Updates: ‘అధికారులెవరూ రాలేదండీ’ | AP and Telangana heavy rains flood updates Sep 12th 2024 | Sakshi
Sakshi News home page

Updates: ఇంకా ముంపులోనే విజయవాడ కాలనీలు

Published Thu, Sep 12 2024 7:57 AM | Last Updated on Thu, Sep 12 2024 1:15 PM

AP and Telangana heavy rains flood updates Sep 12th 2024

AP And Telangana Floods News Latest Updates In Telugu

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 

  • జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల 

  • ఇన్ ఫ్లో : 1,38,833 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 96,081 క్యూసెక్కులు 

  • పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 884.60 అడుగులు 

  • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు .. ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు 

  • కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

విజయవాడ 

  • 12 రోజులైనా ముంపు ప్రాంత ప్రజలకు తప్పని తిప్పలు 
  • ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే నానుతున్న అంబాపురంలోని కాలనీలు 
  • వరదలో ఉండలేక ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ప్రజలు 
  • దొంగల భయంతో మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్న కొందరు 
  • ప్రభుత్వం నుంచి ఈరోజు వరకూ తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం 
  • మంచినీరు కూడా సప్లై చేయడం లేదంటున్న అంబాపురం ప్రజలు 
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇళ్ల నుంచి బయటికి వస్తున్న వరద బాధితులు 
  • ఎన్యుమరేషన్ దాదాపు పూర్తైందంటున్న అధికారులు.. తమ వద్దకు ఏ ఒక్కరూ రాలేదంటున్న వరద బాధితులు
  • వాలంటీర్ వ్యవస్థ ఉంటే తమకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్న అంబాపురం వాసులు

నల్లగొండ

  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల

భద్రాచలం

  • తగ్గుముఖం  పట్టిన గోదావరి ప్రవాహం
  • ఈరోజు ఉదయం 11 గంటలకు 42.7అడుగుల గోదావరి నీటిమట్టం
  • మొదటి ప్రమాద హెచ్చరిక  ఉపసంహరించిన అధికారులు

సూర్యాపేట

  • అనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందం
  • అనంతగిరి మండలం గోండ్రియాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో  ధ్వంసం అయిన ఇళ్లలు, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించిన కేంద్ర బృందం

 

క్లిక్‌ చేయండి: దేవుడా ఈ నరకం ఇంకెన్నాళ్లూ!

 

ప్రకాశం బ్యారేజీ వద్ద కేంద్ర బృందం

  • ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం
  • బోటు ప్రమాదంలో దెబ్బ తిన్న బ్యారేజీని పరిశీలించిన సభ్యులు

ఖమ్మం 

  • ఖమ్మం నగరంలోని వరదల్లో నీట మునిగిన నయా బజార్ కాలేజీ ని పరిశీలించిన ఎమ్మెల్సీ కోదండరాం 
  • అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ 

కొనసాగుతున్న ఆపరేషన్‌ బోట్‌

  • ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమం
  • నిన్నంతా కష్టపడ్డ అండర్‌ వాటర్‌ టీం
  • ఇవాళ కూడా కొనసాగనున్న పనులు
  • బోట్లను ముక్కలు చేసి ఆపై బెలూన్లతో తొలగించే యత్నం


మెదక్‌

  • ఏడుపాయాల ఆలయం మళ్లీ మూసివేత
  • సింగూరు గేట్లు ఎత్తేయడంతో భారీగా నీరు
  • ఆలయాన్ని తాకుతూ నీటి ప్రవాహం
  • రెండ్రజుల కిందటే తెరుచుకున్న ఆలయం
  • ఈలోపే మళ్లీ మూసేసిన నిర్వాహకులు


బ్యారేజీకి కేంద్ర కమిటీ

  • నేడు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేం​ద్ర కమిటీ 
  • ప్రకాశం బ్యారేజీ చెంతకు కమిటీ
  • ప్రస్తుత బ్యారేజీ పరిస్థితిపై ఆరా తీయనున్న సభ్యులు
     

ఎన్టీఆర్ జిల్లా:

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో కేంద్ర బృందం పర్యటన
  • కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన కేంద్ర బృందం
  • వరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ పరిశీలన
  • నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ జి.సృజన
  • కేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేసిన కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డైరీ ) చలసాని ఆంజనేయులు
  • ఫోటో ఎగ్జిబిషన్ అనంతరం ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం

 

నంద్యాల:

  • శ్రీశైలం జలాశయానికి కోనసాగుతున్న వరద నీరు
  • జలాశయం 1 గేటు 10 అడుగులు మేరకు మరొక్కసారి ఎత్తి దిగువకు నీటి విడుదల
  • ఇన్ ఫ్లో: 1,38,833 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో: 96,081 క్యూసెక్కులు
  • పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
  • ప్రస్తుతం : 884.50 అడుగులు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు
  • ప్రస్తుతం: 212.9198 టీఎంసీలు
  • కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

 

విజయవాడ:

  • విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు
  • 12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలు
  • శుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులు
  • నీళ్లలో నానుతున్న ఎల్‌బీఎస్‌  నగర్‌, కండ్రిక, తోటివారి వీధి
  • ముంపులోనే ప్రకాశ్‌ నగర్‌, అంబపురం
  • లోపల కాలనీల ప్రజలకు అందని సాయం 
  • రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలు
  • ప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్‌
  • మ్యాపింగ్‌ ఉంటేనే ఎన్యుమరేషన్‌ అంటున్న అధికారులు
  • ఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్‌ 

 

ఖమ్మం జిల్లా

  • ఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  • భద్రాచలం వద్ద తగ్గుతున్న  గోదావరి నీటి మట్టం
  • ఈరోజు  ఉదయం 9  గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టం
  • అమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక

ఏలూరు జిల్లా    

  • పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన  గోదావరి వరద.
  • స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లు
  • స్పిల్ వే దిగువన 25.580 మీటర్లు  నీటిమట్టం నమోదు.
  • 48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.


ఏలూరు జిల్లా

  • జంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.
  • పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87
  • ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో  గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ  విడుదల చేసిన అధికారులు

నల్లగొండ జిల్లా

  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరద
  • క్రస్ట్ గేట్లు మూసివేత
  • ఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులు
  • అవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులు
  • పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
  • ప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులు
  • పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలు
  • కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
  • ఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులు
  • సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండి

సూర్యాపేట జిల్లా:

  • పులిచింతల అప్‌డేట్‌
  • ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులు
  • అవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులు
  • పూర్తిస్థాయి నీటి మట్టం:175 
    అడుగులు
  • ప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులు
  • పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలు
  • పవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.


నిజామాబాద్ జిల్లా

  • శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
  • ఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులు
  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలు
  • ప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు

 

  • తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.
  • ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.
  • వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.
  • ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.

జూరాల అప్‌డేట్‌

  • మహబూబ్ నగర్ జిల్లా: 
  • జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద
  • 13 గేట్స్ ఎత్తివేత
  • ఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులు
  • పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలు
  • ఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది.

 

తూర్పుగోదావరి జిల్లా

  • గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు
  • బ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం
  • 15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల
  • బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • కోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలు
  • సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలు
  • అప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులు
  • ఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలు
  • వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులు
  • కోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి,  వైనతేయ నదులు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement