
విశ్వాసాన్ని మరోసారి ప్రదర్శించింది..
విశ్వాసానికి మారుపేరు అనగానే టక్కున ఎవరైనా కుక్కనే చూపిస్తారు. ఎందుకంటే వాటి యజమానికి గానీ, అతని కుటుంబ సభ్యులకు ఆపద తలెత్తితే అవి చురుకుగా స్పందిస్తాయన్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ఫిలడెల్ఫియాలో జరిగింది. అంధుడైన యజమానిని రక్షించి ఒక్కసారిగా ఓ శునకం హీరో అయింది. ఫిలడెల్ఫియాకు చెందిన ఓ వ్యక్తి ఇంటికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. అంధుడు, వృద్ధుడైన ఆ వ్యక్తి ఇంట్లో చిక్కుకుపోయాడు.
సమయానికి కుటుంబసభ్యులు ఎవరూ ఆ ఇంట్లో లేరు. విషయాన్ని గమనించిన lఅతడి పెంపుడు కుక్క యోలాండా వెంటనే స్పందించింది. ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి మొరగటం ప్రారంభించింది. ఏదోజరిగి ఉంటుందని అనుమానం వచ్చిన ఫైర్ సిబ్బంది సమయానికి Sఘటనాస్థలానికి Sచేరుకుని అంధుడైన యజమానిని రక్షించారు. శునకం తనను కాపాడటం ఇది మూడోసారి అని యజమాని తెలిపాడు. 2013లో దొంగలబారి నుంచి ఒకసారి, 2015లో టూర్‌కువెళ్లి çస్పృహ తప్పిపడిపోగా, అప్పుడు కూడా 911కు కాల్ చేసి యజమాని ప్రాణాలు రక్షించిందని చెప్పాడు.