tyre burst
-
టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..
ముంబై: కారు టైర్ పేలిపోయి ఒక వ్యక్తి మరణానికి దారితీసిన ఘటనలో ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ తప్ప, డ్రైవర్ నిర్లక్ష్యం కాదంటూ చేసిన వాదనని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కారు ప్రమాదంలో మరణించిన మకరంద్ పట్వర్థన్ కుటుంబానికి రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2010 అక్టోబర్ 25న పట్వర్ధన్ (38) తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి కారులో పుణె నుంచి ముంబై వెళుతున్నారు. వారిలో కారుని తెచ్చిన ఒక కొలీగ్ చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేయడంతో కారు ముందు టైర్ పేలిపోయి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పట్వర్థన్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదనపరుడు కావడంతో ట్రబ్యునల్ అతని కుటుంబానికి న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ 1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కారు పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నించింది. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిని విచారించిన కోర్టు టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని, ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. -
వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు గురువారం త్రుటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని హైదరాబాద్ వెళుతుండగా కర్నూలు శివారులో ఆర్టీసీ కాలనీ వద్ద ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఎడమ వైపు రెండు టైర్లు పేలాయి. డ్రైవర్ అప్రమత్తమై వేగాన్ని తగ్గించి ఆపడంతో ప్రమాదం తప్పింది. అనంతరం కర్నూలు బీక్యాంప్‌లో నివాసం ఉంటున్న దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్నేహితుడు అయ్యపురెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకుని ఆమె మరో వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అయ్యపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఏపీఎస్పీ రెండో పటాలంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి, విశ్రాంతి తీసుకున్నారు. ఈలోగా పేలిపోయిన టైర్లను మార్చి వాహనాన్ని సిద్ధం చేసుకుని డ్రైవరు అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు విజయమ్మ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. విజయమ్మ వెంట ఇద్దరు కుటుంబసభ్యులున్నారు. చదవండి: (నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ) -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
సాక్షి, తిరుపతి : తిరుపతి విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి ముప్పు తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతికి వచ్చిన స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలినట్లు తెలిసింది. దీంతో అందులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా విమానాన్ని టేకాఫ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విమానానికి మరమ్మత్తులు చేపట్టారు. టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం కూడా ఇదే తరహాలో స్పైస్ జెట్ విమానంలో సాంకేతికత లోపించడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. -
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లో స్పైస్‌జెట్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 189 మంది ప్రయాణికులతో వెళుతున్న దుబాయ్-జైపూర్ స్పైస్ జెట్ 58 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. బయలుదేరిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. టేక్ ఆఫ్ తీసుకున్నకొద్ది సేపటికే విమానానికి చెందిన ఒక టైర్ పేలిపోవడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమాన సిబ్బందితోపాటు ప్రయాణీకులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం జైపూర్ విమానాశ్రయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు నిపుణుల బృందం పరిశీలిస్తోంది. Rajasthan: Emergency landing of SpiceJet Dubai-Jaipur SG 58 flight with 189 passengers took place at Jaipur airport at 9:03 am today after one of the tires of the aircraft burst. Passengers safely evacuated. pic.twitter.com/H7WE9Yxroy — ANI (@ANI) June 12, 2019 -
టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్
చెన్నై : చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న స్పైస్ జెట్ విమానానికి గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో రన్ వేను సాయంత్రం 6 గంట వరకు మూసివేశారు. కాగా, మరో ఘటనలో ఇథియోఫియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన కార్గో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మధ్యాహ్నం 2.44 గంటలకు ఇంధన కొరతతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
విమానం టేకాఫ్ అవుతుంటే పేలిన టైరు
-
విమానం టేకాఫ్ అవుతుంటే పేలిన టైరు
పాట్నా: ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం ఓ టైరు పేలడంతో ఆ సర్వీస్‌ను నిలిపివేశారు. బిహార్‌లోని పాట్నాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పాట్నా నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు ఇండిగో విమానం రన్‌వే పై సిద్ధంగా ఉంది. ప్రయాణికులతో ఉన్న విమానం పాట్నా ఎయిర్‌పోర్టులో బయలుదేరింది. రన్‌వే పై టేకాఫ్ తీసుకుంటుండగా విమానం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. సాధారణ శబ్దం చేస్తూ విమానం ఓ టైర్ పేలిపోయింది. దీంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు తమకు ఏమౌతుందోనని ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. టైర్ పేలడంతో విమానం కాస్త ఆలస్యమవుతుందని, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామంటూ ప్రయాణికులకు ఇండిగో సిబ్బంది ధైర్యం చెప్పారు. పాట్నా-న్యూఢిల్లీ ఇండిగో విమాన సర్వీస్ టేకాఫ్ సమయంలో రన్‌వే పై ఫెయిల్ అయిన కారణంగా మరో నాలుగు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. -
విమానానికి తప్పిన పెను ప్రమాదం
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం కోజికోడ్‌లోని కరిపూర్ ఎయిర్‌పోర్టులో విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ ఇంజిన్ ఫెయిల్ కావడంతో పాటు ఓ టైరు పేలిపోయింది. దీంతో విమానం దారితప్పి రన్ వేపై సెంట్రల్ లైన్ నుంచి ఎడమ వైపుకు 30 మీటర్ల దూరం వెళ్లింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో సిబ్బందితో పాటు 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిరిండియా-సీ937 విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఎడమ ఇంజిన్ ఫెయిలైనట్టు అధికారులు చెప్పారు. ఈ సమయంలో టైర్ రన్ వే ల్యాంప్‌ను ఢీకొని పేలినట్టు చెప్పారు. పైలట్ విమానాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ లాంజ్‌లో వసతి కల్పించారు. ఈ ఘటన వల్ల విమాన రాకపోకలకు గంటన్నర సేపు అంతరాయం కలిగింది. ప్రయాణికుల కోసం ముంబై నుంచి మరో విమానాన్ని రప్పించినట్టు ఎయిర్ పోర్టు మేనేజర్ పీపీ వేణుగోపాల్ చెప్పారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అయింది. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విజయవాడ-న్యూఢిల్లీ ఎయిరిండియా విమానం రెండుసార్లు సాంకేతిక సమస్యలకు గురికావడం ఆదివారం కలకలం రేపిన విషయం తెలిసిందే. -
విమానం ల్యాండవుతుండగా పేలిన టైరు
ముంబై: ఎయిర్ ఇండియా వియానం ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తున్న ఎ1 614 విమానం ల్యాండ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారి కలకలం రేగింది. 128 మంది ప్రయాణికులు, సిబ్బందితో వస్తుండగా మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణీకులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. నిర్దేశిత సమయానికి మరో విమానాన్ని ఏర్పాటు చేశామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసామన్నారు. -
పేలిన ఎయిరిండియా విమానం టైరు
ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైరు పేలింది. ఆ సమయానికి విమానంలో 150 మంది ప్రయాణికులున్నారు. అయితే వారంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. నాగ్‌పూర్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్ ఎ320 విమానం దిగుతుండగా దాని టైరు పేలిపోయింది. దాంతో విమానాన్ని టాక్సీవే వద్దకు తీసుకెళ్లి, అక్కడ ఎమర్జెన్సీ చ్యూట్స్ ద్వారా ప్రయాణికులందరినీ దించేసినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులందరినీ దించేసిన తర్వాత విమానాన్ని టాక్సీవే లోకి తరలించారు. అయితే ఈ ఘటన కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులోని ప్రధాన రన్‌వేను మూసేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు
నందవరం: కర్నూలు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. నందవరం మండలం హాలహర్వి సమీపంలో ట్రాలీ ఆటో టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మడల్కల్కు చెందిన వారిగా గుర్తించారు. -
టైరు పేలి లారీ బోల్తా
ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం... ఒడిశాలోని బరంపుర నుంచి గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న వాహనం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద జాతీయ రహదారిపై టైరు పేలడంతో అదపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుకు ఎడమవైపు పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. -
ఆయనే లేకపోతే ఏమయ్యేదో...
ముంబై: కారుతో సహా నీటిలో మునిగిపోతున్న ఓ వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడాడు ముంబైకు సమీపంలోని ఓ దాబా యజమాని. ఈ మధ్యనే వివాహం చేసుకున్న ముంబైకి చెందిన కార్ల వ్యాపారి శేఖర్ తన భార్యను కలవడానికి గుజరాత్ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పక్కనే ఉన్న ఆకాష్ దాబా యజమాని అతణ్ని రక్షించాడు. లేదంటే ఒక నవవధువు తన భర్తను కోల్పోయి ఉండేది వివరాల్లోకి వెళితే. శేఖర్ (35) తన భార్యను కలవడానికి గుజరాత్ బయలుదేరాడు. అతను నడుపుతున్న కారు టైర్ అకస్మాత్తుగా పేలడంతో వాహనం అదుపు తప్పింది. బ్రిడ్జిపై నుంచి సుమారు 25 అడుగుల లోతున్న కాలవలోకి పడిపోయింది. చుట్టూ జనం పోగయ్యారు. మునిగిపోతున్న కారును జనం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. కానీ దాబా యజమాని మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకేశాడు. శేఖర్‌ను కొన ఊపిరితో బయటకు లాక్కొచ్చాడు. వెంటనే జనం అతన్ని స్థానిక ఆసుప్రతిలో చేర్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న శేఖర్ బంధువులు..వెన్నెముక విరిగి, రెండు కాళ్లలో చలనంలేని స్థితి, మెదడులో రక్తస్రావం లాంటితీవ్ర గాయాలతో ఉన్న శేఖర్ ను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కెమ్ ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తస్రావాన్ని ఆపగలిగామని, ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు తెలిపారు. అతను సీటు బెల్టు పెట్టుకొని ఉండకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని కెమ్ డీన్ అవినాష్ సుపె తెలిపారు. ప్రస్తుతం శేఖర్ స్పృహలోనే ఉన్నాడని, ప్రాణాలకు ప్రమాదమేమీ లేదన్నారు. అయితే తన భర్త రాక కోసం ఎదురు చూస్తున్న తాను ప్రమాద వార్త విని చాలా భయపడ్డానని , దాబా యజమాని కాపాడి ఉండకపోతే తన భర్త బతికే ఉండేవాడు కాదని బాధితుని భార్య ప్రియ అంటోంది. ఆయనకు జన్మజన్మలకు ఋణపడి ఉంటామని తెలిపింది. ఆయన అంత సాహసం చేసి ఉండక పోతే ఏమయ్యేదో అంటూ దాబా యజమానికి బంధువులు ధన్యవాదాలు తెలిపారు. -
ఆర్థిక మంత్రి కారు ఉండేది ఇలాగా?
తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఉపయోగిస్తున్న వాహనం కండిషన్ మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక రాష్ట్ర ఆర్థికమంత్రి ఉపయోగించే వాహనానికి ఉన్న నాలుగు టైర్లూ బాగా అరిగిపోయినా వాటిని మార్చకపోవడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. రోడ్డు ప్రమాదంలో పల్టీలు కొట్టిన వాహనం వెనకవైపు టైరు బరస్ట్ అయినట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. ముందు టైర్లు, వెనక టైర్లు కూడా బాగా అరిగిపోయాయి. ఇదే వాహనం ఇంతకుముందు నెలరోజుల క్రితం ఒకసారి ప్రమాదానికి గురైంది. అప్పట్లో తాడిచెట్టును ఢీకొన్న ఈ వాహనం బాగా ధ్వంసమైంది. తర్వాత దానికి మరమ్మతులు చేయించారు. కనీసం ఆ సమయంలోనైనా వాహనం టైర్ల గురించి పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సుదూర పర్యటనలకు సైతం ఉపయోగించే అధికారిక వాహనం టైర్లు అరిగిపోయినా.. వాటిని మార్చాల్సిన సమయం మించిపోయినా పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే అది అదుపుతప్పి బోల్తాపడిందా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పరామర్శ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్‌తో ఆయన మాట్లాడారు. కాగా, మంత్రి రాజేందర్‌కు తగిలినవి స్వల్ప గాయాలేనని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ బోయినపల్లి వినోద్ తెలిపారు. -
రన్ వే పై కుప్పకూలిన విమానం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఒక విమానం టేకాఫ్ చేయబోతూ, టైర్ పేలి రన్‌వే పైనే కుప్ప కూలింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సిన ఎయిర్ బస్ 320 ముందు టైర్ టేకాఫ్ చేసే ముందు గపేలిపోయింది. దాని తుక్కు బండి ఇంజన్‌లోకి దూరిపోయింది. దీంతో బారీగా పొగ వచ్చింది. కొద్ది క్షణాలకే విమానం రన్‌వే పై కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో 149 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది ఉన్నారు. నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలవడం మినహా ఏమీ కాలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు 'అమ్మయ్య' అని ఊపిరిపీల్చుకున్నారు.