లక్నో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యియి. దీంతో రాజధాని కోల్‌కతాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును వరదనీరు ముంచెత్తింది. విమానాశ్రయంలోని రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి.
ఎయిర్ పోర్ట్‌లో రన్‌వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. విమనాల టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. దీంతో పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు. అయితే వరదనీటిలోనే విమానాలు పార్క్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్, మరియు బరాక్‌పూర్‌లో భారీ వర్షం కురుస్తోంది.
📍Kolkata | Flight operations at Kolkata Airport are proceeding normally despite heavy rainfall. Both the runway and all taxiways are fully operational.
However, a few parking stands are affected by waterlogging for which additional pumps have been deployed. pic.twitter.com/ddrEu4rmVE— NDTV (@ndtv) August 3, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వైపు కదులుతోందని, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై చురుకైన రుతుపవన ద్రోణిని మోస్తోందనిఎడతెగని వర్షాలకు కారణమైందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment