సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు.
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇద్దరు భారతీయుల లగేజ్ తనిఖీల్లో ఏదో అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేయగా తినే పదార్థం కేలోక్స్ 13 ప్యాకెట్లలో హైడ్రోపోనిక్ గంజాయి రావాణా చేస్తున్నట్లు తేలింది. వారి నుంచి ఏడు కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ. 7 కోట్లు ఉంటుందని తెలిపారు.
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై 1985 ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా హైడ్రోపోనిక్ గంజాయి అత్యంత ప్రమాదకరమైనది. డ్రగ్స్ కంటే కూడా విలువైన, ఖరీదైన గంజాయిగా పేర్కొంటారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇది తయారవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment