
ఇండిగో విమానంలో మంటలు
న్యూఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ఇండిగో విమానానికి మంటలంటుకున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత విమానంలో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు తీసుసుకువచ్చారు.
ప్రమాద సమయంలో విమానంలో 147 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా విమానం నుంచి కిందకు దిగారని ఇండిగో యాజమాన్యం తెలిపింది. మంటలు వ్యాపించడానికి గల కారణాలు వెల్లడికాలేదు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేపట్టారు.