Philadelphia
-
అమెరికాలో మరో విమాన ప్రమాదం..
-
అమెరికాలో మరో విమాన ప్రమాదం..
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్టు సమాచారం. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని ఈశాన్య ఫిలడెల్ఫియాలో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. First hand video of what happened in northeast Philadelphia pic.twitter.com/LJt912Tw6l— Darren Minto (@FB_Darren) February 1, 2025ప్రమాదానికి గురైన విమానాన్ని లీఆర్‌జెట్ 55గా గుర్తించారు. విమాన ప్రమాదం నేపథ్యంలో పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ శాప్రియా స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, విమానం మిస్సోరీ వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురైనట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల రోడ్లను మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, సాంకేతిక లోపం కారణంగానే విమాన ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక, ఫెలడెల్ఫియా ఎయిర్‌పోర్టు నుంచి బిజినెస్ సంబంధిత జెట్స్, చిన్న విమానాలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. 🚨BREAKING: A small plane fell out of the sky in Northeast Philadelphia.Wow, less than 2 weeks in trump's America, egg prices through the roof, tariffs making other prices skyrocket, and planes falling out of the sky.MAGA: Making America Gross Againpic.twitter.com/yiLjKYyaAB— BrooklynDad_Defiant!☮️ (@mmpadellan) February 1, 2025ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయమే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అరుదైన రీతిలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీకొని, నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 64 మంది ప్రయాణీకులు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌లో సిబ్బంది కొరత కూడా ప్రమాదానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లను, విమానాలను ఒకే కంట్రోలర్ ఏకకాలంలో నియంత్రించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ పనులకు ఇద్దరు విధుల్లో ఉండాలి. కానీ, ఒకరు మాత్రమే ఉన్నారని ఇంటర్నేషనల్ ప్రిలిమినరీ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్‌కి నాట్స్ విరాళం
భాషే రమ్యం.. సేవే గమ్య అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన సేవా భావాన్ని మరోసారి చాటింది. ఫిలడెల్ఫియాలో నాట్స్ విభాగం స్థానిక సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్‌కి ఆరు వేల డాలర్లను విరాళంగా అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఈ చెక్కును సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్ ప్రిన్సిపల్ జాసన్ హెచ్ బుచర్‌కు అందించారు. నాట్స్ అందించిన విరాళం ద్వారా సెంట్రల్ బక్స్ సౌత్‌లో కార్యకలాపాలను మరింత ముమ్మరంగా చేయనుంది. నాట్స్ పూర్వ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, నాట్స్ బోర్డు సభ్యుడు వెంకట్, నాట్స్ జాతీయ కార్యక్రమాల సమన్వయకర్త రమణ రకోతు, నాట్స్ యూత్ సభ్యురాలు అమృత శాఖమూరి ఈ విరాళాన్ని అందించిన వారిలో ఉన్నారు. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం చేసిన దాతృత్వం సమాజంలో సేవా స్ఫూర్తిని నింపుతుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. నాట్స్ ఫిలడెల్ఫియా సభ్యులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు.(చదవండి: 13 ఏళ్లకే రెండు శతకాలు రాసిన సంకీర్త్) -
ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన
అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలు నిర్వహించింది. ఫిలడెల్ఫియా లోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 250 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు.. అలాంటి పౌరులను ఉత్తమ పౌరులుగా, మంచి నాయకులుగా తీర్చిదిద్దేందుకు నాట్స్ బాలల సంబరాలు దోహదపడతాయని నాట్స్ మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని అన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. తెలుగు విద్యార్థుల బంగారు భవితకు తోడ్పడే ఎన్నో కార్యక్రమాలు నాట్స్ చేపడుతుందని శ్రీధర్ అప్పసాని తెలిపారు.పోటీలకు మంచి స్పందన..బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి, చిత్రలేఖనం అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. ఎనిమిదేళ్లలోపు, పన్నెండేళ్ల లోపు, ఆపైన ఉన్న చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. అనేక మంది పిల్లలు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, నేషనల్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్స్ రమణ రాకోతు, బోర్డు అఫ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి, చాఫ్టర్ కోఆర్డినేటర్ సరోజ సాగరం, సంయుక్త కార్యదర్శి రామ్ నరేష్ కొమ్మనబోయిన, బాబు మేడి, విశ్వనాథ్ కోగంటి, నిరంజన్ యనమండ్ర, అప్పారావు మల్లిపూడి, రాజశ్రీ జమ్మలమడక, శ్రీనివాస్ సాగరం, సురేంద్ర కొరటాల, పార్ధ మాదాల, రవి ఇంద్రకంటి, సాయి సుదర్శన్ లింగుట్ల, శ్రీనివాస్ ప్రభ, రామక్రిష్ణ గొర్రెపాటి, మధు కొల్లి, రామ్ రేవల్లి, నాగార్జున కొత్తగోర్ల, రాఘవన్ నాగరాజన్, వేణు కొడుపాక, చైతన్య & లహరి, కృష్ణ నన్నపనేని, కిషోర్ నర్రా ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజేష్ కాండ్రు, రవి తుమ్మల, కిషోర్ నారే, మురళి మేడిచెర్ల, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి, తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిఏజిడివి అధ్యక్షులు రామ్మోహన్ తాళ్లూరి, కార్యదర్శి సురేష్ బొందుగుల, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ చుండూరి, సంయుక్త కోశాధికారి శివ అనంతుని, లవకుమార్ ఐనంపూడి, పూర్వ అధ్యక్షులు హరనాథ్ దొడ్డపనేని, తదితరులు పాల్గొని వారికి తోడ్పాటుని అందించారు.బాలల సంబరాల కోసం యూత్ మెంబర్స్ అమ్రిత శాకమూరి, స్తుతి రాకోతు , యుక్త బుంగటావుల , నిత్య నర్ర, ప్రణతి జమమ్మలమడక, అభినవ్ మేడి, నిహారిక ఐనంపూడి, హవిషా పోలంరెడ్డి , అక్షయ పుల్యపూడి , సుమేధ గవరవరపు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం నిర్వహించిన బాలల సంబరాల కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.స్థానికంగా ప్రముఖ సంగీత, నృత్య గురువులు శ్రీనివాస్ చాగంటి, అన్నపూర్ణ చాగంటి, వల్లి పిల్లుట్ల, శ్రీలక్ష్మి జంధ్యాల, సౌమ్య గండ్రకోట, మైత్రేయి కిదాంబి, భారతి అశోక్, ప్రత్యూష నాయర్, సవిత వారియర్, శ్రీ హరిత, మధుమిత, ప్రసన్న గన్నవరపు, శ్రీదేవి ముంగర, రఘు షాపుష్కర్, నాగేశ్వరి అడవెల్లి, పద్మ శాస్త్రి, కల్యాణ రామారావు గన్నవరపు, విమల మొగుళ్లపల్లి, రూప మంగం, ఈ సంబరాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సాకేత్ ప్రభ గణేశ ప్రార్ధనతో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా సాగింది. రెండు వందల యాబై పైగా చిన్నారులు ఈ సంబరాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్వేతా కొమ్మోజి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.తెలుగు సినీగీతాల గానం, నృత్యంతో చిన్నారులు అద్వైత్ బొందుగుల, ధృతి కామరాసు, క్రిశిత నందమూరి, అనిషా చెరువుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. బాలల సంబరాలకు రుచికరమైన విందు అందించినందుకు మహాక్ష ఇండియన్ ఫ్లేవర్ రెస్టారెంట్‌ను నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల అభినందించారు. సంబరాలకు స్పాన్సర్స్‌గా డివైన్ ఐటీ సర్వీసెస్, వెంకట్, సుజనా శాకమూరి, రిటైర్ వైసెలీ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సాయం అందించారు.(చదవండి: -
Philadelphia: అవిభక్త కవలల సర్జరీ సక్సెస్
అవిభక్త కవలలుగా పుట్టిన ఇద్దరు అబ్బాయిలను విజయవంతంగా వేరుచేసి వారికి పునర్జన్మనిచ్చింది అమెరికాలోని ఓ పిల్లల ఆసుపత్రి. వేరుచేశాక గత నెల 29న ఈ చిన్నారులు తొలి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో నివసిస్తున్న షనేకా రూఫిన్, టిమ్ దంపతులకు అవిభక్త కవల పిల్లలు జన్మించారు. ఆ అబ్బాయిలకు అమరీ, జవార్ రూఫిన్ అని పేర్లు పెట్టుకున్నారు. కౌగిలించుకున్నట్లుగా ఎదురెదురుగా పొట్ట ప్రాంతమంతా అతుక్కుని పుట్టారు. పుట్టినప్పుడు ఇద్దరి బరువు కలిపి కేవలం 2.7 కేజీలు మాత్రమే. వాస్తవానికి అవిభక్తవ కవలల తల్లి షనేకా రూఫిన్ 12 వారాల గర్భంతో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు గర్భస్త శిశువులు అతుక్కున్నట్లు కనిపించింది. పుట్టే చిన్నారులకు శారీరక సమస్యలు వస్తాయని, ఆనాడే తల్లిని వైద్యులు హెచ్చరించారు. తల్లి మనసు ఊరుకోదుగా. గర్భస్రావం చేయించుకోనని తెగేసి చెప్పింది. ఎలాగైనా నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిస్తానని కరాఖండీగా చెప్పేసింది. భర్త టిమ్ సైతం ఆమె నిర్ణయానికి అడ్డుచెప్పలేదు. పిల్లలు అతుక్కుని పుడితే వచ్చే సమస్యలను పరిష్కారం కనుగొనేందుకు మరో ఆస్పత్రిని వెతికారు. అప్పుడే వాళ్లకు ‘చాప్’ చిల్డ్రెన్స్ ఆసుపత్రి ఆశాదీపంగా కనిపించింది. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా చిన్నారులను అతుక్కుని పుట్టినాసరే వేరుచేయవచ్చని అక్కడి వైద్యులు భరోసా ఇచ్చారు. పిల్లల ఉమ్మడి శరీరంలో పొట్టతోపాటు కాలేయంలో కొంత భాగం కలిసే ఉంది. పిల్లలకు 11 నెలల వయసు వచ్చాక ఆపరేషన్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 21వ తేదీన 24 మందికిపైగా నిష్ణాతులైన వైద్యులు, మత్తుమందు డాక్టర్లు, రేడియాలజిస్టులు, నర్సులు ఇలా భారీ వైద్యబృందం ఏకధాటిగా ఎనిమిది గంటలపాటు శ్రమించి చిన్నారులను విజయవంతంగా వేరుచేసింది. పొట్టను వేరుచేసేటపుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా మెష్, ప్లాస్టిక్ సర్జరీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి వారిని వేరుచేశాక ఇద్దరి పొత్తి కడుపులను జాగ్రత్తగా బయటి నుంచి కుట్టేశారు. కొద్దిరోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణ తర్వాత చిన్నారులను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్‌కు ముందు ఆస్పత్రి యాజమాన్యం గత నెల 29వ తేదీన ఘనంగా వీళ్ల పుట్టినరోజు వేడుక జరిపింది. ‘‘ఇద్దరినీ ఇలా వేరువేరుగా చూడటం వర్ణనాతీతమైన అనుభూతినిస్తోంది’’ అని తల్లి రూఫిన్ ఆనందం వ్యక్తంచేశారు. టిమ్ దంపతులకు అంతకుముందే కైలమ్, అనోరా అనే ఇద్దరు పిల్లలున్నారు. ‘‘ఆపరేషన్ తర్వాత మా కుటుంబసభ్యుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఆనందమయ జీవన ప్రయాణాన్ని ఇక ఆరంభిస్తాం. దీనిని సుసాధ్యం చేసిన నిపుణుల బృందానికి మా కృతజ్ఞతలు’’ అని తల్లి చెప్పారు. ప్రతి 35వేల నుంచి 80వేల కవలల జననాల్లో ఇలా అవిభక్త కవలలు పుడతారని వైద్యశాస్త్రం చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్లాష్ లూటీ...
ఫిలడెల్ఫీయా: నిత్యం నిఘా నీడన ఉండే అమెరికాలో దొంగల ముఠా పేట్రేగిపోయింది. చూడ్డానికి.. షాపింగ్‌మాల్స్‌లో ఫ్లాష్‌మాబ్ పేరిట డ్యాన్స్‌లు, అవగాహన కార్యక్రమాలు చేసే బృందంలా కనిపిస్తూ ఒక్కసారిగా దుకాణాలపై తెగబడి అందిన కాడికి దోచేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫీయా నగరం ఈ చోరీల ఘటనకు వేదికైంది. ఒక్కటి కాదు చాలా స్టోర్స్‌లో టీనేజర్లు ఇలా ఒకే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మంగళవారం రోజు జరిగిన ఈ చోరీల తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్లుసహా యాపిల్ కంపెనీకి చెందిన పలు ఎల్రక్టానిక్ ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మాస్‌్కలు, హూడీలు ధరించిన దాదాపు 100కుపైగా టీనేజర్లు యాపిల్ స్టోర్, ఫూట్లాకర్, లూలూలెమెన్ స్టోర్లలో చొరబడి బ్యాగుల నిండా వస్తువులను తీసుకెళ్లారు. విషయం తెల్సుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేíÙంచి 20 మందికిపైగా టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలనూ స్వాదీనం చేసుకున్నారు. అయితే, వస్తువును దొంగిలించినా వాడుకోలేని(యాంటీ–థెఫ్ట్) ఫీచర్ ఉన్న కొన్ని యాపిల్ సంస్థ వస్తువులను దొంగలు అక్కడే వదిలేసివెళ్లారని ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గత నెలలో డ్రైవర్ ఎడ్డీ ఐరీజెర్రీని ఫిలడెల్ఫీయా పోలీస్ అధికారి కాల్చిచంపిన కేసులో రిటెన్హౌజ్ స్క్వేర్ వద్ద శాంతియుత ర్యాలీ జరిగిన కొద్దిసేపటికే అక్కడా ఇలా రిటైల్స్టోర్పై దాడి జరిగింది. అయితే ఆ నిరసనకారులతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఫిలడెల్ఫీయా పోలీసులు స్పష్టంచేశారు. -
మళ్లీ పేలిన తూటా.. అమెరికాలో 8 మంది మృతి
ఫిలడెల్ఫియా: అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే మరో రెండు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి బాల్టిమోర్‌లో బ్లాక్పార్టీపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా 28 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి టెక్సాస్, ఫిలడెలి్ఫయాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా ఇద్దరు బాలురు సహా మరో 10 మంది గాయపడ్డారు. ఫిలడెల్పియాలోని కింగ్సెస్సింగ్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సాయుధుడు వీధుల్లో తిరుగుతూ కనబడిన వారిపైకి కాల్పులు సాగించాడు. సమాచారం అందుకుని పోలీసులు చుట్టుముట్టడంతో అతడు లొంగిపోయాడు. ఆగంతకుడి వద్ద నుంచి ఏఆర్ రైఫిల్, హ్యాండ్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. అతడి కాల్పుల్లో అయిదుగురు చనిపోయారు. మరో ఇద్దరు 2, 13 ఏళ్ల బాలురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మరో ఘటన..టెక్సాస్‌లోని ఫోర్ట్వర్త్లోస్థానిక ఉత్సవం కోమోఫెస్ట్లో పాల్గొన్న జనంపైకి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా 8 మంది గాయపడ్డారు. -
జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ పేలి..
అమెరికా:అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ పేలింది. దీంతో రహదారిలోని ఎత్తైన భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. BREAKING: Fuel tanker explodes on Philadelphia highway, causing an entire overpass to collapse. pic.twitter.com/iwRVgxJZ41 — The Spectator Index (@spectatorindex) June 11, 2023 నాలుగు లైన్ల ప్రధాన రహదారి. నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పొగలు తీవ్ర స్థాయిలో కమ్ముకున్నాయి. రహదారిపై ఉన్న ఎత్తైన భాగం కుప్పకూలిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం అయినందున ట్రాఫిక్ పెద్దగా లేదని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. VIDEO/BREAKING: SkyFOX over the section of northbound I-95 that has collapsed in Philadelphia near the Cottman Ave exit. A tanker truck in the underpass beneath 95 caused the North lanes above to collapse & South have buckled down too. pic.twitter.com/0aIqreRlzI — Steve Keeley (@KeeleyFox29) June 11, 2023 ఇదీ చదవండి:నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే.. -
తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్ కు అనూహ్య స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రతి రెండేళ్ళ ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జూలై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ మహాసభలకు ముందు జరిగే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. న్యూజెర్సీలో తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్ జరిగింది. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ డిన్నర్ ఈవెంట్‌కి అనుహ్య స్పందన వచ్చింది. పెద్దలు, మహిళలు, పిల్లలతో ప్రాంగణం అంత కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రదర్శించిన తానా సేవా కార్యక్రమాల వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతనం ఉట్టిపడేలా నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమనికి హాజరై, గొప్ప ఔన్నత్యంతో విరాళలు అందించిన పలువురు దాతలకు పుష్ప గుచ్చాలతో వేదిక మీదకి స్వాగతం పలికి గౌరవ మర్యాదలతో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన తానా సభ్యులు ఇటీవలే శివైక్యం చెందిన సుప్రసిద్ధ చిత్ర దర్శకులు పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్, శ్రీమతి జయలక్ష్మి గార్లకి, సినీనటుడు నందమూరి తారక రత్నకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. విరాళాల సేకరణకు ముందుగా తానా అధ్యక్షలు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తానా ప్రస్థానం, నిర్వహించిన, నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు, ప్రవాస తెలుగువారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి తానా భరోసాగా నిలిచిన పలు సందర్భాల గురించి అక్కడికి విచ్చేసిన తానా సభ్యులకు వివరించారు. 23వ తానా మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ జులై 7,8,9 తేదిలలో జరగబోయే ప్రతిష్టాత్మక తానా మహాసభల యొక్క విశిష్టతను వివరిస్తూ, ఈ మహత్కార్యానికి ముందుకు వచ్చిన స్వచ్చంధ సేవకులకు, దాతలందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై 23వ తానా మహాసభలకు వారి సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, డైరెక్టర్ వంశీ కోట, అడ్వైజర్ మహేందర్ ముసుకు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ కూకట్ల, తానా ఫౌండేషన్ ట్రస్టీలు విద్యా గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, సుమంత్ రామ్, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, తానా ప్రాంతీయ ప్రతినిధులు వంశి వాసిరెడ్డి, సునీల్ కోగంటి, శ్రీనివాస్ ఉయ్యురు, దిలీప్ ముసునూరు, తానా మహాసభల కల్చరల్ చైర్మన్స్వాతి అట్లూరి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ తదితర నాట్స్ కార్యవర్గ సభ్యులు, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ విజయ్ కుందూరు, ఐటీ సర్వ్ అధ్యక్షులు వినయ్ మహాజన్, టిటిఏ డైరెక్టర్ శ్రీనివాస్ గనగోని తదితరులు అతిధులుగాహాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు మధు రాచకుళ్ల, సౌత్ జెర్సీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ కసిమహంతి, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొని తానామహాసభలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. -
ఫిలడెల్ఫియాలో తానా 23వ మహాసభలు
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ మహాసభలుఈ ఏడాది జులై 7 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. స్థానిక పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో వీటిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీవిల్ నగరంలోని కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్ ఆడిటోరియంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి నేతృత్వంలోని తానా మహాసభల సమన్వయ కమిటీల నియమించారు. మహాసభల కార్యదర్శిగా సతీష్ తుమ్మల, కోశాధికారిగా భరత్ మద్దినేని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రవి మందలపు, ఇండియా వ్యవహారాల డైరెక్టర్ గా వంశీ కోట, జాయింట్ సెక్రెటరీగా శ్రీనివాస్ కూకట్లకు భాద్యతలు అప్పగించారు. కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి, రీజినల్ కోఆర్డినేటర్లు సునీల్ కోగంటి, వంశీ వాసిరెడ్డి పాల్గొన్నారు. -
పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 23వ తానా మహాసభలు
పెన్సిల్వేనియా: 23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7వ తేదీనుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. తానా సైట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అనిల్ యలమంచిలి, సభ్యులు పూర్ణ వీరపనేని, రామ్ మద్ది బృందం తానా మహాసభల వేదిక కోసం అట్లాంటాతో పాటు పలు నగరాలలోని కన్వెన్షన్ సెంటర్స్ తో చర్చించిన తర్వాత ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ ను 2023 తానా మహాసభల వేదికగా సిఫార్సు చేయడం జరిగిందని తానా సైట్ సెలక్షన్ కమిటీ సిఫార్సు కు తానా కార్యవర్గం, బోర్డు ఆమోదం తెలిపిందని అంజయ్య చౌదరి తెలిపారు. తానా మహాసభల కోఆర్డినేటర్ గా రవి పొట్లూరిని నియమించినట్లు తెలిపారు. తానాలో రీజినల్ కోఆర్డినేటర్ నుంచి కార్యదర్శి వరకు పలు పదవులు నిర్వహించి, తానా కార్యక్రమాల నిర్వహణలో విశేష అనుభవమున్నరవి పొట్లూరి కోఆర్డినేటర్‌గా తానా సభ్యులు, నాయకత్వం, దాతల సహకారంతో 23వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరుపునున్నట్లు అంజయ్య చౌదరి వెల్లడించారు. తానా కోఆర్డినేటర్ గా నియమించినందుకు అధ్యక్షులు అంజయ్య చౌదరికి తానా కార్యవర్గానికి తానా మహాసభల కోఆర్డినేటర్ రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. -
ఫిలడెల్ఫియాలో నాట్స్ దాతృత్వం
ఫిలడెల్ఫియా: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి తగట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలను నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్)చేపడుతోంది. అందులో భాగంగా ఫిలడెల్ఫియా చాఫ్టర్ లో నాట్స్ విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రోగ్రామ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల చొరవతో ఫిలడెల్ఫియాలో లార్డ్స్ ఫ్యాంట్రీ, డౌనింగ్ టౌన్‌కు 6,282 డాలర్లను విరాళంగా అందించారు. పేదల ఆకలి తీర్చే లార్డ్ ఫ్యాంట్రీకి విరాళాలు ఇచ్చేందుకు నాట్స్ సభ్యులు, వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ ఇలా సేకరించిన 6,282 డాలర్ల మొత్తాన్ని లార్డ్స్ ఫ్యాంట్రీ డౌనింగ్ టౌన్‌కి విరాళంగా అందించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ నేషనల్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రామ్ కొమ్మనబోయిన, ఫిలడెల్ఫియా నాట్స్ కో ఆర్డినేటర్ అరవింద్ పరుచూరి, జాయింట్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ చుండూరి, రామకృష్ణ గొర్రెపాటి, రవి ఇంద్రకంటి, మధు కొల్లి, కీలక పాత్ర పోషించారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలివర్ వ్యాలీ ప్రెసిడెంట్ ముజీబుర్ రహమాన్, సంయుక్త కార్యదర్శి మధు బుదాటి, సంయుక్త కోశాధికారి సురేష్ బొందుగుల, కమిటీ సభ్యులు రమణ రాకోతు, సుదర్శన్ లింగుట్ల, గౌరీ కర్రోతు తదితరులు తమ పూర్తి సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మరికొందరిలో సర్ఫర్ హరి, లావణ్య మోటుపల్లి, బావర్చి బిర్యానీ శ్రీధర్, సుధ అప్పసాని, డివైన్ ఐటీ సర్వీసెస్ రాధిక బుంగటావుల, లావణ్య బొందుగుల, సునీత బుదాటి, కమల మద్దాలి, వంశీధర ధూళిపాళ, సతీష్, కవిత పాల్యపూడి, విజయ్, అంజు వేమగిరి, రవి, రాజశ్రీ జమ్మలమడక, సరోజ, శ్రీనివాస్ సాగరం, భార్గవి రాకోతు, లవకుమార్, సునీత ఇనంపూడి, నీలిమ , సుధాకర్ వోలేటి, బాబు, హిమబిందు మేడి, లక్ష్మి ఇంద్రకంటి, నెక్స్ట్ లెవెల్ ఫైనాన్సియల్ అడ్వైజర్స్, మూర్తి చావలి, హరిణి గుడిసేవ, దీప్తి గొర్రెపాటి, దీక్ష కొల్లి, లలిత, శివ శెట్టి, మూర్తి , వాణి నూతనపాటి, దీపిక సాగరం , వినయ్ మూర్తి, అపర్ణ సాగరం, నిఖిల్ చిన్మయ వంటి పలువురు తమ ధాతృత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ నూతన అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి(బాపు) దాతలను అభినందించారు. చదవండి: అరిజోన రాష్ట్రంలో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం -
నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టు.. పాపం చిన్నారి.. ఇంతకీ ఆ బాబు ఎవరు?
కొన్ని పైశాచిక చర్యలు.. చరిత్రపుటలను రక్తపుధారలతో తడిపేస్తాయి. మానవాళికి మాయని మచ్చలుగా మిగిలిపోతాయి. సరిగ్గా 65ఏళ్ల క్రితం.. అమెరికాలో ఫిలడెల్ఫియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం అలాంటిదే. అది 1957, ఫిబ్రవరి 26.. సుస్కెహన్నా అడవిలో కుందేళ్ల అలికిడి కాస్త అనుమానంగా అనిపించి.. రోడ్డు పక్కనే కారు ఆపాడు ఓ కాలేజీ కుర్రాడు. ‘జంతువుల్ని పట్టేందుకు అడవిలో అక్రమంగా బోనులేమైనా పెట్టి ఉంటారా? కుందేళ్లు ఎందుకు అలా బెదురుతున్నాయి?’ అనే అనుమానంతో.. అడవి వైపే అడుగులు వేశాడు. లోపలికి వెళ్లే కొలదీ తట్టుకోలేని దుర్గంధం అతడ్ని ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడనివ్వలేదు. అయినా ఏదో కీడు శంకించి.. అడుగులు ముందుకే కదిపాడు. అతడి అనుమానమే నిజమైంది. ఓ నాలుగు నుంచి ఆరేళ్లలోపు పసివాడు నిర్జీవంగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన అతడు.. ‘ఈ విషయంలో నన్ను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు’ అని రిక్వెస్ట్ చేయడంతో... ఫిలడెల్ఫియా పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. బాడీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి వెళ్లింది. నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టుతో ఉన్న ఆ బాబు.. ఎంతో కాలంగా పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. తలపై లోతైన గాయాలు, శరీరమంతా దెబ్బలు, గాట్లు.. ఆ బాబు దయనీయ స్థితికి అద్దంపడుతుంటే.. చనిపోయిన తర్వాతే బాబు జుట్టు, గోళ్లు కత్తిరించిన ఆనవాళ్లు(ఒంటి నిండా వెంట్రుక ముక్కలు) ఉన్నాయి. పైగా శవాన్ని చాలాసేపు నీటిలో ఉంచినట్లు కాళ్లు, చేతులపై ముడతలు పడ్డాయి. తమ బాబు కనిపించడం లేదని ఏ ఒక్కరూ స్టేషన్‌కి రాలేదు. బాబు ఊహాచిత్రాన్ని గీయించిన పోలీసులు.. 4 లక్షల కాపీలు ప్రింట్ వేయించి.. ఆ చుట్టుపక్కల అందరికీ పంచారు. ప్రధాన కూడళ్లలో గోడలకు అతికించారు. వార్త వేయమంటూ పత్రికలకు వివరాలు ఇచ్చారు. ఫిలడెల్ఫియాలో ఇచ్చే ప్రతీ గ్యాస్ బిల్లుతోనూ బాబు ఫొటోను అందించారు. అయినా ఎలాంటి సమాచారం లేదు. ఈ కేసులో కీలకమైన కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవి బ్లూ కలర్ టోపీ, చిన్నారి స్కార్ఫ్, వైట్ కర్చీఫ్, ఆ కర్చీఫ్ మీదున్న ‘ఎమ్’ అనే అక్షరం. అయితే ఏ ఒక్క క్లూ తదుపరి విచారణకు సహకరించలేదు. దాంతో బాబు శవానికి డ్రెస్ వేసి.. నిలబెట్టి, కూర్చోబెట్టి కూడా ఫుల్ సైజ్ ఫొటోలు తీసి పబ్లిష్ చేశారు. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే మీడియా, కొందరు ఔత్సాహికులు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాబు శవం చుట్టూ చాలా కథలల్లేశారు. అందులో ముఖ్యంగా 1960లో ఓ వ్యక్తి చెప్పిన కథ చాలా మందిని నమ్మించింది. పిల్లాడి శవం దొరికిన చోటికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఓ ఫాస్టర్ హోమ్ ఉంది. అది హాస్టల్ లాంటిదే. అక్కడ చిన్న పిల్లల్ని సంరక్షిస్తుంటారు. ఆ హోమ్‌కి వెళ్లిన అతడు.. బాబు శవానికి వాడిన ఊయల లాంటి బాసీనెట్, శవానికి చుట్టిన దుప్పటిని అక్కడ చూశానంటూ సొంతంగా ఓ కథ అల్లాడు. అతడి ఊహ ప్రకారం.. ‘ఆ ఫాస్టర్ హోమ్ యజమాని సవతి కూతురికి పుట్టిన బాబే ఈ బాబు. పెళ్లి కాకుండానే బాబు పుట్టడంతో సవతి తల్లి ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఆ బాబుని చంపేసి, అడవిలో పడేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఎందుకైనా మంచిదని పోలీసులు.. ఆ ఫాస్టర్ హోమ్ యజమానినీ, ఆమె సవతి కూతురినీ ప్రశ్నించారు. కానీ ఎలాంటి నిర్ధారణ రాలేదు. ఏళ్లు గడుస్తున్నాయి. ఈ మిస్టరీని ఛేదించాలని.. ఆ బ్రాంచ్‌కి వచ్చిన ప్రతి కొత్త పోలీసు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓ రోజు ఈ కేసుపై మాట్లాడాలంటూ.. మార్తా అనే యువతి పోలీస్ స్టేషన్‌కి ఎంట్రీ ఇచ్చింది. బాబు శవంతో పాటు దొరికిన కర్చీఫ్ మీదున్న అక్షరం, ఆమె పేరులోని మొదటి అక్షరం ‘ఎమ్’ కావడంతో.. పోలీసులు ఆమె చెప్పే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మార్తా ఏం చెప్పిందంటే.. మా అమ్మ 1954 వేసవిలో... జొనాథన్ అనే గుర్తు తెలియని బాబుని.. ఓ జంట నుంచి కొనుక్కుంది. అప్పటి నుంచీ సైకోలా మారి... దాదాపు రెండున్నరేళ్ల పాటూ ఆ బాబుని భౌతికంగా హింసించింది. సరిగా తిండి కూడా పెట్టేది కాదు. ఓ రోజు చీకటి పడుతున్న సమయంలో... జొనాథన్ బేక్ చేసిన బీన్స్ తిన్నాడు. ఆ వెంటనే వాంతి చేసుకున్నాడు. అది చూసిన మా అమ్మ.. ఎప్పటిలానే ఆ బాబుని చితకబాదింది. అక్కడితో ఆగకుండా ఆవేశంలో బాబు తలను నేలకేసి కొట్టింది. దాంతో జొనాథన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. భయపడిన మా అమ్మ జొనాథన్‌కు వెంటనే స్నానం చేయించింది. ఆ సమయంలోనే ఆ బాబు చనిపోయాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో.. బాబు తల వెంట్రుకలు, చేతి గోళ్లు కత్తిరించి, డెడ్ బాడీని దుప్పట్లో చుట్టి.. అడవిలోని నక్కలు తిరిగే ప్రాంతంలో పడేసేందుకు ప్లాన్ చేసింది. అందుకు నా సాయం కోరింది.. నేను సాయం చేశాను’ అంటూ జరిగిందంతా కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. ఆమె చెప్పిన చాలా అంశాలు... ఫోరెన్సిక్ పరిశోధనతో సరిపోలాయి. బాబు చనిపోవడానికి రెండు మూడు గంటల ముందు ఏదో తిన్నాడని, పొట్టలో బీన్స్ పదార్థాలు ఉన్నాయని, అలాగే బాడీ తడిసినందు వల్లే, కాళ్లు, చేతులు.. ముడతలు పడ్డాయని రిపోర్టులు తేల్చాయి. మార్తా చెప్పినట్లే జుట్టు, గోళ్లు కతిరించిన సంగతీ తెలిసిందే. అయితే ఇదంతా చెప్పిన మార్తా మానసిక సమస్యతో సతమతమవుతోంది. అలాంటి వాళ్లు చెప్పేది కోర్టులో సాక్ష్యంగా నిలబడదు. అయినప్పటికీ పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. మార్తా ఇంటి చుట్టుపక్కల వాళ్లని ఆరా తీశారు. అయితే వాళ్లంతా.. ‘మేము ఎప్పుడూ మార్తా ఇంట్లో ఆ బాబుని చూడలేదు. అయినా పిచ్చిదాని మాటలు పట్టుకుని మీరెలా ఎంక్వైరీ చేస్తారు?’ అంటూ తిరిగి ప్రశ్నించారు. దాంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మొత్తానికీ ఈ కేసు 270 మంది పోలీసుల చేతులు మారింది. ఇప్పటికీ ఆ కేసు యాక్టివ్‌లోనే ఉంది. మరో ఆసక్తికరమైన వాదన ఏంటంటే.. బాబుని ఎవరో అమ్మాయిలా పెంచాలి అనుకున్నారు. అందుకే జుట్టును బాగా పెంచారు. చనిపోయాక కట్ చేసేశారు. బాబు కనుబొమ్మలు అంత స్టైలిష్‌గా ఉండటానికి కారణం అదే అంటూ 2008లో పొడవైన జుట్టుతో స్కెచ్ గియ్యగా.. అచ్చం ఆడపిల్లలాగే ఉన్నాడు ఆ బాబు. ఇది పోలీసులనే కాదు ఈ కేసుపై దృష్టిసారించిన అందరినీ ఆశ్చర్యపరచింది. 1957లో పోస్ట్‌మార్టం తర్వాత పొట్టర్స్ ఫీల్డ్‌లో ఆ చిన్నారి శవాన్ని పూడ్చిపెట్టారు. 1998లో ఓసారి బయటికి తీసి.. అస్థిపంజరం, దంతాల నుంచి డీఎన్ఏ సేకరించారు. తిరిగి ఫిలడెల్ఫియా... సెడార్బ్రూక్లోని ఐవీ హిల్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. ఆ సమాధిపై ఓ భారీ హెడ్ స్టోన్ ఏర్పాటు చేసిన పోలీసులు... ‘అమెరికన్ అన్నోన్ బాయ్’ అని రాసి ఉంచారు. 2018 ఆగస్ట్‌లో వంశవృక్ష నిపుణురాలు బార్బరా రే–వెంటర్, బాలుడిని గుర్తించడానికి డీఎన్ఏ ప్రొఫైలింగ్ని ఉపయోగిస్తామని చెప్పారు. కానీ నేటికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. దాంతో ఆ బాబు ఎవరు? మార్తా చెప్పిన దానిలో వాస్తవమెంత? జొనాథన్ అనేది నిజంగానే ఆ బాబు పేరా? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. -సంహిత నిమ్మన -
వీడేం తండ్రి.. మూడేళ్లకు విషాదంగా ముగిసిన చిన్నారి కథ!
తన వ్యసనం కోసం కొడుకు ప్రాణాలనే అడ్డు పెట్టిన ఓ మూర్ఖుడి కథ ఇది. తనకేమైనా హాని జరుగుతుందన్న ఉద్దేశంతో.. దూసుకొచ్చిన ప్రమాదం ముందర చంటి బిడ్డను ఉంచాడు. ఫలితం.. ఆ పసికందు శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి!. ఫిలడెల్ఫియాలో సుమారు రెండేళ్ల కిందట సంచలనం సృష్టించిన కేసు.. ఇప్పుడు విషాదంగా ముగిసింది. ఫిలడెల్ఫియా హంటింగ్ పార్క్ సెక్షన్‌కు చెందిన నఫెస్ మోన్రోయ్.. తన దగ్గరున్న నకిలీ కరెన్సీతో డ్రగ్స్ కొనే ప్రయత్నం చేశాడు. అయితే ఈ వ్యవహారం బెడిసికొడితే తనకేమైనా హాని కలుగుతుందన్న ఉద్దేశంతో.. కూడా తన 11 నెలల బాబు యసీమ్ జెన్కిన్స్ను రక్షణ కవచంగా వెంటపెట్టుకెళ్లాడు. నఫెస్ ఊహించినట్లుగానే.. డ్రగ్ డీలర్ ఫ్రాన్సిస్కో ఒర్టిజ్, నఫెస్పై కాల్పులకు దిగాడు. ఆ టైంలో యసీమ్ను అడ్డు పెట్టడంతో ఆ పసికందు శరీరంలోకి బుల్లెట్లు దిగాయి. తల, మెడ, వెనుక భాగంలోకి మూడు బుల్లెట్లు దిగగా.. వైద్యులు తీవ్రంగా శ్రమించి ప్రాణాపాయ స్థితి నుంచి ఆ చిన్నారిని బయటపడేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది అప్పట్లో. ఇక మూర్ఖంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నఫెస్ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసు విచారణ సమయంలో.. యసీమ్ జెన్కిన్స్ను ‘మానవ కవచం’గా అభివర్ణించారు జడ్జిలు. అప్పటి నుంచి ఆ చిన్నారి తల్లి సంరక్షణలో ఉంటూ వస్తున్నాడు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ఆ గాయాల తాలుకా ప్రభావంతో ఆ చిన్నారి మరణించినట్లు తెలుస్తోంది. శుక్రవారం మూడేళ్ల యసీమ్ జెన్కిన్స్ కన్నుమూసినట్లు ఫిలడెల్ఫియా అధికారులు ప్రకటించారు. ఇది అప్పటి గాయాల ప్రభావంతోనేనా? అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. ఇక కాల్పులు జరిపిన ఫ్రాన్సిస్కోను ఉద్దేశపూర్వకంగా గాయపర్చినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇప్పుడు హత్యానేరం కింద జైలులోనే శాశ్వతంగా ఉంచే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కొడుకు ప్రాణాలను పణంగా పెట్టిన ఆ మూర్ఖుడు.. కాలక్రమంలో పశ్చాత్తాపం చెందగా, ఇప్పుడు కొడుకు మృతి చెందాడనే వార్త విని గుండెలు పలిగేలా రోదిస్తున్నాడు. -
వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!
వాషింగ్టన్: పిల్లలకి బొమ్మలంటే మహా సరదా. అలాగే ఇంట్లో ఉండే పెంపుడు జంతువులతో ఆడలాడుతుంటారు. వాటి చెవులు పీకుతూ.. జూలు దువ్వుతూ.. సరదాగా గడుపుతారు. తాజాగా ఫిలడెల్ఫియా జూలో చిరుతతో ఓ చిన్నారి ఆట వైరల్‌గా మారింది. తమ బిడ్డతో జూకి వెళ్లిన తల్లిదండ్రులు ఆమెను పులి ఎదుట నిలిపారు. వారు కొంత దూరంలో ఉండి తమ కూతురిని గమనించారు. ఆమె పులిని పెంపుడు పిల్లి అనుకుందో..ఏమో.. దానికి హాయ్ చెప్పింది. తన చేతిలో ఉన్న బొమ్మతో చిరుతను ఆటపట్టించింది. అయితే, చిరుత అమాంతం ఆ పసిపాప పైకి దూకే ప్రయత్నం చేసింది. చిన్నారి చేతిలోని బొమ్మవైపు అదోలా చేసి.. దాన్ని తినేయాలి అనేంత కసిగా.. వారి మధ్య అడ్డుగా ఉన్న గాజు గోడను గోళ్లతో రక్కింది. కాగా, ఈ వీడియోను లారా ఫ్రేజర్ అనే వ్యక్తి రికార్డు చేసి "ప్లే డేట్" క్యాప్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం సాయంత్రం పోస్ట్ చేయగా 93 వేల మంది వీక్షించారు. వేల మంది కామెంట్ చేశారు. ఈ వీడియోలో చిన్నారి తన చేతిలోని బొమ్మతో చిరుతను ఆట పట్టిస్తుంది. తన చేతిలో ఉన్న బొమ్మను గాజు ముందు ఉంచిన ప్రతిసారీ చిరుత దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. " చిన్నారి చిరుతను చూసి పిల్లి అనుకుంటోంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.." చిరుత చిన్నారిని చూసి రుచికరమైన ఆహారం అనుకుంటోంది." అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. " అడ్డుగా గాజు గోడ లేకుంటే. ఏమై ఉండేదో.."అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు) -
సిజేరియన్ అయిన అమ్మలు ఇలా చేస్తే మేలు!
సిజేరియన్ ఆపరేషన్‌తో బిడ్డను కన్న కొత్త అమ్మలకు పేగుల కదలికలకు సంబంధించిన కొన్ని సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయట. అయితే తమ సమస్యను పరిష్కరించుకోవడం చాలా తేలిక అంటున్నారు శాస్త్రజ్ఞులు. వాళ్లు రోజుకు మూడుసార్లు చ్యూయింగ్ గమ్ నమిలితే పేగుల కదలికలు బాగా మెరుగుపడతాయంటున్నారు సైంటిస్టులు. సిజేరియన్ ద్వారా బిడ్డను కన్న కొత్త మాతృమూర్తులకు పేగు కదలికలలో ఇబ్బందులతోపాటు కడుపునొప్పి, వికారం, కింది నుంచి గ్యాస్ పోవడం, మలబద్దకం వంటి పేగులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. సిజేరియన్ ప్రసవం జరిగిన ఐదుగురిలో ఒకరు పైన పేర్కొన్న సమస్యలతో బాధపడటం మామూలే. అయితే కేవలం చ్యూయింగ్‌గమ్ నలమడం ద్వారానే ఆ సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుందంటున్నారు ఫిలడెల్ఫియాకు చెందిన పరిశోధకులు. చ్యూయింగ్ గమ్ వేసుకున్న తర్వాత అరగంట దాన్ని నములుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇలా చేసే సమయంలో శరీరానికి రెండు రకాలుగా స్టిమ్యూలేషన్స్ కలుగుతాయట. మొదటిది ఆ వ్యక్తి ఏదో తింటున్నందున దానికి తగినట్లుగా పేగుల కదలికలు జరిగేలా అంతర్గత అవయవాలు స్పందిస్తాయి. ఇక రెండోది చ్యూయింగ్ గమ్ నమిలే సమయంలో అంతసేపూ లాలాజలం స్రవిస్తుంది. అది లోపలికి స్రవించాక పేగులు దానికి తగినట్లుగా కదలికలు సంతరించుకుంటాయని పేర్కొంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ బెర్ఘెల్లా. అయితే రోజుకు మూడుసార్లు... ప్రతిసారీ అరగంటకు మించనివ్వవద్దని కూడా సూచిస్తున్నారు. మరింత ఎక్కువగా చ్యూయింగ్‌గమ్ నమలడం వల్ల అందులోని విరేచనకారక ఔషధగుణం ఉన్న పదార్థాల వల్ల కొన్నిసార్లు విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చదవండి: చనుబాలు ఇస్తున్నారా? అయితే.. -
ఫిలడెల్ఫియా టూర్: 360 డిగ్రీల వర్చ్యువల్ అనుభవం
పలువురు టూర్ ఇష్టులు.. వర్చ్యువల్ రియాల్టీ టూర్స్‌కి ఓటేస్తున్నారు. కరోనా కారణంగా పుట్టుకొచ్చినా..కరోనా తర్వాత కూడా కొనసాగే అనేక ట్రెండ్స్‌లో ఇదీ ఒకటిగా స్థిరపడుతోంది. కరోనా తర్వాత కృంగిన పర్యాటక రంగానికి పునరుత్తేజం అందించేందుకు, పర్యాటకులకు దగ్గరగా ఉండేందుకు పలు దేశాలు, పర్యాటక శాఖలు వర్చువల్ టూర్స్‌ని ఎంచుకుంటున్న నేపధ్యంలో ఫిలడెల్ఫియా పర్యాటక శాఖ కూడా అదే బాట పట్టింది. తమ దేశంలోని సందర్శనీయ స్థలాలతో పాటు కళలపై అభిమానంతో తమ దేశానికి ప్రత్యేకంగా వచ్చే సందర్శకుల కోసం విభిన్న రకాల ఆర్ట్, హిస్టరీ విశేషాలను, అలాగే తమకే ప్రత్యేకమైన మ్యూరల్స్, వాల్ ఆర్ట్ తదితర చిత్ర ‘విచిత్రాల’తో వర్చువల్ టూర్స్ ను ఆఫర్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ పర్యాటక శాఖ ప్రతినిధులు తెలిపారు. తమ దేశంలోని మ్యూరల్ ఆర్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, వీరి కోసం ఆన్లైన్ ద్వారా వర్చువల్ టూర్స్‌ని అందిస్తున్నామన్నారు. కరోనా కారణంగా తమ సైట్‌కి 50శాతం ట్రాఫిక్ పెరిగిందని పర్యాటక ప్రదేశాలకు సంబంధించి టూరిస్టలకు 360 డిగ్రీల వర్చ్యువల్ అనుభవాన్ని అందించే వెబ్సైట్ యజమాని వర్చువల్ రియాల్టీ ఫొటోగ్రాఫర్ లీన్ థోబియాస్ చెప్పారు. తమ సైట్స్ ద్వారా వాయనాడ్‌లోని ఎడక్కల్ గుహలు, ఈజిప్టియన్ పిరమిడ్స్ వంటి ప్రాంతాలను అత్యధికులు విజిట్ చేశారని అంటున్నారాయన.గత కొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్ సంప్రదాయ గిరిజన కధలను చిత్రాలు, సంబంధించిన పర్యాటక విశేషాలను నగరవాసులకు వర్చువల్లీ వివరిస్తున్నట్టు చెరిష్ ఎక్స్‌పెడిషన్స్‌కు చెందిన చెరిష్ మంజూర చెప్పారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో ఏటా నిర్వహించే బాస్కన్ ఫెస్టివల్‌ని కూడా అందించామన్నారు. అలాగే పర్యాటక నిపుణుల ఆధ్వర్యంలో బూట్ క్యాంప్స్ కూడా నిర్వహించామన్నారు. -
'మీరెంత ఉరిమి చూసిన నేను భయపడను'
-
అమెరికాలో వైద్య విద్యార్థి దుర్మరణం
వాషింగ్టన్: భారత సంతతి విద్యార్థి అమెరికాలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా వివరాల మేరకు... వివేక్ సుబ్రమణి(23) అనే యువకుడు డ్రెగ్జిల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి జనవరి 11సాయంత్రం తను నివాసం ఉంటున్న అపార్టుమెంటు పై అంతస్తుకు వెళ్లాడు. అనంతరం ఒక బిల్డింగు పైనుంచి మరో బిల్డింగుపైకి వారు దూకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ వివేక్ సుబ్రమణి జారి కిందపడిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న వివేక్ స్నేహితులు కిందకు వచ్చి అతడికి శ్వాస అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా వివేక్ మృతితో అతడి సన్నిహితులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. డాక్టర్ కావాలని కలలుగన్న వివేక్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమాద సమయంలో వివేక్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. -
కన్న బిడ్డలను కాల్చి చంపిన తల్లి!
ఫిలడెల్ఫియా(యూఎస్) : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో దారుణం చోటు చేసుకుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే వారి పాలిట కర్కశంగా వ్యవహరించింది. తన ఇద్దరు పిల్లల్ని తుపాకితో కాల్చిచంపింది. వివరాల్లోకి వెళితే.. టాకోనీలోని హెగెర్మాన్ స్ట్రీట్ 6300 బ్లాక్‌లో సోమవారం రాత్రి తుపాకి పేలిన శబ్దం వినిపించింది. దీంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు.. ఆ ఇంట్లో 38 ఏళ్ల వ్యక్తి మృతదేహాంతో పాటు, 4 ఏళ్ల బాలిక, 10 నెలల శిశువు తీవ్రంగా గాయపడి ఉన్నట్టు గుర్తించారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృతిచెందారు. అలాగే ఘటన స్థలంలో తనకు తానే గాయపర్చుకున్న మహిళను(28) పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యం కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ ఇంట్లో ఎందుకు కాల్పులు జరిగాయనేది తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేపట్టారు. చుట్టుపక్కల వాళ్లను విచారించడంతోపాటు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో చిన్న పిల్లలు చనిపోవడం బాధకరమని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. -
వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఫిలడెల్ఫియాలో రక్తదాన శిబిరం
ఫిలడెల్పియా : రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదో వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫిలడెల్పియాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కి ఘన నివాళి అర్పించారు. 150 మంది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అన్నా రెడ్డి, జాయింట్ ట్రెజరర్ శరత్ మందపాటి, శివ మేక, హరి వెళ్కూర్,అంజి రెడ్డి సాగంరెడ్డి, హరి కురుకుండ, ద్వారక వారణాసి, శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి, శ్రీనివాస్ ఈమని, మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్ళం, గీత దోర్నాదుల, లక్ష్మి నారాయణ రెడ్డి, లక్ష్మీనరసింహ రెడ్డి, పద్మనాభ రెడ్డి, నాగరాజా రెడ్డి , జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, రవి మరక, అజయ్ యారాట, నరసింహ రెడ్డి, వెంకట్ సుంకిరెడ్డితో పాటు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
తండ్రిని చంపిన భారత సంతతి వ్యక్తి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన తండ్రిని కాల్చి చంపిన ఘటన అమెరికాలోని ఫిలదెల్పియాలో జరిగింది. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్న సోహన్ పుంజ్రోలియా (31) తన తండ్రి మహేంద్ర పుంజ్రోలియా(60)ను ఈ నెల 3న సాయంత్రం సమయంలో తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడికి మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని, సాయుధుడై ఉండవచ్చని పోలీసులు భావించారు. ఓ ఐస్ క్రీమ్ స్టాల్ వద్ద అతడి కారు ఆగి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే సోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పరారయ్యేలోపే పట్టుకోగలిగామని పోలీస్ చీఫ్ బ్రాన్విల్లే బార్డ్ తెలిపారు. నిందితుడు హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసినట్లు పోలీసులు గుర్తించారు. -
అమెరికాలో డాక్టర్ దంపతులు దుర్మరణం
వాషింగ్టన్ : ప్రైవేట్ విమానం కూలిపోయిన ఘటనలో భారత్‌కు చెందిన వైద్య దంపతులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో వీరి వెంటే ఉన్న 19 ఏళ్ల కూతురు కూడా మృత్యువాత పడింది. గురువారం ఉదయం ఫిలడెల్ఫియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... భారత్‌కు చెందిన జస్వీర్ ఖురానా(60), ఆయన భార్య దివ్యా ఖురానా(54) ఎయిమ్స్‌లో వైద్య విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇరవై ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జస్వీర్ ఓ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పని చేస్తుండగా.. దివ్యా పిల్లల ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కాగా సంపన్నులైన ఖురానా దంపతులు ఓ చిన్నపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో గురువారం కుమార్తె కిరణ్ ఖురానాతో కలిసి ఫిలడెల్ఫియా నుంచి ఓహియోకు విమానంలో బయల్దేరారు. 44 ఏళ్ల క్రితం నాటి ఆ విమానాన్ని నడుపుతున్న జస్వీర్ దానిని అదుపు చేయలేకపోయారు. దీంతో బయల్దేరిన కొద్ది సేపటికే జనావాసాల సమీపంలో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఖురానా దంపతులతో పాటు వారి కుమార్తె కూడా దుర్మరణం చెందింది. కాగా ఖురానా కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం పట్ల వారు పనిచేస్తున్న ఆస్పత్రి యాజమాన్యం, ఇరుగుపొరుగు వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందరితో కలివిడిగా ఉంటూ రోగులను కూడా ఎంతో ప్రేమగా పలకరించే దివ్యా మృతి తమను కలచివేసిందన్నారు. ఇక పెద్ద కూతురు వారితో వెళ్లకపోవడం వల్లే ప్రాణాలతో ఉందని, ఆ దేవుడు తనకు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. కాగా ఇంధనం అయిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ప్రాణం నిలబెట్టేందుకు 'రన్ ఫర్ రామ్'
ఫిలడెల్ఫియా : ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకోవడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందనేది మరోసారి రుజువైంది. అమెరికాలో ఇటీవల ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్న కొయ్యలమూడి రామ్మూర్తి ప్రాణాలు నిలబెట్టేందుకు నాట్స్ తన వంతు సాయం చేయాలని ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రామ్మూర్తి వైద్య ఖర్చులను భరించేందుకు అతని కుటుంబసభ్యులకు నాట్స్ హెల్ప్‌లైన్ ద్వారా విరాళాల సేకరణ చేయాలని నిశ్చయించింది. ఇందుకోసం ఫిలడెల్ఫియాలోని స్థానిక తెలుగు సంఘం టీఏజీడీవీతో కలిసి నాట్స్ 'రన్ ఫర్ రామ్' పేరుతో 5కె రన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని రామ్మూర్తి కుటుంబానికి నాట్స్ విరాళంగా అందించనుంది. 5కె రన్లో భాగంగా స్థానికంగా ఉన్న 120 మందికి పైగా తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిలడెల్ఫియా తెలుగు అసోసియేషన్, ఆటా, నాటా, తానా, పలు సేవా సంస్థ ల ప్రతినిధులు మద్దతు తెలిపారు. నాట్స్ బోర్డు డిప్యూటీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, టీఏజీడీవీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి కిరణ్ కొత్తపల్లి, చైతన్య పెద్దు, రామ్ కొమ్మన బోయిన, వేణు సంఘాని తదితరులు హాజరై తమ వంతు సంఘీభావాన్ని ప్రకటించారు. -
శబ్దాన్ని చూసేద్దాం పదండి..
మీరెప్పుడైనా శబ్దాన్ని చూశారా..? ప్రశ్న తప్పుగా అడుగుతున్నామని భ్రమపడకండి. ఆ ప్రశ్న నిజమే.. అదేంటి శబ్దాన్ని వింటాం కానీ.. చూడటమేంటి.. ఇదే కదా మీ మనసులో మెదిలే ప్రశ్న? ఈ ఫొటోలో ఉన్నదేంటో తెలుసా.. శబ్ద తరంగాలు. ఎంత అందంగా ఉన్నాయో కదా.. అమెరికాలోని ఫిలడెల్ఫియా పట్టణానికి చెందిన లిండెన్ గ్లెడ్‌హిల్ అనే శాస్త్రవేత్త, ఫొటోగ్రాఫర్, ఫార్మాసూటికల్ బయోకెమిస్ట్కు శబ్దాన్ని చూడటం, వాటితో ఆడుకోవడం అంటే సరదా.. అంతే కాదు శబ్దాన్ని ఫొటో తీసి అందరికీ చూపించడం ఆయనకు అదో తృప్తి. 'అందుకే శబ్ద తరంగాలను వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద ఫొటోలు తీస్తుంటాడు. శబ్దాలను ఫొటో తీసే పరికరం చాలా సులువుగా ఉంటుందని గ్లెడ్‌హిల్ వివరించాడు. స్పీకర్‌పై పలుచటి పొరపై నీరు ఉంటుందని, ఆ నీటిపై ఎల్ఈడీ కాంతిని ప్రసరిస్తామని చెప్పాడు. ‘నీటి గుండా శబ్దాన్ని పంపడం వల్ల తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలను ఎల్ఈడీ కాంతిని వెదజల్లే ఉపరితలంపైకి పంపుతాం. ఈ సమయంలో శబ్దాన్ని కెమెరా ఫొటోలు తీస్తుంది. తరంగాలు మనం నిర్ణయించే పౌనఃపుణ్యాన్ని బట్టి మారుతుంది. దాన్ని బట్టే ఫొటోలు కూడా మారుతాయి’అని వివరించాడు. -
నాట్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
ఫిలడెల్ఫియా : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో ఇండోర్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో జరిగిన ఇండోర్ వాలీబాల్ టోర్నరమెంట్లో 20 జట్లు పాల్గొన్నాయి. నాట్స్ వైస్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని సహకారంతో నిర్వహించిన ఈ టోర్నమెంటుకు విశేష స్పందన లభించింది. స్థానిక తెలుగుసంఘం టీఏజీడీవీ కూడా టోర్నమెంటుకు తన వంతు సహకారం అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా టీం సభ్యులు హరినాథ్ బుంగతావుల, చైతన్య పెద్దు, రామ్ కొమ్మబోయిన, శ్రీకాంత్ చుండూరు, ఫణి కడియాల, గోకుల్ పుతుంబాక తదితరులు ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. -
వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ఫిలడెల్ఫియా : రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తొమ్మిదవ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డా. రాఘవరెడ్డి గోశాల, రాజేశ్వరరెడ్డి, ఆళ్ల రామిరెడ్డి, పలువురు వాలంటీర్ల సహకారంతో జరిగిన రక్తదాన శిబిరానికి ఈశాన్య అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు వచ్చారు. వైఎస్సార్ వర్థంతి, 9/11 బాధితుల జ్ఞాపకార్థం దాదాపు 150మందికి పైగా వైఎస్సార్ అభిమానులు రెడ్ క్రాస్‌కు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు సెక్రెటరీ అన్నా రెడ్డి, జాయింట్ ట్రెజరర్ శరత్ మందపాటి, శివ మేక, హరి వెల్కూరు, జ్యోతి రెడ్డి, సహదేవ్ రెడ్డి, శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామిరెడ్డి, శ్రీనివాస్ ఎమాని, మధు గోనిపాటి, విజయ్ పొలంరెడ్డి, టాటా రావు, శ్రీధర్ తిక్కవరపు, రామ్ కల్లం, గీతా దోర్నాదుల, రామ్మోహన్ రెడ్డి యెల్లంపల్లి, నాగరాజ రెడ్డి, జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, అంజి రెడ్డి సగంరెడ్డి, రవి మరక, హరి కురుకుండ, అజయ్ యరాట, నరసింహారెడ్డి, మునీష్ రెడ్డి, ప్రసన్న కకుమను, సుదర్శన్ దేవిరెడ్డిలకి వైఎస్సార్ ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డా. రాఘవరెడ్డి గోశాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్‌లు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయిన గుర్తు చేశారు. అధ్యక్షులు ఆళ్ల రామిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు రాజేశ్వరరెడ్డిలు రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఆహ్లాద్ రెడ్డి, అభిషేక్ మీనన్, అభిలాష్ మార్ది, అభిషేక్ ఆలుగడ్డాల, అజయ్ దేవభక్తుని, అజయ్ కుమార్ యరాతా, అకాశ్ పటేల్, ఆనంద్ పటేల్, ఆనంద్ తొండపు, అనిల్ ఉల్లాసమ్, అనిల్ కుమార్ పద్మ, అనిరుద్ రెడ్డి, అనితా బద్వేలు, అంజిరెడ్డి సాగం రెడ్డి, అర్వింద్ కుమార్ బతిన, అరుణ్ కవాటి, అశోక్ కరకంపల్లే, బాలాజీ సమల్, బస్వాలింగప్ప, చదివే రెడ్డి, చంద్రా రెడ్డి, చెన్నా కేశవరెడ్డి, దేవిరెడ్డి, గిరియేటూరు, గిరిధర్ మాసిరెడ్డి, హరినాథ్ కురుకుండ, హర్ష వర్ధన్ రెడ్డి, జగన్ దుద్దుకుంట్ల, జయసింహారెడ్డి, జ్యోతిశ్వర్, కరుణాకర్ రెడ్డి, కిషోర్ ఇంటిపల్లి, లక్ష్మీ బృందా, లక్ష్మీ గోపిరెడ్డి, లక్ష్మీ విశ్వనాథుని, మధు గొనిపతి, మధుపాపసాని, మధుసూదన్ అరికట్ల, మల్లారెడ్డి, మల్లికార్జున కాసిరెడ్డి, మనోజ్ పులిచర్ల, మోహన్ బాబు భాస్కర్, మనిష్ రెడ్డి, నాగరాజ ఏటూరి, నాగేశ్వర మొదల్ల, నరసింహా రెడ్డి దాసరి, నరసింహులు దామెర, నరేశ్ అన్నం, నటరాజ పిల్ల, నియోల్ కట్ట, పద్మనాభరెడ్డి, పవన్ కుమార్ కుర్ర, ప్రభాకర్ యుదుముల, ప్రదీప్ ఇప్ప, ప్రతాప్ జక్క, ప్రవీణ్ కుమార్ పట్టెం(గురు), ప్రేమ్ వర్ధన్, రాధికా దొంతిరెడ్డి, రాఘవరెడ్డి గోశాల, రాజశేఖర్ గాదె, రాజశేఖర్ గుడురు, రామ్ కల్లం, రామగోపాల్ దేవపట్ల, రామక్రిష్ణముస్సాని, రామమోహన్ రెడ్డి యెల్లంపల్లి, రమణ కోత, రమేష్ జమ్ములదిన్నె, రమేష్ కొత, రమేష్ మీనన్, రవి మరక, రెడ్డయ్య వుండెల, రేవంత్ రెడ్డి, సహదేవ రాయవరం, శైలేష్, సంధ్య, సంగీత దత్త, సత్యనారాయణ ఆడెం, శైలజా శివ, శిరీష్ రెడ్డి గొంగల రెడ్డి, శివ జ్యోతి పదల, శివ కుమార్ బురం, శివ కుమార్ గోర్ల, సోమా రెడ్డి, శ్రీనివాస కూనాడి, శ్రీకాంత్ శివ, శ్రీనివాస పదల, శ్రీనివాసులు బొల్ల, సుబ్బారెడ్డి వాక, సుబ్బారెడ్డి వంగ, సదర్శన్ దేవిరెడ్డి, సుధాకర్ రెడ్డి దొండేటి, సునిల్ కొతపాటి, సుప్రియ దామెర, సురేష్ వెంకన్నగిరి, సుష్మా సుంకిరెడ్డి, ఉమాశంకర్ పల్ల, వాసుదేవ్ రెడ్డి తాళ్ల, వెంకా సుంకర, వెంకట నొస్సమ్, వెంకట్ సుంకిరెడ్డి, వెంకట గడిబావి, వెంకట రెడ్డిమల్లా, వెంకట రెడ్డి యెర్రం, వెంకటరామి శనివారపు, వెంకటేశ్వర్లు, విజయ్ ఆలేరు, విజయ్ రెడ్డి గోండి, విజయ్ పొలంరెడ్డి, వినయ్ మందపాటి, వినయ్ వాసిలి, విశ్వనాథరెడ్డిలు రక్తదానం చేసినందుకు గానూ వైఎస్సార్ ఫౌండేషన్ మీడియా కమిటీ అధ్యక్షులు తిక్కవరపు, శ్రీకాంత్ పెనుమాడ, హరి కురుకుండ, సహదేవ్ రెడ్డి, అంజి రెడ్డి, మునిష్ రెడ్డి, వెంకటరామిరెడ్డి శనివారపు, క్రిష్ణ, నరసింహరెడ్డి, రామ్మోహన్ రెడ్డిలకు వైఎస్సార్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలిపింది. -
‘నీ శరీరంలో ఎముకలనేవి ఉన్నాయా..!?’
న్యూయార్క్ : సాధారణంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు అనుకోని కారణాల వల్ల ప్రయాణం కాస్తా ఆలస్యమయితే ఎక్కడ లేని చిరాకు వస్తుంటోంది. ఆ సమయంలో ఫోన్ పట్టుకునో, బుక్ చదువుతునో కాలక్షేపం చేయడానికి ప్రయత్నిస్తుంటాము. కానీ కాసేపటికి అది కూడా బోర్ కొడుతుంది. ఇక అప్పుడు చేసేదేం లేక ఆలస్యానికి కారణమయిన వారిని తిట్టుకుంటూ కూర్చుంటాము. ఇది మనలాంటి వారి పరిస్థితి. కానీ ఇదే ప్లేస్‌లో షెమీకా చార్లెస్ ఉంటే ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. న్యూయార్క్ బఫెలోకు చెందిన షెమీకా చార్లెస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లింబో డ్యాన్సర్. కొద్ది రోజుల క్రితం ప్రయాణ నిమిత్తం ఆమె ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో వెయిట్ చేస్తోంది. కానీ ఆమె ప్రయాణించాల్సిన విమానం కాస్తా ఆలస్యంగా రానున్నట్లు తెలిసింది. దాంతో అందరిలా ఫోన్‌తో కాలక్షేపం చేయకుండా విమానాశ్రయంలోనే లింబో డ్యాన్స్ చేసింది. అక్కడ ఉన్న వారు ఆమె చేసిన డ్యాన్స్ చేసి ఆశ్చర్యపోయారు. షెమికా భర్త ఆమె చేసిన లింబో డ్యాన్స్‌ని వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్ చేశారు. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. ‘అసలు మీ ఒంట్లో ఎముకలేమైనా ఉన్నాయా’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. లింబో డ్యాన్స్‌లో ఇప్పటికే షెమికా పేరన ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. -
విమానాశ్రయంలో లింబో డ్యాన్స్ చేసిన షెమీకా
-
ప్రొఫెసర్ సాంబరెడ్డికి నాటా సత్కారం
ఫిలడెల్పియా : ప్రొఫెసర్ దూదిపాల సాంబ రెడ్డిని నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఘనంగా సత్కరించింది. ఫిలడెల్ఫియాలో జరిగిన నాటా మెగా కన్వెన్షన్‌లో నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, వైద్యరంగంలో డా. సాంబరెడ్డి చేసిన సేవలను కొనియాడి శాలువాతో సత్కరించారు. వరంగల్ జిల్లా పరకాల మండల పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో డా. సాంబ రెడ్డి జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో ఆరు బంగారు పతకాలతో పట్ట భద్రులయ్యారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో పీహెడీ చేసి, అత్యధిక శాస్త్ర అధ్యయనాలు ప్రచురించి లింకా రికార్డు సృష్టించారు. అయన కనిపెట్టిన ఎన్నో ఫార్మసిటికల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి. డా. సాంబ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం వైద్య శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధిచెందిన శాస్త్ర సంస్థలైన ఏఏఏఎస్ (అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ సైన్స్), ఏఏపీఎస్ (అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫార్మాస్యూటికల్ సొసైటీ), ఏఈఎస్ (అమెరికన్ ఎపిలెప్సీ సొసైటీ ) నుంచి "ఫెల్లో" (శాశ్వత సభ్యత్వము) అనే అతి కొద్దీ శాస్త్రవేత్తలకిచ్చే ముఖ్యమైన పురస్కారాలు అందుకున్న మొట్ట మొదటి తెలుగు భారతీయుడు. ఫార్మసీ మెడికల్ రంగాల్లో 180 పేపర్స్, డజన్ కు పైగా మెడికల్ పుస్తకాలు రచించిన ఆయన ఇంటెర్నేషనల్ సైన్స్ పండిత డాక్టర్లలో ఒక అసామాన్యుడుగా ప్రసిద్ధి పొందారు. ఆయన గత 24 సంవత్సరాల నుండి మెదడు జబ్బులపై అధ్యాయనం చేస్తున్నారు. ఫీట్స్ వ్యాధికి ఓ మెడిసిన్ కూడా కనిపెట్టారు. మెదడులోని ఉత్ప్రేరకాలు, సరఫరా వ్యవస్థ విధానంలో ఎన్నో పరిశోధనలు చేసి, ఎపిలెప్సీ రోగ నిర్మూలనం కోసం 'న్యూరో కోడ్' కనిపెట్టి చరిత్ర సృష్టించారు. మెదడు దెబ్బల నుంచి న్యూరోలాజికల్ జబ్బులు రాకుండా ఒక కొత్త 'ఏపిజెనెటిక్' చికిత్స విధానాన్నిఇటీవలే ప్రకటించారు. ఈ మెడికల్ విధానాలు విశ్వవ్యాప్తంగా ఎన్నో వేల మంది న్యూరోలాజికల్ రోగులకు ఉపయోగపడుతున్నాయి. -
అలరించిన నరాల రామారెడ్డి అష్టవధానం
ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా సభల్లో నరాల రామారెడ్డి అష్టవధానం అందరిని ఆకట్టుకుంది. నాటా కన్వెన్షన్ 2018 లిటరరీ కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి నరాల రామారెడ్డిని వేదికపైకి ఆహ్వానించగా, సభాధ్యక్షత వహించిన డా. వడ్డేపల్లి కృష్ణ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేత లక్ష్మీపార్వతి గౌరవఅతిథిగా హాజరయ్యారు. దత్త పదిగా తానా, ఆటా, నాటా, అమెరికా అను పదాలతో భారతార్థంలో గూడూరి శ్రీనివాస్ పృచ్ఛకునిగా శార్దూల వృత్తాన్ని కోరగా అవధాని చమత్కారంగా పూరించారు. 'రంగమ్మ నిను వీడ జాలనియోన్ రాముడు విభ్రాంతుండై' అన్న సమస్యను డా. పుట్టపర్తి నాగపద్మిని ఇవ్వగా 'సారంగమ్మా' అను సంభోధనతో అవధాని మాయలేడిని వర్ణిస్తూ సమస్యను పూరించి సభికుల్ని ఆనందంలో ముంచెత్తారు. మిగతా పృచ్ఛకులుగా వర్ణన- జయదేవ్, ఆశువు-డా. ఆడువాల సుజాత, న్యస్తాక్షరి- అశోక్, ఘంటసాల-ఆదినారాయణ, అప్రస్తుత ప్రసంగం- సదాశివ రాంపల్లి నిర్వహించారు. నాటా అధ్యక్షులు గంగసాని రాజేశ్వరరెడ్డి అవధాని డా. నరాల రామారెడ్డి, పృచ్ఛకులందరినీ శాలువాతో సన్మానించారు. -
ఫిలడెల్ఫియాలో ఘనంగా నాటా సాహిత్య సమావేశాలు
ఫిలడెల్ఫియా : జూలై 7, 8 తేదీల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన నాటా - 2018 కన్వెన్షన్‌లో భాగంగా సాహిత్య కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ 'భాషా - సాహిత్యం - సమాజం' సెషన్ తిమ్మాపురం ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సెషన్లో తెలుగులో శాస్త్రీయ సాహిత్యం, వైజ్ఞానిక సాహిత్యం ఆవశ్యకతను గురించి నరిసెట్టి ఇన్నయ్య ప్రసంగించారు. భారతీయ సాహిత్యంలో తెలుగు భాషా స్థానం గురించి హిందీ నుంచి తెలుగులోకి అనేక అనువాదాలు చేసిన ఢిల్లీకి చెందిన లక్ష్మిరెడ్డి సోదాహరణంగా మాట్లాడి సభికులను ఆలోచింప చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ తీరు తెన్నులు, అకాడమీ చేసిన మంచి పనులు, అకాడమీ నిర్వహణలో సాధక బాధకాల గురించి దుగ్గిరాల సుబ్బారావు వివరించారు. తమిళ నాట తెలుగు భాషా ఉద్యమం గురించి నంద్యాల నారాయణ రెడ్డి ఆవేశంతో, ఆవేదనతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. 'తెలుగు సాహిత్యంలో భిన్న దృక్పథాలు' సెషన్లో వక్తల ప్రసంగాలతో పాటు, పుస్తాకావిష్కరణలు, స్వీయకవితా పఠనం జరిగాయి. రచయిత్రి కల్పనా రెంటాల అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో విక్రంసింహపూరి విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసి రిటైరైన సీఆర్ విశ్వేశ్వర రావు ఇంగ్లీష్ లోవచ్చిన తెలుగు అనువాదాల గురించి ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. పుట్టపర్తి వారి అభ్యుదయ వాదం గురించి వారి కుమార్తె, విదుషీమణి పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి వారి మహోన్నత వ్యక్తిత్వం పరిచయం చేశారు. ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణికి రచయిత్రి కల్పనారెంటాల నివాళి ప్రసంగం చేశారు. యడ్లపల్లి భారతి 'ఎడారి బతుకులు' వడ్డేపల్లి కృష్ణ తెలుగు కవిత్వానికి ఇంగ్లీష్ అనువాదాల పుస్తకం, తదితర పుస్తకావిష్కరణలు జరిగాయి. నాటా సాహిత్య కమిటీ చైర్ మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్ ఆధ్వర్యం లో జరిగిన ఈ సెషన్స్ సాహిత్యాభిమానులను అలరించాయి. -
నాటా వేడుకల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
ఫిలడెల్ఫియా : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా ఉత్సవాల్లో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలను ఎన్నారైలు అభినందించారు. ఫిలడెల్ఫియాలోని నాటా కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నారైలు వైఎస్సార్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని, అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేస్తారని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు పడుతున్నారని, అలాగే లక్షలాది మందిని కలుస్తున్నారని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ రాజన్న రాజ్యం తెస్తారన్నారు. ఏపీలో ఏ ఊరికి వెళ్లినా చొక్కా గుండీలు విప్పి ఆపరేషన్ అయిన గుండెలు చూపిస్తూ వైఎస్సార్‌ని గుర్తు చేసుకుంటారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో మందికి వైద్యానికి అయ్యే మొత్తం సాయం చేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గుర్తు చేశారు. వైఎస్సార్ అంటేనే ఒక నమ్మకమని, ఆయనున్నారనే భరోసా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉండేదని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అన్నారు. వైఎస్సార్ ప్రజల మనిషని, ప్రజలకోసమే పుట్టి ప్రజల కోసమే బతికిన నాయకుడని అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటూ దివంగత నాయకుడిని స్మరించుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2020 నాటా కన్వెన్షన్‌కు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో రావాలని కోరుకుంటున్నామని నాటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాఘవ రెడ్డి అన్నారు. జగన్ సీఎం అయ్యే వరకు ప్రతి వైఎస్సార్ అభిమాని కృషి చేయాలన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు ఓ మహిళ 3 గంటల పాటు ముగ్గురు ఆడపిల్లలతో వేచి చూసిందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. ఎందుకమ్మా అంతసేపటి నుంచి వేచి చూస్తున్నావని అడిగితే, ' నా భర్త మృతి చెందాడు. ముగ్గురు పిల్లలు చెవిటి వాళ్లుగా ఉండేవారు. అయితే ముగ్గురికి వైఎస్సార్ ఆపరేషన్ చేయించారు. రూ.18 లక్షలతో కంకిలియర్ ప్లాంటేషన్ చేయించారు' అని ఆ మహిళ తనతో చెప్పారని అనికుమార్ యాదవ్ పేర్కొన్నారు. నాటా వేడుకల్లో వైఎస్సార్ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ గంగసాని అన్నారు. వీటి కోసం కన్వెన్షన్ తేదీలను మార్చుకున్నామని తెలిపారు. అమెరికాలో ప్రతి ఏటా వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 2019 లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా అని నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ఎన్నో కష్టాల మధ్య పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రతి ఎన్నారై ఓటు వేసేందుకు ఏపీ వెళ్ళాలని సూచించారు. వాళ్ల అందరికి విమానం టిక్కెట్ తాను ఇప్పిస్తానన్నారు. జగన్ కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కు భారత రత్న ఇవ్వాలని, దాని కోసం కోటి సంతకాల సేకరణ చేపడతామని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో వైఎస్సార్‌ను అనుకరిస్తూ రమేష్ చేసిన మిమిక్రీ అందరిని ఆకట్టుకుంది. ప్రముఖ దాత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) జీవితకాల పురస్కారం అందుకున్న సందర్భంగా నెల్లూరు ఎన్నారై బత్తినపట్ల సురేందర్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. -
శ్రీనాథ్ గొల్లపల్లికి నాటా ఎక్స్‌లెన్స్ అవార్డు
ఫిలడెల్పియా : జర్నలిజంలో చేసిన సేవలకుగానూ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఎక్స్‌లెన్స్ అవార్డును సాక్షి టీవీ అవుట్‌పుట్ ఎడిటర్ శ్రీనాథ్ గొల్లపల్లికి ప్రదానం చేశారు. శ్రీనాథ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం, మాస్ కమ్యునికేషన్స్‌లో మాస్టర్స్ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో లా చదివారు. టీవీ మాధ్యమం ద్వారా వార్తలను సమర్పించడంలో ప్రత్యేకీకరణ సాధించిన శ్రీనాథ్ గొల్లపల్లి 1999లో జర్నలిజంలో కేరీర్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ రాజకీయాలు, క్రీడలు, సంస్కృతి, జీవనశైలి విభాగాల్లో కార్యక్రమాలను రూపొందించడంలో శ్రీనాథ్ నిష్ణాతులు. చేనేత కార్మికులపై శ్రీనాథ్ రూపొందించిన డాక్యుమెంటరీకి నాటా పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్ గంగసాని రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ డా. రాఘవ రెడ్డి గోసాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. శ్రీధర్ కొర్సపాటి, నేషనల్ కోఆర్డినేటర్ ప్రదీప్ సమల, కన్వెన్షన్ డైరెక్టర్ హరినాథ్ వెల్కురు, కల్చరల్ ఛైర్ అళ్ల రామిరెడ్డిలు పాల్గొన్నారు. మూడు రోజులపాటూ జరిగే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వేడుకల కోసం వేలాది మంది తెలుగు ప్రజలు ఫిలడెల్ఫియా చేరుకున్నారు. దీంతో ఫిలడెల్పియా వీధులన్నీ తెలుగువారితో కళకళలాడుతున్నాయి. -
నేటి నుంచి నాటా వేడుకలు
అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : నేటి నుంచి (జులై 6) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వేడుకల కోసం వేలాది మంది తెలుగు ప్రజలు ఫిలడెల్ఫియా చేరుకున్నారు. దీంతో ఫిలడెల్పియా వీధులన్నీ తెలుగువారితో కళకళలాడుతున్నాయి. వేడుకల కోసం డౌన్ టౌన్లో నడిబొడ్డున ఉన్న ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌ను అంగరంగ వైభంగా ముస్తాబు చేశారు. దీని పక్కనే ఉన్న హోటల్ మారియట్, కోర్ట్ యార్డ్, లోవిస్తో పాటు స్థానికంగా ఉండే తెలుగు వారింట అతిథులు బస చేశారు. ఈ వేడుకల కోసం వైఎస్సాసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణసాగర్, మధుయాష్కీ ప్రదీప్ కుమార్, జంగా రాఘవరెడ్డిలు ఇప్పటికే ఫిలడెల్ఫియా చేరుకున్నారు. వేడుకల్లో భాగంగా తొలి రోజు బాంకెట్ డిన్నర్‌తో వేడుకలు ప్రారంభమౌతాయి. వేర్వేరు రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను ఈ వేడుకల్లో సత్కరించనున్నారు. అనంతరం తెలుగు సినీరంగ గాయనీ గాయకుల సారథ్యంలో సంగీత విభావరి జరగనుంది. తర్వాత జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. తదనంతరం భారత జాతీయ గీతంతో పాటు అమెరికా జాతీయ గీతాలను ఆలపిస్తారు. తరువాత నాటా సావనీర్‌ను ఆవిష్కరిస్తారు. వీటితో పాటు నాటా మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకలకు న్యూజెర్సీలో ఉన్న అమెరికా సెనెటర్ థాంసన్ ఆత్మీయ అతిథిగా పాల్గొంటారు. వీరితో పాటు అమెరికా బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటిస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొల్గొంటారు. -
జూలై 6 నుంచి నాటా ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం
ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఆధ్వర్యంలో జూలై 6 నుంచి 8 వరకు శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుపనున్నట్టు నాటా ప్రతినిధులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతులతో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయని.. హిందూ సంప్రదాయం ప్రకారం కన్నుల పండుగగా కళ్యాణం జరిపించడానికి టీటీడీ నుంచి వేద పండితులు జీఏవీ దీక్షితులు, కే పురుషోత్తం ఆచార్యులు ప్రత్యేకంగా వస్తున్నారని వెల్లడించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం ఇవ్వనున్నామన్నారు. కళ్యాణ సమయంలో గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నమాచార్య కీర్తనల రూపంలో శ్రీనివాసుని కళ్యాణ ప్రశస్తిని భక్తులకు వివరిస్తారని.. చైతన్య సోదరుల గాత్రం, పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం మృదంగం, సత్యనారాయణ శర్మ వయోలిన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఫిలడెల్ఫియాలో జరిగే తెలుగు మహాసభల నిర్వహకులు ఎందరో కార్యకర్తలు అహార్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు సకుటుంబ సమేతంగా ఈ కళ్యాణంలో పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాల కోసం nata2018.org వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చని తెలియజేశారు. -
జూలై 7న నాటా మీట్ అండ్ గ్రీట్
వాషింగ్టన్ డీసీ : ఫిలడెల్ఫియాలో నాటా కన్వెన్షన్‌లో జూలై 7న జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారులు పెద్దమొత్తంలో హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ యూఎస్ఏ కమిటీ కోరింది. నాటా ఎలక్ట్ ప్రెసిడెంట్ డా. రాఘవ రెడ్డి గోసాల, నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్‌రెడ్డి గంగసాని, వైఎస్సార్ ఫౌండేషన్ యూఎస్ఏ ప్రెసిడెంట్ ఆళ్ల రామిరెడ్డిలు అందిస్తున్న సహకారానికివైఎస్సార్సీపీ యూఎస్ఏ కన్వీనర్లు డా. వాసుదేవరెడ్డి ఎన్, డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, రత్నాకర్ పండుగాయల, మధులిక చవ్వ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్ జయంతిని నాటా మహాసభల్లో నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, నందమూరి లక్ష్మిపార్వతి నాటా సభల్లో పాల్గొనబోతున్నారు. పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు నాటా పొలిటికల్‌ఫోరం సభల్లో పాల్గొననున్నారు. అలాగే సమకాలీన అంశాలపై జరిగే రాజకీయ చర్చల్లో వైఎస్సార్సీపీ పొలిటికల్‌అడ్వైజరీ కమిటీ సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్‌ఇన్‌ఛార్జ్‌లావు కృష్ణ దేవరాయులు, పార్టీ శ్రీశైలం ఇంఛార్జ్‌శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధనరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, పార్టీ డాక్టర్స్ వింగ్‌అధ్యక్షులు శివభరత్‌రెడ్డి పాల్గొంటారని నాటా నిర్వాహకులు తెలిపారు. -
నాటా ఉత్సవాల్లో నరాల రామారెడ్డి అష్టవధానం
వాషింగ్టన్ డీసీ : తన పదహారవఏటనే అవధానం ప్రారంభించిన నరాల రామారెడ్డి నాటా తెలుగు ఉత్సవాల్లో భాగంగా జులై 8వ తేది ఉదయం 9 గంటలకు అష్టవధానం చేయనున్నారు. నరాల రామారెడ్డి గత 52 ఏళ్లుగా దాదాపు వెయ్యి అవధానాలు చేశారు. అమెరికా తెలుగు సంఘాలైన ఆటా, నాటా, తానా ఆహ్వానాలను అందుకొని అమెరికాలో పలుమార్లు అవధానం చేసి మన్ననలందుకున్నారు. జూలై 6,7,8న ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా తెలుగు ఉత్సవాలలో నరాల రామారెడ్డి మరోసారి అష్టవధానం చేయనున్నారు. ఈ అవధాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరై విజయవంతం చేయాలని నాటా కన్వెన్షన్ 2018 లిటరరీ కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి కోరారు. అవధాన చరిత్ర : తెలుగు సాహిత్యనందనోద్యానంలో విలక్షణంగా వికసించిన పుష్పం అవధానం. ఇది పద్యకవితా సుమగంధాలను విరజిమ్ముతుంది. చమత్కారమకరందాలను చిందిస్తుంది. భారతీయ భాషల్లో కేవలం తెలుగు బాషలోనే రూపుదిద్దుకున్న ప్రక్రియ అవధానం ఇది తెలుగువారి సొంతం. సంస్కృత భాష లో వున్న "సమస్యాపూరణం" అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని 1854 సంవత్సరంలో మహా పండితులు మాడభూషి వేంకటాచార్యులు “సమస్య” అనే అంశానికి "నిషిద్ధాక్షరి దత్తపది, వ్యస్తాక్షరి, మొదలైన అంశాలను జోడించి " "అష్టావధానం" అనే పక్రియను రూపకల్పన చేశారు. అవధాన ప్రాశస్త్యం : మాడభూషి వారి మార్గ దర్శకత్వంలో జంటకవులైన తిరుపతి వేంకట కవులు తెలుగు ప్రాంతమంతట జైత్రయాత్ర సాగించి అవధాన పక్రియను జన బాహుళ్యంలోకి తెచ్చారు. "అష్టావధాన కష్టాలంబనమన్న నల్లేరుపై బండిన డక మాకు శతావధాన విధాన సంవిదానంబన్న షడ్రసోపేత భోజనము మాకు" అని తిరుపతి కవులు అవధానరంగంలో సింహాల్లా విజృంభించారు. అష్టావధానంలొ ఎనిమిది అంశాలుంటాయి. సమస్యాపూరణం , దత్తపది అనే అంశాలు అవధాని చమత్కార ప్రతిభను పరీక్షిస్తాయి. నిషిద్దాక్షరి, వ్యస్తాక్షరి పాండిత్య పరీక్ష చేస్తాయి. ఘంటాగణనం, పురాణపఠనం అవధాని ఏకాగ్రతను పరీక్షిస్తాయి. వర్ణన ఆశుకవిత అవధాని కవితా కౌశల్యాన్ని పరీక్షిస్తాయి. అవధానం చేసే వ్యక్తికి ధార (Flow), ధారణ ( preservation ), ధిషణ (talent), ధోరణి (presence of mind), ధైర్యం (courage) అనే పంచధకారాలు ఉండాలని విజ్ఞులు చెప్పారు. -
జూలై 7, 8న నాటా సాహిత్య సమావేశాలు
ఫిలడెల్ఫియా : అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7, 8న నాటా సాహిత్య సమావేశాలు జరుగనున్నాయని నాటా లిటరరీ కమిటీ చైర్మన్ మెట్టుపల్లి జయదేవ్, కో- చైర్ తిమ్మాపురం ప్రకాష్ తెలిపారు. కమిటీ సభ్యులు ఆదినారయణరావు రాయవరపు, శ్రీనివాస్ సోమవారపు, కమిటీ సలహదారులు శరత్ వేట, తిరుపతి రెడ్డిలతో చర్చించి నాటా సాహిత్య సభల షెడ్యూల్‌కు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాచీన సాహిత్యం నుంచి మీడియా సాహిత్యం వరకూ జరిగే మొత్తం 5 సెషన్లలో ప్రముఖ రచయితలూ, విమర్శకులూ పాల్గొననున్నారు. ప్రతి సెషన్ మధ్యలో స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉండనున్నాయి. జూలై 7 శనివారం రెండు సాహిత్య సెషన్లు జరుగుతాయి. మొదటి సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ప్రొఫెసర్ అఫ్సర్ అధ్యక్షతన 'తెలుగు ప్రసార మాధ్యమాల సాహిత్య కృషి' అనే అంశంపైన జరుగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తెలుగు అచ్చు పత్రికలు- సాహిత్యం అనే అంశం మీద ప్రొఫెసర్ అఫ్సర్, అంతర్జాలంలో తెలుగు పత్రికల సాహిత్య కృషి గురించి ప్రముఖ కవి, విమర్శకులు, ఎడిటర్ రవి వీరెల్లి, ఎలక్ట్రానిక్ మీడియా : మన సాహిత్యం అనే అంశం గురించి డాక్టర్ నరసింహ రెడ్డి దొంతి రెడ్డి, తెలుగు సినిమా సాహిత్యం గురించి ప్రసిద్ధ సినిమా కవి వడ్డేపల్లి కృష్ణ మాట్లాడతారు. ఈ సెషన్ తర్వాత స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి. రెండో సెషన్ ౩ గంటల నుంచి 5 గంటల వరకు 'అమెరికా తెలుగు సాహిత్యం - కొత్త ధోరణులు' అనే అంశం మీద జరుగుతుంది. ప్రముఖ కవి, విమర్శకులు నారాయణ స్వామి వెంకట యోగి సభకి అధ్యక్షత వహిస్తారు. నారాయణ స్వామి 'అమెరికా తెలుగు సాహిత్యంలో రూపం సారం' అనే అంశం గురించి మాట్లాడతారు. అమెరికాలో తెలుగు సాహిత్య సంఘాలు చేస్తున్న కృషి, కొత్త తరం సాహిత్య సృష్టిలో ఆ సంఘాల పాత్ర గురించి ప్రసిద్ధ రచయిత, వంగూరి ఫౌండేషన్ చైర్మన్ వంగూరి చిట్టెన్ రాజు ప్రసంగిస్తారు. కెనడా సాహిత్య ప్రముఖులు సరోజా కొమరవోలు అమెరికా తెలుగు రచనల విశ్లేషణ అందిస్తారు. అమెరికాలో తెలుగు కథ: కొత్త ధోరణుల గురించి ప్రసిద్ధ కథకులు శివకుమార్ శర్మ తాడికొండ మాట్లాడతారు. ఈ సెషన్ తర్వాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి. జూలై 8 ఆదివారం ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు అవధాని సార్వభౌమ, అవధాని కంఠీరవ నరాల రామారెడ్డి అవధానంతో రెండో రోజు సాహిత్య కార్యక్రమాలు మొదలవుతాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఓ భిన్నమైన అంశం మీద ప్రసంగాలతో రెండో సమావేశం మొదలవుతుంది. కేవలం సాహిత్యం మాత్రమే కాకుండా, ఆ సాహిత్యానికి వెన్నెముక లాంటి భాష, సమాజాలతో సాహిత్యానికి ఉండే సంబంధాల గురించి 'భాష - సాహిత్యం - సమాజం' సెషన్ ఉంటుంది. ఇందులో సాహిత్యంలో శాస్త్రీయ విలువల గురించి ప్రముఖ హేతువాది నరిశెట్టి ఇన్నయ్య, భారతీయ సాహిత్యంలో తెలుగు భాష స్థానం గురించి ప్రముఖ అనువాదకులు లక్ష్మి రెడ్డి, కేంద్రీయ సాహిత్య అకాడమీ తీరు తెన్నుల గురించి సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు, అనువాదకులు దుగ్గిరాల సుబ్బారావు, తమిళనాట తెలుగు ఉద్యమానికి అంకితమైన నంద్యాలరెడ్డి నారాయణ రెడ్డి ఆ ఉద్యమ స్వభావాన్ని గురించి మాట్లాడతారు. ఈ సెషన్ తరువాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి. 'వర్తమాన సాహిత్యం- భిన్న దృక్పథాలు'అనే సెషన్లో ప్రసిద్ధ రచయిత్రి, సారంగ సాహిత్య పత్రిక ఎడిటర్ కల్పనా రెంటాల 'మన సాహిత్యం స్త్రీలూ పురుషులూ' అనే అంశం మీద మాట్లాడతారు. ఇంగ్లీషులోకి తెలుగు అనువాదాల గురించి ప్రముఖ విద్యావేత్త సి. ఆర్. విశ్వేశ్వర రావు, పుట్టపర్తి అభ్యుదయ వాదం గురించి మహాకవి పుట్టపర్తి కుమార్తె, నాగపద్మిని పుట్టపర్తి మాట్లాడతారు. ఇదే సెషన్ లో ప్రముఖ విద్యావేత్త జే. ప్రతాప్ రెడ్డి కూడా మాట్లాడతారు. ఈ సెషన్ తర్వాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి. -
అమెరికాలో తెలుగు సంబరం
ఫిలడెల్ఫియా (అమెరికా) : సప్త సముద్రాల ఆవల తెలుగు మహా సంబరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నార్త్ అమెరికా తెలుగు అసొషియేషన్ (నాటా) ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సిద్ధమవుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరం వేదికగా జులై 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న నాటా మహా సభలకు ఏకంగా 13 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు నాటా సభలకు అతిథులుగా హాజరు కానున్నారు. సామాజిక సేవ, తెలుగు సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంగా ఏర్పడిన నాటా.. అనతి కాలంలో మహా వృక్షంగా మారింది. విద్యా, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వచ్చే వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చిన నాటా.. తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సేవలందించడం ప్రారంభించింది. నాటా ప్రతి రెండేళ్లకి ఒకసారి కన్వెన్షన్ నిర్వహిస్తుంది. 2016లో డల్లాస్‌లో, ఈ సారి ఫిలడెల్ఫియోలో వేడుకలు నిర్వహిస్తోంది. నాటా సమాజ సేవలో ముందుండడం, పూర్తి పారదర్శకంగా వ్యవహరించడం, తెలుగు వారి అవసరాలు తీర్చేలా ముందుకెళ్తోంది. గత రెండేళ్లలో అమెరికాలో తలెత్తిన ప్రకృతి విపత్తుల సమయంలోనూ తనవంతు సహాయ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సారి మహాసభలకు వివిధ రంగాల్లో ప్రముఖులు, వేర్వేరు పార్టీల రాజకీయ నాయకులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఇక మహాసభల్లో సాంస్కృతిక వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పలువురు సినీ నటులు, దర్శకులు, గాయినీ గాయకులు, రచయితలు, టీవీ ఆర్టిస్టులు నాటా వేడుకల కోసం అమెరికా వస్తున్నారు. మహాసభలకు ముందస్తుగా పలు కార్యక్రమాలు చేపట్టింది. నాటా నారి పేరుతో మహిళా సదస్సులు, యువత కోసం యూత్ వెల్నెస్ కార్యక్రమాలు, అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు, యూఎస్‌లోని వేర్వేరు నగరాల్లో ఆర్ట్ కాంపిటీషన్స్ , మ్యాట్రిమోనీ కార్యక్రమాలు నిర్వహించింది. నాటా మాట పేరుతో ఓ పత్రిక కూడా విడుదల చేసింది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి నాటాకు ప్రాతినిధ్యం ఉంది. నిజాయతీ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక సేవ అనే పునాదులపై నాటాను ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగు సంసృతి, వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాం. ఈ సారి ఫిలడెల్ఫియాలో జరగనున్న మహాసభలకు 13వేల మంది రానున్నారని సగర్వంగా చెబుతున్నాను. గత ఆరు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవాదళం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణలోని ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాం. బాలిక సంరక్షణ కోసం వరంగల్‌లో నిర్వహించిన జానపద నృత్య రీతులు నాటా చరిత్రలో సరికొత్త మైలురాయి. ‘సమాజ సేవే నాటా మాట - సంసృతి వికాసమే నాటా బాట’ అన్న మా నినాదాన్ని నిజం చేసే దిశగా ప్రయాణిస్తున్నాం. డాక్టర్ ప్రేం సాగర్ రెడ్డి, నాటా అడ్వైజరీ కౌన్సిల్ నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ (నాటా)తో ఎన్నారైలకు వీడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి మహాసభలకు తెలుగు ప్రజలు వేలాదిగా తరలివచ్చి దీవిస్తున్నారు. తెలుగు అనే భాష కింద అంతరాల్లేవు. ప్రాంతీయ బేధాలు లేవు. అందరం ఒకే గొడుగు కిందికి వస్తున్నాం. ఎక్కడో నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. నాకు 17 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మా ఊళ్లో కరెంటు గానీ, తాగు నీరు గానీ లేవు. అలాంటి పరిస్థితి నుంచి అమెరికాకు వచ్చి అతి పెద్ద ఆస్పత్రుల నెట్ వర్క్ ప్రైమ్ ఏర్పాటు చేసి 45వేల అమెరికన్లకు ఉద్యోగలిచ్చా. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు. నేను సంపాదించిన దాన్ని సమాజానికి పంచేందుకు దాత్రుత్వాన్ని ఎంచుకున్నా. సమాజానికి వీలైనంత అందిస్తున్నా. అదే స్పూర్తితో నాటాను ఏర్పాటు చేశాం. నడిపిస్తున్నాం. నాటా వేదికగా వైఎస్సార్ జయంతి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ వేదికగా నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ తెలిపింది. నాటా నిర్వహించనున్న పొలిటికల్ ఫోరంలో భాగంగా డా.వైఎస్సార్ ను స్మరించుకుంటామని ప్రకటించింది. మహా సభలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ను ఆహ్వానించారని, అయితే పాదయాత్ర కారణంగా ఆయన రాలేకపోతున్నారని పార్టీ తెలిపింది. నాటా ప్రతినిధులు, అతిథులను ఉద్దేశించి తన సందేశాన్ని వైఎస్ జగన్ పంపనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారని చెప్పారు. -
నాటా తెలుగు మహాసభలను విజయవంతం చేయండి
-
సాహిత్య పోటీలకు నాటా ఆహ్వానం
ఫిలడెల్ఫియా : నాటా 2018 సాహిత్య పోటీలకు రచయితలు, కవులకు ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఆహ్వానం పలికింది. సారంగ వెబ్ సాహిత్య పక్ష పత్రిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూలై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న నాటా సభల్లో కథలు, కవిత్వ పోటీల ఫలితాలు వెలువరించనున్నారు. ఈ కథల పోటీల్లో మొదటి బహుమతికి రూ. 15 వేలు, రెండో బహుమతికి రూ. 10 వేలు, మూడో బహుమతికి రూ. 5 వేలు ఇవ్వనున్నారు. కవితల పోటీల్లో మొదటి బహుమతికి రూ. 5 వేలు, రెండో బహుమతికి రూ. 3 వేలు, మూడో బహుమతికి వెయ్యి రూపాయలుగా ప్రకటించారు. జూన్ 1లోపు కవితలు, కథలు పంపించాలని నాటా ఓ ప్రకటనలో తెలిపింది. పోటీల్లో గెలుపొందిన కథలు, కవిత్వాలను సారంగ (magazine.saarangabooks.com)లో ప్రచురిస్తారు. రచనలు Literaty@nata2018.org పంపించాలని సాహిత్య కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి విజ్ఞప్తి చేశారు. -
గాలిలో 144 మంది.. పేలిన విమానం ఇంజన్!
ఫిలిడెల్ఫియా : గగనతలంలో అనూహ్యరీతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ అమెరికా విమానం ఇంజన్ మధ్యలో పేలిపోయింది. ఆ ఇంజన్ శకలం దూసుకొచ్చి.. విమానం కిటికీని ఢీకొట్టింది. దీంతో విమానానికి రంధ్రం ఏర్పడి.. ప్రయాణికుల్లో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చెందిన విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజన్ పేలిపోయింది. ఇంజన్ శకలం దూసుకొచ్చి కిటికీని ఢీకొట్టడంతో.. కిటికీ పక్కనే సీట్లో కూర్చున్న మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. అయితే, పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. వెంటనే సమీపంలో ఉన్న ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో విమానాన్ని దింపడంతో పెనుప్రమాదం తప్పింది. పెద్దసంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. డల్లాస్ నుంచి 144 మంది ప్రయాణికులతో బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 1380 ఫిలిడెల్ఫియాలో అత్యవసరంగా దిగింది. విమానం ఇంజన్ ఒక్కసారిగా పేలడం.. విమానానికి రంధ్రం పడటంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళలకు గురైయ్యారు. అతి కష్టం మీద విమాన సిబ్బంది ఆ రంధ్రాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా విమానంలోకి గ్యాస్ ప్రవేశించడంతో ఊపిరాడక ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు. వారికి అత్యవసరంగా సిబ్బంది ఆక్సీజన్ మాస్కులు అందించారు. ఈ ఘటనలో మృతిచెందిన మహిళను జెన్నిఫర్ రియోర్డాన్ గుర్తించారు. ఆమె బ్యాంకు ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా ప్రాణాలు కాపాడు దేవుడా.. అని ప్రార్థించాం గాలిలో ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. విమానం ఫిలడెల్ఫియా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేంతవరకు ప్రార్థనలు చేస్తూ.. భయాందోళనతో గడిపారు. ‘విమాన ప్రమాదం జరిగిన తరువాత మాకు గాలి ఆడలేదు. ఒక్కసారిగా ఆక్సిజన్ ముసుగులు తెరుచుకున్నాయి. మా ప్రాణాలు కాపాడు దేవుడా అని అందరం ప్రార్ధించాం’ అని న్యూయార్క్ ప్రయాణికుడొకరు తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసిన తరువాత తన భర్త చేతిని గట్టగా పట్టుకున్నానని, ఆ సమయంలో తన పిల్లల గుర్తుకు వచ్చారని, మళ్ళి వాళ్ళను తిరిగి చూడగలనా అన్న భయం కలిగిందని ఓ ప్రయాణికురాలు తెలిపారు. ప్రమాదంలో మరణిచిన రియోర్డాన్ న్యూ మెక్సికో విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్. ఆమె గతంలో సమాజ సంబంధాల రంగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2009 నుంచి సౌత్‌వెస్ట్ ఏయిర్ లైన్స్‌లో ఇలాంటి ప్రమాదం జరగటం మొదటిసారి అని సంస్థ సిబ్బంది తెలిపారు. విమానం 30,000 వేల అడుగులో ఉండగా ఇంజన్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించామని, ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో గ్యాస్ లీకైందని విమాన సిబ్బంది తెలిపారు. గ్యాస్ లీకైన వెంటనే విమానంలో ఆక్సిజన్ మాస్క్‌లు తెరుచుకున్నాయని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు. తరువాత ప్రయాణికులను సౌత్‌వెస్ట్ బోయింగ్ 737-700 విమానంలో ప్రయాణికులను లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌కు సురక్షితంగా తరలించామని సౌత్‌వెస్ట్ విమాన అధికారులు తెలిపారు. -
మనుషుల్లా నడవటం నాకూ తెలుసు
ఫిలడెల్ఫియా : గొరిల్లాలు మనుషుల్లా రెండు కాళ్ల మీద నడవటం పెద్ద విశేషం ఏం కాదు. అయితే అది అరుదుగా జరగాలే తప్ప.. అదే పనిగా ఉంటే మాత్రం చర్చనీయాంశమే. అమెరికా ఫిలడెల్ఫియాలోని ఓ జూలో ఉన్న లూయిస్ అనే మగ గొరిల్లా చాలా ప్రత్యేకం. రోజులో దాదాపు సమయం అది రెండు కాళ్ల మీద అది నడుచుకుంటూ వెళ్తుంది. అయితే అది అలా చేయటానికి కారణం ఉందని చెబుతున్నారు జూ నిర్వాహకులు. ‘లూయిస్‌కు బురద అంటే చికాకు. దానిని చూసేందుకు వచ్చే వాళ్లే వేసే తిండిని అది మట్టి పాలు కానివ్వదు. శుభ్రత ఎక్కువ. నిర్వాహకులు పెట్టే తిండిని కూడా అది చేతిలో పట్టుకునే దాని బోనులోకి వెళ్లి అది తింటుంది. ఆ సమయంలో అది రెండు కాళ్ల మీద నడుస్తూనే ఉంటుంది’ అని నిర్వాహకులు చెబుతున్నారు. 18 ఏళ్ల లూయిస్ ఆ మధ్య ఓ సందర్భంలో ఠీవీగా తిప్పుకుంటూ పోతుంటే.. దానిని వీడియో తీసిన జూ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయటంతో వేలలో కామెంట్లు వచ్చిపడుతున్నాయి. Although gorillas occasionally walk on two legs (bipedal), it is less common. Not for Louis though - he can often be seen walking bipedal when his hands are full of snack or when the ground is muddy (so he doesn't get his hands dirty)! pic.twitter.com/6xrMQ1MU9S — Philadelphia Zoo (@phillyzoo) 5 March 2018 -
'అతడి తల నరికితేనే మాకు శాంతి'
బీజింగ్ : ఓ చైనా వీరుడి విగ్రహ బొటన వేలు పోవడానికి కారణమైన అమెరికన్ యువకుడి తల నరికితేనే తాము శాంతిస్తామని చైనా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, చైనా అధికారులు కూడా ఆ వ్యక్తికి కఠినమైన దండన విధించాల్సిందేనని అమెరికాను డిమాండ్ చేస్తున్నారు. రెండువేల ఏళ్ల కిందటి దాదాపు 4.5మిలియన్ డాలర్ల విలువైన చైనా యుద్ద వీరులు టెర్రకోటా వారియర్స్ పది విగ్రహాలను అమెరికాలోని ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఫిలడెల్పియాలో ప్రదర్శనకు ఉంచారు. అయితే, రోహనా (24) అనే అమెరికన్ యువకుడు ఆ ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్లీ స్వీటర్ పార్టీకి గత ఏడాది 2017, డిసెంబర్ 21న హాజరయ్యాడు. అయితే, అతడు ప్రదర్శనశాలను చూసే క్రమంలో సరిగ్గా టెర్రకోట వారియర్స్ విగ్రహాల వద్దకు వెళ్లేసరికి సమయం ముగిసింది. దాంతో అతడు తన ఫోన్లోని ఫ్లాష్ లైట్ ఉపయోగించి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆ విగ్రహంలో ఏదో భాగం విరిగిపోయినట్లు అనిపించింది. ఆ విరిగిన భాగాన్ని తీసుకొని జేబులో వేసుకొని వెళ్లిపోయాడు. అయితే, మ్యూజియం స్టాఫ్ తర్వాత ఆ విషయాన్ని గుర్తించి ఎఫ్‌బీఐ అధికారులకు చెప్పగా వారు రోహనాను అరెస్టు చేశారు. దాంతో అతడు ఆ బొటన వేలి భాగాన్ని తన సొరుగులో దాచిపెట్టినట్లు చెప్పాడు. కొద్ది రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్న అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే, ఎంతో విలువైన పురాతన విగ్రహాల విషయంలో మ్యూజియం అధికారులకు కనీసం జాగ్రత్త లేకుండా పోయిందని, ఈ ఘటనకు కారణమైన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క, చైనా ప్రజలు మాత్రం అతడి తలను కూడా తొలగించాల్సిందేనంటూ మండిపడుతున్నారు. -
వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్త దానం
ఫిలడెల్ఫియా : ప్రజల నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎనిమిదో వర్ధంతి సందర్బంగా ఫిలడెల్ఫియాలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్(అమెరికా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోశాల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి, వైఎస్ఆర్సీపీ అమెరికా కన్వీనర్ రత్నాకర్, రీజినల్ ఇంచార్జి రమేష్ రెడ్డి, నాట్స్ మాజీ అధ్యక్షులు గంగాధర్ దేసులు హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరంలో 150 మంది రక్త దానం చేయగా, 400మందికిపైగా పాల్గొని వైఎస్ఆర్కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ విష్ణు కోటంరెడ్డి, జాయింట్ సెక్రటరీ రఘురామి రెడ్డి ఏటుకూరి, శివ మేక, పూర్వ సెక్రటరీ హరి వెళ్కూర్, బోర్డు సభ్యులు ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, నాటా సెక్రటరీ శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి, వైఎస్ఆర్ అభిమానులు మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్లం, గీత దోర్నాదుల, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, నాగరాజా రెడ్డి, జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, అంజి రెడ్డి సాగంరెడ్డి, రవి మరక, భానోజీ రెడ్డి, హరి కురుకుండ, వంశి బొమ్మారెడ్డి, ధీరజ్ రెడ్డిలు పాల్గొన్నారు. -
విశ్వాసాన్ని మరోసారి ప్రదర్శించింది..
