సీనియర్ ఐపీఎస్ అధి కారి సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధి కారి సీవీ ఆనంద్‌ను దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ఐజీగా సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూ రిటీ ఫోర్స్) నియమించింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆయనకు.. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రత బాధ్యతను అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. దేశంలో 80కి పైగా విమానాశ్రయాలకు సీఐఎస్‌ఎఫ్ భద్రత అందిస్తోంది. గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 12 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లు, మరో 18 జాతీయ విమానాశ్రయాల భద్రతను ఆనంద్ పర్యవేక్షించనున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా..
ఇదివరకు ఎయిర్‌పోర్టుల భద్రతను పర్య వేక్షించేందుకు కేవలం అదనపు డీజీపీ, ఒక ఐజీ పోస్టు మాత్రమే సీఐఎస్‌ఎఫ్‌లో ఉండేది. నెల క్రితం మరో ఐజీ పోస్టును సృష్టించిన సీఐఎస్‌ఎఫ్.. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతను ఆనంద్‌కు అప్పగించింది. ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రతను పర్యవేక్షించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment