిఖీల్లో ఏదో అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేయగా తినే పదార్థం కేలోక్స్ 13 ప్యాకెట్లలో హైడ్రోపోనిక్ గంజాయి రావాణా చేస్తున్నట్లు తేలింది. వారి నుంచి ఏడు కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ. 7 కోట్లు ఉంటుందని తెలిపారు.ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై 1985 ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా హైడ్రోపోనిక్ గంజాయి అత్యంత ప్రమాదకరమైనది. డ్రగ్స్ కంటే కూడా విలువైన, ఖరీదైన గంజాయిగా పేర్కొంటారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇది తయారవుతుంది. -
శంషాబాద్‌లో గవర్నర్ హరిబాబుకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, హుటాహుటిన ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలిలోకి స్టార్ ఆసుపత్రికి తరలించారు.కాగా, మిజోరం గవర్నర్ హరిబాబు సోమవారం ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో, హరిబాబును ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు ఎమర్జెన్సీగా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్: ఎయిరిండియా ప్రయాణికుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని హఠాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు అందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం(91879)లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే బోర్డింగ్ అనంతరం ఫ్లైట్ రద్దు అయినట్లు ప్రకటించారు. రెండు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు పడ్డ ప్రయాణికులు.. చివరకు ఆందోళనకు దిగారు. విమానంలో మొత్తం 147 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
Shamshabad Airport: విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం..
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం నెలకొంది. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతూనే టేకాఫ్ తీసుకుంది. పైలట్ తీరుతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ల్యాండ్ కావాల్సిన విమానం మళ్లీ టేకాఫ్ కావడం చూసి షాక్ అయ్యారు. అయితే ఐదు నిమిషాల తర్వాత విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రన్‌వేపై వెలుతురు సరిగా లేకపోవడంతోనే పైలట్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ -
రూ.125 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. బుకింగ్స్ ఫ్రమ్ టాంజానియా!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల వరుసగా పట్టుబడిన రూ.125 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ముమ్మరం చేశారు. డ్రగ్స్ తీసుకువస్తూ పట్టుబడిన వారంతా క్యారియర్స్‌గా గుర్తించిన అధికారులు విదేశంలోని సప్లయర్లతో పాటు ఇక్కడి రిసీవర్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పక్కా పథకం ప్రకారం ఈ స్మగ్లింగ్ చేయిస్తున్న సప్లయర్లు, మాదకద్రవ్యాలను తీసుకునే రిసీవర్లు ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. విమానాశ్రయంలో గడిచిన పక్షం రోజుల్లో నాలుగు కేసుల్లో చిక్కిన వారిలో టాంజానియన్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఈ డ్రగ్ హైదరాబాద్‌లో తీసుకునే రిసీవర్లు ఎవరనేది నిందితులకు కూడా తెలియదని అధికారులు చెప్తున్నారు. డ్రగ్‌తో ప్రయాణిస్తున్న క్యారియర్ల కోసం నగరంలో హోటల్ గదులనూ సప్లయర్లే బుక్ చేశారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న సద్గురు ట్రావెల్స్ సంస్థకు టాంజానియాలోనూ బ్రాంచ్ ఉంది. ఆ శాఖ నుంచే క్యారియర్ల కోసం సప్లయర్లు గచ్చిబౌలి, మాదాపూర్, మాసబ్‌ట్యాంక్‌ల్లోని హోటళ్లలో రూమ్స్ బుక్ చేశారు. క్యారియర్లతో పాటు ఈ బుకింగ్ రసీదులనూ సప్లయర్లు పంపారు. వీటిని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు సదరు ట్రావెల్స్ సంస్థను సంప్రదించారు. టాంజానియాలోని తమ బ్రాంచ్‌కు వెళ్లిన కొందరు ఈ గదులను క్యారియర్స్‌గా వస్తున్న వారి కోసం బుక్ చేశారని, ఆ సందర్భంలో సగం నగదు చెల్లించాలని కోరినా... చెక్ ఇన్ సమయంలో ఇస్తామంటూ దాట వేశారని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాము ఆ గదులను బుక్ చేయకుండా కేవలం బ్లాక్ చేసి ఉంచామని వివరించారు. సద్గురు ట్రావెల్స్‌కు సంబంధించిన టాంజానియా బ్రాంచ్‌కు వెళ్లిన వారి వివరాలు తెలపాల్సిందిగా డీఆర్ఐ ఆ సంస్థను కోరింది. క్యారియర్లు డ్రగ్స్‌తో వచ్చిన విమానంలోనే సప్లయర్లు, రిసీవర్లకు చెందిన వ్యక్తి కూడా ప్రయాణించి, పరిస్థితులను గమనించి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా విమానాల్లో ప్రయాణించిన వారి జాబితాలను విశ్లేషిస్తున్నారు. క్యారియర్లు డ్రగ్స్‌తో విమానాశ్రయం దాటి వచ్చిన తర్వాత బస చేయాల్సిన హోటల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులకు రిసీవర్ నేరుగా వెళ్లి సరుకు తీసుకునేలా సప్లయర్లు పథకం వేశారు. క్యారియర్లు చిక్కినా తాము పట్టుబడకూదనే డ్రగ్ స్మగ్లర్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. ఈ కేసుల్లో ఇతర నిందితులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మ్యాట్రిమోనితో వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి -
బంగారం అక్రమ రవాణా
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి మణిపూర్ రాజధాని ఇంపాల్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడిని తనిఖీ చేశారు. మలద్వారంలో బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 975 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ. 50.7 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
JP Nadda: నడ్డా రోడ్డెక్కె.. సిటీ హీటెక్కె
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేకెత్తించింది. మంగళవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో దిగడం మొదలు పార్టీ కార్యాలయానికి చేరుకునే దాకా ఉత్కంఠ భరితంగానే కొనసాగింది. ఇటు ఎయిర్‌పోర్టులో, అటు సికింద్రాబాద్ ఎంజీరోడ్డులో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం, పోలీసులు భారీయెత్తున మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనలేదు. నడ్డా ప్రకటనతో టెన్షన్ కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరిట తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించడంపై బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్న నేపథ్యంలో నడ్డా నగరానికి చేరుకున్నారు. సంజయ్ అరెస్టుకు నిరసనగా మంగళవారం సాయంత్రం ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు తాను స్వయంగా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని, అరెస్ట్‌కు కూడా భయపడేది లేదని నడ్డా సోమవారం ఢిల్లీలోనే ప్రకటించారు. దీంతో అటు పోలీసులు, ఇటు పార్టీ నాయకుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొనే కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతి కోరుతూ నార్త్ జోన్ డీసీపీ జి.చందన దీప్తికి బీజేపీ సికింద్రాబాద్ శాఖ అధ్యక్షుడు బి.శ్యామ్ సుందర్‌గౌడ్ దరఖాస్తు చేశారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పాటు నగరంలో నెలకొన్న పరిస్థితులు, ర్యాలీతో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు అదే విషయం లిఖిత పూర్వకంగా తెలిపారు. మంగళవారం విమానాశ్రయంలోనూ, బీజేపీ శాంతియాత్ర నిర్వహిస్తామన్న ఎంజీరోడ్డులో భారీగా మోహరించారు. శంషాబాద్‌లో ఘన స్వాగతం సాయంత్రం 5 గంటల సమయంలో నడ్డా శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నెలకొంది. ఎయిర్‌పోర్టులో నడ్డాకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డాక్టర్కె.లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి, బంగారు శ్రుతి తదిత రులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ లాంజ్‌లోనే రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, గుజ్టుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులతో నడ్డా భేటీ అయ్యారు. సంజయ్ అరెస్ట్, రిమాండ్ పరిస్థితులు, తదనంతర పరిణామాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఉద్యోగుల విభజన, నిరుద్యోగుల సమస్య, ఇతర అంశాలపై పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును గురించి నడ్డాకు పార్టీ నాయకులు వివరించారు. ర్యాలీలకు అనుమతి లేదన్న జాయింట్ కమిషనర్ కాగా, అనుమతి లేకున్నా నడ్డా, నేతలు నిరసన ర్యాలీ కొనసాగించాలని నిర్ణయించారు. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు బీజేపీ శ్రేణులు తరలివచ్చాయి. దీంతో అప్రమత్తమైన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సికింద్రాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూనే సంయుక్త పోలీసు కమిషనర్ కార్తికేయను విమానాశ్రయం దగ్గరకు పంపించారు. అక్కడ నడ్డాను కలిసిన కార్తికేయ ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నాయని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని వివరించారు. సికింద్రాబాద్‌లో తలపెట్టిన కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని కోరారు. నల్లజెండాలు, రిబ్బన్లతో నిరసనలు అనంతరం పార్టీ నేతలతో కలిసి నడ్డా ఎంజీ రోడ్డుకు చేరుకున్నారు. సికింద్రాబాద్‌లో మాజీ మేయర్, బీజేపీ నేత బండా కార్తీకరెడ్డి ఇతర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. చేతుల్లో నల్లజెండాలు ధరించి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. సంజయ్‌ను విడుదల చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడ బీజేపీ నాయకులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి నడ్డా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ని ఎలా అరెస్టు చేస్తారు? అని నడ్డా నిలదీశారు. సంజయ్ అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా సంజయ్ అరెస్టును ఖండించారు. టీఆర్ఎస్ నిరంకుశ ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం కరోనా దృష్ట్యా ర్యాలీని రద్దు చేసినట్లు, సత్యాగ్రహం పూర్తయిందని కిషన్‌రెడ్డి ప్రకటించారు. బాంబే హోటల్ వరకు ర్యాలీ అయితే గాంధీ విగ్రహం నుంచి ఎంజీరోడ్డు మీదుగా బాంబే హోటల్ వరకు ర్యాలీ సాగింది. నడ్డా కారులోనే ఉండి ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిల్స్ చేత పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనం తరం బీజేపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. ర్యాలీ సందర్భంగా, ర్యాలీ అనంతరం సుమారు ఒక గంట పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. ర్యాలీ తర్వాత నడ్డా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపు పార్టీ నేతలతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అనంతరం ఘట్కేసర్ సమీపంలోని తారామతిపేట గ్రామంలోని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి గెస్ట్‌హౌస్‌కు రాత్రి బస నిమిత్తం వెళ్లారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు ఇక్కడికి సమీపంలోని అన్నోజిగూడలో జరిగే ఆరెస్సెస్ అఖిల భారత కార్యకారణి సమావేశాల్లో నడ్డా పాల్గొంటారు. నా ప్రజాస్వామ్య హక్కును అడ్డుకోలేరు: నడ్డా తాము కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూనే ప్రజాస్వామ్యబద్ధంగా తమ కార్యక్రమాలు నిర్వహిస్తామని, గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించడం వరకే పరిమితం అవుతా మని జేసీకి నడ్డా చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగల పౌరు డిగా నిబంధనలు పాటించి.. ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. జాయింట్ సీపీ కార్తికేయ తనతో మాట్లాడారని, రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారని తెలిపారు. కానీ నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ అడ్డుకోలేరని నడ్డా స్పష్టం చేశారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే.. అన్న విలేకరుల ప్రశ్నకు అరెస్ట్ చేస్తే చూద్దామని వ్యాఖ్యానించారు. -
పేపర్‌లెస్ ఈ–బోర్డింగ్.. క్యూ మేనేజ్మెంట్
శంషాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ తగ్గుముఖం పడుతున్న వేళ సురక్షితమైన విమానయానానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ఆయా రాష్ట్రాలు దేశీయ ప్రయాణంలో నిబంధనలను సడలించడంతో మళ్లీ విమానయానం ఊపందుకునే అవకాశం ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయంలోని విశేషాలివీ ►కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్‌లో భాగంగా చెక్–ఇన్ హాల్స్ వద్ద సెల్ఫ్ కియోస్కులను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ చెక్–ఇన్ ప్రక్రియ పూర్తవుతుంది. ►శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు. ►దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్. ►దేశీయ ప్రయాణంలో నిబంధనల సడలింపుతో ఊపందుకోనున్న విమానయానం పేపర్‌లెస్ ఈ–బోర్డింగ్ సౌకర్యం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది. ►దేశీయ ప్రయాణంలో పూర్తి ఈ–బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పించగా, అంతర్జాతీయంగా ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఎమిరేట్స్, గో ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ–బోర్డింగ్ సదుపాయాన్ని వినియోగంలోకి తెచ్చాయి. ►ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా క్యూ మేనేజ్మెంట్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. రద్దీ ప్రాంతాలపై డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఒకేచోట రద్దీ ఏర్పడకుండా నివారిస్తున్నారు. ►జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలు ‘హెచ్ఓఐ’ యాప్ తో భాగస్వామ్యాన్ని రూపొందించుకున్నాయి. దీంతో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డర్లతోపాటు పేమెంట్ సౌకర్యాలను మొబైల్ ఫోన్ల ద్వారా ప్రయాణికులు పొందవచ్చు. ►భౌతిక దూరం నిబంధనలతోపాటు నిరంతర మాస్క్‌ల వినియోగం పర్యవేక్షణ మైక్‌ల ద్వారా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ►టచ్‌లెస్ ఎలివేటర్లతోపాటు ఎక్కువగా వినియోగించే ట్రాలీలు, బెల్టులు ఇతర పరికరాలనూ శానిటైజ్ చేస్తున్నారు. -
రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆదివారం భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి కస్టమ్స్ అధికారులు 12 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.78 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉగాండా, జాంబియా నుంచి ఇద్దరు మహిళలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి -
ఐడియా సూపర్.. కానీ బుక్కయ్యావ్‌గా!
సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణా నిరోధం కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి జనాల మైండ్ సెట్ పెద్దగా మారడం లేదు. ఏదో విధంగా అధికారుల కళ్లు కప్పి బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొన్ని సార్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. నిఘా పెరుగుతున్న కొద్ది జనాల ఆలోచనలు కూడా మారుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో, రూపాల్లో.. దారుల్లో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ వ్యక్తిని చూస్తే.. ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే సదరు వ్యక్తి అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించడానికి ప్యాంటుకు ప్రత్యేకంగా ఓ జేబు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏం లాభం దొరికిపోయాడు. వివరాలు.. దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అధికారుల కన్ను గప్పి బంగారాన్ని తరలించాలని చూశాడు . అందుకు గాను తన ప్యాంటుకు లోపల ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకున్నాడు. దానిలో 71.47 గ్రాములు బంగారాన్ని ముక్కలుగా కట్ చేసి అందులో పెట్టాడు. కానీ కస్టమ్స్ అధికారుల తనిఖీలో ఈ జేబు, దానిలోని బంగారం బయటపడింది. ఇక బహిరంగ మార్కెట్ లో ఈ బంగారం విలువ 3,67,570 రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా టైర్లలో పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు తగు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలోని 155 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్అవుతుండగా మంగళవారం ఈ ఘటన చేసుకుంది. -
అనుమతి లేని ప్రయాణం.. ఆగమాగం
సాక్షి, శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న క్యాబ్‌లకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రయాణికులకు భద్రత లేకుండా కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని అడ్డుకోడానికి పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నా కొందరు క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి భయం లేకుండా వారి వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోకి బుకింగ్‌ల ఆధారంగానే క్యాబ్‌లకు పర్మిషన్ ఇస్తారు. విమానంలో వచ్చే ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా సమయానుకూలంగా అరైవల్, డిపార్చుర్ కేంద్రాలకు చేరుకుంటాయి. ఆ సమయంలో బుకింగ్ చేసుకున్న కార్లలో ప్రయాణికులు అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోతాయి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్టులో ఎలాంటి అనుమతులు లేకుండా కార్లు తిరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం జరిగిన సంఘటన కూడా ఓలా బుకింగ్ స్థానంలో మరో కారు డ్రైవరు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని కిడ్నాప్‌కు యత్నించిన సంఘటన కలకలం రేపింది. బుకింగ్ కూడా లేకుండా ఎయిర్‌పోర్టులోకి క్యాబ్‌లు ఎలా ఎంటర్ అవుతున్నాయని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనుమతులు లేకుండా ఎయిర్‌పోర్టులో తిరుగుతున్న కార్లకు సంబంధించి సుమారు 300కు పైగా టౌటింగ్ కేసులు నమోదు చేశారు. ప్రతిరోజు రెండు నుంచి మూడు ఈ తరహా కేసులు నమోదవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కార్డన్ సెర్చ్‌లో.. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు, ఆరు మాసాలుగా ఎయిర్‌పోర్టులో కూడా పలుమార్లు కార్డన్ సెర్చ్‌లో కూడా టౌటింగ్ కేసులే అత్యధికంగా నమోదయ్యాయి. ప్రయాణికులను బలవంతంగా కార్లలో ఎక్కించుకుంటున్న క్యాబ్ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టౌటింగ్పై పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నా.. అనుమతి లేకుండా ప్రయాణికులను క్యాబ్‌లలో ఎక్కించుకుంటున్న దందా మాత్రం ఆగడం లేదు. ఎయిర్‌పోర్టులో జరుగుతున్న అక్రమ దందాపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకుండా జరుగుతున్న టౌటింగ్ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నాం అనుమతి లేకుండా, బుకింగ్ లేకుండా ప్రయాణికులను తీసుకెళ్తున్న క్యాబ్ డ్రైవర్లపై టౌటింగ్ కేసులు నమోదు చేస్తున్నాం. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. బుకింగ్ లేని కార్లలో ప్రయాణిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎయిర్‌పోర్టులో టౌటింగ్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం – నారాయణరెడ్డి, ఆర్జీఐఏ ట్రాఫిక్ సీఐ -
టాప్ టెన్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు..!
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులకు సేవలందించడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) గొప్ప ప్రగతి సాధించింది. ప్రపంచంలోని టాప్‌టెన్ ఎయిర్‌పోర్టుల్లో 8వ ర్యాంకు పొందింది. ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో నిలవగా.. టోక్యో, ఏథెన్స్ ఎయిర్‌పోర్టులు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా నుంచి మరే ఇతర ఎయిర్‌పోర్టు టాప్ 20లో కూడా లేకపోవడం గమనార్హం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 24వ స్థానంలో నిలిచింది. ఇక అత్యంత చెత్త ఎయిర్‌పోర్టులుగా.. లండన్‌లోని గత్విక్, కెనడాలోని బిల్లీ బిషప్ విమానాశ్రయాలు నిలిచాయి. ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ ఈ ఫలితాలను వెల్లడించింది. విమాన ప్రయాణికుల హక్కులు, పరిహారాలు, కేసులు, విమానాల ఆలస్యం, రద్దు తదితర అంశాలపై ఎయిర్‌హెల్ప్ సేవలందిస్తోంది. ఖతార్ రెండోసారి.. ఇక ఎయిర్‌లైన్స్ సేవల్లో కూడా ఖతార్ వరుసగా రెండో ఏడాది మొదటి ర్యాంకు సాధించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిరోమెక్సికో, ఎస్ఏఎస్ స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఖంతాస్ ఎయిర్‌లైన్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వరస్ట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో ర్యానైర్ ఎయిర్వేస్, కొరియన్ ఎయిర్, కువైట్ ఎయిర్వేస్, యూకేకు చెందిన ఈస్ట్ జెట్, థామస్ కుక్ టాప్ ర్యాంకుల్లో నిలిచాయి. టాప్ టెన్ ఎయిర్‌పోర్టులు.. 1. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - ఖతర్ 2. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - జపాన్ 3. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - గ్రీస్ 4. అఫోన్సో పీనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్ 5. డాన్సిక్ లెచ్ వాటెసా ఎయిర్‌పోర్టు - పోలెండ్ 6. మాస్కో షెరెమ్త్యేవో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - రష్యా 7. సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్టు - సింగపూర్ 8. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఇండియా 9. టెనెరిఫ్ నార్త్ ఎయిర్‌పోర్టు - స్పెయిన్ 10. విరాకోపోస్/కాంపినాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్ -
పీవీ ఎక్స్‌ప్రెస్ వన్ వే మూసివేత
సాక్షి, హైదరాబాద్ : పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే శనివారం నుంచి వన్‌వేగా మారనుంది. దీనికి నిర్వహిస్తున్న మరమ్మతుల నేపథ్యంలో కేవలం విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలనే అనుమతించనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్ కుమార్ తెలిపారు. విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించబోమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాహనాలు ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మోహదీపట్నం మీదగా వెళ్లాలని, అలాగే చాంద్రాయణగుట్ట, జూపార్క్ల వైపు నుంచి వచ్చే వాహనాలు అదే మార్గంలో ప్రయాణించాలని సూచించారు. దాదాపు 3 నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు. వాహనదారుల భద్రత కోసమే... 11.6 కిలోమీటర్లు ఉన్న పీవీఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు కొంతమేర దెబ్బతినడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్ధారిత వేగంతో వెళ్లినా రోడ్డు బాగా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 2009, అక్టోబర్ 19 నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్ వే రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్‌తో కొత్త బీటీ రోడ్డు సోమవారం నుంచి వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి ఈ పనులను వన్‌వేలో పూర్తయ్యాక మళ్లీ మరో వన్‌వేలో వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రకారం ఈ 3 నెలల పాటు వన్‌వేలోనే శంషాబాద్ విమానాశ్రయానికి వాహనదారులను అనుమతించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా... శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీపట్నం మీదుగా రావాల్సి ఉంటుంది. చాంద్రాయణగుట్ట, జూపార్క్ రోడ్డు, శివరాంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనదారులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుంచి మెహదీపట్నానికి చేరుకోవాలి. -
ఎక్స్‌ప్రెస్ హైవే.. నేటి నుంచి వన్ వే
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులకు దాదాపు దశాబ్దకాలం నుంచి సేవలు అందిస్తున్న పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే రహదారి మళ్లీ కొత్తరూపు సంతరించుకోనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే మొదలైన నాడు వేసిన బీటీ రోడ్డు తొలగించి కొత్త బీటీ రోడ్డు వేయనున్నారు. అయితే ఈ పనులతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం పీవీ ఎక్స్‌ప్రెస్ వే నుంచి వన్‌వేలో అనుమతిస్తారు. ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి వచ్చే వారు మాత్రం ఎక్స్‌ప్రెస్ వే కింది నుం చి రావల్సి ఉంటుంది. దాదాపు 3 నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు. వాహనదారుల భద్రత కోసమే... 11.6 కిలోమీటర్లు ఉన్న పీవీఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు కొంతమేర దెబ్బతినడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్ధారిత వేగంతో వెళ్లినా రోడ్డు బాగా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 2009, అక్టోబర్ 19 నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్ వే రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్‌తో కొత్త బీటీ రోడ్డు సోమవారం నుంచి వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి ఈ పనులను వన్‌వేలో పూర్తయ్యాక మళ్లీ మరో వన్‌వేలో వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రకారం ఈ 3 నెలల పాటు వన్‌వేలోనే శంషాబాద్ విమానాశ్రయానికి వాహనదారులను అనుమతించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా... శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీపట్నం మీదుగా రావాల్సి ఉంటుంది. చాంద్రాయణగుట్ట, జూపార్క్ రోడ్డు, శివరాంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనదారులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుంచి మెహదీపట్నానికి చేరుకోవాలి. -
బాబోరూ! పులిగోరు!!
