ఖమ్మం, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయిపోయింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది. అయితే..
శనివారం రోజు కురిసిన భారీ వర్షాలకు.. మున్నేరు వరద ప్రమాదకరంగా పొంగిపొర్లింది. భారీ వర్షం, వరద ధాటికి ప్రకాశ్‌నగర్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహించింది. అనుకోకుండా.. ఈ బ్రిడ్జి మీద చిక్కుకుపోయిన తొమ్మిది మంది సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. ఈ ప్రమాదకర వరదల్లో సుభాన్ ఖాన్ అనే జేసీబీ డ్రైవర్ ప్రదర్శించిన సాహసం.. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది.
If I go, it is one life, if I return, I will save nine lives: this was the courage shown by #Subhankhan who took a JCB to bring back 9 people marooned on Prakash Nagar Bridge #Khammam from early hrs on Sept1; You can hear daughter brimming with pride #MyDaddyBravest #RealLifeHero pic.twitter.com/tbthGfUhRB
— Uma Sudhir (@umasudhir) September 3, 2024
వాళ్లను రక్షించేందుకు సుభాన్ ప్రయత్నిస్తుండగా అంతా వారించారు. ‘నేను అక్కడిపోతే నాది ఒక్క ప్రాణం పోవచ్చు. నేను సాహసం చేస్తే తొమ్మిది ప్రాణాలు రక్షించిన వాడిని అవుతాను’ అని జేసీబీతో వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. వరద సహాయక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీఆర్‌ఎస్ నేతలు, స్థానిక ప్రజలు జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ చేసిన సాహసాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుభాన్‌ను ఫొన్‌లో అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆ రియల్ హీరో సాహసం నెట్టింట చర్చగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment