indigo plane
-
ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు
ఢిల్లీ, సాక్షి: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టాయిలెట్ మీద బాంబ్ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో.. విమానం గాల్లోకి ఎగరకముందే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా దించేశారు. ఆపై సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. వేకువ జామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ ఘటనపై కాసేపట్లో అధికారులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. The IndiGo crew before taking off found a note with the word "bomb" written on it in the aircraft's lavatory, says aviation security official who was on the spot.— ANI (@ANI) May 28, 2024 Passengers of #IndiGo flight from #Delhi to #Varanasi were evacuated via emergency exit following a #bombthreat, earlier today.The aircraft has been moved to isolation bay and further investigations are being carried out. More details are awaited.#imxplorer #travel #indigo pic.twitter.com/QYRVgGKpIR— IMxplorer-Travel The World (@IMTravelService) May 28, 2024 -
శంషాబాద్: కోపంతో బాంబు బెదిరింపు కాల్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో కాసేపు అధికారులు హడలి పోయారు. హైదరాబాద్-చెన్నై ఇండిగో విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అయితే.. తనిఖీ చేశాక విమానంలో బాంబులేదని అధికారులు నిర్ధారించుకున్నారు. ఇక.. ఫోన్ చేసిన వ్యక్తిని వెంటనే ట్రేస్ చేశారు అధికారులు. ఆ వ్యక్తిని అజ్మీరా భద్రయ్యగా గుర్తించించింది సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్. దీంతో భద్రయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను చెప్పిన కారణం విని అధికారులు బిత్తరపోయారు. విమానంలో భద్రయ్య చెన్నై వెళ్లాల్సి ఉంది. కానీ, ఆలస్యంగా రావడంతో విమానం ఎక్కేందుకు ఆయన్ని సిబ్బంది అనుమతించలేదు. దీంతో కోపంతోనే విమానంలో బాంబు పెట్టానంటూ ఫోన్ చేసి బెదిరించాడట భద్రయ్య. -
ఇండిగో నిర్వహణ బాగోలేదు.. సొంత సంస్థపై ఉద్యోగుల షాకింగ్ ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రామాణిక నిర్వహణ విధానాలను ఇండిగో సరిగ్గా పాటించడం లేదని ఆ సంస్థలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు ఆరోపించారు. దీని వల్ల ప్రయాణికుల భద్రత రిస్క్‌లో పడుతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆల్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్ జులై 12న విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు లేఖ రాశారు. ఇండిగో విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఎయిర్‌బస్‌కు వారు విజ్ఞప్తి చేశారు. 'మీరు విమానాలకు లీజుకు ఇచ్చిన ఆపరేటర్లు నిర్వహణ ప్రమాణాలను పాటించడం లేదు. గత నాలుగు రోజులుగా సాంకేతిక సిబ్బంది స్ట్రయిక్ చేస్తున్నారు. అయినా సరైన నిర్వహణ లేకుండానే విమానాలు నడుస్తున్నాయి. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని గత ఏడు రోజులకు సంబంధించిన నిర్వహణ డాటాను ఆపరేటర్లను అడగండి. సరైన నిర్వహణ లేకపోతే ఆ సంస్థల వల్ల మార్కెట్లో మీ కంపెనీకి కూడా చెడ్డపేరు వస్తుంది. మీ విమానాల నిర్వహణ ప్రమాణాలను వారు దిగజార్చారు. ఈ విషయంపై మీరు వాళ్లని నేరుగా ప్రశ్నించండి.' అని సాంకేతిక నిపుణులు ఎయిర్‌బస్‌కు లేఖ రాశారు. అయితే, ఈ ఆరోపణలను ఇండిగో కొట్టిపారేసింది. విమాన నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొంది. అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది. ఇవి నిరాధార ఆరోపణలని, కొందరు దురుద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇండిగో సాంకేతిక నిపుణులు లేఖ రాసిన ఐదు రోజులకే ఆ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. ఆదివారం షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం సాంకేతిక కారణాలతో పాకిస్థాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో ఈ లేఖ చర్చనీయాంశమైంది. చదవండి: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
బెల్టు హుక్స్‌లో బంగారం
శంషాబాద్: బెల్టు హుక్స్‌లో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి లగేజీలో ఉన్న ఓ బెల్టును తనిఖీ చేయగా దాని హుక్స్‌కు ఉన్న పైపూతను తీయడంతో వాటిని బంగారంగా గుర్తించారు. 300 గ్రాముల బరువు ఉన్న బంగారు హుక్స్ రూ.18.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పిన ఘోర ప్రమాదం! ఆలస్యంగా వెలుగులోకి..
బెంగళూరు: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు ఇండిగో విమానాలు గాల్లో ఉండగా.. కాస్తలో ఒకదాంతో మరొకటి ఢీ కొట్టే ప్రమాదం తప్పింది. జనవరి 7వ తేదీనే ఈ ఘటన జరిగిందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీనియర్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఇండిగో విమానం 6ఈ455 (బెంగళూరు నుండి కోల్‌కతా), 6ఈ246 (బెంగళూరు నుండి భువనేశ్వర్) ఉదయం పూట వెళ్తున్న సమయంలో సుమారు 5 నిమిషాల వ్యవధిలో కెంపగౌడ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు విమానాలు గాల్లో అత్యంత దగ్గరా సమీపిస్తుండగా రాడార్లు హెచ్చరించాయి. దీంతో రెండు విమానాల పైలట్లు వెంటనే అప్రమత్తమై దూరంగా మళ్లించండంతో ఢీకొట్టే ముప్పు తప్పిందని తెలిపారు. ఘటన జరిగినప్పుడు రెండు విమానాలు 3,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బెంగళూరు-కోల్‌కతా విమానంలో 176 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది. బెంగళూరు-భువనేశ్వర్ విమానంలో 238 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 426 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. రెండు విమానాలు గాల్లో ప్రమాదకరంగా అత్యంత సమీపంగా కదులుతున్న సమయంలో అప్రోచ్ రాడార్ కంట్రోలర్ లోకేంద్ర సింగ్ గమనించి.. వెంటనే రెండు విమానాలకు సిగ్నల్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో రెండు విమానాలు గాల్లో ఢీకొనకుండా నివారించారని డీజీసీఏ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడా నివేదించలేదని తెలిపారు. దీనిపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు విమానాలు బెంగళూరు విమానాశ్రయం టేకాఫ్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు. -
విమానం టేకాఫ్‌కు ముందు షాకిచ్చిన ప్యాసింజర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన మధ్య ఒక విమాన ప్రయాణికుడి నిర్లక్ష్య వైఖరి కలకలం రేపింది. విమానం మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్ తీసుకుంటుందనగా తనకు కరోనా పాజిటివ్ అంటూ ప్రయాణికుడు బాంబు పేల్చాడు. దీంతో హతాశులైన విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని నిలిపి వేసి, అధికారులకు సమాచారమిచ్చారు. ఢిల్లీ నుండి పూణే బయలుదేరిన ఇండిగో 6ఇ -286 విమానంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విమానం గాల్లోకి ఎగిరేందుకు (టేకాఫ్)సిద్ధమవుతుండగా తనకు కరోనా పాజిటివ్ అని చెప్పడంతో తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి, పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌కు పరిస్థితిని వివరించారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన సదరు ప్రయాణికుడిని అంబులెన్స్ ద్వారా దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్‌కు తరలించారు అధికారులు. ఆ తరువాత ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించి, ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానం మొత్తం శానిటైజ్ చేసిన తరువాత సుమారు గంటన్నర ఆలస్యంగా విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. అలాగే ప్రయాణీకులందర్నీ స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా సూచించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. కాగా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో విమానయాన రంగం ఒకటి. గత ఏడాది మార్చి నుంచి జాతీయ,అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ప్రత్యేక నిబంధనలతో దేశీయంగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనాయి. కానీ అంతర్జాతీయంగా మళ్లీ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ వాణిజ్య విమానాల నిషేధాన్ని డీజీసీఏ మార్చి 31, 2021 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు ముందున్నస్థాయిలో 80 శాతంవరకూ దేశీ సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ సామర్థ్యంలో 80 శాతం విమానాలను నిర్వహించేందుకు వీలు చిక్కింది. ఇందుకు అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ విధించిన తదుపరి మే 25న దేశీయంగా విమాన సర్వీసులకు ప్రభుత్వం అనుమతించింది. రెండు నెలల తరువాత సర్వీసులు ప్రారంభమైనప్పుడు 30,000 మంది ప్రయాణికులు నమోదుకాగా.. నవంబర్ 30కల్లా ఈ సంఖ్య 2.52 లక్షలను తాకినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రయివేట్ రంగ లిస్టెడ్ కంపెనీలు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండిగో.. గో ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 1,744 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,747 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. దేశీయంగా మే నెలలో 33 శాతం, జూన్‌లో 45 శాతం వరకూ విమానాల నిర్వహణకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా 70 శాతం నుంచి 80 శాతానికి పరిమితిని పెంచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. స్పైస్‌జెట్ దేశీ సర్వీసులలో 80 శాతం వరకూ విమానాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో స్పైస్‌జెట్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9.3 శాతం దూసుకెళ్లి రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 92 వరకూ ఎగసింది. ఇక రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా కల్రాక్ క్యాపిటిల్ కన్సార్షియం మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇటీవల జెట్ ఎయిర్వేస్ కౌంటర్ సైతం ర్యాలీ బాటలో సాగుతున్న విషయం విదితమే. వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడటంతో జెట్ ఎయిర్వేస్ షేరు నవంబర్ 5న రూ. 