విశ్వాసానికి మారుపేరు అనగానే టక్కున ఎవరైనా కుక్కనే చూపిస్తారు. ఎందుకంటే వాటి యజమానికి గానీ, అతని కుటుంబ సభ్యులకు ఆపద తలెత్తితే అవి చురుకుగా స్పందిస్తాయన్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ఫిలడెల్ఫియాలో జరిగింది. అంధుడైన యజమానిని రక్షించి ఒక్కసారిగా ఓ శునకం హీరో అయింది. ఫిలడెల్ఫియాకు చెందిన ఓ వ్యక్తి ఇంటికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. అంధుడు, వృద్ధుడైన ఆ వ్యక్తి ఇంట్లో చిక్కుకుపోయాడు. సమయానికి కుటుంబసభ్యులు ఎవరూ ఆ ఇంట్లో లేరు. విషయాన్ని గమనించిన lఅతడి పెంపుడు కుక్క యోలాండా వెంటనే స్పందించింది. ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి మొరగటం ప్రారంభించింది. ఏదోజరిగి ఉంటుందని అనుమానం వచ్చిన ఫైర్ సిబ్బంది సమయానికి Sఘటనాస్థలానికి Sచేరుకుని అంధుడైన యజమానిని రక్షించారు. శునకం తనను కాపాడటం ఇది మూడోసారి అని యజమాని తెలిపాడు. 2013లో దొంగలబారి నుంచి ఒకసారి, 2015లో టూర్కువెళ్లి çస్పృహ తప్పిపడిపోగా, అప్పుడు కూడా 911కు కాల్ చేసి యజమాని ప్రాణాలు రక్షించిందని చెప్పాడు. -
మాతృభాషకు ఆదరణ తగ్గుతోంది
ఆవేదన వ్యక్తం చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషకు ఆదరణ తగ్గుతోందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా భాషా పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టడంలేదని ఆయన మండిపడ్డారు. అమెరికాలో మాత్రం తెలుగు భాష వెలుగొందుతోందని పేర్కొన్నారు. శనివారం ఫిలడెల్ఫియాలో ఏర్పాటైన ‘పాఠశాల’ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు భాషా, సంస్కృతులను నేర్పించడంలో ముందంజలో ఉన్నారని, అమెరికాలో ‘పాఠశాల’ వంటి ప్రత్యేక శిక్షణా సంస్థలను దీని కోసం ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. మాతృ భాష పట్ల ప్రవాసాంధ్రులు చూపుతున్న శ్రద్ధ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రముఖ పాత్రికేయులు నరిసెట్టి ఇన్నయ్య మాట్లాడుతూ అమెరికాలో తెలుగువారు నిర్వహించే ఉత్సవాలకు అక్కడి స్థానికులను కూడా ఆహ్వానించాలని కోరారు. యార్లగడ్డ దంపతులను స్థానిక ప్రవాసాంధ్రులు, పాఠశాల సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు పొట్లూరి రవి నిర్వహించారు. -
లైవ్ రిపోర్టింగ్ లో మహిళా జర్నలిస్ట్ పై దాడి!
వాషింగ్టన్: అమెరికాలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడి జరిగింది. ఫిలడెల్ఫియాలోని ఓ ప్రైవేట్ చానల్ మహిళా రిపోర్టర్ పై దాడి చేసిన మహిళపై అందరూ మండిపడుతున్నారు. రెండు రోజుల కిందట సిటీ హాల్ లో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని టెలిముండో ఆఫీస్ వారు తెలిపారు. ఐరిస్ డెల్గాడో గత కొన్నేళ్లుగా జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తోంది. సిటీ హాల్ లో డెల్గాడో టీవీ లైవ్ షోలో భాగంగా రిపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో వాహిదా విల్సన్ అనే మహిళా అక్కడికి వచ్చి డెల్గాడోపై దాడి చేయడం ప్రారంభించింది. మహిళా జర్నలిస్ట్ తల, ముఖం భాగాలపై విల్సన్ అకస్మాత్తుగా దాడి చేసింది. చేతిని అడ్డు పెట్టుకుని ఏం జరిగింది, ఎందుకిలా చేస్తున్నావంటూ బాధితురాలు అడుగుతున్నా పట్టించుకోలేదు. విల్సన్ దాడి చేయడం ప్రారంభించగానే టీవీ చానల్ లో లైవ్ రికార్డింగ్ ఆపేశారు. యాంకర్ రామన్ జయాస్ ఈ విషయాన్ని గమనించి ఓ మై గాడ్ ఇలా జరిగిందేంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వహీదా విల్సన్ ను అరెస్ట్ చేసినట్లు ఫిలడెల్ఫియా జిల్లా ఉన్నతాధికారి వెల్లడించారు. వీడియో సాక్షాల ఆధారంగా మహిళను అరెస్ట్ చేశామని, ఆన్ లైన్ కోర్టు డాక్యుమెంట్లలో విల్సన్ వల్ల ఇతరులకు ప్రాణహాని ఉందని పేర్కొన్నట్లు చెప్పారు. మహిళా జర్నలిస్ట్ డెల్గాడో చికిత్స తీసుకుంది. ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుందని టీవీ చానల్ వారు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. -
'లెక్క' తప్పింది.. విమానం ఆగింది!
న్యూయార్క్: ఓ ప్రొఫెసర్ విమానం ఎక్కి.. సీరియస్‌గా లెక్కలు చేసుకోవడం.. ఆయనను చిక్కుల్లో పడేసింది. తోటి ప్రయాణికుల్లో అనుకోని భయాందోళనకు కారణమైంది. సదరు ప్రొఫెసర్ తన మానాన తాను గణిత సూత్రాల మీద కసరత్తు చేస్తుండగా.. ఓ మహిళ ఆ లెక్కలను చూసి 'సీక్రెట్ టెర్రరిస్టు కోడ్' అనుకొంది. అంతే గగ్గోలు పెట్టింది. విమానం సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో విమానాన్ని రెండు గంటలపాటు ఆపి.. ఆ ప్రొఫెసర్ గారి లెక్కలు.. ఉగ్రవాదుల 'కోడ్ భాష' కాదని నిర్ధారించుకున్నారు. ఇటలీకి చెందిన ఆర్థిక వేత్త, పెన్సిల్వేనియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గైడో మెంజియో (40)కు ఈ చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని ఫిలడెల్ఫియా నుంచి గురువారం కెనడాలోని సైరాకస్కు ఎయిర్ విస్కాన్సిన్ విమానంలో వెళుతుండగా ఆయన పక్కన ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు ఈమేరకు అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఆయనను ఫిలడెల్ఫియాలోనే దింపేసి.. భద్రతా సిబ్బంది ప్రశ్నించారు. విమానాన్ని రెండు గంటలపాటు నిలిపేశారు. కెనడా ఒంటారియోలోని క్వీన్స్ యూనివర్సిటీలో ఉపన్యసించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని మెంజియో వెల్లడించారు. ఈ ఘటనను ధ్రువీకరించిన సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ.. ప్రొఫెసర్ పక్కన కూర్చున్న 30 ఏళ్ల మహిళ అనుమానాలు వ్యక్తం చేయడం, తాను చాలా అస్వస్థతకు గురయ్యానని చెప్పడంతో ఇలా చేశామని చెప్పుకొచ్చింది. -
పిల్స్ వేసుకున్నా 100మందికి గర్భం వచ్చిందని..
న్యూయార్క్: గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నా తాము గర్భం దాల్చడంపట్ల ఆ మాత్రలు తయారుచేసిన ఫార్మాసూటికల్స్ కంపెనీలపై కొందరు మహిళలు కేసులు వేశారు. తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహిళలు ఆ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియాలోని కొందరు మహిళలు తమకు గర్భం దాల్చడం ఇష్టం లేక గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నారు. అయినా, అవి పనిచేయకపోవడంతో వారు గర్భం దాల్చాల్సి వచ్చింది. ఇలా దాదాపు 100మంది మహిళలు తమకు ఇష్టం లేకపోయినా త్వరలో తల్లులుకాబోతున్నారు. అయితే, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా తయారుచేసిన మందుల కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఫిలడెల్ఫియాలోని మొత్తం నాలుగు కంపెనీలపై కేసులు పెట్టారు. తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని, తమ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు ఆయా రూపాల్లో (విద్య, వైద్యం, పెరుగుదల, నిర్వహణ) అయ్యే ఖర్చును భరించాలని పేర్కొంటూ కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. -
రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి
వాషింగ్టన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్‌పై వెళ్తున్న విజయ్‌ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. విజయ్ మోహన్ చికాగో శివారు ప్రాంతంలో జన్మించారు. ఆయన పాఠశాల విద్య అంతా భారత్‌లో జరిగింది. అనంతరం ఆయన టెంపల్ యూనివర్శిటీ నుంచి ఫిల్మ్, మీడియా అర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. విజయ్ అంకితభావంతో పని చేస్తాడని ఫిలిడెల్ఫియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కమ్యూనిటీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అతడి మృతి పట్ల సంతాపం ప్రకటించింది. -
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం
-
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 238 మంది ప్రయాణికులతో రాజధాని నగరం వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వెళుతోన్న ఆమ్ట్రాక్ లోకల్ రైలు మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని వీట్షెల్ఫ్ లేక్బ్లాక్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందగా, దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 7:10 కి వాషింగ్టన్ స్టేషన్ నుంచి బయలుదేన 188వ నంబర్ ట్రైన్ 10:34కు న్యూయార్క్ చేరుకోవాల్సి ఉంది. ఈ రెండు స్టేషన్లకు సరిగ్గా మధ్యలో ఉండే ఫిలడెల్ఫియా వద్ద గల ఓ మూల మలుపు తిరిగే క్రమంలో నియంత్రణ కోల్పోయి రైలు పట్టాలు తప్పిందని, ప్రమాదం సమయంలో అది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని అధికారులు చెప్పారు. బోల్తా పడ్డ పది బోగీలు.. కొద్ది మీటర్లవరకు దొర్లుకుంటూ వెళ్లడంవల్ల పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారని వివరించారు. సహాయక బృందాలు రంగంలోకిదిగి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. -
బేబీస్ నైట్ అవుట్
చదివింత... ‘‘లేడికి లేచిందే పరుగు... చిన్నారి అడిగిందో డ్రింకు’’ అంటూ ఆశ్చర్యపోయారు బస్సులోని సహప్రయాణీకులంతా. ఫిలడెల్ఫియాలో నివసించే నాలుగేళ్ల చిన్నారి అన్నాబెల్లెకి తెల్లవారుఝామున 3 గంటలకు మెలకువ వచ్చింది. అర్జంటుగా తనకెంతో ఇష్టమైన ఫ్రోజెన్ డ్రింక్ తాగాలనిపించింది. వెంటనే రెయిన్‌కోట్ వేసేసుకుని మరీ బయటకు వచ్చేసింది. దారిలో కనపడిన బస్సు ఎక్కేసింది. సీట్లో కూచుని కాళ్లూపుతూ ‘‘నాకో స్లాషీ (మంచుతో కప్పిన కూల్‌డ్రింక్) కావాలి’’ అంటూ ఆర్డరేసింది. ఆ చిన్నారి ఎవరో ఏమిటో అర్ధం కాక తికమకపడిన బస్సు ప్రయాణికులు విషయాన్ని బస్ డ్రైవర్ చెవిలో ఊదారు. దీంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ముందుగా ఆ బుడతని ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. అసలు అప్పటిదాకా పాప బయటకు వెళ్లిందనే విషయమే గమనించని తల్లి జాక్లిన్ మేజర్...‘‘ఊహించలేకపోతి నీ ‘పోక’... ఊపిరులూదింది నీ రాక’’ అంటూ అన్నాబెల్లిని అక్కున చేర్చుకుందట. సత్యవర్షి -
ఆటా సభలకు కోదండరాం
షికాగో (అమెరికా) నుంచి జి.గంగాధర్ ఈ నెల 3 నుంచి 5 వరకు ఫిలడెల్ఫియాలో జరుగుతున్న ఆటా సభలకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. ఇప్పటికే ఇక్కడికి టీఆర్ఎస్ నాయకుడు వి. ప్రకాష్ చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమం, ఆ తరువాత రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాల గురించి కోదండరాం ప్రసంగిస్తారు. తెలంగాణ ప్రభుత్వ పని తీరు, అమలు చేయనున్న పథకాల గురించి వి. ప్రకాష్ వివరిస్తారు. ఈ సభలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ప్రముఖ కవి సి. నారాయణరెడ్డి, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హాజరవుతున్నారు. సినిమా నటీనటులు శ్రీయ, సునీల్, రాణా దగ్గుబాటి తదితరులు వస్తున్నారు. సభలకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం తెలిపారు. -
మన మధ్యే మృగరాజు...
మనం జూకెళితే.. పులులు, సింహాలు ఏ చెట్టు వెనుక దాక్కున్నాయా అంటూ వెతుక్కోవాల్సిందే.. అలాంటి ఇబ్బంది లేకుండా.. అవే మన మధ్యకు వచ్చేస్తే.. మనకు ఈజీగా ఉంటుంది కదా.. పైగా.. అవి మన మధ్యే ఉన్న అనుభూతి కూడా కలుగుతుంది. తాజాగా అమెరికాలోని ఫిలడెల్ఫియా జూలో ఫుట్ఓవర్ బ్రిడ్జి తరహాలో వన్యప్రాణుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు. పులులు, సింహాలు, కోతులు ఇలా అన్ని రకాల జంతువుల కోసం జూలోని పలు ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.13 కోట్లు వెచ్చించారు. ఇది పర్యాటకులకు సఫారీ తరహా అనుభూతినిస్తుందని జూ సిబ్బంది తెలిపారు. -
రన్ వే పై కుప్పకూలిన విమానం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఒక విమానం టేకాఫ్ చేయబోతూ, టైర్ పేలి రన్‌వే పైనే కుప్ప కూలింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సిన ఎయిర్ బస్ 320 ముందు టైర్ టేకాఫ్ చేసే ముందు గపేలిపోయింది. దాని తుక్కు బండి ఇంజన్‌లోకి దూరిపోయింది. దీంతో బారీగా పొగ వచ్చింది. కొద్ది క్షణాలకే విమానం రన్‌వే పై కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో 149 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది ఉన్నారు. నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలవడం మినహా ఏమీ కాలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు 'అమ్మయ్య' అని ఊపిరిపీల్చుకున్నారు.