బాలనాగమ్మ అనే జానపద కథ తెలిసిన తరంవారికి ఆ కథలోని బాలవర్ధిరాజు అనే బాలవీరుని పాత్ర, తిప్పడు అనే దురాశ పరు డైన విదూషకుని పాత్ర గుర్తుండే వుంటుంది. బాలనాగమ్మ సౌందర్యానికి వివశుడైన మాయల పకీరు అనే మాంత్రికుడు ఆమెను అపహరించి తన గుహలో బంధిస్తాడు. యుద్ధా నికి వచ్చిన ఆమె భర్త కారంపూడి పాలకుడు కార్యవర్ధిని శిలగా మారుస్తాడు. వారి కుమారు డైన బాలవర్ధిరాజు తల్లిదండ్రులను వెతుక్కుంటూ బయల్దేరు తాడు. దారిలోని అడవి ప్రాంతంలో ఒక పెద్దపులి సంచరిస్తుం టుంది. పరిసర గ్రామాల ప్రజలు భయంతో ఆ ప్రాంతపు రాజుగారి శరణు వేడుతారు. ఆ పులిని చంపి దాని గోళ్లను ఆనవాళ్లుగా తెచ్చి చూపిన వీరునికి అర్ధ రాజ్యం బహుమతిగా ఇస్తాననీ, తన కుమా ర్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని రాజుగారు చాటింపు వేయించి ఉంటాడు. అడవి మార్గాన వెళుతున్న బాలవర్ధికి పులి ఎదురవుతుంది. ఆ యువకుడు భీకరంగా పోరాడి పులిని హతమారుస్తాడు. అలసి పోయి ఒక చెట్టుకింద నిద్రపోతాడు. దూరంగా ఇదంతా గమని స్తున్న తిప్పడు అనే పొరుగూరి సాధారణ వ్యక్తి మదిలో దురాశ పుడుతుంది. నిశ్శబ్దంగా ఆ పులిగోళ్లను కత్తిరించుకొని రాజాస్థానా నికి చేరుకుంటాడు. ఇలాంటి జానపద కథలన్నింటిలాగే ఈ కథ లోనూ వీరుడెవరో.. విదూషకుడెవరో తెలిసిపోతుంది. ఈ కథతో మన సంబంధం ఇక్కడి వరకే. ఇప్పుడిక్కడ ప్రస్తావించబోయే ఆధునిక పులిగోటి వీరుడు మాత్రం తనను తాను హీరోగా అభివర్ణించుకుంటారు. ఎవ్వరడి గినా అడక్క పోయినా, సందర్భమైనా అసందర్భమైనా సరే... తన అవక్ర విక్రమ పరాక్రమ వీరత్వాన్ని తన్మయత్వంలో రంగరించి చెప్పుకోవడం ఆయనకు అలవాటు. అది ఎటువంటి బంధమో తెలి యదు కానీ, గంటల తరబడి సాగే ఆయన స్వోత్కర్షను మెజారిటీ చానళ్లు లైవ్ టెలికాస్టు చేయాల్సిందే. కొన్ని పత్రికలు రోజూ మోయా ల్సిందే. ఆయన కథానాయకుడా, ప్రతినాయకుడా, విదూషకుడా, విదూషకత్వంతో కూడిన ప్రతినాయకుడా అన్నదానిపై భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి. అయితే, పులిగోరు విద్యల్లో ఆయనంత ఆరి తేరిన రాజకీయ నేత మరెవ్వరూ లేరని మాత్రం అందరూ అంగీ కరిస్తారు. పీవీ నరసింహారావుగారు ప్రధానిగా వున్న సమయంలో ఎంతో దూరదృష్టితో హైదరాబాద్‌ను కంప్యూటర్ రంగానికి కేంద్రంగా చేయడానికి పునాదులు వేశారు. ఆ రంగంలో హైదరాబాద్ నగరం చేత తొలి అడుగును ఆయనే వేయించారు. తొలి అడుగు వేసిన ఈ నగరం ఐటీలో అగ్రస్థానంలో ఉండాల్సింది. కానీ, కథ ఇక్కడే మలుపు తిరి గింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్నికల చరిత్రను తిరగరాస్తూ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. అనతికాలంలోనే, మీడియా రంగాన్ని శాసిస్తున్న గురువులు–లఘువుల సహకారంతో చంద్రబాబు ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కోటరీ సాయంతో కత్తి వాడకుండానే, నెత్తురు కారకుండానే పూర్తి అహింసా పద్ధతుల్లో ఎన్టీఆర్ గుండెకాయను కోసేయడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవ డం జరిగిపోయింది. చంద్రబాబు తొమ్మిదేళ్లు పరిపాలించారు. భారత దేశంలో గుప్తుల స్వర్ణయుగాన్ని తలదన్నే ఆంధ్రుల స్వర్ణయుగంగా ఓ వర్గం వారు ఈ కాలాన్ని పేర్కొంటారు. అందుకు తందానాగా మీడి యాలోని గురువులూ, లఘువులూ దరువులేసి మరీ ప్రచారంలో పెట్టారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో పక్కనున్న కర్ణాటకలో ముగ్గురు ముఖ్య మంత్రులు మారిపోయారు. దేవెగౌడ రెండేళ్లు, హెచ్‌జే పటేల్ రెండేళ్లు, ఎస్.ఎమ్. కృష్ణ ఐదేళ్లు అధికారంలో వున్నారు. అదేం చిత్రమో గాని ఇక్కడ మన స్వర్ణయుగం ముగిసేనాటికి (అక్కడ ముగ్గురు మారిన ప్పటికీ) హైదరాబాద్ అందుకోలేనంత దూరం ఐటీ రంగంలో బెంగ ళూరు పరిగెత్తింది. కానీ, సైబర్ టవర్స్ అనే బిల్డింగ్ ఆకారంలో ఓ పులిగోరు చంద్రబాబు మెడలో చేరిపోయింది. భారతదేశంలో ఐటీ రంగానికి ఆద్యుడెవరు? కంప్యూటర్ను ప్రవేశపెట్టిందెవరు?... ఇంకె వరు!... భజంత్రీలూ వాయించండర్రా...! వాయించేశారు. గురువులు, లఘువులూ స్తోత్రకైవారాలు గావించారు. భారతదేశంలో మరే నగరానికీ లేని ప్రత్యేకత హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎనిమిది వరుసలలో రూపొందిన ఈ రహదారి మౌలిక వసతుల రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానానికి చేర్చింది. ఈ రహదారి ప్లానింగూ, భూసేకరణ, నిర్మాణం అంతా వైఎస్ హయాంలోనే జరిగింది. అప్పుడు జరిపిన భూసేకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం భజన బృందం పెద్ద దుమారాన్నే లేవ దీసింది. అయినాసరే దీన్ని కూడా ‘స్వర్ణయుగం కోటరీ’ బాబు ఖాతా లోనే వేసింది. బాబు కూడా సిగ్గుపడకుండా, భయపడకుండా తన ఘన తగానే మరో పులిగోరు మెడలో వేసుకున్నారు. వాయిద్యాలూ మోగాయి. స్తోత్ర పఠనం కూడా జరిగింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కథ కూడా ‘షేమ్ టు షేమ్’. ఆ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరిగింది వై.