79 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షేరు 1.5 శాతం క్షీణించి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
ఇండిగో- హిందుస్తాన్ ఏరోనాటిక్స్ .. హైజంప్
ఏటీఆర్ విభాగంలోని 12 ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకివ్వడం, విక్రయించడం వంటి ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కౌంటర్ దూకుడు చూపుతోంది. మరోపక్క దేశీయంగా తయారు చేసిన రూ. 8,722 కోట్ల విలువైన పరికరాల కొనుగోలుకి రక్షణ శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడికావడంతో పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇంటర్‌గ్లోబ్ ఇండిగో బ్రాండుతో విమానయాన సేవలందించే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 13 ఏటీఆర్ విమానాలను లీజుకివ్వడం, విక్రయించడం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే ఎయిర్‌గో క్యాపిటల్, డీఏఈ తదితర లెస్సర్స్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో 2 కోట్ల డాలర్ల(రూ. 150 కోట్లు) వరకూ సమకూరే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఇటీవలే అనుమతించింది. మరోవైపు విమానాల లీజు చెల్లింపులపై మారటోరియం ద్వారా లబ్ది పొందే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిగో షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 1032 వద్ద ట్రేడవుతోంది. హెచ్ఏఎల్ మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ రూ. 8,722 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేసేందుకు తాజాగా అనుమతించింది. వీటిలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ అభివృద్ధి చేసిన ఫిక్స్డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. హెచ్ఏఎల్ డిజైన్ చేసి రూపొందించిన 106 బేసిక్ ట్రయినర్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 1098 వద్ద ట్రేడివుతోంది. తొలుత ఒక దశలో రూ. 1127 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. -
విమానానికి తప్పిన ప్రమాదం
రేణిగుంట (చిత్తూరు జిల్లా): రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8.30 గంటలకు రన్‌వేపై వెళ్తున్న ఫైరింజన్ అదుపుతప్పి బోల్తా పడింది. కొన్ని నిమిషాల వ్యవధిలో ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే వైపు వచ్చింది. రన్‌వేపై జరిగిన విపత్తును గుర్తించిన పైలెట్ విమానాన్ని దించకుండా గగనతలంలో కాసేపు చక్కర్లు కొట్టారు. అటు నుంచి అటే టేకాఫ్ అయి విమానాన్ని బెంగళూరుకు తరలించారు. విమానంలో మొత్తం 48 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 33 మంది రేణిగుంటలో దిగాల్సి ఉండగా, 15 మంది బెంగళూరుకు చేరుకోవాలి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఫైరింజన్‌ను పక్కకు తీసుకెళ్లారు. యథావిధిగా విమాన రాకపోకలు కొనసాగాయి. ఇక్కడ దిగాల్సిన 33 మంది ప్రయాణికులను మళ్లీ బెంగళూరు నుంచి విమానంలో మధ్యాహ్నం 12.45కు తీసుకొచ్చారు. విమానం రావడానికి కొన్ని నిమిషాల ముందు ఫైరింజన్ రన్‌వేపై తనిఖీలు చేయడం ఆనవాయితీ. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఫైరింజన్ బోల్తా పడినట్లు అధికారులు భావిస్తున్నారు. -
నేటి నుంచి బెంగళూరుకు విమానం
మధురపూడి: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమాన సర్వీసులు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసులు నిర్వహించనుంది. 6ఈ7231 నెంబర్ గల ఈ సర్వీసు ప్రతి రోజూ మధ్యాహ్నం 3.35 గంటలకు బెంగళూరులో బయలుదేరి, సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. 6ఈ7232 నెంబర్ గల సర్వీసు సాయంత్రం 6.00 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరుకు పయనమవుతుంది. ఉదయం 9.25 గంటలకు, రాత్రి 9.15 గంటలకు ఉన్న హైదరాబాద్ సర్వీసులు యథాతథంగానే కొనసాగుతాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్ ఆగస్టు 20వ తేదీ వరకూ ఇదేవిధంగా కొనసాగుతాయి. -
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా టైర్లలో పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు తగు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలోని 155 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్అవుతుండగా మంగళవారం ఈ ఘటన చేసుకుంది. -
జస్ట్ మిస్.. లేకుంటే పెను ప్రమాదమే!
న్యూఢిల్లీ : భారత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారుల అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. లేకుంటే గాల్లో రెండో విమానాలు ఢీకొని పెను ప్రమాదం సంభవించేదని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పేర్కొంది. గువాహతి నుంచి కోల్‌కతా, చెన్నై నుంచి గువాహతి వస్తున్న రెండు ఇండిగో విమానాలు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఒకదానికి ఒకటి ఢీకునేలా దగ్గరకు వచ్చాయి. తొలుత కోల్‌కతా ఫ్లైట్ 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. చెన్నై విమానం 35,000 అడుగుల్లో ప్రయాణిస్తోంది. అయితే కోల్‌కతా విమానంకు బంగ్లాదేశ్ ఏటీసీ అధికారులు 35,000 అడుగుల్లో ప్రయాణించాలని సూచించడంతో ఈ రెండు విమానాలు ఒకే లెవల్లో ప్రయాణించాయి.( చదవండి: టేకాఫ్‌కు కొన్ని నిముషాల ముందు..) ఇది గుర్తించిన భారత ఏటీసీ అధికారులు వెంటనే చెన్నై-గువాహతి ఫ్లైట్‌ను కుడివైపు టర్న్ తీసుకుని, కోల్‌కతా విమానంకు దూరంగా వెళ్లాలని సూచించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. నిబంధనల ప్రకారం రెండు విమానాల మధ్య ఎత్తు వెయ్యి అడుగుల వ్యత్యాసం ఉండాలి. అయితే కోల్‌కతా విమానం బంగ్లా అధికారులు సూచనలతో కిందికి రావడంతో రెండు విమానాలు ఒకే లెవల్లో ప్రయాణించాయి. ఈ ఘటనపై ఏఏఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇండిగో అధికారప్రతినిధి మాత్రం ఈ సంఘటనపై ఎలాంటి సమాచారం అందలేదన్నాడు. ఇటీవల ఇండోనేషియాలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. (చదవండి: సముద్రంలో కూలిన విమానం) -
విమానం అత్యవసర ల్యాండింగ్.. అయినా దక్కని పసివాడి ప్రాణం
హైదరాబాద్: నాలుగు నెలల చిన్నారి అస్వస్థతకు గురవ్వడంతో పట్నా వెళ్లే ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయినప్పటికీ ఆ పసివాడి ప్రాణం మాత్రం దక్కలేదు. బిహార్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సందీప్‌కుమార్ తన భార్య పునీత్ శర్మతో కలసి బెంగళూరులో నివాసముంటున్నాడు. మంగళవారం ఉదయం పునీత్ శర్మ తన నాలుగు నెలల కుమారుడు స్పర్శ్‌తో కలసి బెంగళూరు నుంచి ఇండిగో 6ఈ837 విమానంలో పట్నాకు బయలుదేరింది. ప్రయాణంలో స్పర్శ్ శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందికి గురికావడంతో ఆమె విమాన సిబ్బంది దృష్టికి తీసుకువచ్చింది. దీంతో పైలెట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. వెంటనే చిన్నారిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. పునీత్‌శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విమానం టేకాఫ్ అవుతుంటే పేలిన టైరు
-
విమానం టేకాఫ్ అవుతుంటే పేలిన టైరు
పాట్నా: ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం ఓ టైరు పేలడంతో ఆ సర్వీస్‌ను నిలిపివేశారు. బిహార్‌లోని పాట్నాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పాట్నా నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు ఇండిగో విమానం రన్‌వే పై సిద్ధంగా ఉంది. ప్రయాణికులతో ఉన్న విమానం పాట్నా ఎయిర్‌పోర్టులో బయలుదేరింది. రన్‌వే పై టేకాఫ్ తీసుకుంటుండగా విమానం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. సాధారణ శబ్దం చేస్తూ విమానం ఓ టైర్ పేలిపోయింది. దీంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు తమకు ఏమౌతుందోనని ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. టైర్ పేలడంతో విమానం కాస్త ఆలస్యమవుతుందని, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామంటూ ప్రయాణికులకు ఇండిగో సిబ్బంది ధైర్యం చెప్పారు. పాట్నా-న్యూఢిల్లీ ఇండిగో విమాన సర్వీస్ టేకాఫ్ సమయంలో రన్‌వే పై ఫెయిల్ అయిన కారణంగా మరో నాలుగు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. -
బ్రిడ్జిని ఢీకొట్టిన విమానం
జైపూర్: ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జైపూర్‌లోని సంగనర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయిన తర్వాత పార్క్ చేసే క్రమంలో ఎయిరో బ్రిడ్జిని ఢీకొట్టింది. విమానం రెక్క ఒకటి బ్రిడ్జికి తగలడంతో స్వల్పంగా అది దెబ్బతిన్నది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఢిల్లీ నుంచి శనివారం ఉదయం 174మంది ప్రయాణీకులతో బయలుదేరి వచ్చిన 6ఈ-962 ఇండిగో విమానం తొలుత విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత దానిని పార్కింక్ చేసేందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగిందని, దర్యాప్తునకు ఆదేశించామని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎం పీ బన్సల్ తెలిపారు. తమ అంతర్గత భద్రతా వ్యవహారాలు చూసే బృందంతో విచారణ చేయిస్తామని ఇండిగో తెలిపింది. -
టేకాఫ్ అవుతుండగా ఎమర్జెన్సీ విండో తీసి..
ముంబయి: విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించి తొందరుపాటు చర్యకు దిగాడు. ఓ ఇండిగో విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచాడు. టేకాఫ్‌కు ముందు అతడు అనూహ్యంగా డోర్ ఓపెన్ చేశాడు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవరాక్షన్ చేసిన చేసిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
పైలట్లు రోడ్డునే రన్‌వేగా పొరబడి..
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్లు రోడ్డును రన్‌వేగా భావించి విమానాన్ని ల్యాండ్ చేయబోయారు. చివరి నిమిషంలో పైలట్లకు హెచ్చరికలు రావడంతో ముప్పుతప్పింది. ఫిబ్రవరి 27న జైపూర్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇండిగో విమానం 6ఈ-237 అహ్మదాబాద్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు వచ్చింది. విమానాశ్రయంలో సమీపంలో ఓ రోడ్డును రన్‌వేగా భావించిన పైలట్లు ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. నేలకు అతి సమీపంగా విమానం వచ్చింది. ఈజీపీడబ్ల్యూఎస్ నుంచి హెచ్చరికలు రావడంతో పైలట్లు అప్రమత్తమై విమానం దిశను మళ్లించి, జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ల తప్పిదాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఇద్దరు పైలట్ల లైసెన్సులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. పైలట్లు ఇద్దరినీ విధుల నుంచి తప్పించినట్టు ఇండిగో అధికారులు చెప్పారు. -
ఇండిగో విమానంలో మంటలు
న్యూఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ఇండిగో విమానానికి మంటలంటుకున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత విమానంలో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు తీసుసుకువచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో 147 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా విమానం నుంచి కిందకు దిగారని ఇండిగో యాజమాన్యం తెలిపింది. మంటలు వ్యాపించడానికి గల కారణాలు వెల్లడికాలేదు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
ఇండిగో విమానంలో మంటలు
నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో శనివారం ఇండిగో విమానంలో మంటలు చెలరేగాయి. ఖాట్మాండ్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పుడే దిగిన ఇండిగో విమానం కుడి భాగంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ విషయాన్ని వెంటనే ఎయిర్ట్‌పోర్ట్ సిబ్బంది వెంటనే గుర్తించి, అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పివేశారు. అయితే ఇండిగో విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులను సురక్షితంగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది కిందకు దింపారు. ఆ ఇండిగో విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీ నుంచి ఖాట్మాండ్ బయలుదేరింది. అయితే శుక్రవారం నేపాల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమాన ఇంజన్లో అవాంతరం ఏర్పడటంతో త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో వెంటనే దింపివేసిన సంగతి తెలిసిందే.