సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా టైర్లలో పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు తగు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలోని 155 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్‌అవుతుండగా మంగళవారం ఈ ఘటన చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment