అండర్‌వేర్‌లో రూ.19 లక్షల బంగారం | Men held with gold in underwear at Hyderabad International Airport | Sakshi
Sakshi News home page

వీడు మాములోడు కాదు.. లో దుస్తుల్లో రూ.19 లక్షల గోల్డ్‌

Published Sat, Oct 21 2017 2:05 PM | Last Updated on Sat, Oct 21 2017 2:23 PM

  Men held with gold in underwear at Hyderabad International Airport

సాక్షి, శంషాబాద్‌: కస్టమ్స్‌ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా...బంగారం అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగారూ.19 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెద్దా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఆ వ్యక్తిని తనిఖీ చేయగా అండర్‌ వేర్‌లో మూడు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అండర్‌వేర్‌కు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో బంగారు బిస్కెట్లను దాచుకున్నాడు.

612.5 గ్రాముల ఈ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకొని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఇక గత పది రోజులుగా శంషాబాద్‌లో 3 కేజీల 400 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement