వరదలతో రాళ్లు తేలి, ఇసుక మేటలు వేసిన పొలాల రైతుల ఆవేదన
ఖమ్మం జిల్లాలో మొత్తంగా 68,345 ఎకరాలకు దెబ్బ
అందులో 5 వేలకుపైగా ఎకరాల్లో రాళ్లు, ఇసుక మేటలు
ఎకరాకు రూ.10వేలు పరిహారం ఇస్తామన్న సర్కారు
ఇసుక మేటలు వేసిన భూములకు అదనంగా పరిహారం ఇవ్వాలనే డిమాండ్లు
వాటిని సాగు యోగ్యంగా మార్చాలంటే రూ.లక్షలు ఖర్చవుతాయని ఆవేదన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 68 వేల ఎకరాలకుపైగా దెబ్బతినగా.. అందులో ఇందులో 5 వేల ఎకరాలకుపైగా ఇసుక, రాళ్ల మేటలు వేశాయి. ఈ భూములను సాగుయోగ్యంగా మార్చడం ఎలాగని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించిందని.. కానీ ఇసుక, రాళ్ల మేటలు వేసిన తమ భూముల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములను సాగుయోగ్యం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతాయని.. ప్రభుత్వం అదనంగా పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఆనవాళ్లు కూడా లేనంతా..
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో మున్నేరు, ఆకేరు విలయ తాండవం చేశాయి. వీటి పరీవాహకంలో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. నష్టంపై సర్వే చేపట్టిన అధికారులు.. 33శాతంపైన దెబ్బతిన్న పంటలనే పరిగణనలోకి తీసుకుని, 68,345 ఎకరాల్లో నష్టం జరిగినట్టు గుర్తించారు.
వీటికి ఎకరాకు రూ.10 వేల చొ ప్పున పరిహారం అందనుంది. అయితే కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, తల్లాడ తదితర మండ లాల్లో వేల ఎకరాల్లో భూములు సాగుయోగ్యం కాకుండా పోయాయి.
ముఖ్యంగా తిరుమలాయపాలెం మండ లం రాకాసితండాలో సారవంతమైన మట్టి అంతా కొ ట్టుకుపోయి రాళ్లు తేలి, ఇసుక మేట వేసింది. పంటలు సాగు చేయాలంటే.. భూములను బాగు చేసుకోవాలి. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చవుతాయని రైతులు వాపోతున్నారు.
సర్వం కోల్పోయి.. భూమీ దెబ్బతిని..
తిరుమలాయపాలెం మండలం అజ్మీరా తండా పరిధిలోని రాకాసి తండాకు చెందిన భూక్యా దేశ్యా తన మూడెకరాలకు తోడు మరో ఎకరం కౌలుకు తీసు కుని మిర్చి సాగు చేశారు. రూ.4 లక్ష లు వెచ్చించి మలి్చంగ్ పద్ధతిలో నా టాడు. కానీ ఆకేరు వరదతో పంట ఆనవాళ్లు లేకుండా పోయింది.
పైగా పొలం అంతా ఇసుక మేటలు వేసింది. వరదలతో ఇంట్లో ఉన్న సర్వం కో ల్పోయామని.. జీవనాధారమైన భూమి కూడా బా గా దెబ్బతిన్నదని దేశ్యా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment