జూలై 7న నాటా మీట్‌ అండ్‌ గ్రీట్‌ | YSRCP USA committee conducts Meet and Greet event in Philadelphia | Sakshi
Sakshi News home page

జూలై 7న నాటా మీట్‌ అండ్‌ గ్రీట్‌

Published Wed, Jul 4 2018 3:24 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YSRCP USA committee conducts Meet and Greet event in Philadelphia - Sakshi

వాషింగ్టన్ డీసీ : ఫిలడెల్ఫియాలో నాటా కన్వెన్షన్‌లో జూలై 7న జరిగే మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారులు పెద్దమొత్తంలో హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ యూఎస్‌ఏ కమిటీ కోరింది. నాటా ఎలక్ట్‌ ప్రెసిడెంట్ డా. రాఘవ రెడ్డి గోసాల‌, నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్‌రెడ్డి గంగసాని‌, వైఎస్సార్‌ ఫౌండేషన్‌ యూఎస్‌ఏ ప్రెసిడెంట్‌ ఆళ్ల రామిరెడ్డిలు అందిస్తున్న సహకారానికివైఎస్సార్సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌లు డా. వాసుదేవరెడ్డి ఎన్‌, డా. శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, రత్నాకర్‌ పండుగాయల, మధులిక చవ్వ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్ జయంతిని నాటా మహాసభల్లో నిర్వహిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, నందమూరి లక్ష్మిపార్వతి నాటా సభల్లో పాల్గొనబోతున్నారు. పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు నాటా పొలిటికల్‌ఫోరం సభల్లో పాల్గొననున్నారు. అలాగే సమకాలీన అంశాలపై జరిగే రాజకీయ చర్చల్లో వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌అడ్వైజరీ కమిటీ సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్‌ఇన్‌ఛార్జ్‌లావు కృష్ణ దేవరాయులు, పార్టీ శ్రీశైలం ఇంఛార్జ్‌శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్‌ హర్షవర్ధనరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, పార్టీ డాక్టర్స్ వింగ్‌అధ్యక్షులు శివభరత్‌రెడ్డి పాల్గొంటారని నాటా నిర్వాహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement