విమానం టేకాఫ్ అవుతుంటే పేలిన టైరు | An IndiGo plane suffers tyre burst while taking off from Patna airport | Sakshi
Sakshi News home page

విమానం టేకాఫ్ అవుతుంటే పేలిన టైరు

Published Fri, Jun 30 2017 7:26 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

విమానం టేకాఫ్ అవుతుంటే పేలిన టైరు

విమానం టేకాఫ్ అవుతుంటే పేలిన టైరు

పాట్నా: ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం ఓ టైరు పేలడంతో ఆ సర్వీస్‌ను నిలిపివేశారు. బిహార్‌లోని పాట్నాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పాట్నా నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు ఇండిగో విమానం రన్‌వే పై సిద్ధంగా ఉంది. ప్రయాణికులతో ఉన్న విమానం పాట్నా ఎయిర్‌పోర్టులో బయలుదేరింది.

రన్‌వే పై టేకాఫ్ తీసుకుంటుండగా విమానం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. సాధారణ శబ్దం చేస్తూ విమానం ఓ టైర్ పేలిపోయింది. దీంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు తమకు ఏమౌతుందోనని ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. టైర్ పేలడంతో విమానం కాస్త ఆలస్యమవుతుందని, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామంటూ ప్రయాణికులకు ఇండిగో సిబ్బంది ధైర్యం చెప్పారు. పాట్నా-న్యూఢిల్లీ ఇండిగో విమాన సర్వీస్ టేకాఫ్ సమయంలో రన్‌వే పై ఫెయిల్ అయిన కారణంగా మరో నాలుగు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement