అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఒక విమానం టేకాఫ్ చేయబోతూ, టైర్ పేలి రన్వే పైనే కుప్ప కూలింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సిన ఎయిర్ బస్ 320 ముందు టైర్ టేకాఫ్ చేసే ముందు గపేలిపోయింది. దాని తుక్కు బండి ఇంజన్లోకి దూరిపోయింది. దీంతో బారీగా పొగ వచ్చింది.
కొద్ది క్షణాలకే విమానం రన్వే పై కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో 149 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది ఉన్నారు. నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలవడం మినహా ఏమీ కాలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు 'అమ్మయ్య' అని ఊపిరిపీల్చుకున్నారు.