ఎస్. హయాంలోనే. ప్రారంభోత్సవం జరిగిందీ ఆయన ఆధ్వర్యంలోనే. అయినా సరే దాని పేరుతో కూడా ఓ పులిగోరు బాబుగారి దగ్గరుంది. విమానాశ్రయాన్ని కట్టింది చంద్రబాబేనంటూ ‘స్వర్ణయుగ’ చరిత్రకారులు రాసి పెట్టారు. ఎల్లో సిండికేట్ ఆధ్వర్యంలో యధాశక్తి వాద్యం! యథాశక్తి స్తోత్రం!! ఇలా చెప్పుకుంటూపోతే ఈ పులిగోళ్ల పురాణం ఓ గ్రంథమవు తుంది. అందుకని, వ్యాస విస్తరణ భీతివల్ల ఇంతటితో ముగించి, తాజా పరిపాలనాకాలం ముగుస్తున్న వేళ ఉన్న పరిస్థితిని పలకరిద్దాం. అధి కారాంతమున ఆయన ఆర్డర్ చేసిన పులిగోళ్లు మరీ ముచ్చటగా ఉన్నాయి. ఎన్నికల రణరంగంలో అలంకరించుకునేందుకు బంగారు తొడుగుల పులిగోళ్లను ఆయన సిద్ధం చేశారు. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఆయనిచ్చిన డబ్బులు వడ్డీకి కూడా సరిపోలేదని ఓ పక్క రైతులంతా గగ్గోలుపెడుతున్నా ఆయ నకు పట్టలేదు. సరిగ్గా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి ‘అన్నదాతా సుఖీభవ’ అంటూ మరో పులిగోరు ఆభరణం తగిలించుకున్నారు. మోడల్ కూడా తన తెలివికాదు. రెండేళ్ల కింద ప్రతిపక్ష నేత ప్రకటించిన రైతు భరోసాను లేపేశాడు. అదీ వెంటనే లేపలేదు. ఆయన ఉద్దేశం ఎన్నికల ముందు అలంకరించుకోవడమే కనుక రెండు నెలల ముచ్చటకో సమే ఈ మురిపెం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టారు. మామూలు మనిషన్నవాడైతే చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాడు. కానీ, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చి, పసుపు– కుంకుమ అనే సెంటిమెంటు పులిగోళ్లను బయటకు తీశాడు. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్–సావిత్రి మధ్య నడిచిన సిస్టర్ సెంటిమెంట్‌కు దీటుగా ఈ రెండు నెలలు పసుపు కుంకుమ అనే నాటకాన్ని నడిపించేందుకు తైనాతీలు య«థాశక్తి తాపత్రయపడు తున్నారు. నిరుద్యోగ సమస్యపైనా అదే డ్రామా. ఇంటికో ఉద్యోగం ఇస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మండలానికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి చివరిదాకా ఇవ్వలేదు. రెండు నెలల ఎన్నికల వేషంకోసం ఇప్పుడా పులిగోరు కూడా సిద్ధమైంది. పూర్వం రాజులు యుద్ధాల్లో గెలిచినప్పుడు విజయసూచ కంగా శిలాశాసనాలను ప్రతిష్ఠించే వాళ్లు. కానీ బాబుగారు ఎక్కడా గెలవకుండానే గెలిచినట్టు ప్రచారం చేసుకునే విద్యలో రాటుదే లారు. బతికి వున్న పులి దగ్గరికే పోకుండా చచ్చిన తర్వాత గోళ్లు ఎత్తుకొచ్చి అమ్ముకునేవాళ్ల మాదిరిగా. వ్యక్తిత్వ వికాస పాఠాల్లోని ఓ ప్రాథమిక సూత్రాన్ని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. అది ‘సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాల’ని! కానీ ఈ సూత్రాన్ని కొంత భిన్నమైన రీతిలో ఆయన ఆచరించారు. వైఫ ల్యాలను కూడా విజయాలుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు ఉనికి రహస్యం. కొసమెరుపు చివరి పులిగోరు కొంచెం తేడా. ఇంతకుముందు తాను చేయని పనులను చేసినట్టుగా చూపించుకునే పులిగోళ్లు. తాజాగా తాను చేసిన పాపానికి ఒప్పుకోలు పులిగోరు. వై.ఎస్. రాజశేఖ రరెడ్డి దురదృష్టకర మరణం తర్వాత ఆయన కుమారుడిని పార్టీ నుంచి బయటకు పంపి తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు స్నేహం ముసుగు జారి బహిరంగమయింది. జగన్‌కు వ్యతి రేకంగా కుట్రలు నడపడంలో తోడ్పడిన కిరణ్‌కుమార్‌రెడ్డిని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది బాబే. ఆయన తమ్ముడికి అసెంబ్లీ టికెట్ కూడా టీడీపీ తరఫునే ఖాయం చేశారు. కిరణ్‌ను కూడా పార్లమెంట్ బరిలో నిలపాలనే ముచ్చట కూడా వుందట బాబుకు. కానీ, ఆ వీరుడికి కత్తిపట్టడం చాతనవుద్దో, కాదోనన్న సందేహం పీడిస్తోందట. కాంగ్రెస్ పార్టీ సహకారంతో తాను, తన ఎల్లో సిండికేట్ రచించి దర్శకత్వం వహించిన జగన్ కేసుల నాటకంలో కీలక పాత్ర పోషించిన అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ టికెట్ కేటాయించడానికి సిద్ధపడి కథను చంద్రబాబు క్లైమాక్స్‌కు చేర్చారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ తప్పుడు కేసుల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందని జేడీ మొర పెట్టుకున్నందువల్లనే పదవీ విరమణ చేయించి రాజకీయ ప్రవేశం చేయించారని లోకం కోడై కూస్తోంది. చంద్రబాబు మెడలో తాజా ముద్దుల పులిగోరు జేడీ లక్ష్మీ నారాయణ. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
మహిళ నుంచి అరకేజీ బంగారం స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి అధికారులు 500 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో నివసించే రోషిని కొతాడియా ముంబై వెళ్లడానికి ఆదివారం ఉదయం శంషాబాద్ చేరుకుంది. ఈ క్రమంలో సీఐఎస్ఎఫ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆమె వద్ద 100 గ్రా. బరువున్న 5 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అమెరికాలో ఉండే తన మామ ఆ బంగారాన్ని బహుమతిగా ఇచ్చినట్లు ఆమె విచారణలో వెల్లడించినప్పటికీ.. అందుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సౌదీ విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. ఈ విషయం గమనించిన పైలట్లు వెంటనే చాకచక్యంగా ల్యాండింగ్ చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 70 మంది ప్రయాణం చేస్తున్నారు. -
సీవీ ఆనంద్‌కు ఎయిర్‌పోర్టుల రక్షణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధి కారి సీవీ ఆనంద్‌ను దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ఐజీగా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూ రిటీ ఫోర్స్) నియమించింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆయనకు.. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రత బాధ్యతను అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. దేశంలో 80కి పైగా విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత అందిస్తోంది. గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 12 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లు, మరో 18 జాతీయ విమానాశ్రయాల భద్రతను ఆనంద్ పర్యవేక్షించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా.. ఇదివరకు ఎయిర్‌పోర్టుల భద్రతను పర్య వేక్షించేందుకు కేవలం అదనపు డీజీపీ, ఒక ఐజీ పోస్టు మాత్రమే సీఐఎస్ఎఫ్లో ఉండేది. నెల క్రితం మరో ఐజీ పోస్టును సృష్టించిన సీఐఎస్ఎఫ్.. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతను ఆనంద్‌కు అప్పగించింది. ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రతను పర్యవేక్షించనున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
-
అండర్వేర్లో రూ.19 లక్షల బంగారం
సాక్షి, శంషాబాద్: కస్టమ్స్ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా...బంగారం అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగారూ.19 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెద్దా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆ వ్యక్తిని తనిఖీ చేయగా అండర్ వేర్లో మూడు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అండర్‌వేర్‌కు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో బంగారు బిస్కెట్లను దాచుకున్నాడు. 612.5 గ్రాముల ఈ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకొని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఇక గత పది రోజులుగా శంషాబాద్‌లో 3 కేజీల 400 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనత సాధించింది. మన దేశంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ విధానాన్ని అమలుచేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా రికార్డు నెలకొల్పింది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న పౌర విమానయాన శాఖ.. ముందుగా గత ఏప్రిల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో జెట్ ఎయిర్ వేస్ సహకారం కూడా ఉంది. ఈ మూడు నెలల కాలంలో దాదాపు 700 మంది ప్రయాణికులు ఈ- బోర్డింగ్ విధానాన్ని వినియోగించుకున్నారని, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఈ- బోర్డింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలుచేసినందుకు గానూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని బుధవారం జీఎంఆర్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం స్పూర్తితో మరిన్ని ఎయిర్ పోర్టుల్లో ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు విమానయాన శాఖ పేర్కొంది.